డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కొలమానంలో కొలతలు అణుపరిమాణం నుంచి ప్రారంభించి యోజనం దాకా విస్తరించటాన్ని గమనించండి. పరమాణువంటే ఈనాటి పరమాణువుగాదు. కిటికీలోనుంచి ఎండ ఇంట్లో పడినప్పుడు, ఆ ఎండ పొడలో కనిపించే అతి సన్నని ధూళిరేణువు కొలత త్రసరేణువు. దానిలో ఎనిమిదవ వంతు పేరు అణు పరిమాణం అని నిర్వచించారు. ఈ నిర్వచనాలను బట్టి వారి కొతలు ఎంత సూక్ష్మంగా వుండేవో, అలాంటి సూక్ష్మ కొలతలను వినియోగించుకునే యంత్రాలు వారికి ఎలా వుండేవో, మనం ఊహించుకోవచ్చు.
అలాగే యోజనం అంటే సుమారుగా తొమ్మిది మైళ్ళ 160 గజాలని పెద్దలు నిగ్గుతేల్చారు. దీనే్నగాక మహాయోజనం అనేదాన్ని కూడా వినియోగించుకొని, గ్రహగోళాల దూరాలను మనవాళ్ళు కొలిచారు.
బండి నిర్మాణం: క్రీ.శ. 6వ శతాబ్దంలో విశ్వకర్మకృతమైన వాస్తుశాస్త్రంలోని రథలక్షణంలో బండి చేసే విధానం, చక్రాలు, చక్రాల ఆకులు, ఆకులమధ్య కుండ (హబ్) తయారుచేసే విధానం ఇవ్వబడింది.
వేదాలలో నగర నిర్మాణం - పరిపాలన
నగరాల నిర్మాణం గురించీ, పరిపాలన వ్యవస్థ గురించీ, వివరించే శాస్ర్తియ గ్రంథాలు సంస్కృత వాఙ్మయంలో అనేకం వున్నాయి.
గ్రంథాలున్నాయంటే, ఆ నాటికే బాగా అభివృద్ధి చెందిన ‘నగరాలు’ వున్నాయన్నమాట! ఏ నాగరికలోనైనా ‘పట్టణీకరణం’ భౌతిక సంపదల అభివృద్ధిని సూచిస్తుంది.
క్రీ.పూ. 4వ శతాబ్దం నాటి కౌటిల్యుని అర్థశాస్త్రంలోనూ, వైదిక యుగం నాటి శుక్రనీతిలోనూ, నగర నిర్మాణం, పాలనల గురించిన విస్తారమైన ప్రస్తావన వుంది.
వాహనాలు, రథాలు, వెళ్ళే రాజమార్గాలు, జాతీయ, ప్రాంతీయ, రాష్ట్రీయ పథాలు, శ్మశానాలకు వెళ్ళే పథకాలు, సేతువులు (వంతెనలు), అడవి మార్గాలూ, పెద్ద పశువులు వెళ్ళే మార్గాలు, చిన్న జంతువులు, మనుష్యులు, వెళ్ళే మార్గాలు వంటి వర్గీకరణలతో రోడ్లు నిర్మింపబడేవి. ఏయే రోడ్డు ఎంతెంత వెడల్పు వుండాలి, ఎలా నిర్మించాలి అనే అంశాలు చక్కగా వివరించబడ్డాయి.
కూర్మవృష్ఠంలాగా రోడ్డును నిర్మించాలి. (తాభేలు వీపులాగా గోడుగా వుండాలన్నమాట!) ‘పార్శ్వఖాతాన్’ (వాన నీరు, మురుగు
నీరు పోయేటందుకు ఇరుపక్కలా కాలువలను తవ్వించాలి.
మార్గాన్ సుధాశర్క రైర్విఘట్టితాన్ ప్రతివత్సరమ్
అభియుక్తా నిరుద్యోగైః కుర్యాత్ గ్రామ్యజనైర్ నృపాః
ప్రతి యేడూ నిరుద్యోగులైన గ్రామ్య జనంతో రోడ్లను సున్నంతోనూ, కంకరతోనూ బాగు చేయించి, గట్టి పరిపించాలి. అని వేదానంతర పురాతనకాలం నాటి శుక్రనీతి నిర్దేశిస్తోంది.
