డైలీ సీరియల్

పచ్చబొట్టు-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనే్వష్ ‘పరమానందం’ దగ్గిర సెల్‌ని తీసుకున్నాడు. అందులో నెంబర్లను తెలుసుకుంటుంటే అతని మతిపోతోంది. ఇతని వెనక ఏదో పెద్ద ముఠా ఉన్నట్లే అనిపిస్తోంది. అది మాఫియా గాంగో, నక్సలైట్లో తెలుసుకోవాలి. కానీ రోజురోజుకూ విచిత్రమైన మలుపులు తిరిగి తనని ఆశ్చర్యపరుస్తోంది. అసలు పరమానందం పేరు ‘్ఫణి’. ఇతను మూడు నెలల క్రితమే ఆ స్కూలులో పనికి కుదిరాడు. ఎవరైనా మంచివాళ్ళు దొరికేవరకూ టెంపరరీగా చెప్పి పెట్టుకున్నామని వాళ్ళు చెప్పటంతో తెలిసింది.
అతన్ని బయట ఉంచితే ప్రమాదమని సెల్‌లో వేసాడు. అనుమానం రానట్లే ప్రవర్తిస్తున్నా అతని ప్రాణాలకు ముప్పు ఉందని మనసు హెచ్చరిక చేస్తోంది. సెల్‌లో కాంటాక్ట్ నెంబర్స్, అవుట్ గోయింగ్ నెంబర్స్ తీసుకొని అతనికి తెలియకుండా ఎంక్వయిరీ ప్రారంభించాడు. పాపం ఫణి మాత్రం తన మీద పడ్డ నేరాన్ని ఎలా రూపుమాపుకోవాలా? కోర్టు శిక్షను ఎలా తప్పించుకోవాలా? సాక్ష్యాలు ఎలా సృష్టించాలా అని ఆలోచిస్తున్నాడు. తన బాస్ అదంతా చూసుకుంటాడని గట్టి నమ్మకంతోనే ఉన్నాడు.
అనే్వష్ మాత్రం ముందు వివరాలు కనుక్కొని అప్పుడు ఫణితో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. చెప్పకపోతే థర్డ్ డిగ్రీ ఎలాగూ ఉందిగా. ఈలోపు మొత్తం పోలీసు బలగాన్ని అంతా వినియోగించుకొని పావులను కదిపాడు. ప్రత్యర్థులు కళ్ళుతెరిచేలోపే పట్టుకున్నారు.
వాళ్ళూహించిన దానికన్నా పెద్ద ప్లానుమీదే ఉన్నారు వాళ్ళందరూ.
మంచికి మారుపేరుగా పేరుగాంచిన విద్యాలయ స్కూల్‌లో తమ కార్యకలాపాలు గుట్టుగా జరపాలని నిశ్చయించుకున్నారు. దానికి మొదటి సన్నాహంగా ఫణిని పంపారు. సొరంగం తవ్వి అండర్‌గ్రౌండ్‌లో బాంబుల తయారీ, దొంగనోట్ల ముద్రణ చెయ్యాలని వారి ప్లాన్. అనే్వషణ తెలివితేటలవల్ల ఆ ప్లాన్ అంతా అట్టర్ ప్లాప్ అయింది. అంతర్జాతీయ దొంగల ముఠాను కనుగొన్న ఖ్యాతి అనే్వష్‌కి దక్కింది.
అనే్వష్‌కి సి.ఐగా ప్రమోషన్‌కి రికమెండ్ చేస్తానంటూ ప్రత్యేకంగా వచ్చి అభినందించారు డిసిపి అనే్వష్. పచ్చబొట్టుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆమెవలనే కదా పరమానందం పట్టుబడింది. ఆ తర్వాత కథ అంతా బయటపడింది. అంత సంతోషంలోనూ ఒక దిగులు అతన్ని బాధపెడుతూనే ఉంది. తన ఉత్తరం చదివాకకూడా తనకు సమాధానం రాయాలని పచ్చబొట్టుకు ఎందుకు అనిపించలేదా అని. ఏ రోజుకారోజు గులాబీ రంగు కవర్ కళ్ళ పడుతుందని తపించిపోతున్నాడు. ఈ విషయం తెలిసాక కంగ్రాచ్యులేట్ చెయ్యకుండా ఉండలేదులే పచ్చబొట్టు అని ఆశపడుతున్నాడు.
