డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘విజయోస్తు... నీ తండ్రి అభీష్టంమేర సింహాసనాన్ని అధిష్టించి జన రంజకమైన పాలనాతి యశోచంద్రికలతో వర్ధిల్లు నాయనా’’అని దీవించాడు.
ఇద్దరూ గురువుగారి దగ్గర సెలవుతీసుకుని తోటి సహచరులకు వీడ్కోలు చెప్పి బయల్దేరారు...
సరిగా అదే సమయంలో ఇందాకటి చిలుక వచ్చి సుధర్ముల పాదాల మీద వాలింది...
సుధాములు ఆ చిల్కను చేతుల్లోకి తీసుకున్నాడు. కనులు మూసుకుని దివ్యదృష్టితో వీక్షించాడు. ‘‘ఓరుూ చిలుకా నా మనసు అవగతమైంది... వెళ్ళు నీకు ష్పవించనం తథ్యం... విజయోస్తు’’అని దీవించి గాలిలోకి వదిలాడు చిలుకను.
ఆ చిలుక గాలిలోకి ఎగిరి ఆశ్రమం వదిలి తమ రాజ్యానికి బయల్దేరిన మిత్రుల్లో విజయుడి భుజంమీద వాలింది.
విజయుడు ఆ చిలుకను తన చేతులలోకి తీసుకుని దేశవాసివి నువ్వు.? అడిగాడు నవ్వుతూ...
‘‘మీరు సరే అంటే మీ దేశవాసిని’’ చిల్కా పలుకులు పలికింది.
‘‘మాటలాడు చిలుకవా... భళి భళి... మాతో వస్తావా...’’ విజయుడు అడిగాడు.
‘‘్భలే భలే వస్తాను’’ చిలుక పలికింది.
‘‘అయితే నువ్వు మా నేస్తానివి... మా విక్రముడికి కూడా’’ విక్రముడి వైపు తిరిగి అన్నాడు.
అశ్వాలను అధిరోహించారు మిత్రులిద్దరూ... విజయుడు అశ్వం తల భాగంమీద ఆసీనురాలైంది చిలుక. ఆ శే్వతాశ్వంతోపాటు విక్రముడి అశ్వం ముందుకు కదిలాయి...
***
రెండు అశ్వాలు అశ్వవేగంతో గాలితో పోటీపడి పరుగులు తీస్తున్నాయి. సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి... ఒక చెట్టుకింద తమ అశ్వాలను ఆపారు... చల్లటి గాలివీస్తోంది. వృక్షాలు వింజామరలు అయ్యాయి.
‘‘మిత్రమా ఈ చల్లగాలిలో ప్రయాణంచేసిన బడలికలో అలిసిన మన దేహాలు విశ్రాంతిని కోరుకుంటున్నాయి. మన అశ్వాలు పరుగెత్తి పరుగెత్తి అలిసిపోయాయి’’ అన్నాడు విక్రముడు.
‘‘అవునవును అలిసిపోయాయి అలిసిపోయాయి’’ చిలుక వంతపాడింది విజయుడు అధిరోహించిన అశ్వంనుంచి రివ్వున ఎగిరివచ్చి విజయుడి భుజాల మీద వాలి.
‘‘అవునవును నిన్ను తన తలమీద మోసిన నా పంచకల్యాణి అలిసిపోయింది’’ అన్నాడు చిలుకను చేతుల్లోకి తీసుకుంటూ...
‘‘్భలే భలే పంచకల్యాణి... మరి నేనెవరిని మిత్రమా?’’ చిలుక గారాలపోతూ అడిగింది.
విజయుడు విక్రముడివైపు తిరిగే ‘‘నిజమే మిత్రమా... మన నేస్తానికి పేరే పెట్టలేదు కదూ...’’ అన్నాడు.
‘‘అవునవును అన్నప్రాసన చేసి పేరుపెడదాం’’ విక్రముడు నవ్వుతూ అన్నాడు.
‘‘మన చిలుకకు తగిన పేరేమి పెడదాము...? విజయుడి భృకుటి ముడిపడింది.
ఆ చిలుక వీళ్ళవైపే చూస్తోంది.
విజయుడు ఒక్క క్షణం కళ్ళుమూసుకుని కళ్ళుతెరిచి ‘‘ఈ రాజహంసకు సరిపడు నామధేయమేమున్నది? అంటూనే వెంటనే.. ’’రాయంచ... అన్నాడు.
‘‘బాగుబాగు రాయంచ బాగు’’ చిలుక తన రెక్కలు టపటపలాడిస్తూ సంతోషాన్ని వ్యక్తంచేసింది.
విక్రముడు చిలుక వైపు చూసి ‘‘రాయంచా... ఇకనుంచి నువ్వు మాలో ఒకరివి... నీ పేరు రాయంచ’’అన్నాడు.
‘‘అవునవును ధన్యవాదాలు మిత్రులారా? రాయంచ చిలకపలుకులు పలికింది.
‘‘ఏమంటావు మిత్రమా? అన్నాడు విజయుడు.
‘‘చిత్తం మిత్రమా నీ చిత్తంలో అనిపించింది నాకు సమ్మతమే’’ అన్నాడు విక్రముడు.
ఇద్దరూ కలిసి రాయంచా... అని చిలుకను పిలిచారు. అది విన్న చిలుక రెక్కలాడిస్తూ ‘‘నేను రాయంచ నేను రాయంచ’’అని పలికింది. అది చూసిన మిత్రులిద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఆ చెట్టుకింద విశ్రమించారు.
‘‘ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం... తెల్లవారి మన ప్రయాణం కొనసాగిద్దాం.. ముందు ఆకలి తీర్చుకుందాం మిత్రమా’’ విజయుడు అన్నాడు.
‘‘అవునవును క్షుద్భాధ తీరకుండా కంటి మీదికి కునుకు కూడా రాదు కదా? దగ్గరలో ఫలవృక్షాలు ఉన్నాయేమో చూద్దాం’’ విక్రముడు అన్నాడు.
ఇద్దరు ముందుకు కదలబోతుంటే ‘‘మీరు విశ్రమించండి.. ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను... ఫలవృక్షాల జాడ చిటికెలో పసికట్టేస్తాను? అంటూ గాల్లోకి ఎగిరింది రాయంచ.
‘‘ఇది మామూలు చిలుక కాదు మిత్రమా... శాపవశమున ఈ రూపం ధరించిందని నా మది చెబుతుంది.’’
‘‘నిజమే మిత్రమా... లేకున్నా ఇన్ని మాటలు పలుకు చిలుక... అదియునూ గురుదేవుడి ఆశ్రమ ప్రాంతమున’’
వాళ్ళు అలా సంభాషణ కొనసాగిస్తూ వుండగానే రాయంచ వీళ్ళ దగ్గరికివచ్చి వాలింది.
‘‘త్వరపడండి... మేలుజాతి రాజఫలాలు మామిడి... సీతాఫలం... నాకు మిక్కిలి మక్కువైన జామఫలాలు...’’ రాయంచ పలికింది.
***
ఫలములతో కూడిన తోట... రకరకాల ఫలవృక్షాలు వున్నాయి. విక్రముడు విజయుడు తమకు కావలసిన ఫలాలను తీసుకున్నారు... రాయంచ వైపు చూసారు.. రాయంచ జామచెట్టుమీద వాలి జామకాయల రుచి చూస్తూ బావున్న వాటిని తన ముక్కుతో కొరికి తన మిత్రులకు అందిస్తున్నది.
‘‘చిలుక కొరికిన జామ రుచి బహుబాగున్నదికదా విక్రమా’’ అన్నాడు విజయుడు.
రుచికరమైన ఫలాలతో ఆకలి తీర్చుకున్నాక అశ్వాలను కట్టివేసి ప్రదేశానికి వచ్చి చెట్టుకింద విశ్రమించారు.
‘‘మిత్రమా నువ్వు నిద్రపో... నేను మెలుకువగా వుంటాను.. క్రూరమృగాలు దాడిచేసే ప్రమాదం పొంచి వున్న అడవికదా’’ అన్నాడు విజయుడు.
‘‘లేదు మిత్రమా నువ్వు విశ్రమించు... నేను కాపలా వుంటాను’’ విక్రముడు అన్నాడు.
‘‘మీరు ఇరువురూ విశ్రమించండి... నేను మెలకువగా వుంటాను. ప్రమాదం పొంచి చూసినప్పుడు మీకు తెలియజేస్తాను’’ రాయంచ చెప్పింది.

-సశేషం

- శ్రీ సుధామయి