గ్రామాలలోని వీధులను ఒక ప్లాను ప్రకారంగా నిర్మించాలని మయవిరచితమైన ‘మయమతం’లోనూ ‘కలామూల శాస్త్రం’లోనూ కూడా వుంది. ఈ రెండూ 6వ శతాబ్ది ప్రాంతానివి. కౌటిల్య విరచితమైన అర్థశాస్త్రంలో కూడా (క్రీ.పూ 4వ శతాబ్ది) అనేక వివరాలు ఇవ్వబడినాయి. రాజమార్గాలెలా వుండాలి, పురమార్గాలెలా వుండాలి, గ్రామమార్గాలెలా వుండాలి- వీటి కొలతలు ఎలా వుండాలి. వీటి మధ్యలో వచ్చే వాగుల మీద వంతెనలెలా వుండాలి, వాన నీరు పోయేందుకు వెసులుబాటు లెలా వుండాలి మొదలైన వివరాలన్నీ ఆ గ్రంథాలలో విపులంగా చర్చించబడ్డాయి.
కౌటిల్యుని అర్థశాస్త్రంలో గృహాల నిర్మాణం ఎలా వుండాలో కూడా నిర్దేశించబడింది. రెండు ఇళ్ళమధ్య కనీసం మూడు అడుగుల దూరం వుండాలి. కిటికీలు వీధులవైపుగా ఎత్తుగా ఉండాలి.

దానివల్ల ఇళ్లలోకి వెలుతురు బాగా ప్రసరిస్తుంది. ఎక్కడైనా కొన్నిచోట్ల ఈ నియమాలను దాటవలసి వస్తే, ఆ వీధులలోని ఇళ్ళవాళ్లు సంప్రదించుకుని పరస్పర సమ్మతితో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా గృహ నిర్మాణాల గురించిన నిబంధనలున్నాయి.
శ్రీ ఎ.ఎల్.్భషాంగారు తమ ‘వండర్ దట్‌వాజ్ ఇండియా’ అనే సుప్రసిద్ధ గ్రంథంలో పురాతన భారతీయ గృహ నిర్మాణ చాతుర్యంలోని మరొక కోణం ఆవిష్కరించారు.
తవ్వకాలలో దొరికిన హరప్పా గృహాల నమూనాలను పరిశీలించగా, వారికి ఇళ్ళలో ఇప్పటిలాగే స్నానాల గదులు వుండేవని తేలుతోంది. అంతకంటే ఆశ్చర్యమేమిటంటే, అక్కడ స్నానం చేసిన నీరు తూముల ద్వారా, ఇళ్ళ బైటకు ప్రవహించేది. ఆ తూములు రోడ్ల క్రిందుగా ఇవాళ్టి డ్రైనేజీ సిస్టమ్‌లాగా, సుదూరం ప్రయాణం చేసి ఎక్కడో ఒక ఇంకుడు గుంటలోకి కలిసేది (ఇవాళ్టిలాగా నదులలోకి కాదు) ఇలాంటి భూగర్భపు గొట్టాలను బలమైన ఇటుకలతో కట్టి, రోడ్లను యథాతథంగా వుంచేవారు- ఇలాంటి వ్యవస్థలు సురక్షితంగా సాగాలంటే ఆ నగరాలలో పటిష్టమైన నగర పాలక వ్యవస్థ (మున్సిపాలిటీ) కూడా వుండి వుండాలని ఊహించవచ్చు.
అయిదువేల యేళ్ళకు దాటిన పురాతన నాగరికతలలో హరప్పాలో తప్ప మరెక్కడా ఇలాంటి సామర్థ్యం కనిపించడంలేదు.
ఆ తర్వాత రోమన్ల సంస్కృతిలో ఇలాంటి నగర నిర్మాణ లక్షణాలు మనకు కనిపిస్తాయి.
12. పర్యావరణ విజ్ఞానము
మన ప్రాచీన మహర్షులకు పర్యావరణ విజ్ఞానం అనేది ఈనాటి ‘‘ఎకలాజికల్ సైన్సు’’ రూపంగా లేదేమో కానీ-వారికి ప్రకృతిలోని సజీవ నిర్జీవ పదార్థాలన్నింటితోనూ కలిసి సామరస్యంగా జీవించటమే ‘‘్ధర్మం’’ అని తెలుసు.
వారు వేద పాఠాలకు ముందు వెనుకలలో శిష్యులకు బోధించే ‘‘శాంతి పాఠాల’’లలోనే సమతౌల్య సిద్ధింతం మనకు దర్శనమిస్తుంది.
ఉదా: ‘‘ఓం సహనావవతు...’’(ఆ పరమాత్మ మనిద్దరినీ కలిపి రక్షించుగాక!)
‘‘్భశ్శాంతిః భువశ్శాంతిః’’ (కృ.యజుర్వేదః- శాన్తిపాఠః)
భూమికి శాంతి కలుగుగాక! భూమ్యాకాశాల మధ్య ప్రదేశానికి శాంతి కలుగుగాక! ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి