డైలీ సీరియల్

పంచతంత్రం-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్ళకి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఫాలో అవుతున్నాడు కార్తీక్. అతడు ఆ ఇంటిని బాగా గుర్తుపెట్టుకుని అక్కడినుంచి తన మిత్రులను కలవడానికి బయలుదేరాడు.
* * *
హరీష్ వాళ్ళ ఇంట్లో కార్తీక్, గోపిక, జైరాం, రవి సమావేశం అయ్యారు. కార్తీకమాసం అవటంతో హరీష్ వాళ్ల తల్లితండ్రులు ఆ దగ్గరలో ఉన్న శివాలయంలో ‘మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం’ చేయిస్తున్నారు. వాళ్ళు సాయంత్రం వరకూ రారు. కార్తీక్ అతడి మిత్రులూ ఆరోజు జరిగిన విషయాల గురించి చర్చించుకున్నారు.
‘‘మీరు అక్కడ ఉన్నట్లు ఆ బాల్‌రాజ్‌గాడికి ఎలా తెలిసింది?’’ అడిగాడు జైరాం.
‘‘వాడి సెల్‌ఫోన్ నా దగ్గర ఉంది. ఎవడో పండిట్ అనేవాడి సహాయంతో వాడు నన్ను ట్రాక్ చేసాడు... ఐనా... వెళ్లిపొమ్మని ఎస్‌ఎంఎస్ ఇస్తే మీరేంటి... ఆ అడవిలోకి వచ్చేసారు.?’’అంటూ అడిగాడు కార్తీక్.
‘‘నిన్ను వదిలి. మేము ఎక్కడికి వెళ్తాం?’’అన్నాడు రవి.
‘‘మిమ్మల్ని వాడు చూడలేదా?’’ అడిగాడు జైరాం.
‘‘అసలు ఏం జరిగింది?’’అంటూ అడిగాడు రవి.
అక్కడ జరిగింది చెప్పటం ప్రారంభించాడు కార్తీక్. అతడు చెప్పటం మొదలుపెట్టగానే గోపికకు భయంవేసింది. ఆ ఇద్దరు లవర్స్ ఫ్రెంచ్ కిస్ పెట్టుకోవటం, బాల్‌రాజ్ వాళ్ళను చూడగానే తాను భయంతో కార్తీక్‌ని బల్లిలా గట్టిగా హత్తుకోవటం వంటివి అన్నీ చెప్పేస్తాడేమోనని ఆమెకు భయంవేసింది. కాని గోపికకు ఇబ్బంది కలిగించే విషయాలు విడిచిపెట్టి, మిగిలిన విషయాలుఅన్నీ వాళ్లకు వివరించాడు కార్తీక్. తర్వాత అతడు డ్రోన్ బయటకు తీసాడు. దానికి ఉన్న కెమెరాను దాన్నుంచి విడతీసి, అందులోని డేటా అంతా డిలీట్ చేశాడు. అందులో ఆ ఇద్దరు ప్రేమికులు కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.
‘‘గుర్తుంచుకోండి. మనపక్కన ఉన్న అవంతికాలనీలో వినాయకుడి గుడి వెనక దాదాపు ఐదొందల గజాల స్థలంలో, మూడు అంతస్తుల పసుపుపచ్చ రంగు ఇల్లు ఒకటి ఉంది. అదే పఠాన్‌గాడి ఇల్లు.’’
జైరాం అన్నాడు ‘‘ఆ బాల్‌రాజ్‌గాడి ఫోన్ నీదగ్గరే ఉంది కదా?... అందులో ఆ పండిట్‌గాడి ఫోన్ నెంబర్ ఉందేమో...!’’
‘‘ఖచ్చితంగా ఉంటుంది. కాని నన్ను ఆ పండిట్ అనేవాడు ట్రాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ బాల్‌రాజ్ ఫోన్ ఆన్‌చేస్తే నేను హరీష్‌వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఆ పండిట్‌కి తెలిసిపోతుంది. వాడి సంగతి తర్వాత చూద్దాం.’’అంటూ చెప్పి డ్రోన్‌ను జైరాంకు ఇస్తూ అన్నాడు కార్తీక్.
‘‘దీంతో... అందరూ ప్రాక్టీస్ చెయ్యండి...!’’
‘‘మరి మన స్థలాలు ఆ బాల్‌రాజ్ పేరిట రేపే రిజిస్ట్రేషన్ చెయ్యాలి...’’ అడిగాడు రవి.
‘‘ఆ సంగతి నాకు వదిలిపెట్టండి!...’’ అంటూ సమాధానం చెప్పాడు కార్తీక్.
డ్రోన్‌తో మొదట జైరాం ప్రాక్టీస్ చెయ్యడం ప్రారంభించాడు.
* * *
ఆ మర్నాడు ఉదయం పది గంటలప్పుడు తన అనుచరుడు పఠాన్ ఇంట్లో నిద్రపోతున్న బాల్‌రాజ్ నిద్రలేచాడు. అప్పటికే అతడికోసం ఎదురుచూస్తున్నారు పఠాన్, బైరాగి, స్నానంచేసి ఫ్రెషప్ అయి టిఫిన్ తినటం ముగించాక పఠాన్, బైరాగిలతో చెప్పాడు బాల్‌రాజ్.
‘‘ఆ పండిట్‌గాడికి పేచేశారా?’’
‘‘నిన్ననే వాడికి డబ్బులు ఇచ్చేశాం అన్నా!’’
‘‘ఓకే! ఆ కొండాపూర్, అలకాపూర్ రిజిస్ట్రేషన్స్ సంగతి ఇవ్వాళే ఖతం చేద్దాం.’’
