డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిన్ను నేను మొదటి చూపులోనే ప్రేమించాను. నీ అందం నన్ను పిచ్చివాడని చేసింది. నాకెందుకో మొదటినుంచీ అనిపిస్తూనే వుంది రాజేష్‌గాడు నీకు కరెక్ట్ కాదని!’’
ఆమెకి రాజేష్ గుర్తుకువచ్చాడు. మాట్లాడకుండా అలాగే వుండిపోయింది. అది పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా భరణిని ఆమెని మరింత దగ్గరగా హత్తుకున్నాడు క్రమంగా ఇద్దరి శరీరాలూ వేడెక్కసాగాయి. డాన్స్ వేగం తగ్గి, గుండె కొట్టుకునే వేగం మరింత పెరిగింది. ఆ ఆట అలా ఎంతసేపు సాగిందో ఎవరికీ తెలియదు. తెలుసుకోవడానికి ఎవరూ టైము చూసుకోలేదు!
సరిగ్గా అదే సమయానికి గెస్టుహౌస్ దగ్గర వున్న శ్రీను మాత్రం టైము చూసుకుని ‘చాలా లేటైపోయింది. ఇంక తిరిగి వెడదామా?’ అంటున్నాడు సుజాతతో.
***
‘‘హాయ్ భరణీ’’
‘‘హలో..’’
‘‘ఏమిటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు?’’
‘‘బిజీగా వున్నాను కానీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు’’
అవతలవైపు కొద్దిసేపు వౌనం.. తరువాత నెమ్మదిగా వినిపించాయి మాటలు ‘‘నువ్వు చాలా మారిపోయావు భరణీ...’’
ఆమె మాటలని పూర్తిచేయనీయకుండా అన్నాడు భరణి విసుగ్గా ‘‘కమాన్ సంధ్యా.. బిజీగా ఉన్నానని చెప్పాను కదా? నాన్చకుండా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు?’’
‘‘ఈరోజు సాయంత్రం ఫ్రీనేనా? కలుద్దామా? నీతో కొంచెం మాట్లాడాలి’’ అడగలేక అడుగుతున్నట్టుగా వినిపించింది అవతల నుంచి.
‘‘ష్యూర్.. ష్యూర్.. తప్పకుండా కలుద్దాం. మనం ఫ్రీగా కలిసి చాలా రోజులైంది. మా గెస్ట్‌హౌస్‌లో కలుద్దాం’’
అతడి మాటలింకా పూర్తికానేలేదు- పక్కనే వున్న శ్రీను నవ్వుతూ చూసాడు భరణి వంక. భరణి ఫోన్ పెట్టేసాక ఆశగా అన్నాడు ‘‘ఈసారి గెస్ట్‌హౌస్‌కి ఎవర్ని పంపిస్తున్నావు?’’
భరణి చిన్నగా నవ్వేడు.
‘‘ఇలా ఆడుకోవడం తప్పు గురూ. సంధ్య చాలా మంచి అమ్మాయి.. నిన్ను ప్రేమిస్తోంది’’ పక్కనే వున్న సూర్య అన్నాడు భరణితో.
భరణి పగలబడి నవ్వేడు. ‘‘సంధ్య మంచమ్మాయా? ఏ విధంగా? ఏమీ తెలీదు తెలీదు అంటూనే లంగా ఓణీల్లోంచి ఏడాది తిరక్కుండానే జీన్స్ ప్యాంటుల్లోకి మారింది. రెండేళ్ళు తిరక్కుండానే ఇద్దరూ బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చింది. అర్థరాత్రి దాటేదాకా తిరిగి వచ్చినా ఏమనకుండా హాస్టల్ వార్డెన్ని మేనేజ్ చేస్తుంది. ‘షల్ వియ్ హావ్ దట్?’ అని అంటే ‘నీకు సిగ్గులేదు’ అని నన్ను తిడుతుంది కానీ తను మాత్రం సిగ్గుపడదు. నాకేదో ఆమె అంటే మోజు వుండబట్టి ఆమెని వెంటేసుకుని తిప్పాను కానీ ప్రేమా గీమా కాదు. అదంతా వట్టి ట్రాష్!’’
‘‘నీమీద ప్రేమతో తనని ప్రాణానికి ప్రాణంలా ప్రేమించే రాజేష్‌ని కూడా కాదని నీతో తిరిగింది. నీకు సర్వస్వాన్నీ సమర్పించుకుంది. ఆ రాజేష్ కూడా ఆమె తనతో కన్నా నీతో సుఖపడుతుందని ఆమె జీవితంలోంచి తప్పుకున్నాడు. నువ్విప్పుడు ఇలా మాట్లడడం బాగోలేదు’’
‘‘ప్రేమా?’’ వెటకారంగా అన్నాడు భరణి. ‘‘తండ్రి అనారోగ్యంతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ సతమతవౌతున్న రాజేష్‌తో ఎంజాయ్ చెయ్యడం కుదరదని వాడ్ని వదిలేసి సంధ్య నా పక్కన చేరింది. ఒక్క విషయం చెప్పమన్నావా? సంధ్యైనా, నువ్వైనా నేనైనా ఈ ముసుగు వెనుక కోరుకునేది ప్రేమని కాదు- ఎంజాయ్‌మెంట్‌ని! థ్రిల్‌ని!! అర్థమైందా? అసలీ అమ్మాయిలంతా అంతంత దూరం నుంచి వచ్చి కాలేజీల్లో ఎందుకు చదువుతారో తెలుసా? ఎంజాయ్‌మెంట్ కోసమే...’’ చెబుతూ నవ్వుతున్నాడు భరణి.
‘‘ఊరుకోరా- సంధ్య ఎలాంటిదో నాకు తెలుసు. రాజేష్ సంధ్యని ఎంతగా ప్రేమించాడో కూడా నాకు తెలుసు. నువ్విలా మాట్లాడడం వింటే రాజేష్ చాలా ఫీలవుతాడు. తన త్యాగం విలువ ఇంతేనా అనుకుంటాడు’’.
అతడి మాటలని పట్టించుకోనట్టుగా భరణి మళ్లీ నవ్వాడు నిర్లక్ష్యంగా.
అతడి మాటలని రాజేష వింటే ఏం చేసేవాడో తెలియదు కానీ, సంధ్య మాత్రం వింది. దురదృష్టవశాత్తూ కాల్ కట్ కాకపోవడంతో భరణి తనమీద వెలిబుచ్చిన విలువైన అభిప్రాయాన్ని ఆమె పూర్తిగా వింది!
ఆ రోజు ఆమె గెస్ట్‌హౌస్‌కి వెళ్ళలేదు. రాత్రికి రాత్రే సామాన్లు సర్దుకుని తమ ఊరు వెళ్లిపోయింది. రెండు రోజుల తరువాత పేపర్లో సంధ్య వాళ్ళ ఊరు వున్న డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వార్త వచ్చింది!
సంధ్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆమె మాజీ ప్రియుడు రాజేష్ ఆ వార్తని చదివి తను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ఒకే ఒక్క చిన్ని ఆశ అతడిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపింది.

ప్రారంభం
సమయం సాయంత్రం ఆరుగంటలవుతోంది.
ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే హైదరాబాద్ శివార్లలో ఉన్న భుజంగరావుగారి ఫామ్‌హౌస్ గేటు ముందర ఆ రోజు మాత్రం చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. రెండు పోలీసు జీపులతో పాటూ ఖరీదైన కార్లు ఆ గెస్ట్‌హౌస్ వున్న రోడ్డు పొడవునా పార్కు చేసి ఉన్నాయి. ఖద్దరు చొక్కాలు వేసుకున్న కొంతమంది పెద్దమనుషులు గెస్ట్‌హౌస్ పోర్టికోలో తిరుగుతూ ఫోన్లలో ఆదుర్దాగా మాట్లాడుతున్నారు.
గెస్ట్‌హౌస్ మొదటి అంతస్థులో వున్న విశాలమైన హాల్లో సోఫాలో దిగులుగా కూర్చుని వున్నాడు భుజంగరావు. అతడి చుట్టూ పెద్ద పెద్ద పొజిషన్లో వున్న రాజకీయ నాయకులు, ముఖ్యమైన పదవుల్లో వున్న పోలీసు ఆఫీసర్లూ వున్నారు. గెస్ట్‌హౌస్ వాచ్‌మెన్ తిరుపతయ్య చేతులు కుట్టకుని హాల్లో ఒక మూలగా నిల్చుని ఉన్నాడు భయంగా.
తను చేసే వ్యాపార లావాదేవీల్లోనూ, రాజకీయ సమావేశాల్లోనూ బిజీగా వుండే భుజంగరావు సాధారణంగా ఆ గెస్ట్‌హౌస్‌కి ఎప్పడూ రాడు. కాలేజీలో చదివే అతడి ఒక్కగానొక్క కొడుగు భరణి స్నేహితులతో జరుపుకునే పార్టీలకే ఎక్కువగా దాన్ని వాడుకుంటూ ఉంటాడు.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