డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనాటి సమస్త దేశాలవారూ అంగీకరిస్తున్న చారిత్రక కొలమానాల ప్రకారం చర్చించుకున్నా కూడా, సనాతన భారత వైభవం ఏ మాత్రమూ మసకబారదని నిరూపించేందుకోసం, పాశ్చాత్యులు నిర్ణయించిన కాలనిర్ణయాలనే అంగీకరించి ఈ చర్చ చేయడం జరిగింది.
భారతీయ గణిత శాస్తజ్ఞ్రుల ఆదిమూలాలు వేదాలలోనే ఉన్నప్పటికీ, వాటి ప్రస్ఫుట ఆవిష్కరణలు శుల్బ సూత్రాలతో ప్రారంభమైనాయి. ఇవి బిసి 800-1300 ప్రాంతానివని ఆధునికుల భావన. ఆనాటినుంచి ఇంచుమించు 19వ శతాబ్దం వరకు భారతీయ గణిత పరిశోధన పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఆ వివరాలన్నీ చెప్పుకునే అవకాశం ఇక్కడ మనకు లేకపోయినా, స్థూలంగా కొందరు ప్రముఖ భారతీయ గణిత విశేషజ్ఞులను, వారి కాలాలను గమనించడం సముచితం.
శాస్తజ్ఞ్రుల పేరు వారు జీవించిన కాలము (సుమారుగా)
1. లగధుడు క్రీ.పూ.1350
2. మహర్షి పింగళుడు క్రీ.పూ.200
3. ఆర్యభట్టు-1 క్రీ.శ.476-550
4. వరాహమిహిరుడు క్రీ.శ.587
5. బ్రహ్మగుప్తుడు క్రీ.శ.598
6. భాస్కరుడు-1 క్రీ.శ.600-680
7. శ్రీ్ధరాచార్యుడు క్రీ.శ.750
8. లల్లాచార్యుడు క్రీ.శ.700-790
9. మహావీరాచార్యుడు క్రీ.శ.800-870
10. గోవిందస్వామి క్రీ.శ.800-860
11. శ్రీపతి క్రీ.శ.1019-1066
12. ఆర్యభట్టు-2 క్రీ.శ.950
13. భాస్కరుడు-2 క్రీ.శ.1114
14. పావులూరి మల్లన్న క్రీ.శ.1018-1061
15. నీలకంఠ సోమయాజి క్రీ.శ.1444-1545
16. గణేశ దైవజ్ఞుడు క్రీ.శ.1507
వీరిలోని ప్రముఖ గణితజ్ఞులంతా అంకగణిత, బీజగణిత, రేఖాగణితాలను మాత్రమే కాక ఖగోళ గణితాన్ని కూడా విస్తారంగా పరిశోధించి, నూతన ఆవిష్కరణలను చేసినవారే. వీరి కాలాలను గమనించినపుడు, ఆనాటి ఇతర దేశీయ గణితజ్ఞుల ఆవిష్కరణలకంటే వీరి ఆవిష్కరణలు ఎంత ముందుగా ఉన్నాయో మనం గ్రహించవచ్చు. ఈ విషయంలో విశేషంగా తెలుసుకోదలచినవారు ఐసర్వ్ సంస్థ ప్రచురించిన ‘ఏన్షియంట్ ఇండియన్ మాథమెటీషియన్స్’ వంటి అనేక పరిశోధనాత్మక గ్రంథాలను పరిశీలించవచ్చును.
భారతీయ గణిత పరంపరలో పురాతన వర్గానికి చేరకపోయినప్పటికీ, కాలరీత్యా అత్యాధునికులే అయినప్పటికీ, ఇద్దరు భారతీయ గణితజ్ఞులు విశేష ప్రసిద్ధిని ఆర్జించారు. వీరిలో శ్రీనివాస రామానుజన్ పూర్తిగా ఆధునిక విధానంలోనే అద్భుత గణిత శిఖరాలను అధిరోహించగా, పూరి శంకరాచార్య పరంపరకు చెందిన శ్రీ్భరతీ కృష్ణతీర్థగారు ఆవిష్కరించిన వేదిక్ మాథమేటిక్స్ అనేది గణిత శాస్త్రంలో ఒక నూతన మార్గాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. అందువల్ల వీరి వేదిక్ మాథమాటిక్స్ గురించి, దీనిని గురించి పాశ్చాత్యుల అభిప్రాయాల గురించి కొద్దిగా చెప్పుకుందాం.
వేదిక్ మాథ్స్ సమకాలీన ఆవశ్యకత
ఆశ్చర్యకరంగా, 1884లో శ్రీ భారతీ కృష్ణతీర్థులు అనే మేధావి జన్మించి, నూతన గణితాంశాలెన్నింటినో కనిపెట్టారు. అదే వారి అనంతరం ‘వేదిక్ మాథమాటిక్స్’ అనే పేర ప్రచురించబడింది.
అథర్వవేదానికి ఉపవేదమైన స్థాపత్యవేదం ద్వారా ప్రేరితులై శ్రీ భారతీ కృష్ణతీర్థులు దీన్నివ్రాయటంవల్ల, దీనికి వేదిక్ మాతమాటిక్స్ అనే పేరు ఏర్పడింది. ఈ గణిత విధానం హెచ్చవేతలు, భాగహారాలు వంటి ఎన్నో గణిత సమస్యలను ఆశ్చర్యకరమైన వేగంతో పరిష్కరించగలుగుతోంది. గనుక దీన్ని ‘స్పీడ్ మాథమాటిక్స్’ లేకుంటే ‘శీఘ్రగణితం’ అనటం ఉచితంగా ఉంటుందని మరికొందరి అభిప్రాయం.
ఇతర దేశాలవారు మాత్రం ఈ వేదిక్ మాథమాటిక్స్ మీద ఆసక్తి కనబరచి, వారి విద్యాలయాల్లో (సెయింట్ జోన్స్ ఇండిపెండెంట్ స్కూల్స్, లండన్, స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వర్క్స్, లండన్, సెయింట్ జీసెస్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ, ఆస్ట్రేలియా మొదలైన చోట్ల) పాఠ్యగ్రంథంగా రుూ వేదిక్ మాథమేటిక్స్‌ని బోధించడం మమందరం గమనించదగ్గ విశేషం.
శ్రీ భారతీ కృష్ణతీర్థులవారి సిద్ధాంతిక భాగాలమీద పరిశోధనలు కూడా విదేశాల్లోనే మొదలయ్యాయి. ఇంకావుంది..

- కుప్పా వేంకట కృష్ణమూర్తి