బైరాగి, పఠాన్ ‘‘సరే అన్నా!’’అంటూ తలలు ఊపారు.
సెల్‌ఫోన్ తీసుకుని కార్తీక్ తండ్రి వాసుదేవరావుకి రింగ్‌చేసాడు బాల్‌రాజ్.
‘‘పర్సనల్ పని ఉండి నిన్న రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేసాం. మరో గంటలో మా బైరాగిగాడు, పఠాన్‌గాడు మిమ్మల్ని రిజిస్ట్రార్ ఆఫీసుకి తీసుకువెళ్తాడు. నేను డైరెక్ట్‌గా మిమ్మల్ని రిజిస్ట్రార్ ఆఫీస్‌లో కలుస్తా. మిమ్మల్ని మా బంటిలోనే అక్కడికి తీసుకెళతాం. రిజిస్ట్రార్ మావాడే పని వెంటనే అయిపోతుంది.’’అంటూ చెప్పి ఫోన్ కట్‌చేసాడు బాల్‌రాజ్.
* * *
దిగులుగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు వాసుదేవరావు. ఆయనతో అన్నాడు కార్తీక్. ‘‘ఏంటి డాడీ’’... మళ్ళీ ఆ బాల్‌రాజ్ ఫోన్ చేశాడా?
అవును అన్నట్టు తల ఊపాడు.
‘‘సరే డాడీ! ఇవ్వాళ కూడా రిజిస్ట్రేషన్స్ ఆగిపోవాలని దణ్ణం పెట్టుకోవటానికి తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్‌కి వెడుతున్నా! మొన్న కూడా ఆయనకే దణ్ణం పెట్టుకున్నా!... రిజిస్ట్రేషన్ ఆగిపోయింది’’ అన్నాడు కార్తీక్. వాసుదేవరావు ఆంజనేయస్వామి భక్తుడు.
కార్తీక్ మాటలతో ఆయనకు ఉత్సాహం వచ్చింది.
‘‘జాగ్రత్తగా వెళ్లిరా!’’అంటూ ఆయన కార్తీక్‌తో చెప్పాడు.
* * *
ట్రాఫిక్ ఎక్కువగా లేని సందుల్లోంచీ, గొందుల్లోంచీ టాటానానో కారులో ప్రయాణిస్తున్నారు కార్తీక్ అతడి మిత్రులు. చిన్న సైజులో ఉన్న నానో చిన్నచిన్న సందుల్లోంచి కూడా సులభంగా వెళ్లిపోతోంది. ఆ నానోకారు హరీష్ ఈమధ్యనే కొన్నాడు. డ్రైవింగ్ సీట్‌లో హరీష్, అతని పక్కన రవి కూర్చుని ఉన్నారు.
జేబులోంచి సెల్‌ఫోన్ తీసాడు వెనక సీట్‌లోఉన్న కార్తీక్. అది బాల్‌రాజ్ సెల్‌ఫోన్. తర్వాత తన షర్ట్ పాకెట్‌లోంచి మడతలుపెట్టిన కాగితం, పెన్ను తీసి జైరాంకి ఇచ్చి చెప్పాడు కార్తీక్.
‘‘నేను చెప్పేదంతా వేగంగా. తప్పులులేకుండా జాగ్రత్తగా నోట్ చెయ్.!’’
జైరాం తలవూపాడు. కార్తీక్ ఏమి చేయబోతున్నాడో మిగిలినవాళ్ళకి అర్ధం కావటం లేదు.
బాల్‌రాజ్ సెల్‌ఫోన్ ఆన్‌చేసి, ఆ సెల్‌ఫోన్‌లో ఉన్న మెమోఐకాన్ సెలెక్ట్‌చేసి, ఓపెన్ చేసాడు కార్తీక్. మెమోలో బాల్‌రాజ్‌కు చెందిన బ్యాంకు అకౌంట్ వివరాలు, పాస్‌వర్డ్స్ మొదలైనవి అన్నీ టైపుచేసి ఉన్నాయ్. కార్తీక్ వేగంగా వాటి వివరాలు చెప్పసాగాడు.
వాటిని జైరాం నోట్ చెయ్యసాగాడు.
తర్వాత కార్తీక్ తన షర్ట్ జేబులోంచి మరో కాగితం బయటకు తీసాడు. అందులో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, తిరుపతి వేంకటేశ్వరస్వామి, శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి, బెజవాడ కనకదుర్గ, వరంగల్ భద్రకాళి, శ్రీశైలం మల్లిఖార్జునస్వామి, కొమరవెల్లి మల్లిఖార్జునస్వామి, కాణిపాకం గణపతి, మహానందీశ్వరస్వామి మహానంది, కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి, షిరిడీసాయిబాబా, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్, రామకృష్ణమఠం, రెడ్‌క్రాస్ సొసైటీల బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఐఎఫ్‌ఎస్ కోడ్ నంబర్స్ అన్నీ ఉన్నాయ్.
బాల్‌రాజ్ ఫోన్‌కి కనెక్షన్ ఉంది.
మొబైల్ డేటా ఆన్‌లో ఉంది.
వెంటనే బాల్‌రాజ్ అకౌంట్ ఉన్న బ్యాంకు వెబ్‌సైట్‌లోకి వెళ్లాడు.
అది ఒక ప్రైవేటు బ్యాంకు.
జైరాంని అడిగాడు కార్తీక్. ‘‘ఇప్పుడు చెప్పు...! ఆ బాల్‌రాజ్‌గాడి అకౌంట్ డిటైల్స్’’ జైరాం చెప్పసాగాడు.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు