డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు లభిస్తున్న భారతీయ వైజ్ఞానిక శాఖలలో ఆచరణ పరంగానూ, గురుశిష్య పరంపరగానూ అమలులో ఉన్న సజీవ శాఖలు రెండే రెండు. అవే గణితము, వైద్యము. వీటిలో గణితం పంచాంగ గణిత రూపంలో సజీవంగా ఉండగా వైద్యం, ఆయుర్వేదం రూపంలో విస్తృత ప్రచారంలో ఉన్నది. దీనిలో పోయినంత పోగా మిగిలి ఉన్నదే సముద్రమంత ఉన్నది. ప్రజలలో దీనిని గురించిన అవగాహన కూడా ఎంతో కొంత వుంది. అందువలన ఈ విజ్ఞానశాఖను గురించి మనం ఇప్పుడు చాలా సంగ్రహంగా ప్రముఖ విషయ పరిచయాత్మకంగా ముందుకు సాగుదాం.
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అల్లోపతీ వైద్యవిధానమే అత్యధికంగా అమలులో వుంది. దీనినే ఆధునిక వైద్యవిధానం అంటున్నారు. దీని చరిత్ర ఇంచుమించు క్రీ.పూ.5వ శతాబ్దంతో ప్రారంభమవుతోంది. క్రీ.పూ.460 ప్రాంతంలో హెపోక్రటీస్ అనే గ్రీకు వైద్యుడి రచనలే ఈ విద్యకు ప్రారంభం అని భావిస్తున్నారు. ఆ తరువాత క్రీ.పూ. 201నాటి గాలెన్ (లేక గాలే ఈయన కూడా గ్రీకువాడే) మరింత విస్తృతంగా వైద్య గ్రంథ రచన చేశాడు. ఈయన రచనలోనే ప్రప్రథమంగా అనాటమీ (శరీరావయవ శాస్తమ్రు) ఫిజియాలజీ (చికిత్సా విభాగము)అనే విభాగాలు రూపొందాయి. దాదాపు 17వందల ఏళ్ళుదాటాక క్రీ.శ.1550 ప్రాంతంలో బెల్జియం దేశస్థుడైన ఆండ్రూస్ వెసాలియన్ మరిన్ని విస్తృత పరిశోధనలుచేసి గాలే గరా తప్పులను దిద్దాడు. ఆ తరువాత క్రీ.శ.19, 20 శతాబ్దులలో వైద్యం శరవేగంగా పురోగతి సాధించింది. సంగ్రహంగా ఇదీ ఆధునిక వైద్యచరిత్ర!
ఇక మన భారతదేశంలో చికిత్సావిధానాలు ఎప్పుడు మొదలైనాయ. ఎలా వృద్ధి చెందినాయ అనే విషయాలను బహుసంగ్రహంగా పరిశీలిద్దాం.
అతి పురాతనాలైన వేదాలలోనే ఎన్నో వ్యాధులు, వాటి చికిత్సలు, దానికి తగిన మూలికలు, వగైరా విషయాల ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఇదేదో నిరక్షరాస్యుల అనుభవ వైద్యంకాదు. అథర్వణ వేదానికి అనుబంధంగా వున్న ‘‘గర్భోపనిషత్తు’’లో ధాతువులు, శిరలు, కండరాలు, స్నాయువులు, ఎముకలు, సంధులు వంటి శరీరాంతర్గత అవయవాల వివరాలన్నీ వున్నాయి. అదిగాక, శరీర భాగాలను చెడగొట్టే సూక్ష్మక్రిముల ప్రస్తావన వుంది. జ్వరము, క్షయ, కుష్ఠము, సంధివాతము, దుర్ణామా (పైల్సు) వంటి కొన్నిరకాల రోగాల పేర్లున్నాయి.
వీటికి మూలికాదుల ద్వారా జరిగే ఔషధ చికిత్స మాత్రమేకాక జల చికిత్స, సూర్యరశ్మి చికిత్స, మణి చికిత్స, వర్ణ చికిత్స వంటి చికిత్సా విధానాల ప్రస్తావనలున్నాయి. వివరాలు లేకపోయినా గండమాల వంటి వ్యాధులకు శస్తచ్రికిత్స ప్రస్తావన వుంది. ఇదిగాక, సర్పాలను 18రకాల జాతులుగా విడదీసి వాటికి పేర్లుపెట్టి, విష చికిత్సా విధానాలను సూత్రీకరించిన వైనం వుంది.
వేదకాలం నాటికే ఇంతటి సునిశిత వైద్యవికాసం వుంటే, అది క్రమక్రమంగా పెరగకుండా వుంటుందా?
వేదానంతరం పురాణాలలోనూ, తంత్ర శాస్త్రగ్రంథాలలో ఇలాంటి వైద్య ప్రస్తావనలు మరింత విస్తృతంగా కనిపిస్తున్నాయ.
ఐనప్పటికీ, ఇవాళ్ళ ఆయుర్వేదమనే పేరుతో వ్యవహరింపబడే వైద్యప్రక్రియ యొక్క సమగ్ర రూపకల్పన చరక- సుశ్రుత- వాగ్భటుల గ్రంథాలలోనే మనకు దర్శనమిస్తుంది. వీరు రచించిన గ్రంథాలే చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయము అనేవి. వీటినే ఆయుర్వేద సంఘాలలో ‘బృహత్త్రయి’అంటారు. అంటే - ‘‘మూడు గ్రంథాలు’’ అని అర్థం.
అంతకుముందున్న వైద్య ప్రసక్తులలో విస్పష్టంగా లేని వైద్య సిద్ధాంత భాగం ఈ బృహత్త్రయిలో విస్పష్టంగా దర్శనమిస్తుంది. వాత-పిత్త-శే్లష్మాలనే మూడు వౌలికాంశాలే ఆయుర్వేద వైద్య సిద్ధాంతానికి మూల స్తంభాలు. ఆరోగ్యవంతుడి విషయంలో ఇవి ‘‘్ధతువులు’’అంటే, మూల పదార్థాలు. వ్యాధిగ్రస్తుడి విషయంలో ఇవి ‘‘దోషాలు’’అంటే, రోగ కారణాలు.
వాత పిత్త శే్లష్మాలనే మూలతత్త్వాలు మానవ శరీరంలో మాత్రమేగాక, జంతు శరీలాలలోనూ, వృక్షశరీరాలలోనూ కూడా వుంటాయి. వృక్ష శరీరాలలో వీటికి మార్పులు జరిగే వీలు తక్కువ. వాత పిత్త శే్లష్మాలు వుండవలసిన నిష్పత్తిలో వుంటే, అది మానవుడికి ఆరోగ్య స్థితి. దీనినే ధాతుసామ్యం అంటారు. ఆ నిష్పత్తి చెదిరిపోతే- అది ధాతు వైషమ్యం. అది మానవుడికి అనారోగ్య స్థితి.
అనారోగ్యస్థితిలో వుండే లక్షణాలనుబట్టి, శరీరంలో సంభవించిన ధాతు వైషమ్యాన్ని గుర్తించాలి. అప్పుడు దానికి విరుగుడు చేసి, మళ్ళీ ఆ ధాతువులను సమ నిష్పత్తిలోకి తీసుకురావాలి. దీనికోసం ఎక్కువైన ధాతువును తగ్గించాలి. తగ్గిన ధాతువును పెంచాలి. ఇది జరగాలంటే ఏ ధాతువు పెరిగిందో దానికి విరుగుడు చేయగల ఔషధాన్ని, ఏది తగ్గిందో దాన్ని పెంచగల ఔషధాన్ని తినాలి. తిన్న ఔషధం కడుపులోకి పోయి, అక్కడ గల వివిధ ద్రవాలతో సంయోగం చెంది, వివిధ మార్గాల ద్వారా, దోష ప్రభావానికి లోనయిన దూష్య స్థానానికి చేరి, అక్కడగల దోషాన్ని తొలగించి, రోగికి స్వాస్థ్యాన్ని కలిగిస్తుంది.
ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యక్తికి అరికాళ్ళ మంటలు బయలుదేరినాయి. దానికి కారణం అతనిలో వాత దోషం పెరగటమే. కనుక అతను వాతాన్ని తగ్గించే ఘృతాదులను సేవిస్తాడు. ఆ ఘృతం అతని ఉదరంలో చేరి వివిధ నాడులలోకి ప్రసరించి, అక్కడి వాతాన్ని తగ్గించి క్రమంగా అతని అరికాళ్ళలోగల మంటను తొలగిస్తుంది. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి