Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: భూమి కేంద్రం అనుకున్నపుడు భూమి చుట్టూ చంద్రుడు, సూర్యుడు కూడా తిరుగుతున్నారనుకున్నపుడు, వాళ్లిద్దరిమధ్యగల డిగ్రీల దూరాన్ని లెక్క వేస్తే- ఆ దూరం పేరే తిథి!
సూర్యచంద్రుల మధ్య దూరం పెరుగుతూ, తరుగుతూ వుంటుంది. కొన్ని హద్దులకు లోబడి ఆ దూరం మారుతూ వుంటుంది (రెండూ సమాన కేంద్రంగల వృత్తాలు కావు గనుక). అందుకే తిథుల పొడుగు మారుతూ వుంటుంది.
ఈ తిథులు పదిహేను- ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ రోజుకు సుమారు 12 డిగ్రీలు నడుస్తాడు.
కనుక 12న15 =180 డిగ్రీలు. అంటే అది ఒక అర్థవృత్తం! దాని పేరే ఒక పక్షం. ఇలాటి పక్షాలు రెండు కలిస్తే దాని పేరు మాసం.
యోగం: మన చుట్టూ వుండే రాశి చక్రానే్న ‘్భ చక్రం’ అంటారు. దీన్ని 13.20 డిగ్రీల చొప్పున ముక్కలు చేసుకుంటూ పోతే, 27 ముక్కలు వస్తాయని ఇదివరకే చెప్పుకున్నాం గదా. సరిగా ఒక్కొక్క ముక్క అంచు మీద సూర్యచంద్రుల దూరాన్ని లెక్కిస్తే ఆ దూరం పేరు యోగం. తిథి కూడా సూర్యచంద్రుల మధ్య దూరమే
కాని- అది ఒక రోజు మొత్తంలో వారిమధ్యగల దూరం. యోగం అనేది 13.20 డిగ్రీల దగ్గర ఉండే దూరం- అదే తేడా. యోగం అనేది 13.20 డిగ్రీల ముక్కలమీద ఆధారపడి వుంది గనుక యోగలు కూడా ఇరవై యేడే.
కరణం: ఇక కరణం అనగా ఒక రోజు యొక్క అర్ధ్భాగంలో సూర్యచంద్రులు యిద్దరి మధ్యా వుండే దూరం పేరు. రోజు మొత్తంలో వుండే దూరం తిథి అయితే అర్థ రోజులో వుండే దూరం పేరు కరణం. కానీ విచిత్రమేమిటంటే- తిథిలో సగం కరణం కాదు. సుమారుగా సరిపోయినా, తేడాలుంటాయి. ఎందుకంటే, గ్రహాలన్నీ దీర్ఘవృత్తంలో ప్రయాణం చేస్తున్నాయే కానీ- సమవృత్తంలో ప్రయాణం చేయటం లేదు. అందువల్ల ఆ లెక్కలన్నీ చూచి మన వాళ్లు కరణాలు పదకొండు అని నిర్ణయం చేశారు.
వారం: వారము అంటే- ‘సారి’ అని అర్థం. 1వ సారి, 2వసారి అంటామే దానే్న సంస్కృతంలో ప్రథమవారము, ద్వితీయవారము- ఇలా అంటారు. భూమి బొంగరంలాగా తన చుట్టూ తను తిరుగుతూ, కదిలే బొంగరంలాగా సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగటాన్ని ‘ఒక వారం’ అని పిలిచారు మనవాళ్లు. ఒకసారి అన్నా- ఒకవారం అన్నా ఒకటే అని చెప్పుకున్నాం గదా! ఆకాశంలో గ్రహాల వరస ఎలా వుందో సూర్య సిద్ధాంత గ్రంథంలో స్పష్టంగా వుంది.
‘‘మందామరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః’’
అనగా పైనించి క్రిందికి వరసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలు వున్నాయి. ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో వుండగా వారాలు సూర్య, చంఅద, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో వున్నాయి. దీంట్లో ఏం లాజిక్ వుంది. ఇది కేవలం మూఢ విశ్వాసమా?ఈ విషయాలు తెలియాలంటే మనం భారతీయుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.
భూమి తన చుట్టూ తాను తిరగటానికి అరవై ఘడియలు పడుతుంది. ఈ అరవై ఘడియలలో ఈ ఏడు గ్రహాల ప్రభావాలూ ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.
ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే.. ఒక అహః ప్రమాణంలో ఇరవై నాలుగు భాగాలు కనిపించాయి. ఆ భాగాలను వారు ‘హోర’లలు అన్నారు.
‘అహఃప్రమాణం’ అన్నా ‘అహోరాఅత ప్రమాణం’ అన్నా ఒకటే. ‘అహోరాత్ర’ అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే ‘హోర’ అయింది. దీనే్న సాంకేతిక పదంగా తీసుకుని రోజ్కు 24 హోరలు అన్నారు.
ఈ హోర పదానే్న హవర్‌గా మార్చి పాశ్చాత్యులు 24 హవర్స్ అన్నారు. హోర శబ్దానికి, హవర్ శబ్దానికీ వున్న భాషాశాస్తప్రరమైన సామ్యాన్ని పరిశీలించినపుడు మనం ఆశ్చర్యపోకతప్పదు.
ఒక్కొక్క హోరలోనూ సప్త గ్రహాల ప్రభావం అదే వరసలో భూమి మీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ వుంటుంది. ఈభ్రమణంలో చిత్రం ఏమిటంటే- ఇవాళ ఆదివారం అయితే ఈ రోజు మొదటి హోర సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న ‘మందామరేఢ్య భూపుత్ర శుక్ర బుధేందవః’ అనే వరసలో, ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే- మర్నాడు ఉదయానికి సరిగా చంద్రహోర వుంటుంది. కనుక ఆ ఓజు చంద్రవారం లేక ‘సోమవారం’. మళ్లీ వరసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి ‘మంగళహోర’ వస్తుంది. కనుక ఆ రోజు ‘మంగళవారం’. ఆ మర్నాడు ఉదయం బుధహోర- అది బుధవారం. ఆ మర్నాడు ఉదయానికి గురుహోర- అది గురువారం. ఆ మర్నాడు ఉదయానికి శుక్రహోర- అది శుక్రవారం. ఆ మర్నాడు ఉదయానికి శనిహో- అది శనివారం! ఇలా సూర్యోదయ సమయానికి వుండే హోరమీద- ఏ గ్రహం ప్రభావం వుంటుందో, ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంద.
అయితే, మొదటి రోజు సూర్యోదయానికి, ‘సూర్యహోర’ అవుతుంది, అనుకుంటే గదా ఈ లెక్కలన్నీ ఇలా వచ్చేది! అలా ఎందుకనుకోవాలి? అనే ప్రశ్న సహజం.
--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి