డైలీ సీరియల్

పచ్చబొట్టు-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తలనొప్పిగా ఉందా? అలా ఉన్నావేం?’’
‘‘ఏం లేదు. బాగానే ఉన్నాను’’ అంది విద్య వినీల్ దగ్గర బయటపడడం ఇష్టంలేక.
‘‘విద్యా! నీ గురించి నాకు తెలియదా? ఏదో ఉంది. ఏమీ లేకపోతే మా విద్య ముఖం ఇంత చిన్నబోతుందా? నాతో చెప్పకూడదా’’
‘‘అలా ఏం లేదు’’ తప్పించుకోబోయింది.
‘‘మరి చెప్పమ్మా!’’’
‘‘అన్నయ్య నాతో అబద్ధమాడాడు. అది నేను సహించలేకపోతున్నాను’’.
‘‘ఏమని?’’
‘‘పట్టుబడ్డ పచ్చబొట్టు అసలు పచ్చబొట్టు కాదన్నాడు. అంతవరకూ కరెక్టే. అసలు పచ్చబొట్టు తెలిస్తే కదా ఈమె ఆమె కాదని తెలిసేది. అంటే పచ్చబొట్టు తెలియదని చెప్పటం అబద్ధమే కదా!’’
‘‘ఓ అదా! ఆమె పచ్చబొట్టు కాదన్నాడు కానీ పచ్చబొట్టు తెలుసని చెప్పలేదుగా. నువ్వే ముందు ఊహించుకొని అలా అన్నయ్యను అనుమానిస్తే ఎలా? పచ్చబొట్టు గురించి తెలిస్తే ముందు చెప్పేది మనకే కదా!’’’
‘‘ఉహూ! ఇందులో ఏదో లొసుగు ఉంది. అదేమిటో అన్నయ్యకే తెలియాలి’’
‘‘అదేం లేదు విద్యా! నువ్వేదో అనుకుని అనే్వష్‌ని బాధపెట్టకు. ఏదైనా ఉంటే ఎదురుగా అడుగు. అంతేకానీ మాటలు ఆపేస్తే ఎంత బాధపడతాడు? అసలే అమ్మా నాన్న పోయిన దుఃఖంలో ఉన్నాడు. నువ్వూ ఇలా చేస్తే ఇక ఏకాకిననుకొని బాధపడడా? మీ ఇద్దరి మధ్య సయోధ్యకు నేను రావాలా? ఏమన్నా బాగుందా? అయినా ఎవరో పరాయి మనిషి గురించి అన్నయ్యతో పోట్లాటా?’’
‘‘ఏమో! పచ్చబొట్టు పరాయిలా అనిపించటంలేదు. అలా అని అన్నయ్య కంటే ఎక్కువని చెప్పను. ఆమె అంటే ఆరాధన. ఎంతంటే అన్నయ్య ఆమెను చేసుకుంటే సుఖపడతాడనేంత. ఆమె విషయంలో ఏ చిన్న అబద్ధం చెప్పినా నేను సహించలేను. అలాంటిదేదో జరుగుతోందేమోనని అనుమానం వచ్చింది. అసలు ఈ పచ్చబొట్టు విషయంలోనే కాదు ఏ విషయంలోనూ అబద్ధం చెప్పటం నేను సహించను. నిజం ఎంత నిష్ఠూరం అయినా భరిస్తాను. అయినవాళ్ళనుంచీ ఇలాంటివి అసలు తట్టుకోలేను’’.
‘‘సరే విద్యా! నీకు చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీకెలా చెయ్యాలనిపిస్తే అలా చెయ్యి. అనే్వష్ డాబామీద ఉన్నాడు’’ అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్లిపోయాడు.
వెంటనే విద్య డాబామీదకు వెళ్లటానికి మెట్లు ఎక్కటం గమనించి ‘అమ్మయ్యా!’ అనుకున్నాడు. తను వెళ్ళేకంటే విద్య వెళితేనే అనే్వష్‌కి సంతృప్తి. ఇప్పుడైతే ఇద్దరూ రాజీపడతారు.
అనే్వష్ దిగులుగా కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు.
అన్నయ్యను అలా చూసేటప్పటికి దిగులేసింది. తనేనా ఇలా ప్రవర్తించింది. వాడిని బాధపడకుండా చూసుకోవాలనుకొని తనే బాధపెడుతుందో! ఆ బాధ తనే తొలగించాలి.
‘‘సారీరా! అన్నయ్యా!’’ అంది ప్రక్కనే కూర్చుంటూ.
బాధను ఆపుకోలేక, అది చెల్లి గమనించటం ఇష్టం లేక రెండు మోకాళ్ళమధ్య తల దూర్చేశాడు.
‘‘ఇంకెప్పుడూ ఇలా చెయ్యను, సరేనా?’’
అయినా మాట్లాడలేదు అనే్వష్. దుఃఖాన్ని ఆపుకోవటం అతనికి కష్టవౌతోంది. అందుకే తల ఎత్తేసాహసం చెయ్యటంలేదు.
చెల్లి ముందు బయటపడటం అసలు ఇష్టంగా లేదు. పచ్చబొట్టు మీద పిచ్చికోపం వస్తోంది. తను ఎందుకలా చెప్పాలి? చెల్లితో తన విషయం చెబితే ఏవౌతుంది? ఇపుడు చెల్లి అడిగితే ఏం సమాధానం చెప్పగలడు? అందుకే ఈ వౌనం
‘‘క్షమించు అన్నయ్యా! నువ్వు మాట్లాడకపోతే నేను వెళ్లిపోతాను’’.
వెంటనే తల ఎత్తాడు. చీకట్లో అతని కళ్ళలో నీరు.. తళతళా మెరుస్తూ. స్వచ్ఛమైన నదిపైన నీటి మెరుపులను తలపిస్తూ.
‘‘వద్దురా! నువ్వలా బాధపడితే చూడలేను.. ప్లీజ్’’ అంటూ అనే్వష్ కళ్ళు తనే తుడిచింది.
‘‘చెల్లీ!’’ అంటూ ఆమె ఒడిలో తల దాచుకున్నాడు.
‘‘నేనే నీకు సారీ చెప్పాలిరా! పచ్చబొట్టు పట్టుబడేవరకూ నన్ను వదిలెయ్, నా విషయం పట్టించుకోకు. ఇంతకంటే ఏం చెప్పలేను’’.
‘‘సరేలే! ఒప్పుకుంటున్నాను. నినే్నమీ అడగను. ఇబ్బంది పెట్టను. రా! క్రిందకు వెళ్దాం!’’
‘‘కాసేపయ్యాక వస్తాను’’
‘‘కుదరదు.. ఇద్దరం కలిసే వెళదాం’’
ఇక తను లేకుండా వెళ్లదని అర్థమై విద్యతోనే క్రిందకు దిగాడు. అది చూసి వినీల్ ఎంతో ఆనందించాడు.
***
భూగోళంలో భయభ్రాంతులు
పారిస్‌లో పచ్చబొట్టు పడగానే వివిధ దేశాలలో వున్న భారతీయులంతా అప్రమత్తమయ్యారు. పచ్చబొట్టు పేరు చెబితే గడగడలాడుతున్నారు. పరాయి చోట ఉన్నామని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నవారంతా తమంత తామే లక్షణ రేఖలను గీసుకుంటున్నారు. ఎయిడ్స్ గురించి భయపడేవారంతా ఇపుడు పచ్చబొట్టుని తలుచుకొని దడదడలాడుతున్నారు. ఇంత మార్పుకు కారకులైన పచ్చబొట్టును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం అంటూ పత్రికలో రాసిన వార్తలను కంప్యూటర్‌లో చదువుతున్న ‘చామంతి’ మరోసారి పచ్చబొట్టుకు ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంది.
పెద్ద సాడిస్ట్‌గా పేరుతెచ్చుకున్న తనభర్తను ఏ సైకియాట్రిస్ట్‌లు మార్చలేకపోయారు. వాళ్ళను దగ్గిరకే రానివ్వలేదు. కానీ ఎక్కడోదూరంగా ఉండి పచ్చబొట్టు చేసిన చిన్న ప్రయోగం అతనిలో మార్పు తెచ్చింది. ఇది తను ఈ జన్మలో ఊహించనిది. తన బ్రతుకు బండి గాడిలో పడింది. ఆమెకు ఏమిచ్చినా ఋణం తీరదు. ఆవిడెవరో తెలిస్తే దేవుని మందిరంలో ఆమె పటాన్ని కూడా చేర్చి పది కాలాలు చల్లగా ఉండాలని పూజ జేస్తాననుకొంది.
ఆమే కాదు అలా ఎందరో.. ఎందరెందరో దేవతగా కొలుస్తున్నారు. ఆమెను చూడాలని తసతహలాడుతున్నారు. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
***
అనే్వష్ స్టేషన్ ఏఎస్‌ఐ ఆనందరావుతో పచ్చబొట్టు గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఇంతలో సెల్ రింగయింది.
హైదరాబాద్ నుంచి కాల్.
‘‘అనే్వష్! నేనురా ‘రాంకిరణ్’ని. నీకో గుడ్ న్యూస్’’.
‘‘ఏమిటది?’’
‘‘పచ్చబొట్టుమీద కేసు వేసిన ‘ప్రేమ్’ ఇక్కడ తన కేసును విత్‌డ్రా చేసుకున్నాడు. పచ్చబొట్టు అందరిలో తెస్తున్న మార్పు తనకు కనువిప్పు కలిగించిందని ఆ కారణంగానే కేసు విత్‌డ్రా అవుతున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు. ఇక మీ ఊరుదే మిగిలింది. వాళ్ళు కూడా విత్‌డ్రా అయితే పచ్చబొట్టు పట్టుబడినా బయటకు వచ్చెయ్యచ్చు. అది చెబుదామనే. బాయ్’’
అనే్వష్‌కా వార్త ఎంతో సంతోషాన్ని కలిగించింది. సగం బాధ తీరిపోయినట్లయింది. ఈ వార్త కేసు మీద హోప్స్‌ని పెంచుతోందనిపిస్తుంది. కాసేపు అలా ఉత్సాహపడినా మరు నిముషం శూన్యంలో వెలుగు కోసం వెదుకుతున్నట్లుంది తన పరిస్థితి అనిపిస్తుంది.
ఈ మధ్య పచ్చబొట్టు నుంచి కబర్లు లేవు. ఉత్తరాలు లేవు. రాంకిరణ్ తన క్లాస్‌మేట్ కావడంతో పచ్చబొట్టు గురించి ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవాడు. తమ మధ్య రహస్యాలు లేవు. ఉన్నది ఒక్కటే పచ్చబొట్టు రహస్యం. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206