డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా పేరు మత్స్యగంధి... ఒకనాటి వెనె్నలవేళ కొలనులో జలకాలాడుతున్న నన్ను బంధించి చెరపట్టాడు. మంత్రాల దీవిలోకి ప్రవేశించిన వారిని నా ఒయ్యారాలతో వలపులతో బంధించి చెప్పాలి. ఈ కొలనులోకి దిగిన వెంటనే ఎంతటి వారైనా ‘‘తమ శక్తులు కోల్పోతారు. మీ జలఖడ్గంలోని నీరు మిమ్మల్ని మత్తులోనుంచి బయటకు తీసుకురావడమే కాదు.. సముద్రుడి శక్తివంతమైన సముద్రజలం ఈ కొలనును పవిత్రంగా మార్చింది. నాకు వకృటాసురుడి చెరనుంచి విముక్తి కలిగించినది. నాకు చేసిన మేలుకు ప్రత్యుపకారంగా నీకు ఆ వకృటాసురుడి మరణ రహస్యాన్ని చెబుతాను. నన్ను చెరపట్టే సందర్భంలో తన మరణ రహస్యాన్ని మధుర మత్తులో చెప్పాడు..
వకృటాసురుడి ప్రాణాలు.. మంత్రాలు మాయలతోకూడిన వకృటాసురుడి నివాసమైన మంత్రాలదీవిలో వున్నాయి అని ఒక్క క్షణం విజయుడివైపు చూసి... ‘‘మీ మనసులో వున్న ప్రాణసఖిని చూడవలెనని వున్నది కదూ...అంటూ కళ్ళుమూసుకుని తెరిచినది.
కొలనులో నీళ్లలో కోసలరాజ్యం కనిపించింది. యువరాణి సహస్రదర్శిని శయనగరం కనిపించింది.. వెల్లకిలాపడుకుని తాను కానుకగా పంపిన హారాన్ని పెదవులమధ్య బిగించి ముసిముసి నవ్వులు రువ్వుతూ కనిపించింది..
ఒక్క క్షణం విజయుడి హృదయం లయ తప్పినది..
మీ రాకకోసం మీ ఇష్టసఖి ఎదురుచూస్తున్నది. ఇక మీ రాజ్యంలో కూడా.. చూడండి మహావీరా..అన్నది మత్స్యగంధి. పులి పహారా కాస్తున్నది. విక్రముడు సైనికులతోపాటు గస్తీ తిరుగుతున్నాడు. ఎలాంటి అలజడులు కానరాలేదు. తను వెంటనే వకృటాసురుడిని సంహరించాలి.. అనుకున్నాడు. అతని మనసులోని భావాలూ పసిగట్టినట్టు..
ఆ వకృటాసురుడి మరణరహస్యాన్ని ఆలకింపుడు అన్నది.
* * *
సుమారుగా ఒక యోజనం పొడవునా విస్తరించి ఉంది. పొగలు వెలువడుతూ మానవమాత్రులు ఏమాత్రం ప్రవేశించలేని దుర్లభమైన దుర్భేధ్యమైన దీవి. అదే వకృటాసురుడి మంత్రాలదీవి.
ఆ దీవిలో పంచభూతాలు వకృటాసురుడి ఆధీనంలో ఉంటాయి. మంత్రాల దీవి అనేక మంత్రాలు మాయలతో కూడి ఉంది.
ఆ దీవి ముఖద్వారంలో ఒక పెద్ద ఊడలమర్రి చెట్టు విస్తరించి ఉంది. ఆ మర్రిచెట్టు ఎంతో దూరం విస్తరించి శాఖోపశాఖలుగా ఊడలు ఊడలుగా వ్యాపించి ఉంటుంది.
పాషాణ సదృశమైన శరీరం కలిగి ఉన్న మాంత్రికుడి వకృటాసురుడి ప్రాణం పాషాణంగా మారని ఎడమచేయిలో ఉంటుంది.
అతను ఒకేసారి వివిధ రూపాలలో ప్రత్యక్షమవుతాడు. వకృటాసురుడి నిజ రూపంలో వామహస్తం శిలవలె ఉంటుంది. అదే వకృటాసురుడి నిజరూపం గుట్టు.
అతని వామహస్తాన్ని గురితప్పకుండా ఒకే వేటుతో నేలమీద పడాలి... అప్పుడే అతని ప్రాణంపోతుంది.
కానీ అతి ప్రమాదం సుమా... మీకు ఒక శక్తిని అనుగ్రహిస్తున్నాను. మీరూపం వివిధ ప్రతిరూపాలుగా మారే శక్తిని స్వీకరించండి. ఇది దుష్టసంహారానికి మాత్రమే ఉపయోగించాలి. సూర్యుడి వెలుగురేఖలు పంచుకుంటే ఈ శక్తి పనిచేయదు. స్వీకరించండి మహావీర.. అంటూ కళ్ళు మూసుకుంది.
మరుక్షణం సర్పగంధి శరీరంలోనుంచి ఒక వెలుగు విజయుడిలో లీనమైంది.
విజయుడు కళ్లుమూసి తెరిచేలోగా ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. అందమైన భవనం అదృశ్యమైంది. అప్పటికే తెల్లవారుతోంది. రాయంచ గరుడపక్షితోపాటు అక్కడికి వచ్చింది.
రాయచం విజయుడివైపు తిరిగి ‘‘మిత్రమా క్షేమమేకదా?’’అని అడిగింది.
‘‘మనం తక్షణమే మాంత్రికుడి గుహను చేరుకోవాలి.’’అన్నాడు విజయుడు.
‘‘అవశ్యం మహావీరా... మీ ఆజ్ఞ శిరోధార్యం...’’అన్నాడు. విజయుడు గరుడపిక్షి వీపుమీదకు వున్నాడు. రాయంచ అతని భుజంమీద వాలింది. గాల్లోకి ఎగిరాడు గరుడుడు. పెద్ద శబ్దంతో గాలి దుమారం వచ్చింది. ఆకాశయానం మొదలైనది.
అలా కొద్దిదూరం పయనించకముందే ఒక్కసారిగా గరుడపక్షి గాల్లోనే నిలిచిపోయింది. ముందుకు సాగలేకపోతున్నది.
‘‘ఏమైనది గరుడా? అడిగాడు విజయుడు అనుమానంతో.
‘‘ఏదో బలమైన శక్తిముందుకు కదలకుండా అడ్డుకుంటున్నది..’’ చెప్పింది గరుడపక్షి.
అప్పటికే బలవంతంగా ఎవరో ఆకర్షించినట్టు గరుడపక్షి కిందికి దిగుతోంది.
విజయుడి తీక్షణమైన చూపులు ఉపద్రవకరణాన్ని అనే్వషిస్తున్నాయి. గరుడపక్షి కిందకి దిగింది. విజయుడు దిగాడు. ప్రమాదాన్ని పసికట్టాడు. అతని కుడిచేయి కరవాలంమీద బిగుసుకుంది. ఏ క్షణమైనా కరవాలాన్ని ఝుళిపించడానికి సిద్దంగావున్నాడు. చుట్టూ దట్టమైన చెట్లు ఎవరో తమను చూస్తున్నట్టు అనిపించింది.. అపుడే ఒక అగ్నిజ్వాల విజయుడు ముందునుంచి దూసుకువెళ్లింది.
* * *
ఒక్క క్షణం వెనక్కి గెంతాడు. పరిశీలనగా చూసాడు. ఆ అగ్నిజ్వాల ఇచ్చటినుంచి వస్తుందో కనుక్కోలేకపోతున్నాడు. అతని కళ్లు తీక్షణంగా పరిశీలిస్తున్నాయి. అగ్నిజ్వాల రహస్యాన్ని చేధించలేకపోతున్నాయి. గరుడపక్షి కూడా నిస్సహాయంగా వుండిపోయింది. రాయంచ ఒక్క లిప్తకాలం ఆలోచించి గాల్లోకి ఎగిరింది. విహంగ వీక్షణం మొదలుపెట్టింది.
అప్పుడు గమనించింది.. అక్కడున్న వృక్షాలు మామూలు వృక్షాలు కావు... ఒక్కో వృక్షానికి ఒక పెద్ద కన్ను వుంది. ఆ కన్ను రెప్ప వృక్షము రంగులో ఉండడం మూలాన కన్ను తెరుచుకున్నప్పుడు కనిపెట్టడం కష్టమవుతుంది. ఆ వృక్షము ఒంటికన్ను తెరుచుకున్నప్పుడు ఆ కన్నులోనుంచి అగ్విజ్వాల వస్తుంది. విజయుడు ఇదేమీ గమనించక ఒక వృక్షాన్ని చేరుకుని వృక్షానికి ఆనుకుని నిలబడ్డాడు. అప్పటికే ఆ వృక్షము కొమ్మలు చేతుల్లాసాగి విజయుడిని చుట్టాయి.
ప్రమాదం పసిగట్టిన విజయుడు ఏ మాత్రం ఆలస్యంచేయకుండా ఒరలోనుంచి ఖడ్గంతీసి కొమ్మలపై వేటువేసాడు.
చెట్టుకొమ్మలు విరిగిపోయాయి. క్షణాల్లోనే తిరిగి అతుక్కున్నాయి.. మరో చెట్టుకిందికి వంగి గరుడపక్షిమీద వాలబోయింది. విజయుడు ఆ వృక్షాన్ని నరికేశాడు. తిరిగి వృక్షం మొలిచింది.
రాయంచకు ఏం చేయాలో తోచలేదు. గాల్లో ఎగురుతూ ఉంటే ఒక మూలన వున్నా వనదేవత విగ్రహం కనిపించింది. మట్టితో కప్పుకుపోయింది. చెట్ల ఆకులూ విగ్రహాన్ని మూసేసాయి. రాయంచ వెళ్లి వనదేవత విగ్రహంమీద వున్న మట్టిని తన చిలుక ముక్కుతో తొలగించింది. అది గమనించిన గరుడపక్షి తన రెక్కలను బలంగా విసిరింది. ఆ రెక్కల తాకిడికి విగ్రహం మీదవున్న ఆకులు తొలగిపోయాయి.
విజయుడు అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే వృక్షాలు ముందుకు కదులుతున్నాయి.
ఒంటి కన్ను రాక్షసులుగా వకృటాసురుడి చేత సృష్టించబడిన ఒంటి కన్ను చెట్లు. అవి నడుస్తాయి.. కన్నుల్లోనుంచి జ్వాలలు సృష్టిస్తాయి. వాటి వేర్లు కొమ్మలు శత్రువులను బంధిస్తాయి. మంత్రాలదీవిలో కాపలాగా ఉంచిన దుష్టశక్తులు ఆ ఒంటికన్ను చెట్లు.
విజయుడు వనదేవత విగ్రహం దగ్గరికివెళ్లి తన ఒరలోవున్న జలఖడ్గాన్ని తీసి వనదేవత పాదాల చెంత ఉంచాడు. జలఖడ్గంలోని జలం వనదేవత పాదాలను అభిషేకించింది.
పెద్ద మెరుపుతో వనదేవత ప్రత్యక్షమైంది. వన దేవత ముఖంలో ఆనందం తొణికిసలాడింది. -సశేషం

- శ్రీ సుధామయి