డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనుక, ఆయుర్వేద వైద్యుడు, కేవలం రోగ లక్షణాలను మాత్రమేగాక, ఆ లక్షణాలకు కారణమైన దోష వైషమ్యాన్ని దానివల్ల ప్రభావితమైన దూష్య స్థానాన్ని, దాన్ని నివారించగల ఔషధ యోగాన్నీ కూడా గుర్తించగలగాలి. (యోగము అంటే - వివిధ ఓషధుల కలయికవల్ల యేర్పడిన ఔషధ స్వరూపము.)
పటిష్ఠమైన ఈ సిద్ధాంత భాగం వైద్యవిధానంలో అమలుకు రావాలంటే, శరీరావయవాల నిర్మాణం పూర్తిగా తెలియాలి. ఇలాంటి వివరాలన్నీ బృహత్త్రయిలో ఎంతో విపులంగా వున్నాయి.
ఈ బృహత్త్రయి కర్తల కాల నిర్ణయం అనిత సులభంగా కుదరటం లేదు. అందువల్లనే ఆ విషయంలో చారిత్రికులలో ఏకాభిప్రాయం కష్టసాధ్యంగా వుంది. ఏది ఏమైనప్పటికీ వారు ముగ్గురూకూడా కొద్ది వందల సంవత్సరాల తేడాతో క్రీ.పూ.1000 ప్రాంతానికి చెందిన వారేననటంలో ఎవరికీ భేదాభిప్రాయం లేదు. అందువల్ల ప్రస్తుత మన అధ్యయనంలో వారందరినీ క్రీ.పూ.10వ శతాబ్ది ప్రాంతంవారనే మనం వ్యవహరిద్దాం.
ఆ బీసీ నాటి మహనీయుల రచనలలోని కొన్ని అపూర్వ విషయాలను మనం ప్రస్తావించుకుందాం-
చరక సంహితలో ఆయుర్వేదంలోని ప్రత్యేక విభాగాలు ఇలా ఇవ్వబడ్డాయి.
కాయ చికిత్స-శరీరానికి చికిత్స(మందులు, పైపూతలు వగైరాలు)
శాలాక్యము- ముఖం (ముక్కు, కన్ను, చెవి) చికిత్స
శల్యా పతృకము- కత్తితో తొలగించవలసినవి (శస్తచ్రికిత్స)
విషగర వైరోధక ప్రశమనము- విషం గరళాలకు చేసే చికిత్స
భూతవైద్యము- భూత అంటే(పాస్ట్) గతించిన వ్యాధుల చికిత్స (సైకాలజీ, మనోవ్యాధులు)
కౌమారభృత్యకము- స్ర్తిశిశు చికిత్సలు
రసాయనము- రసాయనాలతో చికిత్స
సుశ్రుతంలో (క్రీ.పూ.6వ శతాబ్దం) వ్యాధుల వర్గీకరణ వుంది.
శరీరంలో ఉద్భవించేవి, పరిసరాలవల్ల సంక్రమించేవి, దైవవశాత్తు సంభవించేవి.
ఆదిబల ప్రవృత్తాః (వారసత్వ వ్యాధులు)
జన్మబల ప్రవృత్తాః (గర్భోత్పత్తి తర్వాత జననంముందు వచ్చే వ్యాధులు)
దోషబల ప్రవృత్తాః (వాతపితాకఫదోషాలవల్ల వచ్చే వ్యాధులు)
సంఘాతబల ప్రవృత్తాః (అంటు రోగాలు)
కాలబల ప్రవృత్తాః (ఋతువులవల్ల వచ్చే వ్యాధులు)
దైవబల ప్రవృత్తాః (దైవ వశంగా వచ్చే వ్యాధులు)
స్వభావబల ప్రవృత్తాః (సహజంగా వృద్ధాప్యం వగైరాలవల్ల వచ్చే వ్యాధులు)
ఎలాటి రోగాలైనా చికిత్సకు కుదిరేవి, భరించవలసినవి, నివారణకు లొంగనివి! అని మరో రకపు వర్గీకరణ.
అందులోనే శరీరంలోని భాగాల ప్రస్తావన ఇలా వుంది.
చర్మం ఏడుపొరలు, ఆశయాలు ఏడు, ఏడు ధాతువులు, 700సిరలు (నాడులు) 500 పేశీలు (కండరాలు), 900 స్నాయువులు, 300 ఎముకలు, 210 సంధువులు, 107 మర్మస్థానాలు, 24 ధమనులు, మూడు దోషాలు, 3 మలాలు, 9 ఇంద్రియాలు, 16 కండరాలు, 16 జాలాలు, 6 కూర్చలు, 4 రజ్జులు, 7 కుట్లు, 14 సంఘాతాలు, 14 సీమంతాలు, 22 నాళికలు (వాహినులు), 2 ఆంత్రాలు.
విచిత్రమేమిటంటే, ఒక్క కండరాల విషయంలో తప్ప మిగతావన్నీ ఈనాటి లెక్కలతో సరిపోలుతున్నాయి.
చర్మం పొరలు-
ఆధునిక వైద్యశాస్త్రం చర్మంలో అయిదు పొరలున్నాయని గుర్తించింది. కానీ సుశ్రుత సంహితలో చర్మానికి ‘‘ఏడు పొరలు’’ఉన్నాయని వివరించబడింది.
మొదటి పొర ‘‘అవభాసినీ’’అనే పేరుగలది. అయిదు రకాలు రంగులు దీని నుండి ప్రకాశిస్తాయి. వడ్లగింజలో పదునెనిమిదవవంతు ప్రమాణం గలది.
రెండవది ‘‘లోహిత’’అనే పేరుగల పొర, వడ్లగింజలో పదహారవ వంతు ప్రమాణం కలది.
మూడవది ‘‘శే్వత’’అనే పేరుగలది. వడ్లగింజలో పనె్నండవ వంతు మందం గలది. చర్మం పగుళ్ళు వగైరాలు ఈ పొరనుండి వస్తాయి.
నాల్గవది ‘‘తామ్ర’’అనే పేరుగలది. వడ్లగింజలో ఎనిమిదవ వంతు మందంలో వుండే ఈ పొర వివిధ చర్మవ్యాధులకు ఆకారం. అయిదవ పొర పేరు ‘‘వేదిని’’ వడ్లగింజలో అయిదవ వంతు మందం. ఇది ‘‘కుష్ఠ, విసర్చి’’ వ్యాధులకు స్థానం.
ఆరవది ‘‘రోహిణీ’’అనే పేరు గలది. వడ్లగింజ మందంగల ఈ పొరనుండి గ్రంథులు, కంతులు వగైరా చర్మవ్యాధులు వస్తాయి. ఏడవది ‘‘మాంసధరా’’ పేరుగలది. రెండు వడ్లగింజల మందం గలది. భంగధర, మూలవ్యాధి మొదలైన వ్యాధులకు స్థానం.
ఆధునిక శాస్త్రం కంటే రెండు పొరలు ఎక్కువగా చర్మాన్ని వర్గీకరించిన మన పురాతన వైద్యశాస్త్ర నైపుణ్యాన్ని ప్రశంసించకుండా వుండగలమా?

--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి