డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మట్టికొట్టుకుపోయిన నా విగ్రహానికి విముక్తి లభించింది. వకృటాసురుడు పరిమళ భరితము నయనానందకరమైన వనాన్ని మాయావృక్షాలతో కలుషితంచేసాడు. ఒంటికన్ను చెట్లు మాంత్రికుడి సృష్టి అని విజయుడివైపు తిరిగి ‘‘ఒంటికన్ను చెట్లు నీ చేతుల్లోనే నేలకూలిపోవాలి... వాటి ప్రాణాలు ఆ చెట్లకు వున్న ఒంటి కన్నులలో వున్నాయి.. వాటిని నీ కరవాలంతో సంహరిస్తే నీ కరవాలం రక్తసిక్తం అవుతుంది. రుధిరం చిందిన నీ జలఖడ్గం వకృటాసురుడిని చంపలేదు.
అందుకే నా వనంలోని వృక్షాలను ఆయుధాలు మారుస్తున్నాయి. మాయావృక్షాన్ని వృక్షంతోనే సంహరించాలి అని కళ్ళు మూసుకుంది వనదేవత.
మరుక్షణం అక్కడ అందమైన ఉద్యానవనం ప్రత్యక్షమైంది.. ఒంటి కన్ను వృక్షాలు విజయుడిని సమీపిస్తున్నాయి.
‘‘మహావీరా... విజయుడా... మనసులో నన్ను స్మరించు.. పచ్చగా కళకళలాడే వృక్షాన్ని ఆయుధంగా మార్చు.. గురిచూసి ఒంటి కన్ను వృక్షాలను సంహరించు.. కన్నుమూసి తెరిచేలోగా నీ కార్యాన్ని పూర్తిచేయి.. విజయోస్తు’’ అని దీవించింది.
అప్పటికే ఒంటి కన్ను వృక్షాలు విజయుడిని సమీపించాయి. అవి విజయుడిని చుట్టుముట్టాయి. విజయుడు మనసులో వన దేవతను స్మరించాడు.
ఎదురుగావున్న ఉద్యానవనంలో వృక్షాలు గాల్లోకి లేచి విజయుడి చేతిలోకి వచ్చాయి.
‘‘కళకళలాడే వృక్షాల్లారా.. మిమ్మల్ని బాధించిన ఆ ఒంటి కన్ను వృక్షాలను ఈ భూమీద లేకుండా చేయండి’’అని వృక్షాలను గురిచూసి ఒంటి కన్ను వృక్షాలవైపు విసిరాడు.
ఒక్కో వృక్షం సూక్ష్మరూపములో విజయుడి చేతిలో ఆయుధంగా మారుతుంది.
క్షణాల వ్యవధిలోనే ఒంటి కన్ను వృక్షాలు నేలకూలాయి. అక్కడినుంచి అదృశ్యమయ్యాయి... ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఉద్యానవనమే... ఫలవృక్షాలతో అలరారుతోంది.
ఫలవృక్షాలు తమ చెట్టుకు కాసిన ఫలాలను విజయుడికి అందించి స్వీకరించమని కోరాయి.
జామచెట్టు మీద కాసింతసేపు సేదతీరింది రాయంచ చిలుక.. జామకాయ రుచి చూస్తూ..
గరుడపక్షికి మామిడి తన రుచి చూపింది. పూల వనం తన పరిమళాలతో కాసేపు విశ్రమించేలా చేసింది.
* * *
మాంత్రికుడి గుహ..
వకృటాసురుడు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నాడు. క్రోధంతో అతని కళ్ళు చింతనిప్పులు అయ్యాయి. గుహ మరోమారు కంపించింది. గుహలో ఒకేసారి ఒంటి కన్ను వృక్షాలు వకృటాసురుడి పాదాలమీద పడ్డాయి. గుహమొత్తం వణికిపోతున్నది.
గుహ ప్రతిధ్వనించేలా అశరీరవాణి మాటలు వినిపిస్తున్నాయి. ‘‘ఓరుూ వకృటాసురా.. నీకు అంత్యకాలం సమీపించింది. మంత్రాల దీవిని అతలాకుతలంచేసి నీ శక్తులను నిర్వీర్యంకావించి నిన్ను అంతమొందించడానికి మహావీరుడు వస్తున్నాడు. పారిపోయి ప్రాణాలు దక్కించుకో.. లేదా విజయుడి పాదాలమీద పడి శరణుకోరు.
మాంత్రికుడు వకృటాసురుడు కోపంతో ఊగిపోయాడు. ఈ వకృటాసురుడి అంతమొందించే వీరుడా... నా శక్తులమీద అల్పుడు వాడు’’ హుంకరించాడు వకృటాసురుడు.
అశరీరవాణి నువ్వు గుహ మొత్తం ప్రతిధ్వనించింది. నిజం నిక్కంగా తెలుస్తుంది. ఎదురుచూడు వకృటాసురా... అదిగో చండప్రచండమై వస్తున్నాడు... చూడు...చూడు చూడు...
గుహ మొత్తం కంపిస్తున్నది. వకృటాసురుడు తూలి పడబోయాడు. గరుడపక్షి మీద విజయుడు సరాసరి మాంత్రికుడి గుహలోకి వచ్చాడు.
గరుడపక్షి నేలమీద దిగింది. గరుడపక్షి మీదినుంచి కిందికి దిగాడు విజయుడు. రాయంచ వకృటాసురుడి వంకే చూస్తుంది. విజయుడు తీక్షణంగా చూసాడు. ప్రకృతికి విరుద్ధంగా విశ్వనాశనాన్ని కోరుకునే దుష్టమాంత్రికుడు రూపాన్ని చూస్తున్నాడు.
గరుడపక్షి మహావీరుడు విజయుడికి మాంత్రికుడికి జరిగే పోరు చూడాలని మాంత్రికుడి ప్రాణాలుపోవడం కళ్లారా వీక్షించాలని తహతహలాడుతోంది.
వకృటాసురుడు విజయుడి వంక చూసాడు. కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణం. విజయుడి ముఖంలో దివ్యతేజస్సును చూడలేకపోయాడు.
‘‘వకృటాసురా నువ్వు తపశ్శక్తివంతుడివి.. నీ శక్తులను ఒక మంచి పనికి విశ్వశ్రేయస్సుకు ఉపయోగించు. ఇప్పటికైనా చేసిన తప్పిదాలను ఒప్పుకుని మన్నింపు కోరు. మా గురుదేవులు సుధర్ములవారి మీద ఆన.. నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను. నువ్వు కోరుకున్న రాజవైభోగాలు నీకు దక్కేలాచేస్తాను. నీ తపశ్శక్తిని విశ్వమానవాళికి ఉపయోగించు...’’ విజయుడు వకృటాసురుడి వంక చూసి చెప్పాడు.
వకృటాసురుడు వికటాట్టహాసం చేసాడు. ‘‘అల్పమానవా అజేయమై తపస్సుతో మహాశక్తులను మెప్పించిన మేము ఒక నూనూగు మీసాల యువకుడి మాటలు వింటామా... నా శక్తి ఏమిటో చూడు’’అంటూ వకృటాసురుడు తన మంత్ర దండాన్ని గాల్లోకి విసిరాడు.
మంత్రదండం విష సర్పంలా మారి విజయుడివైపు దూసుకువస్తుంది.
విజయుడు మనసులో గురుదేవుడ్ని స్మరించి జలఖడ్గాన్ని గాల్లోకి విసిరాడు. జలఖడ్గం గరుడుడిగా మారింది. విష సర్పం వెనక్కి తిరిగింది.
వకృటాసురుడు మరోసారి మంత్రదండాన్ని గాల్లోకి విసిరాడు. ఒకేసారి గుహను విచిత్ర ప్రాణులు చుట్టుముట్టాయి.

-సశేషం

- శ్రీ సుధామయి