డైలీ సీరియల్

పచ్చబొట్టు-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సంఖ్య ఒంటరి అంకెల్లోంచి పదుల్లోకి, వందల్లోకి, వేలల్లోకి పాకింది. ఇంతమంది ఈ ఉద్యమంలో పాల్గొన్నా ఒక్క విషయం కూడా బయటకు రాకుండా చూసుకున్నాం. అదే మా ఆడవారి గొప్పతనం!
నిజంగా మేము విజృంనించాలనుకుంటే మీ మగవారే కాదు ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు.
మేము ప్రజలలో ఏ మార్పు కావాలనుకున్నామో ఆ మార్పును తీసుకొచ్చాం. ఆ మార్పు శాశ్వతమని మా నమ్మకం. ఈ తృప్తి మాకు చాలు. ఇక నేను చెప్పుకోవాల్సిందేమీ లేదు అంటూ ముగించింది తృప్తి.
కోర్టులో జడ్జి తనను తాను మరిచారు ఒక్క క్షణం. తర్వాత ఆలోచించుకొని తీర్పు చెప్పబోయేలోపు పరమానందం భార్య భానుమతి తనకు మాట్లాడే అవకాశమివ్వమని కోరింది. తనలో ఈ మార్పు తీసుకొచ్చిన అనే్వష్‌కు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ.
జడ్జి ఒప్పుకోవటంతో ఆమె బోనుకి వచ్చి ‘‘దయచేసి నా తప్పును మన్నించండి. మా ఆయన బలవంతంమీద ఈ పచ్చబొట్టుమీద కేసు వేశాను. కానీ ఆ రోజునుంచీ నాకు మనశ్శాంతి లేదు. ఈ రోజు తనకు ఏ సంబంధం లేకున్నా మన అందరిలో మార్పు రావాలని చేసిన ఆమె ప్రయత్నం విన్నాక కూడా నేను మారకపోతే అర్థం లేదు. నా భర్త లాంటివాళ్ళు లేకున్నా బాధలేదు. ఇలా సమాజానికి ఉపయోగపడేవాళ్ళు జైళ్లలో మగ్గటానికి వీల్లేదు. అందుకే నేను వేసిన కేసును నేనే విరమించుకుంటున్నాను. నాకీ అవకాశం ఇచ్చి నాకు శాంతిని చేకూరుస్తారని ఆశిస్తాను’’ అని అనటంతో జడ్జిగారి చేతిలో పెన్ను పక్కన పెట్టారు.
ఈ కాలం వాళ్ళకిపచ్చబొట్టు లాంటి వాళ్ళు ఎంతో అవసరమని, ఒక జడ్జిగా ఆ మాట చెప్పలేకపోయినా ఒక భారతీయ పౌరునిగా ఆమెను, ఆమె స్నేహితురాళ్లను, ఆమెకు సహకరించిన అందరినీ అభినందిస్తున్నాను అన్నారు.
‘పచ్చబొట్టూ జిందాబాద్’ అనే అరుపులతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగింది.
కోర్టు బయట తనకోసం ఎదురుచూస్తున్న అందరికీ అభివాదం చేసింది పచ్చబొట్టు.
ఓ అద్భుతమైన వ్యక్తిని చూస్తున్న ఆనందం అందరి కళ్లలో.
ఓ వింతను పరికిస్తున్న అనుభూతి వారి చూపు వెలుగుల్లో.
తృప్తి మరో చెయ్యి అనే్వష్ చేతిని విడువలేదు.
వినీల్, విద్య ఎప్పుడు బయటికి వెళ్ళారో ఎవరికీ తెలియదు.
రెండు పూల దండలతో క్షణాలలో ప్రత్యక్షమయ్యారు.
ఇంతమంది అభిమానుల మధ్య వీరు దంపతులవ్వాలని మా కోరిక అని ప్రకటించింది విద్య.
తృప్తి సిగ్గుల మొగ్గే అయ్యింది. ఎక్కడెక్కడికో వెళ్లి విహారం చేస్తున్న సిగ్గు ఆమె బుగ్గలపై లాస్యమాడటం ప్రారంభించింది.
అనే్వష్ చిలిపిగా నవ్వాడు.
వినీల్ అనే్వష్‌కు పూలదండ అందించాడు. విద్య తృప్తికి అందించింది. ఇద్దరూ దండలు మార్చుకున్నారు.
పచ్చబొట్టుని చూడాలని వచ్చినవారిలో ఉన్న పూజారిగారు మంత్రాలు చదివి తన దగ్గిరున్న అక్షింతలతో వారిని ఆశీర్వదించటమే కొసమెరుపు.
అభిమానుల తప్పట్లు తాళాల సంగతి అందరికీ తెలిసిందే!
***
మంచి ముహూర్తాన తృప్తి మెళ్లో తాళి కట్టాడు అనే్వష్.
పది నిమిషాల తేడాలో ప్రక్క వేదిక మీద కూర్చున్న వధూవరులిద్దరికీ వివాహం జరిపించారు పెళ్లి పెద్దలుగా కన్యాదానం చేసి మరీ. విద్య, వినీల్ ఆ జంటకి నమస్కరించారు.
అలా ఆ రెండు జంటలనూ చూద్దామని వచ్చిన వారి కళ్లకి పండగే.
****
ఆ రాత్రి వెనె్నలతో పోటీపడుతున్న తృప్తిని చూస్తూ.
‘‘ఈ అమాయకపు ముద్దుగుమ్మ పచ్చబొట్టంటే ఇప్పటికీ నమ్మబుద్ధికావటంలేదు’’ అన్నాడు అనే్వష్ ఆమె ముంగురులను సవరిస్తూ. అవి చంద్రునితో ఆడుకొనే మేఘాలలా.. ఆమే మళ్లీ మేఘాలలో ఆడుకునే చంద్రునిలా కన్పించి కన్విస్తుంటే..
సమాధానం చెప్పనన్నట్లుగా అతని ఎదపైన తలదాచుకుంది తృప్తి తృప్తిగా. ( సమాప్తం )

-యలమర్తి అనూరాధ 9247260206