డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల చేతులు లేని సముద్రాక్షి జలరూపం కనిపించింది.
‘‘మహామంత్రికా నాకిక సెలవ్’’అంటూ మొత్తం నీటిగా మారిపోయింది సముద్రాక్షి.
దిగ్గున లేచాడు వకృటాసురుడు... మంత్రదండాన్ని నేలకు గట్టిగా తాటించాడు. కంపించిన గుహ ఆగిపోయింది. కళ్ళుమూసుకున్నాడు. దివ్యదృష్టితో వీక్షించాడు. విజయుడు సముద్రాక్షిని జలఖడ్గంతో సంహరించిన దృశ్యం స్పష్టంగా గోచరించింది. విజయుడు మంత్రాలదీవికి రావడం కూడా కనిపించింది.
వెంటనే మంత్రదండాన్ని తన నుదురుకు తాకించి ‘‘క్రియమ్ హయాం స్వాహా... ఆవాహయామి’’అంటూ మంత్రదీవిలోని సమస్తశక్తులూ కళ్లుతెరవండి.. మంత్రాల దీవిలోకి ప్రవేశించినవారిని హతమార్చినది. మీ శక్తులతో హింసించండి’’ గుహ ప్రతిధ్వనించేలా శాసించాడు.
ఆ మాటలు విన్నంతనే మంత్రాలదీవి ఒక్క క్షణం ఊగిపోయింది... దుష్టశక్తులు కళ్ళు తెరిచాయి.
* * *
మంత్రాల దీవిలోకి అడుగుపెడుతుండగానే ఒక్కసారిగా మంత్రాల దీవి కంపించడం గమనించాడు విజయుడు. గరుడపక్షి ఒక్క క్షణం కలవరపాటుకు గురై నిలదొక్కుకుంది. రాయంచ విజయుడి భుజాలను గట్టిగా కరుచుకుని కూచుంది.
విజయుడు చుట్టూ పరికించి చూసాడు.
మిత్రమా ఇదే మంత్రాలదీవి...
ఇంకొంచెం ముందుకు దారితీస్తే అక్కడ ఈ రాత్రి విశ్రమించడానికి అనువైన ప్రదేశం ఉంది. మనతోపాటు గరుడుడు కూడా అలిసిపోయాడు. కాసేపు విశ్రమిద్దాం... మంత్రాలదీవి రహస్యాన్ని ఛేదించాలి.. వకృటాసురుడి జాడ కనిపెట్టాలి. జ్వాలాముఖిదేవి వున్న గుహను చేరుకోవాలి. ముందు మనం విశ్రమిస్తే శక్తివస్తుంది. రాయంచ చెప్పి ముందుకు కదిలింది.. గాల్లోకి ఎగిరింది.
రాయంచ దారిచూపుతుంటే విజయుడు ముందుకుసాగాడు. గరుడపక్షి విజయుడి వైపు చూసి ‘‘మీరు నా భుజంమీద కూచోండి.. గమ్యానికి చేరుస్తాను’’ అన్నది.
‘‘లేదు మిత్రమా.. ఇక్కడి పరిస్థితులు ఆకళింపుచేసుకోవాలి.. మనం నడిచి వెళ్లడమే శ్రేయస్కరం.. నువ్వు కాసేపు ఇచ్చటనే విశ్రమించు’’ అన్నాడు.
‘‘వద్దు మిత్రమా.. మీరు పదండి.. నేను మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాను’’ అన్నది.
అక్కడ విశాలమైన మైదానం చల్లగాలి వీచే వృక్షాలు అనేకం ఉన్నాయి. అప్పటికే చీకటి పడిపోయింది. విజయుడు ఒక చెట్టుకింద విశ్రమించాడు.
రాత్రి రెండు జాములు గడిచాయి. గరుడుడు కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఉన్నట్టుండి మెలకువ వచ్చిన విజయుడు దిగ్గున లేచాడు. ఎక్కడనుండో ఒక మధురమైన గానం గాలిలో అలలు అలలుగా తేలుతూ వినవస్తోంది. ఆ మధురమైన కంఠస్వరం వినవస్తున్న దిక్కుగా విజయుడు వెళ్లడం మొదలుపెట్టాడు. యధాప్రకారం రాయంచ కూడా వెంట రాసాగింది.
కొంచెం దూరంలో శూన్యంలో గాలిలో తేలుతూ ఒక సౌందర్యరాశి నాట్యం చేస్తోంది.
ఆ మధురమైన గానం ఆమె కంఠంనుండే వస్తున్నట్టు గ్రహించాడు విజయుడు ఆమె వెనుక మరికొంచెం దూరంలో వింతకాంతులు వెదజల్లుతున్న ఒక భవనం.
విజయుడికి అంతా ఆశ్చర్యంగా ఉంది చిట్టడవిలో ఆ రాజసౌధం ఎలా వచ్చిందో అర్థంకాలేదు.
అంతలోపు ఆ నాట్యంచేస్తున్న యువతి విజయుడిని ఆహ్వానిస్తున్నట్టు చేతులు ఊపింది.
అది చూసిన విజయుడికి ఇదేదో మాయలా ఉంది అనుకుంటూ తనవెంట ఉన్న రాయంచను వెనక్కివెళ్లిపొమ్మంటూ హెచ్చరించాడు.
విజయుడిని ప్రమాదంలోకినెట్టి తాను వెళ్ళడానికి రాయంచ సిద్ధంగా లేవు.
అప్పుడు విజయుడు ‘రాయంచా నువ్వు వెనక్కి మళ్లి మనం విశ్రమించిన చోటులో వేచి ఉండు.. నేను తెల్లవారేలోపు నేను రాకపోతే గరుడుడితో కలిసి ఈ చోటుకు రా’’ అన్నాడు.
రాయంచ అలాగే అన్నట్టు వెనక్కి వెళ్ళింది.
* * *
వింతకాంతులతో మెరిసిపోతున్న భవనం... భవనంలోకి ప్రవేశించిన విజయుడు అప్రమత్తంగా ఉంటూ చుట్టూపరికిస్తూ నడుస్తున్నాడు. విజయుడిని ఆహ్వానించిన సుందరి ముందునడుస్తూ వయ్యారాలొలకబోస్తూ అక్కడున్న ఒక తల్పంమీద విశ్రమించమంటూ చూపింది. పుచ్చపూవులా విరిసిన వెనె్నల కిరణాలు లోనికి ప్రసరిస్తూ ఆ ప్రదేశమంతా వెలుగుతో నిండి ఉంది. ఆ తల్పంమీద కూర్చున్నాడు విజయుడు.
అలా కూర్చోగానే విజయుడి మనసు తన ఆధీనంనుండి తప్పుకుంటోంది. మనసు వశం తప్పుతోందని అది మాయాతల్పమని ఇట్టే గ్రహించాడు స్వతహాగా సూక్ష్మగ్రాహి అయిన విజయుడు.
వెంటనే లేచి నిలబడ్డ విజయుడి చేయి కరవాలంపై బిగుసుకుంది. అంతలో అక్కడికొచ్చిన సుందరి ఒకపాత్రలో మధువు తెచ్చి విజయుడికి ఇచ్చింది. విజయుడు ఆ మధువును స్వీకరించాడు. అతని గొంతులోకి మధువు వెళ్ళిపోయింది. శరీరం తూలుతున్నట్టు అనిపించింది.
కళ్ళుమూతలు పడుతున్నాయి. ‘‘మతి పోగొడుతున్న వయ్యారి సుందరీ నీవెవరవు... నన్ను చేరవచ్చి నా చిత్తమును చిత్తుచేసి నీ వశం చేసుకున్నావ్’’ ఆ సుందరివైపు చూసి మత్తుగా అన్నాడు.
‘‘నిన్ను చేరవచ్చిన నీ అందాల సుందరిని.. నీకోసమే తనువును నీ ముందు పరిచిన నీ దానిని... రా నన్ను స్వీకరించు..నాలో కరిగి స్వర్గసుఖాలు అనుభవించు’’. మత్తుగా అతడిని ఆహ్వానించింది.
‘‘నా సుందరివా.. అంటే నువ్వు యువరాణి సహస్రదర్శినివా? విజయుడు ఆమెవంకే చూస్తూ అన్నాడు. ఆ అందాల సుందరి ఆ మాటలతో వెనక్కి తిరిగి.. మరల ముందుకుతిరిగి చూడుచూడు మహావీరా.. నేనే నీ సహస్రదర్శినిని’’ అంది సహస్రదర్శినిలా మారిపోయి.
‘‘నా సహస్రదర్శిని భలే భలే... నాకోసం కోసలనుంచి వచ్చావా సుకుమారీ... ప్రయాణిక బడలిక.. అలసట వున్నవి.. జలకాలాడి నీతో సరసాలాడడానికి వస్తాను.. వేచి ఉండుము.. మనకోసం శయ్యను సిద్ధం చేయుము.’’
విజయుడు అలా అనగానే సహస్రదర్శిని రూపంలోకి మారిన సుందరి కొలను వైపు దారి చూపింది.
విజయుడు సరేనంటూ భవనం బయటికి వచ్చాడు.
కొలనువైపు చూసి కొలనులోకి దిగబోయాడు. కానీ అతని కాలు ముందుకు ఆడడంలేదు. తననెవరో బలవంతంగా వెనక్కి లాగుతున్నట్టుంది.
ఆశ్చర్యంతో విజయుడు మరోసారి ప్రయత్నించాడు. ఈసారి కూడా కాళ్లు ముందుకు కదలడంలేదు. ఏదో అనుమానం విజయుడిని చుట్టుముట్టింది. తన ఒరలో కరవాలం పక్కనపెట్టి కొలనులోకి అడుగుపెట్టబోయాడు. అప్పుడు అడుగుముందుకు పడింది. వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఒరలో జలఖడ్గాన్ని మనసులోనే ప్రార్థించాడు.
మరక్షణం జలఖడ్గంలోనుంచి వర్షం చినుకులుగామారి గాల్లోకి వెళ్లి విజయుడి తలమీదుగా నేలమీదికి జారాయి. అలా మారిన జలం కొలనులోకి వెళ్ళింది.
అప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కొలనులోకి ఎప్పుడైతే జలఖడ్గములోని నీరు వెళ్లిందో కొలనులో నీటి రంగు మారింది.
కొలనులో చిన్న కలవరం. ఆ కొలనులోనుంచి ఒక బంగారు వర్ణంలోకి చేపపైకి వచ్చింది.
‘‘జయం జయం మహావీరా... నాకు ఈనాటికీ దుష్టమాంత్రికుడి చెరనుంచి విముక్తికలిగినది’’అంటూ పసిడి వర్ణముతో కూడిన యువతి రూపంలోకి మారింది. విజయుడు ఆశ్చర్యపోతూ ‘‘మీరెవరో తెలుసుకొనవచ్చా? నావలన మీకు విముక్తి కలిగినదా? ఎటుల ఎటుల? అడిగాడు. -సశేషం

- శ్రీ సుధామయి