డైలీ సీరియల్

యాజ్ఞసేని-126

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్మార్గుడైన తన కుమారుని చంచలత్వం ఆచార్యునికి తెలుసును. అందువలన ధర్మవేత్త అయిన తనా తదుపరి కుమారుని శాసించి ‘‘నాయనా! ఎంత ఆపదలోనున్నా, యుద్ధ్భూమిలో ఈ అస్త్రాన్ని విశేషించి మనుష్యులమీద ప్రయోగింపరాదు. నీవెప్పుడూ సజ్జన మార్గంలో నిలవవని నా సందేశం’’ అని అన్నాడు.
అశ్వత్థామ కోపిష్ఠి. దుర్మార్గుడు. చపలుడు. క్రూరుడు కదా? అతడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని యెరిగినవాడు. కాబట్టి భీమసేనుని కాపాడాలి’’ అని అంటూ శ్రీకృష్ణుడు తన రథాన్ని ఆయత్తం చేసికొని దానిని అధిరోహించాడు. అర్జునుడు, ధర్మరాజు కూడా ఆ రథాన్నియెక్కారు. శ్రీకృష్ణుడు వారిద్దరినీ తనతోపాటు తీసికొని వేగంగా వెన్నంటి క్షణకాలంలో భీమసేనుని సమీపించాడు.
కానీ భీమసేనుని నివారించలేకపోయారు. ఆ ముగ్గురూ చూస్తుండగానే భీముడు భగీరథీ తీరానికి చేరాడు. పాండవుల పుత్రులను చంపిన అశ్వత్థామ అక్కడ వున్నట్లు విన్నాడు. అక్కడ గంగాతీరంలో వ్యాస మహర్షి ఋషులతో కూర్చొని యుంగా భీముడు చూచాడు. ఆయనకు దగ్గరలోనే కూర్చొని యున్న అశ్వత్థామను కూడా గమనించాడు. అశ్వత్థామ ఒంటికి నేయి పూసుకొని, దర్భ చీరలు ధరించి యున్నాడు.
భీముడు బాణాలతోపాటు వింటిని చేబూని అశ్వత్థామ మీదికి వెళ్ళాడు ‘‘నిలు! నిలు’’ అని గూడా అరిచాడు. అప్పుడు అశ్వత్థామ భీకరుడైనభీముడు విల్లు పట్టి రావడాన్ని, ఆయనవెనుక కృష్ణునిరథంపైనున నున్న ధర్మరాజును, అర్జునుని చూచి వ్యధకులోనయ్యాడు.
అప్పటి కర్తవ్యాన్ని ఆలోచించాడు. ఎడమచేతిలో ఒక గడ్డిపరకను పట్టుకొన్నాడు. దివ్యాయుధాలను ధరించి యెదుటనున్న శూరులను సహించలేకపోయాడు. అంతటి ఆపదను పొందిన అశ్వత్థామ కోపించి దివ్యాస్త్రాన్ని (బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని) ప్రయోగించాడు.
‘పాండవులందరినీ ఈ అస్త్రం సంహరించగుగాక’’అని దారుణమైన మాట అన్నాడు. అస్త్రాన్ని విడిచిపెట్టాడు. వెంటనే ఆ గడ్డిపరకనుండి అగ్నిపుట్టింది.అది ఫ్రళయకాల యమునివలె మూడు లోకాలను దహిస్తున్నట్లుకనిపించింది.
అది చూచిన శ్రీకృష్ణుడు అర్జునునితో ‘‘పార్థివా! అర్జునా! ద్రోణుడు ఉపదేశించిన దివ్యాస్త్రం నీ మనసులో వున్నది. దానిని ప్రయోగించటానికి యిప్పుడు యిది తగిన సమయం. నిన్ను, నీ సోదరులను రక్షించుకొనటానికి నీవు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించుము. ఇది అశ్వత్థామ ప్రయోగించిన ఆ అస్త్రాన్ని వారిస్తుంది’’అని అన్నాడు.
వెంటనే అర్జునుడు రథాన్ని దిగాడు. ధనుర్భాణాలను చేతబట్టి ముందుగా అశ్వత్థామకూ, ఆపైన తనకూ, ఆపై సమస్త సోదరులకూ శుభం జరగాలని దేవతలకూ, గురువులకూ నమస్కరించి ‘‘ఆ అస్త్రం శత్రువుల బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయుగాక!’’అని ధ్యానించి ఆ దివ్యాస్త్రాన్ని వదలిపెట్టాడు. అర్జునుడు ప్రయోగించిన ఆ అస్త్రం వెంటనే ప్రళయ కాలాగ్నివలె మహాజ్వాలతో ప్రజ్వరిల్లసాగింది. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం గూడా అదే విధంగా తేజోమండలం మధ్య నిలిచి మహాజ్వాలలతో ప్రజ్వరిల్లసాగింది. ఆ అస్త్రాలతో భూమి మొత్తం కంపించింది. ఆ రెండు అస్త్రాలు లోకాలను కంపింపజేస్తూ నిలిచాయి.
అప్పుడు నారదుడూ, వ్యాసమహర్షి యిద్దరూ ప్రత్యక్షమయ్యారు. అశ్వత్థామ, అర్జునులను శాంతింపజేయాలని ప్రజ్వరిల్లుచున్న ఆ రెండు అస్త్రాల మధ్య నిలిచారు. ‘‘గతంలో నానాశస్తవ్రేత్తలైన మహారథులు వెళ్ళిపోయారు. వారెవ్వరూ ఈ అస్త్రాన్ని యెప్పుడూ ప్రయోగించలేదు. వీరులారా! మహావినాశనకరమైన ఈ సోపానం యెందుకుచేశారు’’ అని మహర్షులు పలికారు.
వెంటనే అర్జునుడు వేగంగా ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించాడు. చేతులు జోడించి ఋషులతో ‘‘అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయాలని నేను అస్త్రాన్ని ప్రయోగించాను. నేనీ అస్త్రాన్ని ఉపసంహరిస్తే పాపకర్ముడైన అశ్వత్థామ మమ్ములనందరినీ ఆ అస్త్రంతో తప్పనిసరిగ దహించి వేస్తాడు. కావున లోక హితులైన మీరు అంగీకరించి చెప్పాలి’’ అని పలికి మరలా అస్త్రాన్ని ఉపసంహరించాడు. ఒక్క అర్జునుడు తప్ప రణభూమిలో ప్రయోగించిన తరువాత మరెవరూ ఈ అస్త్రాన్ని ఉపసంహరించలేరు.
అశ్వత్థామ కూడా ఋషులను చూచాడు. అస్త్రాన్ని ఉపసంహరింప ప్రయత్నం చేశాడు. కానీ వీలుకాలేదు. అప్పుడు వ్యాసమహర్షితో ‘‘్భగవాన్! వ్యాసమునీంద్రా! భీమసేనుని చూచి భయపడి తీవ్ర సంకట స్థితిలో ప్రాణాలను రక్షించుకొనగోరి నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. ఈ భీముడు అధర్మమార్గంలో దుర్గ్ధోనుని సంహరించాడు. అందువలన ఈ అస్త్రాన్ని ప్రయోగించవలసిన అవసరం యేర్పడింది. దానిని నేను ఉపసంహరించాలని ఉత్సాహపడటం లేదు. దీనిని పాండవుల నిర్మూలనకోసం అభిమంత్రించి ప్రయోగించాను.
మహర్షీ! రోషంతో నిండిన మనస్సుతో పాండవుల వధను గోరి యుద్ధ్భూమిలో ఈ అస్త్రాన్ని ప్రయోగించి పాపం చేశాను’’అని అనగా మహర్షి వ్యాసుడు

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము