డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంధ్యచీకట్లు ముసురుకుంటున్నాయి. ఒకవేళ తాను దారి తప్పితే... ముందే విజయుడికి విషయం వివరించి అతడితోపాటు తాను వెళ్లి ఉంటే బావుండేదేమో... ఒక్క క్షణం తనలోతాను అనుకున్నది. పైగా ఈ అడవిలో క్రూరమృగాల సంచారం ఎక్కువని విన్నది. అలా పరిపరివిధాల ఆలోచిస్తోన్న సమయంలో రాయంచ వచ్చి యువరాణి సహస్రదర్శిని భుజంమీద వాలినది.
యువరాణి సహస్రదర్శిని ఆనందానికి అవధులు లేవు. ‘‘ఓరుూ ప్రాణమిత్రమా.. రాయంచ చిలుకా...’’ ఆశ్చర్యంతో ఆనందంతో పలకరించింది.
‘‘మహాపురినుంచి మిమ్మల్ని నా చిలుక కంట కనిపెడుతూనే వున్నాను. తమరు దారితప్పుతారనే భయంతో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అయినా యువరాణి వారికి ఈ సాహసం పనికిరాదు’’ అన్నది రాయంచ చిలుక.
‘‘నిజం చెప్పు మిత్రమా... నేను చేసినది సరైనది కాదా? సూటిగా రాయంచ వైపుచూసి అడిగింది.
‘‘మంత్రాలదీవి ప్రాణపాయ ప్రపంచం కాదు... రణస్థలం.. అక్కడ పోరాటాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో తమరు...’’అని ఆగింది రాయంచ.
‘‘నేను చేసినది తప్పని భావిస్తే ఇక్కడికి పయనం అవ్వకముందే తెలియజేసే దానివి. అవునా కాదా’’ అంది.
‘‘ఏమో నా మిత్రుడికి ఈ విషయం తెలిస్తే నన్ను నిష్టూరాలు ఆడుతాడు. పైగా నా నోటితో నేను మీరెవరో చెప్పనని మాట ఇచ్చాను. మీరు పురుషవేషంలో వున్నారు. విజయుడు లాంటి వీరుడు మరో వీరుడి సాయాన్ని స్వీకరిస్తాడా?
నీకు మాట రానిస్తావా? అన్నది యువరాణి.
రాయంచ యువరాణివైపు తిరిగి ‘‘అలా దక్షిణంవైపు తిరిగి కుడివైపునకు వచ్చినచో అక్కడ ఒక మహావృక్షం కనిపిస్తుంది. అక్కడే యువరాజు విశ్రమిస్తున్నారు. మీరేమి చెప్పుకుంటారో ఏమి చేసుకుంటారో మీ ఇష్టం. నాకు మాట రానివ్వకుండా’’ అని అశ్వంవైపు తిరిగి ‘‘అశ్వమా... మిత్రమా... వేగం పెంచండి. నన్ను అనుసరించండి’’అని గాలిలోకి ఎగిరింది.
అశ్వం రాయంచను గమనిస్తూ ముందుకు పరుగులు తీస్తుంది.
* * *
మంత్రాల దీవి ఒక్కసారిగా పెద్ద గాలిదుమారం... తీతువుపిట్టల భయానక అరుపులు.
వకృటాసురుడు వస్తున్నాడు పారిపోండి పారిపోండి.. అంటూ పక్షుల మాటలు.
వకృటాసురుడు వస్తున్నాడనడానికి ఒక సంకేతం.. అప్పుడు ఆ మంత్రాల దీవిలో వున్న పక్షులు వృక్షాలు బండరాళ్లు భయంతో వణికిపోతాయి. వకృటాసురుడి క్రూర స్వభావానికి గాలి దుమారంనుంచి ప్రత్యక్షమయ్యాడు వకృటాసురుడు.
తననుచూసి వణకిపోతున్న మంత్రాలదీవిని చూసి వికటాట్టహాసం చేసాడు.
‘‘ఈ వకృటాసురుడు వస్తున్నాడంటే సమస్త భూమండలమే వణికిపోవాలె... హహహ’’అంటూ ముందుకు నడుస్తున్న వకృటాసురుడు ఒకచోట ఆగిపోయాడు.
అక్కడ కొన్ని విచిత్రమైన శిలలు చిన్న గుట్టలా పడిఉన్నాయి. ఒక శిలను తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించగా ఆ శిల స్థానంలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. గంధర్వుడు భయంభయంగా వకృటాసురుడి వంక చూసాడు.
ఆ గంధర్వుడిని చూసి వికటాట్టహాసం చేస్తూ...
‘‘నీ భయం చూస్తుంటే ముచ్చటేస్తున్నదిరా... ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని నాకు వశమై నాకు బానిసగా ఉంటావా లేదా అని హుంకరించాడు.
అది విన్న గంధర్వుడు...
‘వకృటాసురా ఆకాశ సంచారంచేస్తున్న నన్ను మాయతో బంధించి ఈ దీవిలో బందీచేశావు కానీ నేను ఎప్పటికీ నీకు బానిస కాను... నిన్ను ఎదురించి అంతమొందించి నాకు విమోచనం కలిగించే మహావీరుడు వస్తాడు’ అన్నాడు.
వెంటనే వకృటాసురుడి మొహంలో కోపం చోటుచేసుకుంది.
‘‘ఓరీ గాంధర్వ దురహంకారి... ననే్న ధిక్కరిస్తావా... ఎంత అహంకారం... నిన్ను శిలగా బందీచేసినా ఇంకా బుద్ధిరాలేదు. భయం కలగడంలేదు కదూ... నన్ను ధిక్కరిస్తున్నావుకదూ... చూడు నీకెలాంటి గతి పట్టిస్తానో’’అంటూ మంత్రదండాన్ని ఊపుతూ ఏవో మంత్రాలు ఉచ్చరించసాగాడు.
ఒక్కసారిగా గంధర్వుడిగామారిన శిల తిరిగి పూర్వ శిలారూపంలోకి వచ్చింది. ఎవరో బలంగాపైకి విసిరినట్టు గాల్లోకి ఎగిరింది. అతివేగంగా పైకివెళ్లి అంతే వేగంగా శిలగామారిన ఆ గంధర్వుడు అక్కడున్న రాళ్లగుట్టకు నేలకు కొట్టుకోవడం మొదలుపెట్టాడు. మాంత్రిక మాయచేత... శిలారూపంలో వున్న గంధర్వుడి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
‘వకృటాసురుడా... నీకిది తగదు. నినె్నదిరించి నీకు తగిన బుద్ధి చెప్పడానికి మహావీరుడు వస్తాడు’’ శిలగా మారిన గంధర్వుడు ఆక్రోశించాడు.
గంధర్వుడి ఆర్తనాదాలు విని వికృతంగా నవ్వుకుంటూ... ముందుకు సాగిన వకృటాసురుడు కొంచెం ముందుకువెళ్లి ఒక శిల్పందగ్గర ఆగి ఆ శిల్పానికి తన మంత్రదండాన్ని తాకించాడు.
ఒక్కసారి కళ్లు మిరుమిట్లుగొలిపే మేలుపులో మెరుపుతీగలా ఆ శిల్పం. ఒక అద్భుతమైన సౌందర్యరాశిగా మారిపోయింది. ఆమె సిరిహరిణి అనే పేరుగల అప్సరస. ఆమెను మోహించిన వకృటాసురుడు ఆమెను బలవంతంగా ఎత్తుకొచ్చి శిలగామార్చేశాడు. ఏదొక సమయంలో వచ్చి ఆ అప్సరసను బతిమాలాడో బెదిరించో వెళుతుంటాడు.
‘‘అద్భుత సౌందర్యరాశి.. ఇప్పటికైనా చెంతకువస్తావా... నన్ను మురిపిస్తావా... నన్ను సంతోషపెట్టవే అప్సరసల నిన్ను ఈ భూమండలాన్ని మహారాణిని చేసేను’’అన్నాడు తన గడ్డాన్ని నిమురుకుంటూ...
‘‘ఓసీ మాయావీ.. మగువ మనసును అర్ధంచేసుకోలేని అవివేకి... నీలాంటి క్షుద్ర మాంత్రికుడికి నేను కాలెనా? మాయచేత నన్ను చెరపట్టినావు... నిన్ను శిక్షించి నాకు విమోచనం కలిగించే వీరాధివీరుడు వస్తాడు...’’అంది కోపంగా ఆ అప్సరస.
‘‘నీ అందానికి మించిన అహంకారం వున్నదే... మగవాడి చిత్తాన్ని చిత్తుచేసే నీ సౌందర్యం బండరాయివలె ఉండిపోతుంది చూడు’’అంటూ మంత్రదండాన్ని అప్సరస నుదురుకు తాకించాడు.
తిరిగి శిలగా మారింది అప్సరస.
దీవి అంతా కలియజూస్తూ తన ఆధీనంలోఉన్న మంత్రాలదీవిలో ఉన్న ప్రతి వస్తువూ ప్రాణిఅన్నీ తన కనుసన్నలలో మెలుగుతాయని అదే విధంగా సర్వజగత్తును తన గుప్పిట బంధించాలని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాయి.
ఇంకొకచోట ఆగిన వకృటాసురుడు తన మంత్రదండంతో గాలిలో ఆడించాడు. అంతే అక్కడ వీస్తున్న గాలి స్థంభించిపోయింది.
మరికొంత ముందుకు వెళ్లిన వకృటాసురుడు అక్కడున్న మోడువృక్షాలను చూసి వికటాట్టహాసం చేశాడు. ఆ వృక్షాలు మంత్ర ప్రభావంచేత మోడుగామారిన కొందరు యక్షులు తన ఆధీనంలోని మంత్రాలదీవిని పరికిస్తూ తన గుహలోకి వెళ్లిపోయాడు వకృటాసురుడు.

-సశేషం

- శ్రీ సుధామయి