డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరింత లోతైన అధ్యయనమూ, అనే్వషణ చేస్తే సనాతన భారతీయ ఇంజనీరింగ్ విభాగాన్ని గురించి ఇంకా ఎన్నోకోణాలు బయటపడే అవకాశాలున్నాయి.
వేదాలు - మెకానికల్ ఇంజనీరింగ్
మన ప్రాచీనులకు మంత్రాలు, తంత్రాలు తప్ప ‘యాంత్రిక విజ్ఞానం’ లేదని ఈనాటి యువకుల అభిప్రాయం! నిజానికి ప్రాచీన వాఙ్మయంలో బహుళంగా యంత్ర విజ్ఞానం వుంది.
దీనిని ఆధునిక భాషలో మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. వివిధ రకాల యంత్రాలు, వాటి అమరిక, అవి పనిచేసే విధానం, వగైరాలన్నీ వివరించే గ్రంథాలు ఎన్నో వున్నాయి.
కేవలం ‘యంత్ర’ అనే పేరుతో కూడిన గ్రంథాలే కొన్ని వున్నాయి. యంత్రార్జవము, యంత్రకల్పము, యంత్రకల్పతరువు, యంత్ర సంగ్రహము, బృహద్యంత్ర సర్వస్వము మొదలైనవి. ఇవిగాక యంత్రాలను గురించి చెప్పే ఇతర గ్రంథాలు కూడా అనేకం వున్నాయి.
మహాభారతంలో అర్జునుడు ఛేదించిన మత్స్య యంత్రం ప్రసిద్ధమే కదా! భాగవతంలో ‘తిలఘాతయంత్రం’ (ఆయిల్ ఎక్స్‌ల్లింగ్ డివైస్) ప్రస్తావన వుంది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో (క్రీ.పూ.4వ శతాబ్దము) 32 యంత్రాల ప్రస్తావనవుంది. క్రీ.శ.5వ శతాబ్దం నాటి ఆర్యభట్టుచలన యంత్రాన్ని వర్ణించాడు.
వెన్న తీసే కవ్వం, మగ్గం వగైరాలన్నీ చిన్న చిన్న యంత్రాలే! గాలి కొట్టే తిత్తి, రకరకాల బట్టీలు, మందులు, రసాయనాలు తయారుచేసే యంత్రాలు, ఎన్నో రకాలు వుండి వుంటాయి. త్రాసు, ఇంజనీరింగులో మట్టం, తూకం చేసే యంత్రాలు, బండి, మనకు ఇంకా వారసత్వంగా వాడుకలోనే వున్నాయి.
అంశుబోధిని వంటి వైజ్ఞానిక గ్రంథాలలోనూ, రామాయణం వంటి సాహిత్య గ్రంథాలలోనూ కూడా ప్రస్తావింపబడిన యంత్రాలు, నమ్మశక్యం గానివి ఎన్నో వున్నాయి.
సూర్యరశ్మిలో వుండే చీకటిని కొలిచే తమః ప్రమాపక యంత్రం; ఫొటోగ్రఫి వంటి ఛాయాగ్రాహక యంత్రం- వగైరాలెన్నో అంశుబోధినిలో వున్నాయి. రామాయణంలో పుష్పక విమానం, శిలాయంత్రం వంటి వాటి ప్రస్తావనలున్నాయి.
భూమినుంచి ఇనుము, ఉక్కు, బంగారం, పాదరసం, వగైరా ఖనిజాలను, లోహాలను, తీసి వాటిని వాడి ఆభరణాలు, పరికరాలు చేసే పరిజ్ఞానం వుందంటే, వివిధ యంత్రాల గురించి ఎంతో పరిజ్ఞానం ఉన్నట్లు స్పష్టమే గదా! భాగవత పురాణంలో ఖనిజాల నుంచి లోహాలను వెలికితీసే యంత్రాల ప్రస్తావన వుంది!
స్వర్ణం యథా గ్రావసు హేమకారః
క్షేత్రేషు యోగై స్తదభిజ్ఞ అప్నుయాత్!
క్షేత్రేషు దేహేషు తథాత్మయోగైః
ఆధ్యాత్మ విద్భ్రహ్మగతం లభతే
(ఉపాధ్యాయుడైన స్వర్ణకారుడు ఆయా క్షేత్రములలోని శిలలను తీసుకుని, ఆయా ఉపాయముల ద్వారా వాటినుండి బంగారమును బైటికి తీసినట్లుగా, ఆధ్యాత్మ విద్యావేత్తయగు సాధకుడు తన దేహక్షేత్రములయందు ఆధ్యాత్మికోపాయముల చేత పరబ్రహ్మను విడదీసి పొందవలెను)క్రీ.శ.14వ శతాబ్దంనాటి యంత్రార్జవంలో ‘యంత్రం’ అంటే నిర్వచనం ఇవ్వబడింది.
దండై శ్చక్రైశ్చ దంతైశ్చ సరణి న్రమణాదిభిః
శక్తే రుత్పాదనం కిం వా చాలనం యంత్ర ముచ్యతే
కర్రలు, చక్రములు, పళ్ళ చక్రాలు, మొదలైన వాటి కదలికలవలన గానీ, తిరగటంవలనగానీ, శక్తిని ఉత్పాదన చేసేది లేక చలనాన్ని కలిగించేది ‘యంత్రం’ అనబడుతుంది అని అర్థం.
భోజరాజ కృత సమరాంగణ సూత్రధారంలో కూడా యంత్ర లక్షణాలకు చెందిన అనేక అంశాలున్నాయి. దీనిలో రోబోట్లు వంటి స్వయం చాలిత యంత్రాల ప్రస్తావన కూడా వుంది. ఐతే వాటి నిర్మాణ వివరాలను బయటపెట్టడం సమాజానికి హితం కాదు కనుక వాటిని గ్రంథంలో వ్రాయటం లేదని భోజరాజు వివరించాడు. దీనిని బట్టి ఆ నాటి వైజ్ఞానికులకు గల సంయమనం ఎంత పటిష్టమైనదో మనం గ్రహించవచ్చు. ఇది ఈనాటి వైజ్ఞానికులకు ఆదర్శప్రాయం కావలసి వుంది.
క్రీ.పూ.4వ శతాబ్దినాటి కౌటిల్యుని అర్థశాస్త్రంలో ‘తుల’ (త్రాసు) తయారుచేసే విధానం వివరంగా వర్ణింపబడింది. అందులో వాడబడిన కొలమానాలే క్రీ.శ.1950 దాకా (దశాంశ పద్ధతి అమలులోకి వచ్చిందాకా) భారతదేశంలో అమలులో వుండేవి.
3 తులాలు - 1 పలం
40 పలాలు - 1 వీశ
1 వీశ - 1.400 కిలోలు
క్రీ.శ. అయిదవ శతాబ్దిలో అర్యభట్ట విరచిత ఆర్యభటీయం (గోళపాదం)లో భూగోళం నమూనా ఎలా చెయ్యాలో చెప్పారు.
కాష్ఠమయం సమవృత్తమ్‌సమంతతః సమగురుం లఘుం గోళమ్
పారద తైల జలై స్తంభ్రామయేత్ స్వధియా చల కాలసమమ్
సమవృత్తాకారంలో వున్నది, అన్ని వైపులా సమమైన బరువు కలదీ, తేలికగా కదిలేట్టు వుండేదీ, అయిన చెక్క గోళాన్ని తయారుచేసి పాదరసమూ, నూనె నీటిని ఉపయోగించి, ఒక రోజుకు ఒక ఆవృత్తి పూర్తయేటట్లుగా తెలివిగా తిప్పాలి అని అర్థం. భూగోళాకారపు కొయ్యబంతిని చెయ్యటమే కాక, రాశి చక్రంలో అనుసంధానం అయ్యేలాగా ఆ కొయ్యబంతి పరిభ్రమించేటట్లుగా ఆ యంత్రాన్ని తయారుచేసేవారట. భాస్కరాచార్యుడు ఈ శ్లోకానికి ఇచ్చిన వివరణలో, ఈ గోళం భ్రమణాన్ని బట్టి కాలాన్ని, రాశిచక్ర విభాగాలను, రోజువారీగా తెలుసుకునే వివరాలు తెలిపాడు.
దూరమానం కాలాన్ని గురించే గాక, దూరాన్ని గురించి కూడా మన పూర్వీకులు చాలా లోతుగా పరిశీలన చేశారు. దానికి వారి కొలమానమే ఒక పెద్ద నిర్వచనం. ఆర్యభటీయంలో ఇవ్వబడిన దూరాల కొలమానాన్ని గమనించండి.
8 పరమాణువులు - 1 త్రసరేణువు, 8 త్రసరేణువులు - 1 రథరేణువు ,8 రథరేణువులు - 1క్రోశము, 8 క్రోశములు - 1 తిలబీజము, 8 తిలబీజములు - 1 సర్షపము ,8 నర్షపములు - 1 యవము
8 యవములు - 1 అంగుళము, 12 అంగుళాలు - 1 వితస్తి, 2 వితస్తులు- 1 హస్తము, 4 హస్తములు - 1 దండము, 2000 దండములు - 1 క్రోశము, 4 క్రోశాలు - 1 యోజనము. ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి