డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులి దగ్గర సెలవు తీసుకుని బయల్దేరుతుంటే ‘‘మిత్రమా.. ఒక చిన్న పని యున్నది. మీరు అనుమతి ఇస్తే’’ అని ఆగింది.
ఏమిటన్నట్టు చూసారు విక్రమ విజయులు.
చిలుక పులి దగ్గరికి వెళ్లి పులిరాజా ఒక చిన్న కోరిక.. కోరమందువా? అని అడిగింది.
‘‘యువరాజా వారి దగ్గర నాకు గౌరవం దక్కేలా చేసావు. చిలుక మిత్రమా అడుగు’’అంది పులి.
‘‘కొద్దీదూరం నీమీద స్వారీ చేయవలెనని ముచ్చటగా వున్నది. గుర్రం మీద స్వారీ చేశాను. ఇప్పుడు పులి స్వారీ చేస్తే మా తోటి చిలుకలతో చెప్పుకుంటాను’’ అంది.
పులి సరేనన్నది పులి మీద కూచున్నది చిలుక... పులి మీద స్వారీ చేస్తున్నట్టు... పులి నడుస్తున్నది. పక్కనే రెండు అశ్వాలు... వాటి వెనుక విక్రమ విజయుడు.
ఆ దృశ్యం చూడముచ్చటగా యున్నది.
***
అడవి దాటి మహాపురి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. విజయుడులో అంతులేని భావోద్వేగం పొంగి పొర్లింది. చాలాకాలం తర్వాత తాను రాచనగరికి వచ్చాడు.. తాను తిరిగిన ప్రాంతాలు, ఆడిన ఆటలు రాజభటులు తన ప్రజలు అన్నీ గుర్తొచ్చాయి.
విక్రముడు కూడా అదే విధమైన ఆలోచనలో వున్నాడు.
ఇరువురూ ఒకరినొకరు చూసుకున్నారు.
రాయంచ రాజసాలు ఒలకబోస్తూ పులిమీది నుంచి ఎగిరి విజయుడి భుజాల మీద వాలింది.
‘‘ధన్యవాదాలు మిత్రమా... నా కోరిక తీర్చావు... మా తోటి చిలుకలకు మీ గొప్పతనాన్ని చెబుతాను’’ అంది.
పులి విజయుడి వైపు తిరిగి ‘‘యువరాజా.. ఇక మా సరిహద్దు.. అడవి దాటి నగరంలోకి ప్రవేశించడం శ్రేయస్కరం కాదు... నన్ను చూసి మీ నగరవాసులు భీతి చెందుతారు.. మీకు సేవచేయడానికి నేను సదా సంసిద్ధం.. ఎప్పుడు నాతో ఏ అవసరం వచ్చినా నా మిత్రుడు రాయంచతో కబురుచేయండి. మీముందు వాలుతాను.. విజయోస్తు’’ అంటూ విక్రమ విజయులవద్ద సెలవుతీసుకుంది పులి.
***
విజయుడు విక్రముడి వైపు చూసి ‘‘మిత్రమా నా ఒంటిలో గగుర్పాటు... గురుకులంలో గడిపి మనం రాజ్యంలోకి వచ్చాం... మన ప్రజలు..సంతలు.. రాజభటులు పచ్చని పొలాలు పాడియావులు... వీటిని చాలాకాలం తర్వాత దర్శించబోతున్నాం. మన రాకకోసం మహాపురి స్వాగత తోరణాలతో ఆహ్వానం పలుకుతుంది కదూ.. మాతృమూర్తిని పితృదేవులను చూడవలెనని నా మనసు ఆత్రపడుతుంది... కానీ’’అని ఆగిపోయాడు.
‘మిత్రమా ఏమైంది అన్యమనస్కతకు కారణం ఏమిటి అని పట్టికుదిపాడు విక్రముడు. తేరుకున్న విజయుడు గురువుగారు చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాను. మహారాజుగా పట్ట్భాషేకం చేసుకుని కిరీటాన్ని ధరించడానికి ముందు ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం మన విధి.
దేశ సంచారంచేసి మారువేషాల్లో సంచరించి ప్రజలకు మరింత మెరుగైన పాలన ఎలా అందించాలో తెలుసుకోవాలికదా...’’ అన్నాడు.
విజయుడు అలాఅనగానే విక్రముడు ‘‘మిత్రమా మనం రాజ్యంలోకి ఇలా వెళ్లడం వద్దు. వేషాలు మార్చుకుని నగర సంచారం చేద్దాం. మన రాజ్యంలో పాలన సుభిక్షంగా ఉండటం కనులారా చూడాలి మన రాజ్యంలో పాడిపంటలు పచ్చని పంటచేలను చూడక ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కదా.. అందుకే మారువేషాలలో వెళ్లి నగర సంచారం చేశాక అప్పుడు రాజభవనానికి బయలుదేరుదాం’’అన్నాడు. మన రాకకోసం ఏర్పాటుచేసిన స్వాగత సన్నాహాలుకూడా చూడవచ్చు మిత్రమా అలాగే చేద్దాం అన్నాడు విక్రముడు.
మిత్రులిరువురూ వేషాలు మార్చుకుని పరదేశీవాసులలా తయారయ్యారు. రాయంచతో కలిసి నగరంలోకి ప్రవేశించారు.
***
మహాపురి సామ్రాజ్యంలోకి ప్రవేశించిన విక్రముడు విజయుడు నిశే్చష్టులయ్యారు.. శిలాప్రతిమల్లా నిలబడిపోయారు.
‘‘ఇది మహాపురి సామ్రాజ్యమేనా? ఎప్పుడూ గుమ్మాలకు తోరణాలతో కళకళలాడే భవంతులు ఏవీ ఎక్కడ? రంగుతేలిన భవంతులు... అస్తవ్యస్తంగా వున్న రహదారులు... చక్కని మేలిమి వస్త్రాలతో తిరుగాడే నగర ప్రజలు మాసిన దుస్తులతో చిరుగుల దుస్తులతో కనిపిస్తున్నారు.
పొలాలు బీడులుగా మారాయి.. ప్రజల మొహాలలో కళాకాంతులు లేవు. అక్కడ అగుపిస్తున్న ప్రతి దృశ్యం నిశే్చష్టులను చేస్తోంది. కాలి బాటకిరువైపులా రమ్యమైన ఫలవృక్షాదులు వాడిపోయి ఎండిపోయి మోడువారి ఉన్నాయి. మనోహర శిల్పాకృతులను కలిగిన భవనాలు భవంతులు వెలిసిపోయి అక్కడక్కడా కూలిపోయి తమ ప్రాభవాన్ని కోల్పోయి కాంతి హీనమైపోయాయి. రాజ్యంలోని జనులందరూ తినడానికి తిండి కూడా లేని విధముగా చిక్కి శల్యమై ఉన్నారు. కరువుకాటకాలకు లోనై సమస్తాన్ని కోల్పోయినట్టు సర్వం కళావిహీనమై కనిపిస్తోంది. ఎక్కడ చూసినా క్షామం తాండవిస్తున్నట్టు కనిపిస్తోంది.
అవన్నీ చూసిన విజయుడు ఖిన్నుడయ్యాడు. తీవ్రమైన విచారంతో మిత్రమా మనం అడుగుపెట్టి వచ్చినది మన రాజ్యమేకదా... మహాపురి సామ్రాజ్యమేకదా? అని విక్రముడిని అడిగాడు. ఖిన్నమనస్కుడై. నిశే్చష్టమనస్కుడైన విక్రముడికి నోట మాట రావడం లేదు.
ఇంతలో వారి ముందు కలకలం మొదలైంది.
అల్లంత దూరాన అరుపులు... దొంగ దొంగ పట్టుకోండి... అనే కేకలు
విజయుడు తేరుకుని ఒరనుంచి తన కరవాలాన్ని తీసాడు... విక్రముడు కూడా తేరుకున్నాడు... పరుగెత్తుకు వస్తున్నా చోరుడిని నిలువరించాలన్న ఆలోచనతో వున్నారిద్దరూ.. తమ రాజ్యంలో చోరులా? మునుపెన్నడూ లేని విడ్డూరం... మహాపురి నగరంలో చోరులకు స్థానం లేదు.. ఆ అవసరమూ తమ రాజ్యపౌరులకు లేదు... పరరాజ్యం పౌరుడైనా సాదరంగా ఆహ్వానించి ఆదరించే సంస్కారం తమ రాజ్యానిది.. అలాంటిది? విజయుడు ఆలోచనలో ఉండగానే పరుగెత్తుకువస్తోన్న వ్యక్తి విజయుడిని సమీపించాడు.. వెనుకనుంచి జనం తరుముతున్నారు..
పరుగెత్తుకు వచ్చిన చోరుడిని చూసి ఆశ్చర్యపోయాడు విజయుడు. అతడిని ఒడిసిపట్టుకున్నాడు. ఆయుధాన్ని ఉపయోగించే అవసరమే కలుగలేదు. చిక్కిశల్యమైన వ్యక్తి. అతని చేతిలో చిన్నమూట... ఆ బక్కపల్చని వ్యక్తి విజయుడి పాదాలమీద పడి ‘‘దయచేసి నన్ను వదిలిపెట్టండి... నా బిడ్డలు వృద్ధులైన తల్లిదండ్రులు క్షుద్భాదతో మృత్యువుకు చేరువగా వున్నారు’’ అని వేడుకున్నాడు.
విజయుడి చేతిలోని కరవాలం చేజారింది.
బక్కపలచని వ్యక్తి చేతిలోని మూటనుంచి ఎండిన రొట్టెలు కనిపిస్తున్నాయి.
అప్పటికే బక్కపలచని వ్యక్తి వెంబడించిన పౌరులు దొంగను పట్టుకున్న విజయుడిని చూసి... పక్కనే వున్న విక్రముడుని చూసి... మారువేషాల్లో వున్నవారిని గుర్తుపట్టని కారణంగా...
‘‘మీరెవరో పరదేశీయుల్లా వున్నారు.. తమరిది మా పొరుగురాజ్యం కూడా అయి వుండదు. మీరు ఎవరైననూ మీకు మా ప్రణామములు.. ఈ చోరుడిని దండించకుండా విడిచిపెట్టండి.
అడవిదాటి మహాపురి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. విజయుడులో అంతులేని భావోద్వేగం పొంగిపొర్లింది. చాలాకాలం తర్వాత తాను రాచనగరికి వచ్చాడు.. తాను తిరిగిన ప్రాంతాలు, ఆడిన ఆటలు రాజభటులు తన ప్రజలు అన్నీ గుర్తొచ్చాయి.
***
ఆ మాటలతో విజయుడు ఆశ్చర్యానికిలోనై ‘‘దొంగదొంగ అంటూ వెంటపడ్డారు... చేతికి చిక్కిన చోరుడిని దండించవద్దు... అంటున్నారు.. చాలా చిత్రముగా యున్నది.’’
-సశేషం

- శ్రీ సుధామయి