డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మంత్రం భూమిలో బంగారం రూపొందే విధానాన్ని పరామర్శిస్తోందని మనం గుర్తించాలి.
వేద పరిభాషలో రోగాలకు పాపాలనే పేరు ఉంది గనుక, బంగారాన్ని రక్షాద్రవ్యంగా వినియోగించటాన్ని ఈ మంత్రం చెపుతోంది గనుక, బంగారం యొక్క ఓషధీ విలువలను కూడా అథర్వశ్రీవేదం ప్రస్తావిస్తోందని మనం గుర్తించాలి.
ఆ తరువాత వైద్య శాస్త్రంలో రసాయనిక శాస్త్రాన్ని అంతర్భాగంగా స్వీకరించి, ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. అందుకే క్రీ.పూ. 3000 నాటినుండి భారతదేశంలో రసాయన శాస్త్రం వంశపారంపర్యంగా వారసత్వంగా అనుసరించే శాస్త్రంగా పాటింపబడుతూ వస్తోంది.
పాదరసం, జింకు, రాగి- వీటి మిశ్రమ లోహాల తయారీ కూడా వారు చేసేవారు.
ఓషధులనుండి, జంతువులనుండి, లభ్యమయ్యే వివిధ పదార్థాలతో వీరు రసాయనిక అద్భుతాలు సృష్టించారు.
ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా అనేక లేహ్యాలు, కలికాలు, అంజనాలు, రసాయనాలు, పొడులు, గుళికలు, తయారుచేయడంలో నాటివారు సిద్ధహస్తులు అయ్యారు.
మందులు తయారీలో అనేక రకాలుగా వండటం, ఆవిరి చేయడం, నూరటం, ఉడికించడం వగైరా ప్రక్రియలు అవసరవౌతాయి. వాటికి అనుగుణంగా ఆనాటివారు ప్రయోగశాలలో వాడేందుకోసం కనీసం 32 రకాల యంత్రాలను తయారుచేసుకున్నారు. వాటిలో కరిగించేందుకు, ఆవిరిబట్టీ పెట్టేందుకు, వివిధ రకాల ప్రత్యేక యంత్రాలు, అనేక రకాల కొలుములు కూడా వుండేవి.
అంతేగాక, ప్రయోగశాలలు లేక ఔషధాలు తయారుచేసే శాలలు (రసశాలలు) ఎలా వుండాలో కూడా ఆనాటి శాస్త్ర నిర్వచించింది.
క్రీ.శ.12వ శతాబ్దినాటిదైన వాగ్భట విరచితమైన ‘రసరత్న సముచ్చయం’ అనే గ్రంథంలో రసశాల నిర్మాణ వివరాలు చాలా వున్నాయి.
ఉదాహరణకు- వంటబట్టీలు పట్టే పాకశాలలు ఎక్కడ వుండాలి. నూరే కల్వాలు ఎక్కడ వుంలి, మూల పదార్థాలు కడిగే స్థానం ఎక్కడ ఉండాలి, వాటిని ఆరబెట్టే స్తానం ఎక్కడ వుండాలి, వాటిని ముక్కలు చేసేదెలా, అనుకున్న పదార్థం తయారైన తర్వాత ఆ సిద్ధ వస్తువులను భద్రపరిచేస్థలం ఎక్కడ ఉండాలి. పాదరసాన్ని ఎక్కడ భద్రపరచాలి? ఇలాంటి వివరాలన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయి.
ఆనాటి శాస్త్రాలలో పరస్పర సమన్వయం ఉండేది. అందువల్ల ఈ శాలా నిర్మాణ వర్ణన ఇటు కర్మాగార సౌకర్యాలతోపాటు, అటువాస్తు శాస్త్రంతో కూడా సరిపోలుతున్నది. రసశాలగురించే ఇంత విస్తారంగా వుందంటే, రసాయనాల గురించి ఇంకెంతగా శాస్త్రం అభివృద్ధి చెందిందో ఊహించవచ్చు.
రసాయన పదార్థాల తయారీలో కావలసిన సాధనాలు అనేకం వుంటాయి. వాటిని ముందుగానే కూర్చుకోవాలని కూడా ఆ గ్రంథంలో సూచనలున్నాయి.
నీటి బక్కెట్లు, రకరకాల తొట్టెలు, (కోష్టీలు) భస్ర్తీకాయుగళం, (జంట కొలిమి తిత్తులు), కల్వాలు, సన్నరంధ్రాల జల్లెడలు, రోళ్లు, రోకళ్ళు, తిరగళ్ళు, కొయ్య పాత్రలు, కర్రముక్కలు (శలాకలు) పిడకలు- వగైరా పదార్థాలను తయారుగా వుంచుకోవాలని సూచించబడింది.
ఇందాక చెప్పుకున్న 32రకాల యంత్రాలలో కోష్టయంత్రం, ఢేకీ యంత్రం, తిర్యక్ పతన యంత్రం మొదలైనవి వున్నాయి. వీటి అమరికలు అన్నీ వివరంగా ఇవ్వబడ్డాయి. వాటి కొలతలు, అవి పనిచేసే విధానాలు కూడా తెలుపబడ్డాయి.
తిర్యక్ పతన యంత్రం అనేది ఆవిరిబట్టీ యంత్రం లాంటిది. దాని వివరం ఇలా వుంటుంది.-
క్షిపేద్రసం ఘటే దీర్ఘే నతాధో నాళసంయుతే
తన్నాళం నిక్షిపే దన్యఘట కుక్ష్యంతరే ఖలు
తత్ర రుద్ధ మృదా సమ్యగ్వదనే ఘటయోరథ
అధస్తాద్రస కుంభస్య జ్వాలయేత్తీవ్ర పావకమ్
ఇతరస్మిన్ ఘటే తోయం ప్రక్షిపేత్ స్వాదుశీతలమ్
తిర్యక్ పాతన మేతద్ధి వార్తికై రభిధీయతే
పొడుగ్గావుండి క్రిందికి వంగివున్న గొట్టంగల ఒక ఘటం (పాత్ర)లో రసాన్ని వుంచాలి. కిందికి వంగిన గొట్టాన్ని మరో ఘటంయొక్క కడుపులోకి చొప్పించాలి. అక్కడ మట్టితో దాన్ని గట్టిగా మూసివేయాలి. ఆ రెండు ఘటాల మూతులనూ కూడా మట్టితో గట్టిగా ముయ్యాలి. మొదటి రస ఘటం కింద పెద్ద మంటపెట్టాలి. రెండో ఘటం చుట్టూ చల్లటి నీళ్లుపొయ్యాలి. ఇదే తిర్యక్ పాతన యంత్రం.
ఈ విధంగా ఆయా పరికరాల సహాయంతో, ఆయా యంత్రాలతో వివిధ ఓషధులను తయారుచేసేవాళ్ళు. ఉదాహరణగా, కాష్టిక్ ఆల్కలీ (తీవ్రక్షారం లేక చాకలిసోడా) తయారుచేసే విధానం క్రీ.పూ. 6వ శతాబ్దం నాటిదని భావింపబడుతున్న సుశ్రుత సంహితలో విపులంగా వుంది- ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి