డైలీ సీరియల్

అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సీరియల్ ప్రారంభం
*
తెల్లవారు ఝాము ఐదు గంటలు కావస్తూంది సమయం.
ముందు వరండాలో కుర్చీ వేసుకుని, రెయిలింగ్ మీద కాళ్లు పెట్టుకుని రోడ్డుకేసి చూస్తూ కూర్చున్నాడు అనిరుధ్. అప్పటికే చలి వెళ్లిపోయి వేసవి ప్రవేశిస్తున్నట్లుంది వాతావరణం.
ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే భాగ్యనగర్‌లో వాతావరణం అంత తీవ్రంగా అనిపించదు. ఇక్కడ ముందుగా వేసవి వస్తుంది. ముందుగా శీతాకాలమూ వస్తుంది. అది ఒకప్పటి మాట.
ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పర్యావరణ పరిస్థితులు కారణంగా ఇక్కడి వాతావరణంలోనూ మార్పు వస్తోందని భాగ్యనగర్ వాసులు అంటూంటారు.
నానాటికీ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, లెక్కకు మించి వాహనాల కారణంగా పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణంలో ఈ మార్పులు సంభవిస్తున్నాయని పర్యావరణవేత్తలు విశే్లషిస్తున్నారు.
దీనికితోడు పెరుగుతున్న జనాభాకి ఎక్కడలేని వసతులూ సరిపోవడం లేదు. చిట్టడవులు, అడవులు సైతం మాయమైపోయి కాంక్రీట్ జంగిల్‌గా తయారవుతున్నాయి. చెట్లు పెంచమని శాస్తజ్ఞ్రులు గగ్గోలు పెడుతున్నా వినిపించుకునే నాధుడు లేడు.
ఏది ఏమైతేనే రుతు ధర్మాలు మారిపోయాయి. పేరుకే ఆరు రుతువులు. అనుభవంలోకి వచ్చేసరికి వేసవికాలం, శీతాకాలం అన్నట్లు రెండు రుతువులే కనిపిస్తున్నాయి. ఏ వాయుగుండమో, అల్పపీడనమో వస్తే మేఘాలు అలా నీరు చిలకరించినట్లు విదిలించి వెళుతున్నాయి. కురిస్తే కుంభవృష్టి, లేదంటే అనావృష్టి అన్న చందంగా మారిపోయింది వాతావరణం.
నగరవాసులకివేం పట్టవు. పట్టించుకునే ఓపికా, తీరికా వారికి లేవు. షాపుకి వెళ్లినపుడు మాత్రం విసుక్కుంటూ, సణుక్కుంటూ, పాలకుల్ని తిట్టుకుంటూ నిరసన తెలియజేస్తారు.
అనిరుధ్ కూడా ఆ జాతివాడే. అతడికి కిలో కిందిపప్పు ధర కాని, కిలో వంకాయ ధర కానీ తెలీదు. తెలుసుకోవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే అతడు రోజూ భోజనం చేసేది మెస్సులో. బోరుగా అనిపిస్తే ఏదైనా పెద్ద హోటల్లో డిన్నర్ చేస్తాడు.
అతడు ఓ ఐదేళ్ళు యుఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేసి రెండేళ్ల క్రిందటే ఇండియా వచ్చేశాడు.
డబ్బు సంపాదన వరకూ అతడికి అమెరికా బాగానే అనిపించింది. కానీ ఆ ఐదేళ్లలో అతడికి అక్కడ ఓ మంచి స్నేహితుడు దొరకలేదు. మనసు విప్పి మాట్లాడుకునే ఆత్మీయులెవరూ దొరకలేదు.
ఏదో భేషజం.. అతిశయం.. ఆడంబరం.. ఈ మాస్క్‌లు తగిలించుకున్న మనుషులు. వీడు ఎంత సంపాదిస్తున్నాడు?ఎంత వెనకేసుకుంటున్నాడు? అన్న ఎక్స్‌రే కళ్లతో చూపులు! ఇది అతడి భ్రమే కావచ్చు. అతడికి సన్నిహితులు దొరక్కపోవడం అతడి బిడియపు మనస్తత్వమే కావచ్చు. కానీ అతడు ఆ రకమైన భావనతో చాలా ఇబ్బంది పడ్డాడు.
అందుకే అనిరుధ్ అక్కడ ఉండలేకపోయాడు. వేల కిలోమీటర్ల దూరంగా తనవాళ్లని వదలి తను ఇక్కడ ఎందుకు ఉండాలి? పదే పదే ప్రశ్నించుకున్నాడు. అతడికి సమర్థించుకునే సమాధానం దొరకలేదు.
తనవాళ్లంటే అనిరుధ్‌కి పెద్దగా బలగం ఉందని కాదు. పేరుకి మేనమామ, మేనత్త ఉన్నారు. అలాగే ఓ పిన్నమ్మ, బాబాయ్ ఉన్నారు. కానీ అనిరుధ్ దృష్టిలో వాళ్ళెవరూ ముఖ్యులు కారు. రెక్కలు ముక్కలు చేసుకుని, తనను పెంచి పెద్దచేసిన అమ్మమ్మే తనకి సర్వస్వం.
వార్థక్యంలో వున్న ఆమెను అలా వదిలేసి, తను వేల కిలోమీటర్ల దూరంలో, డబ్బు సంపాదనకోసం ఉండడం సమంజసంగా అనిపించలేదతడికి. అసలు తను అమెరికా వెళ్లిందే ఆమె ఒత్తిడి మీదనే
‘ఒరే అనిరూదూ! నువ్వు బాగా సదూకోని అమెరికా యెల్లాలిరా.. బోల్డు డబ్బు సంపాయించాలిరా! నేను సూడాలిరా!.. అని ఆమె పదేపదే అంటూంటే తనకీ పట్టుదల పెరిగింది. దీక్షగా చదివాడు. మంచి ర్యాంకులు సంపాదించి, స్కాలర్‌షిప్పులు సాధించి మరీ చదివాడు. ‘నీకు బగమంతుడు ఏమీ ఇవ్వకపోయినా అచ్చరం ముక్క యిచ్చాడ్రా’ అంటూ ఆమె మురిసిపోయేది.
ఆమె కోరిక తీరింది. అనిరుధ్ అమెరికా వెళ్లాడు. రెండు చేతులా సంపాదించాడు ఆమె చేతికి మురుగులు చేయించాడు. మెడలో ఓ బంగారు గొలుసూ చేయించాడు. ఆమె పరమానందభరితురాలయ్యింది. ఇక అక్కడ చాలనుకున్నాడు.
అంత కాకపోయినా వేలల్లో చెప్పుకోదగ్గ జీతం ఇండియాలో, ప్రత్యేకించి భాగ్యనగర్‌లో దొరుకుతుందని అతడు యుఎస్ వదిలి వచ్చేశాడు. అతడు ఆశించినట్లుగానే ఎనభై వేలతో భాగ్యనగర్‌లో ఉద్యోగమూ దొరికింది.
అమెరికాలో ఉండగా కొంతలో కొంత తనతో సన్నిహితంగా మెలగిన ఓ మిత్రుడి సలహాతో, అక్కడ సంపాదించి కూడబెట్టిన కొంత సొమ్ముతో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లూ కొన్నాడు. ఆ తర్వాతే సాఫ్ట్‌వేర్ బూమ్
అందుకుంది. ఇదంతా ఏడాది క్రిందటిమాట.
సాఫ్ట్‌వేర్ బూమ్ అందుకుంటున్న సమయంలోనే అనిరుధ్ తెలివిగా ఉద్యోగానికి రాజీనామా చేసి, మరొక మిత్రుడు జగదీశ్‌ని పార్ట్‌నర్‌గా పెట్టుకుని తనే ఓ ఐటి కంపెనీ ప్రారంభించాడు. అప్పుడు అతడి కంపెనీలో ఉద్యోగులు పదిమంది. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య పదిరెట్లయ్యింది.
అతడు భాగ్యనగర్ వచ్చశాక తన దగ్గరికి అమ్మమని తెచ్చేసుకోవాలని, ఆమెకు తోడుగా ఓ పనిమనిషిని పెట్టుకోవాలని, ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలనీ చాలా ఆరాటపడ్డాడు.అందుకే ఆమె దగ్గరికి వెళ్లి శత పోరు పెట్టాడు, తనతో హైదరాబాద్ వచ్చెయ్యమని. కానీ ఆమె మనవడితో హైదరాబాద్ రావడానికి ఒప్పుకోలేదు.

- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842