డైలీ సీరియల్

యాజ్ఞసేని-134

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరణు కోరినవాడిని స్వీకరించకపోవడం, మంచి మిత్రుడికి ద్రోహం చెయ్యడం, కులవధువును చంపడం, బ్రాహ్మణుని ధనాన్ని అపహరించడమనే ద్రోహాలతో సమానమయ్యే అపరాధం చెయ్యని సేవకుడిని నిర్ధాక్షిణ్యంగా వదలివెయ్యడంకూడా మంచిదేనా? ఈ పాపాన్ని యెట్లా సహించడం? స్వర్గసుఖమట్లుండనీ! నాలో దయ స్థిరంగా వుండేటట్లు చేయుము. ఆ పుణ్యంచేత ఈ కుక్కను ఆదరించిన కార్యం దోషంగాక పోవడమనేది నాకొక పెద్ద వరం కాగలదు. ఇక నీవు మరలిపొమ్ము. తీవ్రమైన తపశ్చర్యలతో నినే్న సేవిస్తూ ఈ అడవిలోనే వుండిపోతాను. నాకు అంతమాత్రం చాలును.’’ అని ధర్మరాజు పలికాడు.
ఆ విధంగా దృఢ నిశ్చయంతో పలికిన తన కుమారుడిని చూచి యమధర్మరాజు చాలా సంతోషించి కుక్కరూపాన్ని వదలి తన నిజరూపాన్ని పొంది యెదుట నిలిచాడు. అది చూచి ధర్మరాజు తొట్రుపాటుతో నమస్కరించాడు. ఆనందంతో వుక్కిరిబిక్కిరవుతున్న ధర్మరాజుతో యమధర్మరాజు ‘‘నాయనా! నీవు పుణ్య చరిత్ర, నిర్మలమైన బుద్ధి, సర్వభూతాల పట్ల నీకున్న దయాగుణం నా మనసును సంతోష సాగరంలో తేల్చాయి. భూమిపై నీయటువంటివాడు యెవడున్నాడు? మునుపుగూడా ద్వైతవనంలో దోషాలులేని నీ పవిత్రమైన మనోగతిని నకులుని కోరినప్పుడే గుర్తించాను. గొప్ప ఔన్నత్యాన్ని ఇంద్రుడు నీలో గమనించాడు. రాజా! ఇక నీవు నిశ్చింతగా ఈ దేహంతోనే యోగమార్గంలో పుణ్యలోకాలకు వెళ్ళుము’’అని వరాన్ని ప్రసాదించాడు.
అప్పుడు గంధర్వులు, దేవఋషులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు మిక్కిలి ఆనందంతోవచ్చి, యముడు, ఇంద్రునితోచేరి పరమానందంతో ధర్మరాజును పైకెత్తి దివ్యరథంలో ఆసీనునిచేశారు. స్వర్గానికి కొనిపోయారు.
స్వర్గంలో తన సోదరులందరినీ చూచాడు ధర్మరాజు. వారు వారివారి స్థానాలలో వున్నారు. బ్రహ్మ శరీరంలోవున్న గోవిందుని చూచాడు. అర్జునుడు ఆయనను వుపాసిస్తున్నాడు. కర్ణుడు ద్వాదశాదిత్యులతో కూడి వున్నాడు. అట్టి అతడిని చూచాడు.
భీమసేనుడు మరుద్గణ పరివేష్ఠితుడై వున్నాడు. వాయుదేవుని ప్రక్కన కూర్చొనివున్న భీముని చూచాడు.
ఉత్తమసిద్ధిని పొంది తమ తేజస్సుతో వెలుగొందుతూ అశ్వినుల స్థానంలో వున్న నకుల సహదేవులను చూచాడు.
కమలాలు, కలువల మాలను ధరించి తన శరీర శోభలో స్వర్గాన్ని ఆక్రమించి సూర్యతేజస్సుతో విరాజిల్లుచున్న పాంచాలిని(ద్రౌపదిని) చూచాడు.
అప్పుడు దేవేంద్రుడు ధర్మరాజుతో అన్నాడు.
‘‘యుధిష్ఠిరా! ద్రౌపదిరూపంతో కనిపిస్తున్న ఈమె సాక్షాత్తు ‘లక్ష్మియే’. మీకోసం మానుషత్వాన్ని పొందింది. సాక్షాత్తు శూలపాణి అయిన శంకరుడే మానుషత్వాన్ని పొందింది. సాక్షాత్తు శూలపాణి అయిన శంకరుడే మీ ఆనందంకోసం ఆమెను కల్పించాడు. ద్రుపదుని యింటబుట్టి మీ అందరి ఆదరణను పొందింది’’ అని.
ద్రౌపది పుత్రులుగా పుట్టిన ఆ అయిదుగురు గంధర్వులు చూచాడు.
ధృతరాష్ట్రునిగా జన్మించిన గంధర్వరాజును చూచాడు.
సాధ్యులు, విశ్వదేవతలు, మరుత్తల గణాల అంశతో పుట్టిన వృష్టి. అంథక మహారథులను, సాత్యకిని చూచాడు.
చంద్రకాంతితో, చంద్రునితో కలిసి కూర్చున్న‘అభిమన్యుని’ చూచాడు.
వసువులతో వున్న భీష్మపితామహుని చూచాడు.
బృహస్పతికి దగ్గరగా వున్న గురుద్రోణుని చూచాడు.

అయిపోయంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము