డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటిని పాడుచేయటం అపరిశుభ్రం చేయటం పాపం! వర్షపు నీరు అత్యంత పరిశుభ్రమైనది. ఈ నీరు అన్ని వ్యాధులనూ నివారించే శక్తి కలిగి వుంటుంది- అంటోంది అథర్వవేదం (3-31-11).
అథర్వవేదంలో సముద్రాన్ని రత్నాలకూ, వివిధ సంపదలకు నిధిగా చెప్పారు. అంతేకాదు వర్షాలకూ, విద్యుత్తుకు, మెరుపులు మొదలైన వాటికి కూడా సముద్రమే జన్మస్థానం అని చెప్పారు. ‘‘సముద్రే అంతర్నిహితాని నాభిః...’’ (అథర్వవేద 1-13-3).
ఋగ్వేదం (5-41-11)లో ఇలావుంది. ‘‘ఆప ఓషధిరుతనో అవస్తు ద్యౌర్వన గిరయో వృషకేశః’’ (జలమే ఔషధము. జలము మమ్ములను, మా ఆకాశాన్ని, వనాలను, పర్వతాలను, రక్షిస్తున్నది)-అని
ఇలాంటి ఈ జలమండలంలో మన నవీన నాగరికతలోని పరిశ్రమలు, రసాయనిక పదార్థాలు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, మొదలైనవి విష రసాయనాలు కారణంగా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. తాగటానికి కూడా పనికిరాకుండా పోతున్న జల వనరుల వల్ల మొత్తం జీవ జలానికే ముప్పు వచ్చే అవకాశం వుంది.
ఈ జల కాలుష్య నివారణకు కూడా మన ప్రాచీన మహర్షులు కొన్ని సూచనలు చేశారు.
నదులలోను, సరస్సులలోను ఉండే జలం యాగాదుల నిర్వహణవల్ల పరిశుద్ధవౌతుందని చెప్పబడి వుంది. యాగాది క్రతువులలో ఉత్పన్నమయ్యే యజ్ఞ్ధూమానికి, సుగంధ ధూపానికి జలాన్ని పరిశుద్ధం చేసే శక్తి వుంటుందని చెప్పబడి వుంది.
‘ఆపో దేవో సింధుభ్యః కర్త్వం హవిః’ అని ఋగ్వేదంలో చెప్పబడి వుంది.
స్థల మండలం లేక పృథ్వీ మండలం- సృష్టిలోని సర్వ చరాచర ప్రాణులకు ఆధారం భూమి! ఈ భూమి కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి. అంటే దీని పవిత్రతను సర్వదా కాపాడుకుంటూ ఉండాలి.
వేదాలలోనూ, విశేషించి బ్రాహ్మణ భాగాలలోనూ, వృక్షజాతులకు ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే భూమి పర్యావరణ పవిత్రతను కాపాడేది వృక్షాలే! అథర్వ వేదంలో దేవతల దివ్యశక్తులన్నీ వృక్షాలలో నిక్షేపించినట్లు ప్రస్తావించబడి వుంది.
ఈనాటికీ మన జ్యోతిశ్శాస్త్రంలో వృక్షాలకూ, మొక్కలకూ, నవగ్రహాలతో, నక్షత్రాలతో, ఇతర దేవతలతో గల సంబంధాన్ని నిర్ణయించి చెప్పే విధానం వుంది. ఉదాహరణకు, ఎవరైనా సూర్యదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే జిల్లేడు చెట్లను పూజిస్తే చాలు! అలాగే చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మోదుగ మొక్కను చక్కగా పూజిస్తే చాలు. తులడి, మేడి, రావి, వేప మొదలైన వృక్షాల గురించి, వాటి దేవతల గురించి మనకు గ్రామగ్రామాన ప్రత్యక్ష సాక్ష్యాలు కనిపిస్తూనే వుంటాయి.
ఇలా ఈ వృక్షాలను చక్కగా పోషిస్తే, వాటికి అధిదేవతలైన దేవుళ్ళు, ఆ మానవులకు, ఆ గ్రామానికీ సర్వశక్తులూ ఇస్తారని నమ్మకం.
అంతేకాక కొన్ని మూలికా లక్షణాలు గల మొక్కలు పర్యావరణ, వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి కనుకనే వాటిని ‘విషదూషణీ’ అని అథర్వ వేదంలో పేర్కొన్నారు.
శబ్ద మండలం- ఈనాటి ఫిజిక్స్‌లో సౌండ్ లేక ఎకోస్టిక్స్ ఒక ప్రత్యేక విభాగం! శబ్దాన్ని డెసిబల్స్‌తో కొలవటం, అల్ట్రాసౌండ్ వగైరా శబ్ద తరంగాలకు చెందిన వైజ్ఞానిక విశేషాలూ, ఈ విభాగంలో ఉన్నాయి.
ఇంత తెలిసినా మన ప్రాచీనులు శబ్దానికి ఇచ్చిన మహత్త్వాన్ని ఆధునిక శాస్తవ్రేత్తలు ఇవ్వలేదేమోననిపిస్తుంది. ఈనాటి సైన్సులో శబ్దాన్ని డెసిబల్స్‌లో కొలుస్తారని చెప్పుకున్నాం. మానవుడి చెవి సుమారు 60-70 డెసిబల్స్ ప్రమాణంలో వుండే శబ్దానే్న వినగలవు. అంతకు ఎక్కువైనా తక్కువైనా వినలేవు సరిగదా చెవికి, కంటికీ, మెదడుకూ, గుండెకూ, రక్తపుపోటుకూ సంబంధించిన రోగాలు వస్తాయి. దీన్ని బట్టి తెలిసేదేమిటి? ఒక శ్రుతిలో శబ్దాలను ఉచ్ఛారణ చేస్తే దానికి సంబంధించిన ఫలితం మనిషికి అందుతుంది. పక్షులకు, కొన్ని జంతువులకు, కుక్కలకు అల్ట్రాసోనిక్ సౌండ్ వినే శక్తి వుంది.
యాభై శాతం మేరకు మరణాలు శబ్ద కాలుష్యంవల్లనే ఏర్పడుతున్నాయని ఒక జర్మన్ సైంటిస్టు చెప్పారు.
శబ్దశక్తి వినియోగ విధానానే్న మన ప్రాచీనులు ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాలతో కూడిన మంత్రోచ్ఛారణగా సూత్రీకరించారు. ఈ మంత్రల ద్వారా శబ్ద మండలాన్ని, తద్వారా మానవుడి పర్యావరణాన్ని మన మహర్షులు ప్రభావితం చేసేవారని మనం గ్రహించాలి.
యజ్ఞాలలో ఉచ్ఛరించే మంత్రాలవల్ల ఋతుచక్రం చక్కగా నడుస్తుంది. అందుకనే యజ్ఞంఋతుచక్ర కేంద్రకమని యజుర్వేదం చెపుతోంది. యజుర్వేదంలోని 18వ మండలంలోని మొదటి 29 మంత్రాలూ యజ్ఞాలవల్ల, మానవులకు వ్యవసాయం, వర్షం, దీర్ఘజీవితం, శక్తి, వృక్షాలకు ఔషధాలకు పవిత్రత, ఆహారం, మేధస్సు- ఇన్ని రీతులుగా లాభాలు కలుగుతాయని చెప్పింది.
ఇలా వివిధ వాతావరణ పర్యావరణ మండలాల పరిపుష్టికీ, వాటికి హాని కలిగించే కాలుష్యాల నివారణకు ఉపయోగపడే వివిధ సూత్రాలను అందించటం ద్వారా మన ప్రాచీన మహర్షులు మనకు పర్యవరణం విజ్ఞానం అందించరాని మనం తెలుసుకుందాం.
రసాయన శాస్తమ్రు
ఈనాడు కెమిస్ట్రీ అని పిలవబడే శాస్త్రాన్ని మన దేశంలో రసాయన శాస్త్రం అని పిలిచేవారు. ఈ శాస్త్రానికి సంబంధించిన ప్రసక్తులు అథర్వణవేదంలో పుష్కలంగా ఉన్నాయి.
ఆ వేదంలో బంగారము, వెండి, రాగి, ఇనుము, జింకు (తుత్తునాగము) మైలుతుత్తము (సల్ఫేట్ ఆఫ్ కాపర్) మొదలైన వాటి ప్రసక్తులే కాక, వివిధ రకాల పర్వతజన్య ధాతువుల గురించి, వృక్షజాతి జన్యమైన వర్ణ ద్రవ్యాల గురించి, ఎన్నో ప్రస్తావనలున్నాయి. ఉదాహరణకు-
వాతాత్ జాతో అంతరిక్షాత్ విద్యుతో జ్యోతిషస్పరీ
స నో హిరణ్యజాః శంఖః కృశనః పాత్వంహసః
‘‘ఈ బంగారు మయమైన రక్ష (కృశనః) వాయువునుంచీ ఆకాశమునుంచీ మెరుపులనుంచి, సూర్య కిరణములనుంచి జన్మించినది. ఇది నీ పాపములను పోగొట్టుగాక! ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి