డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ణం అనే పదంవల్ల వ్యక్తమయ్యే అక్షరము, తేజస్సు- రెండూ ఒకే తత్త్వంలోంచి వ్యక్తం అవుతున్నాయి గనుక, ఆ రెంటికీ సహజంగానే సమన్వయం వుంటుంది. మూలాధారంలో వ్యక్తమయ్యే గణపతి తత్త్వం పృథివీ తత్త్వానికి సన్నిహితం కనుక, ఆయన వ్యక్తంచేసే జ్యోతిస్సు రక్తవర్ణంగా వుంటుంది. (పృథివీతత్త్వం ఎరుపు రంగని యోగశాస్త్రంలో ప్రసిద్ధం.) అందుకనే గణపతి రక్తచందన ప్రియుడు. రక్తపుష్ప ప్రియుడు.
త్రికోణం
అంతేకాక, మూలాధారంలో వుండే యంత్రం త్రికోణం. ప్రపంచంలో అతి తక్కువ బిందువులతో ఏర్పడగల యంత్రం త్రికోణం మాత్రమే. ఒకే బిందువు వుంటే దానికి యంత్ర ఆకారమే లేదు. రెండు బిందువులు వుంటే ఒక సరళరేఖ ఏర్పడుతుంది గాని, దానితో అతుకులు పూర్తిఅయిన యంత్రం ఏర్పడదు. (closed circuit ఏర్పడదు). మూడు విభిన్న బిందువులు వుంటేనే యంత్రం అనేది ఆవిర్భవిస్తుంది. కాగా త్రికోణం అనేది సృష్టిలోని ప్రప్రథమ యంత్రం. సృష్టిలోని ప్రథమ దైవము, ప్రథమ పూజ్యుడు, అయిన గణపతిని త్రికోణమే వ్యక్తం చేయగలదు. అందుకనే గణపతికి త్రికోణమే ప్రథమ సంకేతం. అంతేగాక, ఒక త్రికోణం ఏర్పడిందంటే రెండు కొలతలు ((dimensions) గల ఒక తలం (place) ఏర్పడినట్లు లెక్క. ఆ తలంలో ఏర్పడే ఇతర యంత్రాలన్నిటికీ ఈ త్రికోణమే నిర్ణాయక అధికారాన్ని వహిస్తుంది. అంటే ఆ తలంలోని ఇతర యంత్రాలన్నిటికీ ఇది ఆది పూజ్యమవుతుంది. అందుకే గణేశుడు ఆదిపూజ్యుడు.
ఈ విధంగా పురాణాలలో వర్ణింపబడిన గణపతి రూపాలన్నిటికీ వైజ్ఞానిక ప్రాతిపదికలను పరిశోధించినకొద్దీ మనం దర్శించగలుగుతాము.
ఏకవింశతి పత్ర పూజ
ఇక వరసిద్ధి వినాయక వ్రతంలో ఏకవింశతి పత్ర పూజకు చాలా ప్రముఖ స్థానం వుంది. గనుక, ఆ 21 మూలికాపత్రాలలోని వైద్య విశేషాలను ఆయుర్వేదానుసారంగా రేఖామాత్రంగా పరిచయం చేసుకుందాం.
1. మాచీపత్రం- మాచిపత్రి (Artemisia Indica :- దీని ఆకులు, వెన్నుల కషాయం వ్రణాలు, దద్దుర్లు, కుష్ఠులు, వాతాలు పోగొడుతుంది. మనసునకు వికాసం కలుగచేస్తుంది. ఈడ్పు రోగాలు, నరాల రోగాలు పోగొడుతుంది. వరుస జ్వరము, అగ్నిమాంద్యము (Dyspepsia), మూర్ఛ, అపస్మారము, ఋతుబద్ధములను నివారిస్తుంది.
2. బృహతీపత్రం - నేలములక (Solanum Jacquinii) :- దీనిలో పసుపు, తెలుపు, నలుపు కాయలుగల జాతులున్నాయి. తెల్లని శ్రేష్ఠము. దీని సమూల కషాయంగాని, చూర్ణం గాని కారము, చేదుగ వుంటుంది. జఠర దీప్తినిస్తుంది. త్రిదోషములను హరిస్తుంది. శే్లష్మము, దగ్గు, జ్వరము, హృద్రోగము, ఆమదోషము, మలబద్ధములను హరిస్తుంది.
3. బిల్వపత్రం- బిల్వము: మారేడు (Aegel Marmelos) :- ధీని ఆకురసము లేక కషాయము చలువ, మేహశాంతి, పైత్యశాంతి చేస్తుంది. జఠర దీప్తినిస్తుంది. అగ్నిమాంద్యము, విచారపు పిచ్చి, అజీర్ణపు పిచ్చి, తాపము, మూత్రకృఛ్రములను హరిస్తుంది. గుండెదడ, విరేచన బద్ధములను పోగొడుతుంది. వేరు గంధము సర్పవిషాన్ని హరిస్తుంది. ఆకు కషాయము ఉబ్బసాన్ని, వమనాన్ని అణస్తుంది. పువ్వులు నీళ్ళలో ఊరబెట్టి కాచి తీసిన అరఖు విషాన్ని, కలరా మొదలైన అంటువ్యాధులను పోగొడుతుంది.
4. దూర్వాయుగ్మం- గరికి (Cynodon dactylon) :- దీని వేళ్ళరసము లేక కషాయము చలువ చేస్తుంది. విసర్పి, రక్తదోషము, విదాహము, క్రిమిరోగము, మూత్రదోషము, పైత్యము, కఫము, తాపములను పోగొడుతుంది.
5. దత్తూర పత్త్రం- ఉమ్మెత్త (Datura Metel & Datura Alba)) :- దీని ఆకు, కాయ మొదలైనవి వగరు, చేదు, తీపి రుచులుగా ఉంటాయి. మత్తు, పైత్యము, కాక చేస్తాయి. కుష్ఠురోగము, వ్రణము, దురదలను పోగొడుతుంది. దీని సమూలమును ఎండించి ముక్కలు, ముక్కలుగ కొట్టి పొగపీల్చుకొంటే ఉబ్బసదగ్గు (Asthma) తగ్గుతుంది. దీని ఆకులను కాచిన ఆముదంలో వేసి వడలించి రెండుమూడు పొరలుగ క్రొత్తగా లేచిన గడ్డలపై వేస్తే అవి శీఘ్రంగా హరించిపోతాయి.
6. బదరీపత్రం- రేగు ఆకు (Zizyphus jujuba) :- దీని చెక్క రసమ లేదా కషాయము వగరుగ ఉంటుంది. కాక చేస్తుంది, బలమిస్తుంది. వాతము, అతిసారము, రక్తదోషములను హరిస్తుంది. దీని ఆకును నీళ్ళతో దంచి కవ్వముతో చిలికి అందులో వచ్చిన నురుగును పూస్తే కాళ్ళు, చేతుల మంటలు హరిస్తాయి.
7. అపామార్గపత్రం- ఉత్తరేణి (A chyranthes Aspera & A Bidentata):- దీని సమూల రసము లేక కషాయము, వెగటుగ, చేదుగ వుంటుంది. గురదాల (జజూశళకఒ) పైన పనిచేస్తుంది. త్రిదోషాలను, జిహ్వదోషము, పైత్యము, కఫము, ఉబ్బు, రక్తమూలము, శూల, పొక్కులు, గజ్జి, కుష్టు వీనిని జయిస్తుంది. మూత్రమును కలిగిస్తుంది. దీని విత్తులను నీళ్ళతో నూరిగాని, చూర్ణము చేసి నీళ్ళతోగాని యిచ్చిన వెర్రికుక్క విషసంధి (Hydrophobia), సర్పవిషము, నేత్ర రోగములు, చర్మరోగములు పోతాయి. దీని పూత వెన్నులను కొద్దిగా పంచదార వేసి నూరి మాత్రలుగ చేసి వెర్రికుక్క కరచిన వారికిస్తే దాని విషము హరిస్తుంది.

ఇంకావుంది...
----------------------------------------------------
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

--కుప్పా వేంకట కృష్ణమూర్తి