డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర దేశాలవారు మాత్రం ఈ వేదిక్ మాథమాటిక్స్ మీద ఆసక్తి కనబరచి, వారి విద్యాలయాల్లో (సెయింట్ జోన్స్ ఇండిపెండెంట్ స్కూల్స్, లండన్, స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వర్క్స్, లండన్, సెయింట్ జీసెస్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ, ఆస్ట్రేలియా మొదలైన చోట్ల) పాఠ్యగ్రంథంగా రుూ వేదిక్ మాథమేటిక్స్‌ని బోధించడం మమందరం గమనించదగ్గ విశేషం.
శ్రీ భారతీ కృష్ణతీర్థులవారి సిద్ధాంతిక భాగాలమీద పరిశోధనలు కూడా విదేశాల్లోనే మొదలయ్యాయి.
ఇంగ్లీషు గణిత శాస్తజ్ఞ్రులు కెనె్నత్ విలియమ్స్, ఆండ్రూ నిఖోలాస్, జెరెమి పిక్కిల్స వంటివారు, శ్రీ భారతీ కృష్ణతీర్థులవారి గ్రంథాలమీద పరిశోధనలు చేస్తూ, ఎన్నో ఉపన్యాసాలు కూడా ఇవ్వడం జరిగింది. ‘ఇంట్రొడక్టరీ లెక్చర్స్ ఆన్ వేదిక మాథమాటిక్స్’ పేర లండన్‌లో ఒక గ్రంథం కూడా 1981లో ప్రచురించబడింది. ఇంతేగాక, ఈ వేదిక్ మాథమాటిక్స్‌వల్ల విద్యార్థులకు లభించే ప్రయోజనాలమీద కూడా లోతైన అధ్యయనాలు విదేశాలలోనే జరిగాయి.
ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి ఒక సుప్రసిద్ధ వెబ్‌సైట్‌లో ఉన్నవిషయాలను పరిశీలిద్దాం. మనోవిశే్లషక వైజ్ఞానికుల ప్రకారం మానవ మేధ రెండు అర్ధగోళాలుగా వుంది. అందులో ఎడమభాగం ఒక పద్ధతి ప్రకారం సమాచారాన్ని కూడబెట్టటం, దాన్ని తులనాత్మకంగా విశే్లషించడం, క్రమపద్ధతిలో ఒక తార్కికమైన నిర్ణయానికి రావడం వంటివాటికి సహకరిస్తుంది. కుడిభాగం మాత్రం ఆసమాచారపు గుణగణాల్ని, నమూనాలను విశే్లషించడం, సూక్ష్మబుద్ధితో ఒక మెరుపు లాంటి ఆలోచనల్ని (ఇంట్యూషన్) కలిగించడం వంటివి చేస్తూ వుంటుంది. ప్రస్తుత విద్యా విధానంలోని గణిత శాస్త్రం ఎడమ భాగంలో వున్న మేధకు మాత్రమే పదునుపెడుతోంది. ఎంతో అవసరమైన కుడి భగంలోని మేధ వికసించాలంటే, వేదిక్ మాథమాటిక్స్ లాంటి థ్రాల ఆవశ్యకత ప్రస్తుత విద్యార్థి లోకానికి ఎంతైనా వుంది. ఎందుకంటే వేదిక్ మాథమాటిక్స్‌లో ప్రముఖమైన అంశం నమూనాల గుర్తింపే. ఈ మెట్టు దాటితే, మెరుపు వేగంతో నోటి లెక్కలు వేయడం దాని రెండవ మెట్టు. ఈ అంశాలన్నీ మెదడు కుడి అర్థగోళానికి సంబంధించిన అంశాలు.
‘‘ఈనాటి విద్యార్థులే భావితరాల వైజ్ఞానికులు. ఈ వేదిక్ మాథమాటిక్స్ బోధనలతో వారికి రెండు వైపులా పరిపూర్ణ మనోవికాసం కలుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, వేద గణితం మానవ మేధకు (కాస్మిక్ కంప్యూటర్) కాస్మిక్ సాఫ్ట్‌వేర్‌లాగా పనిచేస్తుందనడం అతిశయోక్తి కాదు.
‘‘మందరికీ తెలుసు, కంప్యూటర్‌లో ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సిపియు) వుంటుంది. దీనిలో ఒక ఎ.ఎల్.యు(అర్థమాటిక్ లాజిక్ యూనిట్), ఒక ఎన్.సిపి. (న్యూమరిక్ కో ప్రాసెసర్) అనేవి వుంటాయి. ఈ ఎన్.సి.పికి వేదిక్ మాథమాటిక్స్ సహాయంతో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తే, అది సూపర్ కంప్యూటర్‌కన్నా ఎన్నో రెట్లు అధికమైన దక్షతతో, శక్తి సామర్థ్యాలతో పనిచేయవచ్చునని కొందరు నిపుణులు భావిస్తున్నారు’’.
గణిత శాస్త్భ్రావృద్ధి ఇతర వైజ్ఞానిక శాఖల అభివృద్ధికి సూచికగా పనిచేయగలదు గనుక, ప్రాచీన భారతీయ గణిత శాస్త్ర విశేషాలను గురించి ఒకింత విపులంగా మనం ప్రస్తావించుకున్నాం.
భౌతిక శాస్తమ్రు
గ్రహాల గురించీ, భూమిని గురించీ, గణిత శాస్త్రం గురించీ పరిచయం చేసుకున్నాక, ఇతర వైజ్ఞానిక శాఖలమీద మన పురాతన ఋషులకు వున్న అవగాహన ఏమిటో పరిశీలిద్దాం. ఈ విషయంలో మనం కోల్పోయిన గ్రంథాల సంఖ్య వేలలో ఉండగా, మనకు లభిస్తన్న గ్రంథాలు వేళ్ళమీద లెక్కించదగినవిగానూ, పరస్పర సంబంధం లేనివిగానూ ఉండటం మన దురదృష్టం. అయినప్పటికీ, ఆయా శాఖల గురించి మనకు దొరికినంతలో రేఖామాత్ర పరిచయాన్ని సంపాదించే ప్రయత్నం చేద్దాం. ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి