డైలీ సీరియల్

పచ్చబొట్టు-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చబొట్టు లొంగుబాటు
హాయ్ ఫ్రెండ్స్!
నన్ను చూడాలని ఎప్పటినుంచో కలవరిస్తున్నారుగా. అందుకే మీ మందుకు వస్తున్నా! ఎక్కడ నా ఉద్యమాన్ని ఆరంభించానో అక్కడే ముగించాలని. నేను దీన్ని ప్రారంభించగానే వేల వేల చేతులు తామున్నామంటూ వారి సహాయన్నా నాకు అందించారు. వారందరికీ నా అభినందనలు! కృతజ్ఞతలు! భారతీయులుగా మనం మంచికి ప్రతిరూపాలుగానే భాషించాలని నా సహోదరులంతా ఆలోచిస్తున్నారు. అదే నేను వారినుంచి ఆశించినది.
అందుకని నా ప్రయత్నాన్ని విరమింపచేస్తున్నా. పచ్చబొట్టు మరో లక్ష్మణరేఖలా చరిత్రలో గుర్తుండిపోతుందని నమ్మకం. ఆ నమ్మకమే మీ అందరికీ టాటా! టా! చెప్పమంటోంది. కోర్టులో కలుద్దాం! మంగళవారంనాడే!
మీ
పచ్చబొట్టు
అన్ని పేపర్లలో ఆ వార్త రావటంతో మంగళవారం ఉదయానికే కోర్టు ఆవరణ అంతా ఇసుకేస్తే రాలనంత జనాలతో నిండిపోయింది.
ఆ రోజు కోర్టుకు వినీల్, విద్య కూడా బయలుదేరు. పచ్చబొట్టును చూడాలనే ఉత్కంఠ లేనిది ఎవరికి? అనుకోకుండా తృప్తి వచ్చి వారితో జాయిన్ అయింది నేను కూడా స్టేషన్‌కి వస్తానని. తృప్తి రావటం ఆనందం కలిగించినా పచ్చబొట్టును తెలుసుకోలేకపోయాననే అసంతృప్తి అతన్ని వెన్నాడుతోంది.
‘‘సరే! స్టేషన్‌కు వెళ్లి అటునుంచీ కోర్టుకు వస్తాను. అక్కడ కలుద్దాం’’ అని తన బైక్‌మీద వెళ్లిపోయాడు అనే్వష్.
తను లొంగిపోతే తన దగ్గిరకే వస్తానందిగా. అంటే స్టేషన్‌కి వస్తుందా? ఏం చేస్తుంది? కోర్ట దగ్గిరే కలుస్తుందా? అంతా సస్పెన్స్.
కోర్టుకెళ్లాల్సిన టైము వరకూ అలా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏమీ జరగలేదు. బయలుదేరాడు. కోర్టు బయట తన కోసం ఎదురుచూస్తున్న వినీల్ దగ్గరకు చేరాడు. ఇంకా సమయం ఉండటంవలన కాసేపు వాళ్ళ దగ్గిరుండి అందరినీ తీసుకొని లోపలికి వెళదామనుకున్నాడు.
ఈలోపు వినీల్ అనే్వష్! ఎప్పటినుంచో నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. అడగలేకపోతున్నాను. అసలే పచ్చబొట్టు టెన్షన్‌లో ఉన్నావ్! ఇపుడు అడగచ్చో లేదో కూడా తెలియదు. అయినా అడగకుండా ఉండలేకపోతున్నాను. విద్య లేనపుడు అడగాలని. అందుకే కుదరలేదు’’.
‘‘అడుగు వినీల్. ఈ టెన్షన్స్ ఎప్పుడూ ఉండేవేగా’’
‘‘ఆ రోజు తృప్తిని నేను ప్రపోజ్ చేస్తే కామ్‌గా ఉన్నావేం? తృప్తి అంటే నీకిష్టంలేదా? మరి అద్దంలోంచి ఆ చూపులేమిటి? నీ పాంట్‌లోనుంచి చనువుగా తృప్తి ఏదో తీసుకవోడమేమిటి? ఏమీ లేకపోతే..’’
ఇక అతన్ని మాట్లాడనివ్వలేదు అనే్వష్ షార్ప్‌బ్రెయిన్.
‘‘ఏమన్నావ్? తృప్తి నా పాంట్‌లోంచి కాగితం తీసిందా?’’
‘‘అవును. నీకు తెలుసనుకుంటున్నాను. ఆ ఓజు జ్యూస్ త్రాగాంగా నాయుడుపేటనుంచీ వచ్చినపుడు’’.
అతని వాక్యాన్ని పూర్తిగా వినలేదు. విద్య వాళ్ళవైపు పరుగెత్తాడు.
తృప్తి దగ్గరగా వెళ్లాడు.
నేను గెలిచాను అనటం.. లొంగిపోతున్నాను అని ఆమె అనటం ఒకేసారి జరిగాయి.
ప్రక్కన విద్య వంతయ్యింది ఆశ్చర్యపోవటం. ఇంతలో వినీల్ కూడా ప్రక్కన చేరాడు. అప్పుడు తెలిసింది తృప్తే పచ్చబొట్టని వాళ్ళిద్దరికి.
అనే్వష్ ఆనందం పట్టలేకపోతున్నాడు. ఇన్నాళ్ళూ తన వెంట ఉన్న అసంతృప్తి గాలిలోకి బెలూన్‌లా ఎగిరిపోయింది మనసంతా తృప్తితో నిండిపోయింది. పచ్చబొట్టును తలుచుకుంటే ఉండే ఆనందం ‘తృప్తి’ విషయంలోనూ జరగటంతో కలవరపడ్డాడు కానీ ఆమె ఈమె అనుకోలేదు. ఆ విషయం తన మనసుకు తెలుసు. తనకే తెలియలేదు. తనకు తెలియకుండా తన ప్యాంటు జేబులోని ఉత్తరం కొట్టేసిందనగానే అర్థమయింది ఆమె పచ్చబొట్టు అని. భార్యాభర్తలమధ్య, ప్రేయసీ ప్రియులమధ్య గెలుపు, ఓటమి ఉండవంటారు. సరిగ్గా అదే జరిగింది ఇద్దరి విషయంలో.
కోర్టు టైమవటంతో అనే్వష్.. అనే్వష్ వెంట ‘తృప్తి’ నడుస్తున్నారు.
విలేకరులు అంతా దూరంలో నిలబడి ఉన్నారు. పోలీసు బలగాలు వారినెవ్వరినీ లోపలికి రానివ్వటంలేదు. ముందు జాగ్రత్త చర్యగా స్పెషల్ స్క్వాడ్‌ని పిలిపించారు. జనంలో తొక్కిసలాట పోగొట్టడానికి కోర్టులో జరిగేది ప్రత్యక్ష ప్రసారమయ్యేట్లు ఓ టీవీని కోర్టు బయట ఉంచారు. మధ్యమధ్య స్పీకర్స్ ఏర్పరిచారు.
కేసు విచారణ ప్రారంభమైంది.
పచ్చబొట్టు, పచ్చబొట్టు, పచ్చబొట్టు అని మూడుసార్లు పిలిచారు.
అపుడు అనే్వష్ వెంట రాగా తృప్తి బోను దగ్గరకు వెళ్లింది.
బోనులోకి వెళ్ళగానే జడ్జిగారికి నమస్కరించింది. అలాగే ఇటు తిరిగి అందరికీ నమస్కరించింది.
కోర్టు లోపల, బయట ఒకటే నినాదం ‘‘పచ్చబొట్టు జిందాబాద్! పచ్చబొట్టు జిందాబాద్’’ అంటూ.. అయిదు నిమిషాల దాకా వారి ఆనందం ఆగలేదు.
ఆఫీసులకు సెలవులు పెట్టి, పనులు ఆపుకొని చిన్నా పెద్దా, ముసలి, ఆడ, మగ ఆ ఊరివారే కాకుండా ఎన్నో ఊర్లనుంచీ ఎంతమందో ఆమెను చూడాలని పనిగట్టుకుని వచ్చారు.
పచ్చబొట్టు స్ర్తి అని ఊహించారు కానీ ఇంత చిన్న వయసని ఎవరికీ తట్టలేదు. మెరుపుతీగలా మెరిసిపోతున్న ఆమె ఆందం ఓవైపు, హిమాలయ శిఖరాల వంటి వ్యక్తిత్వం మరోవైపు అంచుతో ప్రత్యేక ఆకర్షణగా ఆమెను నిలబెడుతోంది మరి.
హర్షధ్వానాల హోరు ఆగటంలో కోర్టు ఆవరణంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పచ్చబొట్టు నోట్లోంచి ఊడిపడే ఆంముత్యాలని ఏరుకోవాలని ప్రతి హృదయం తపనపడుతోంది.
లాయర్ పచ్చబొట్టుతో భగవద్గీతమీద ప్రమాణం చేయించారు.
తర్వాత తన విచారణ ప్రారంభించారు.
‘‘మీ పేరు?’’
‘‘నా పేరు తృప్తి. ఈ ఆపరేషన్‌కి నేను పెట్టుకున్న పేరు పచ్చబొట్టు.’’
‘‘అంటే మీరు పచ్చబొట్టంటే ఒప్పుకుంటున్నట్లేనా?’’
‘‘అవును.. నేను పచ్చబొట్టునే’’.
‘‘ఇలా మగవారి బుగ్గలపై పచ్చబొట్టు పొడవటం మీకు తప్పనిపించలేదా?’’
‘‘లేదు. ఇంకా న్యాయమనిపించింది. అనాదిగా స్ర్తికి జరిగే అన్యాయంతో పోల్చుకుంటే ఇది చాలా స్వల్పమనిపించింది’’.
‘‘అసలు పచ్చబొట్టు పొడిచే అధికారం మీకెవరిచ్చారు?’’
‘‘మగవారికెవరు అధికారం ఇచ్చారని ఆడవారికీ ఒక మనసుంటుందని ఆలోచించకుండా అనుక్షణం వారిని ఆవేదనలో ముంచుతున్నారు? ఆ అధికారం వారికెవరు ఇచ్చారో నాకూ వారే ఈ అధికారం ఇచ్చారు’’ తడుముకోకుండా సమాధానమిచ్చింది.
ఆ సమాధానాన్ని హర్షిస్తున్నట్టు ఎన్నో చేతులు అభినందనల చప్పట్లు వినిపించాయి. లైవ్ ప్రోగ్రామ్‌గా తిలకిస్తున్న వాళ్లు కూడా తమ చేతులు కలిపారు టీవీల ముందునుంచే.
‘‘మీరొక్కరే ఇదంతా చేసారా? లేక ఇంకెవరైనా సహాయపడ్డారా? ఎంతమంది?’’ -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206