* * *
ఆ రోజు రామక్రిష్ణప్రసాద్ గారింట్లో పండగ వాతావరణం చోటుచేసుకుంది. విద్య ‘‘అన్నయ్య! కంగ్రాట్స్‌రా!’’అంటూ అనే్వషణ కిష్టమైన బాంబే హల్వాను తినిపించింది. తండ్రి అనే్వష్‌ను బిగియారా కౌగలించుకున్నాడు. తన బిడ్డ అంచెలంచెలుగా అలానే ఎదగాలని మనసారా ఆశీర్వదించారు.
అమ్మ ఈ సంతోష సమయంలో దగ్గర లేకపోవటం వాళ్ళందరికీ మరో ప్రక్క విచారాన్ని కలిగిస్తోంది. అనే్వష్ తను తెచ్చిన లడ్డూలను తండ్రికి, చెల్లికి ఇచ్చాడు.
‘‘స్వీట్ న్యూస్ ఇచ్చావు కదరా! మళ్ళీ స్వీటెందుకు?’’ అంది సరదాగా విద్య.
‘‘ఇది నీకు కాదు. మీ ఆయనకు’’ అన్నాడు.
‘‘పోరా! మళ్ళీ మొదలుపెట్టావు.’’
‘‘ఆఁ! ఆఁ! ఇలాగ అంటూనే సడన్‌గా ఒకరోజు ‘నేను ఇతన్ని ప్రేమిస్తున్నానురా’’అంటూ బావగారిని నా ముందు నిలబెట్టేస్తావ్.’’
‘‘నేనేం అలా తెచ్చుకోను. నువ్వు చెప్పి నచ్చితేనే చేసుకుంటాను.’’
‘‘నల్లగా, కోతిలాగా ఉన్నా అన్నయ్య తెచ్చాడని చేసేసుకుంటావా?’’
‘‘నువ్వలాంటి వాడిని నీకిష్టమైన చెల్లికి తీసుకురావని నమ్మకంలే.’’
‘‘అబ్బో! నామీద చాలా హోప్స్ పెట్టుకున్నావే!’’అని పైకి అని మనసులో ‘ఈ లోకమంతా గాలించి అయినా నీకో మంచి భర్తను తీసుకువస్తానురా’ అనుకున్నాడు.
ఎందుకో అతని కళ్ళు చమర్చాయి.
‘‘అమ్మకి ఫోన్‌చేసి చెబుదాం’’ అన్నాడు అనే్వష్.
‘‘టి.వీలో ఈ న్యూస్ వచ్చేసింది. అమ్మ చూసే ఉంటుంది. అయినా మనం చెప్పాలిగా. చెయ్యిరా అన్నయ్యా!’’
అనే్వష్ లాండ్ ఫోన్‌వైపు నడుస్తున్నాడు.
ఇంతలో అతని సెల్ రింగయింది.
‘‘హాయ్! హాండ్‌సమ్! కంగ్రాట్స్!’’
‘్థంక్స్! మీరెవరు?’’ మనసులో మెదిలే ఆలోచన కరెక్టాకాదా అన్న అనుమానం తీర్చుకోవటానికి.
‘‘నేనే’’.
‘‘నేనే అంటే’’
‘‘నువ్వు రోజూ ఎదురుచూస్తున్నావుగా ఆ మాత్రం గుర్తుపట్టలేవా?’’
‘పచ్చబొట్టా’ అనబోయి నువ్వేనా’’ అన్నాడు.
‘‘ఆఁ! నేనే! నమ్మలేవా?’’
‘‘ఎందుకు నమ్మను? నిజమయితే తప్పక నమ్ముతాను.’’
సెల్‌లో నెంబరు వంక చూస్తూ అన్నాడు.
‘‘నెంబరు చూసినా ప్రయోజనం ఉండదు మిష్టర్. నేను పబ్లిక్ బూత్ నుంచీ కాల్ చేస్తున్నాను.’’
నేనేం నెంబరు చూడటం లేదు అని చెప్పాలనిపించింది. కానీ వౌనం వహించాడు.
మొదటిసారి తనకి ఫోన్ చేయడం. ఎంత స్వీట్‌గా, హస్కీగా ఉందా వాయిస్.
‘‘ఏమిటి? అమ్మాయిలకు డాష్‌లిస్తున్నావ్? ఏదో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకున్నా ఇలాంటివి కూడా ఉన్నాయా?’’
‘‘లేదే! అలాంటిదేం లేదే!’’ ఇదికూడా కనిపెట్టేసిందా మహాతల్లి.
‘‘ఉందిలే! నేను నిన్ను ఓ కంట గమనిస్తూనే ఉంటాను. నిముషంలో తప్పిపోయావు. లేకుంటే దొరికిపోయి ఉండేదాన్ని.’’
‘‘అంటే నువ్వక్కడే ఉన్నావా?’’
‘‘ఆహాఁ! తమరు కాలినడకన తిరుపతి చేరటం కూడా తెలుసు. అందరూ కొండకు నడిచి ఎక్కుతామని కోరికలు కోరుకుంటారు. నువ్వు ఏడుకొండలు కాలినడకన దిగుతావని. ప్రమోషన్ ప్రసాదించమని నీ తరఫున కోరుకున్నాను. చూసావా! రిజల్ట్స్ ఎంత త్వరగా వచ్చిందో?
‘‘నేనే నీకు థాంక్స్ చెబుదామనుకున్నాను.’’
‘‘ఇప్పుడు చెప్పెయ్.’’
‘‘ఎదురుగా వచ్చి చెప్పాలని.’’
‘‘ఆశ, దోశ, అప్పడం, వడ కాదూ!’’
ఇంతలో లాండ్‌ఫోన్ రింగయింది.
మాట్లాడే మాటను ఆపేస్తూ ‘‘మీ అమ్మగారనుకుంటా! ఇకనే ఉంటా! బాయ్’’ అంటూనే. ఫోన్ పెట్టేసింది.
ఈసారి మాట్లాడినప్పుడు ఎలాగయినా ట్రాప్ చెయ్యాలి. మొదటిసారి, అదీ తను ఫోను చేస్తుందని ఊహించలేకపోయాడు.
విద్య ఫోనుతీసి మాట్లాడుతోంది.
‘‘అన్నయ్యా! అమ్మరా!’’
‘‘వస్తున్నా!’’
‘‘ఏరా నాన్నా! కంగ్రాట్స్ చెబుదామని చేసానురా!’’
‘‘్థంక్సమ్మా!’’
‘‘నువ్వింకా ఇలా ఎన్నో విజయాలు సాధించాలిరా.’’
‘‘అలాగే. నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు?’’
‘‘వచ్చేస్తున్నానురా. టిక్కెట్సు రిజర్వేషన్ కూడా అయిపోయింది. రెండు రోజులలో మీముందు ఉంటాను.
‘‘ఈ విషయం వింటే విద్య ఎగిరిగంతేస్తుంది. నిన్నుచూసి చాలా రోజులయినట్లుంది వచ్చెయ్యమ్మా!’’
‘‘వస్తానులేరా! ట్రైను తీసుకురావద్దూ. మీరు కంగారుపడ్డారని అది తొందరగా తీసుకువస్తుందా’’ అందామె నవ్వుతూ.
‘‘సరే నాన్నగారికిస్తున్నాను. విద్యకివ్వు. దానితో మాట్లాడలేదు.’’
‘‘నేనే మాట్లాడుతున్నానమ్మా!’’
‘‘ఎలా ఉన్నావురా!’’
‘‘నీకోసం రోజూ ఎదురుచూస్తున్నామమ్మా. ఇలా ఉండిపోతానంటే అసలు పంపేవాళ్ళంకాము.
‘‘వచ్చేస్తున్నానుగా. అలకలన్నీ తీర్చుకుందురుగానీ.’’
‘‘నాన్నగారికివ్వనా.’’
‘‘ఇవ్వు’’
‘‘సత్యా! ఎలా ఉన్నావ్?’’
‘‘బాగున్నానండీ! ఆవిడకు కాస్త కాలు నయమయ్యింది. పనికి ఓ అమ్మాయిని కూడా కుదుర్చుకున్నారు. ఇంక అక్కడ నా అవసరం లేదు. అందుకే చెప్పి రిజర్వేషన్ చేయించేసాను.’’
*
-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206