డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీ.పూ.321-296 కాలంలోని కౌటిల్యుని అర్థశాస్త్రంలో ‘‘వ్యవసాయ రంగం’’ గురించిన అనేక విషయాలు ప్రస్తావించబడి వున్నాయి. ఆ రోజుల్లో రాజాస్థానాలలో ‘‘సీతాధ్యక్షుడు’’ (సీత అనగా నాగటిచాలు)అనే పదవి వుండేది. ఆయనకు వ్యవసాయ విధానాలు తెలిసి వుండాలి, పైరు పంటలకు, వృక్షాలకు వచ్చే వివిధ వ్యాధుల గురించి వాటి నివారణోపాయాల గురించి కూడా క్షుణ్ణంగా తెలిసి వుండాలి. ప్రస్తుతం మన ఎగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ ప్రొక్యూర్‌మెంట్, గోడౌన్లు, మార్కెట్ యార్డులు వగైరా వివిధ శాఖలన్నీ ఆనాటి పరిపాలనలో సీతాధ్యక్షుడి ఆధీనంలో వుండేవిట! వీటికి అదనంగా ఈనాడు మన ప్రభుత్వాలు కూడా పట్టించుకోని ‘‘రైతుకూలీల’’ వ్యవస్థయొక్క ప్రస్తావన కూడా అర్థశాస్త్రంలో వుంది. పైన చెప్పిన సీతాధ్యక్షుడు, ఖైదీలు, బానిసలు మొదలైన వారిని రైతుకూలీలుగా వినియోగించి వ్యవసాయ పనులను క్రమబద్ధీకరించాలని తద్వారా ఆయా కార్మిక వర్గాలకు జీవనభృతి కల్పించాలని చాణక్యుడు నిర్దేశించాడు. ఇంకా ఇప్పటి మైనర్, మేజర్ ఇరిగేషన్లు కూడా ఆయన ఆధీనంలోనే వుండేవిట. పశువుల మేతకు బీళ్లు ఏర్పరచటం దగ్గరినుంచి వ్యవసాయానికి కావలసిన తాళ్లు పేనటంతో సహా, వ్యవసాయ పనిముట్లు చేసే వడ్రంగులు, కమ్మర్లు, కంచర్లకు తగిన విధంగా పనులు పురమాయించటాలు కూడా ఈయన ఆధీనంలో వుండేవి.
ఇలా క్రమక్రమంగా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటూ అభివృద్ధి చెందుతున్న మన ప్రాచీన ‘‘కృషి విజ్ఞానం’’ క్రీ.శ.550 నాటి బృహత్సంహిత నాటికి ఇంకా విస్తరించింది.
వరాహ మిహిరుని బృహత్సంహితలోని ‘‘సస్యజాతకం’’అనే అధ్యాయంలో గ్రహ నక్షత్రాలు ఆధారంగా పంట ఎలా పండబోతుందో వివరించబడి వుంది.
అటు తర్వాత కృషి పరాశరం అనే గ్రంథంలో(క్రీ.శ.1వ శతాబ్ది- కొందరి మతంలో క్రీ.పూ.4వ శతాబ్ది) పరాశరుడు కృషి విజ్ఞానానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావిస్తూ ‘‘మానవజాతికి వేద విజ్ఞానం, శాస్తవ్రిజ్ఞానం ఎంత అవసరమో కృషి విజ్ఞానం కూడా అంతే అవసరం’’అని వక్కాణించారు.
వర్షపాతం, వగైరా వివరాలతోపాటు గ్రహ నక్షత్ర సంచారాన్నిబట్టి వచ్చే యేడు ఎక్కడ ఎంతెంత వాన పడుతుందో జోస్యం చెప్పటం, ఏ రకాల పంటలు వచ్చే యేడు బాగా పండే అవకాశం వుంటుందో చెప్పటం వగైరా వ్యవసాయ జ్యోతిష విజ్ఞానానికి వరాహ మిహిర, పరాశరాదులు బాటలు వేశారు. అంతేగాక పరాశరుడు వ్యవసాయ రంగానికి చెందిన అనేక శాస్ర్తియ అంశాలు ప్రస్తావించాడు.
గోశాలలు, పశుసంపద, ఒక కాడికి ఆరునుంచి ఎనిమిది ఎడ్లు వినియోగించాలనటం, పశువుల పండగ ఒకటి ఏర్పరచటం, గోశాలలనుండి ‘‘పెంటపోగు’’ పొలాలకు తోలటంనుంచి, దున్నటం, విత్తనాలు చల్లటం, పంటలు కోయటం వగైరాలన్నింటికీ శుభదినాలు చూడడం వగైరాలన్నీ, ఈ పరాశరుడి తర్వాత కాలంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అంతేకాక పరాశరుడు అనేక వ్యవసాయ పనిముట్లను వివరంగా వర్ణించాడు. కృషిపరాశరం, (112119) లో వర్ణించిన నాగలి ఆధారంగా గీసిన చిత్రం నేటి నాగలితో సరిపోలుతుంది.
అటు తర్వాత క్రీ.శ.7 లేక 8 శతాబ్దినాటి కాశ్యపీయ కృషి సూక్తి, క్రీ.శ. పదవ శతాబ్దినాటి వృక్షాయుర్వేదము (సురపాలవిరచితము) క్రీ.శ.15వ శతాబ్దినాటి విశ్వవల్లభము (చక్రపాణి మిశ్ర విరచితము) మొదలైన శాస్త్రగ్రంథాలు వచ్చాయి.
ఇంత విస్తారమైన కృషి శాస్త్రగ్రంథాలలో సురపాల విరచిత వృక్షాయుర్వేదము గురించి ప్రత్యేకంగా పేర్కొనవలసి వుంది. నిజానికి ఈ గ్రంథం కొనే్నళ్లక్రితం వరకూ అలభ్యం! దీని మూలప్రతి ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్‌లో బోడ్లియన్ గ్రంథాలయంలో వున్నదట. దీని వ్రాతప్రతిని హైద్రాబాదులోని ఆసియన్ అగ్రిహిస్టర్ ఫౌండేషన్‌వారు సుమారు పదేళ్ల క్రితం సంపాదించగలిగారు.
వృక్షాయుర్వేదం అంటే ‘‘వృక్షాల జీవశాస్తమ్రు’’అని అర్థం! మూల గ్రంథంలో సుమారు 170 రకాల వృక్షాలు, మొక్కలు ఉదహరించబడ్డాయి. దీనిని వృక్షశాస్త్ర సర్వస్వం అని చెప్పుకోవచ్చు.
నేలలో రకాలు, భూగర్భ జలం, చెరువులు, బావులు, దున్నటం, విత్తనాలు శుద్ధిచేయటం, విత్తటం వగైరాలేకాక వివిధ రకాల మొక్కల పెంపకం గురించిన వివరాలు కూడా వున్నాయి.
చెట్లు బాగా పెరిగేందుకు ‘‘పాలుపొయ్యటం’’కూడా ఇందులో ప్రస్తావించబడింది. చెట్లకు అగ్ని, మంచు, మొదలైన బాహ్య కారణాలవల్ల వ్యాధులు వస్తాయని చెప్పబడింది. అంతేకాక వృక్షజాతులకు, మనుషులకు లాగానే వాత పిత్త కఫాలవల్ల (త్రిదోషాల) రోగాలు వస్తాయని చెబుతూ, వాటి నివారణోపాయాలు, మందులు కూడా పేర్కొనబడ్డాయి.
ఇందాక ప్రస్తావించబడిన కృషిపరాశరము అనే గ్రంథము గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకోవాలి. కొందరి అభిప్రాయంలో ఇది క్రీ.పూ.4వ శతాబ్దానికి చెందినది. ఇదే వ్యవసాయ శాస్త్రానికి సంబంధించినంత వరకు ప్రథమ గ్రంథమని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే ఇది ప్రథమ కృషి శాస్త్ర గ్రంథంగా కొందరు చెబుతారు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో ప్రత్యేకించి ‘‘గంగాకావేరీ’’ మధ్య దేశంలో విభిన్న లక్షణాలు కలిగిన నేలలు, భిన్న ఋతువులు సంభవించే వాతావరణ మార్పులు కనపడుతున్నాయి. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర.
0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి