డైలీ సీరియల్

అన్వేషణ -14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిజం హిమా!.. అది అక్షరాలా నిజం.. ఆయనే నా గురించి పట్టించుకోకపోతే ఈ అనిరుధ్ ఏ చిల్లకొట్లోనో, ఏ మెకానిక్ షెడ్‌లోనో పనిచేస్తూండేవాడు..’’
అవునన్నట్లు తలూపిందామె. అనిరుధ్ వౌనంగా ఉండిపోయాడు ఆ జ్ఞాపకాలు తలచుకుంటూ.
‘‘సరే! ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావ్?’’ కొద్ది క్షణాలు పోయాక అడిగిందామె.
‘‘అనే్వషణ’’
‘‘అనే్వషణ?!’’
‘‘అవును హిమా! నా దగుల్భాజీ నానె్నవరో తెలుసుకోవడానికి బయల్దేరతాను..’’ దృఢంగా అన్నాడు.
‘‘ఎక్కడని బయల్దేరతావు? ఎలా తెలుసుకుంటావు?’’
‘‘ఒకళ్లిద్దరి వివరాలు గురుమూర్తి చెప్పాడుగా. వాళ్లనుంచి మిగిలినవాల్ల వివరాలు తెలుసుకుంటాను.. లేదా ఎలాగోలాగ ప్రయత్నిస్తాను.. ఎలాగైనా సరే వాళ్ల ఆచూకీ తెలుసుకుంటాను..’’
‘‘తెలుసుకుని?!’’
‘‘ఇప్పుడు వైద్య శాస్త్రంలో చాలా మార్పులొచ్చాయి కదా! డిఎన్‌ఎ టెస్టు ద్వారా ఎవరు ఎవరికి పుట్టినవాడో, ఎవరికి ఎవరు తండ్రో తెలుసుకోవచ్చు.. ఇదే విషయమై మన దేశంలో ఒక మాజీ గవర్నర్ మీద కేసు కూడా నడిచింది.. పేపర్లలో ప్రముఖంగా ప్రచురించారు...’’
‘‘అవును.. చదివాను..’’
‘‘ఇప్పుడు నేనూ అదే పద్ధతి అనుసరిస్తాను. ఈ విషయమై ఒక సీనియర్ డాక్టర్ని కూడా సంప్రదించాను.. ఆయన చెప్పింది కూడా ఇదే పద్ధతి.. అదే నేనూ ఫాలో అవ్వాలనుకుంటున్నాను.. కానీ, ఆ నలుగురిమీద ఈ టెస్టు చేయించడం అంత తేలికైన విషయం కాదు. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను.. మన దేశంలో చాలా పనులు డబ్బుతో సాధించవచ్చు.. అవినీతికి అలవాటుపడ్డ వాళ్లే ఇక్కడ మనకి వరం.. మరికొన్ని పనులు తెలివితో సాధించాలి.. అయితే ఇందుకు ఎన్నాళ్లు పడుతుందో కూడా నాకు తెలీదు. కానీ కొన్నాళ్లు నువ్వు నాకోసం నిరీక్షించగలవా హిమా!?’’ బేలగా అడిగాడు అనిరుధ్.
ఆ మాటకి అనిరుధ్ భుజం చుట్టూ చేతులు వేసింది హిమజ. దగ్గరికి లాక్కుంది. సున్నితంగా అతడి నుదుటిమీద చుంబించి అడిగింది’’ ఎంతకాలం నిరీక్షించమంటావ్?’’ అని.
‘‘చెప్పలేను.. ఒకవేళ ఈ పనిలో నేను ఏమీ సాధించలేకపోతే..’’ ఇంక మాట్లాడలేకపోయాడు. గొంతు పూడుకుపోయింది దుఃఖంతో.
‘్ఛ! నువ్వు ఓడిపోవు అనిర్! సాధిస్తావ్.. ఆ నమ్మకం నాకుంది.. అది కూడా తక్కువ సమయంలోనే...’’
ఆ మాటకి నిజంగానా అన్నట్లు ఆమె ముఖంలోకి చూశాడు.
‘‘నిజంగా అనిర్! నువ్వు సాధిస్తావ్.. ఆ నమ్మకం నాకుంది..’’ అన్నదామె మళ్లీ.
ఆనందంగా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. అతడి వెన్నుమీద రాస్తూ చిన్నపిల్లాడిని ఓదారుస్తున్నట్లు అనునయించిందామె. కొద్ది క్షణాలు అతడు అలానే ఉండిపోయాడు.
‘‘అనిర్! వాళ్లలో ఒకరు మీ నాన్న అని తెలిస్తే అప్పుడు ఏం చేస్తావ్?’’ అతడిని అలానే పొదివి పట్టుకుని అడిగిందామె.
ఆ ప్రశ్నకి చటుక్కున అమెనుంచి జరిగి సరిగ్గా కూర్చుని అన్నాడు. ‘‘సినిమాల్లో మాదిరిగా అమాంతం ‘నాన్నా’ అంటూ వెళ్లి అతడిని కౌగలించుకోను.. అతడు చేసిన ఓ నీచమైన పనివల్ల జరిగిన పరిణామాలేమిటో చెబుతాను. నాలాంటి ఒక అభాగ్యుడు పడిన చీదరింపులు, అవమానాలు, కష్టాల గురించి చెబుతాను..ఒక తల్లిగా అమ్మమ్మ ఎంతటి క్షోభననుభవించిందో చెబుతాను.. ఒక చెంపదెబ్బ కొట్టి మరీ వచ్చేస్తాను.. నా కళ్ళల్లోంచి అతడి రూపాన్ని వెంటనే చెరిపెయ్యడానికి ప్రయత్నిస్తాను..’’ అన్నాడు అనిరుధ్.
అంత ఉద్వేగంగా అంటున్న అతడిని తేరిపార చూసింది హిమజ. అతడి గుండెల్లో ఎంతటి లావా గూడుకట్టుకుని వుందో ఆమెకు బాగా అర్థమయ్యింది.
‘‘అనిర్! కంట్రోల్ చేసుకో.. నీ గుండెల్లో ఇంతటి అగ్నిగుండం రగులుతోందా?!’’ అన్నదామె అతడినే చూస్తూ.
‘‘నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ అమ్మా, నాన్న లేరు అంటే చాలా బాధగా అనిపించింది. అమ్మ చనిపోయిందంటే అయ్యో అనుకునేవాడిని. నాన్న గురించి ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పకపోయినా నాకు అంతగా బాధ అనిపించేది కాదు.. కానీ అమ్మమ్మ నోట ఆ వివరాలు విన్న తర్వాత నా గుండె రగిలిపోతోంది హిమా!.. ఆ నలుగురినీ మొక్కజొన్న కాల్చినట్లు కాల్చెయ్యలన్నంత కోపంగా వుంది. అసలు రేప్ చేసినవాళ్లని ఏళ్లూ పూళ్లూ విచారణ పేరుతో కాలయాపన చేయడం సరికాదు. వాళ్లని అక్కడికక్కడే కాల్చిపారెయ్యలి. పసలేని చట్టాలతో కోర్టుల్లో సాగదీత ధోరణిలో రోజులు గడిచేకొద్ది ఇటు జనం, అటు బాధితులు జరిగిన విషయాన్ని మర్చిపోతారు. శిక్షలు కఠినంగా ఉన్నపుడే ఇలాంటివి నివారించగలం.. ఢిల్లీలో నిర్భయ్ ఇన్సిడెంటు జరిగిన తర్వాత ఏమైంది? నిర్భయ్ చట్టం వచ్చినా రేప్ సంఘటనలు తగ్గాయా? అలాంటి నికృష్టులు ఏమైనా భయపడుతున్నారా? డైలీ రేప్ న్యూస్ లేని పేపర్ ఉందా? నిర్భయ్ చట్టానికెవరైనా భయపడుతున్నారా?.. బ్లడీ రూల్స్.. బ్లడీ యాక్ట్స్..’’ అంటూ చేతికదిన రాయిని బలంగా నేలకేసి కొట్టాడు అనిరుధ్.
హిమజ అతడినే తేరిపార చూస్తూండిపోయింది కొద్ది క్షణాలు.. తర్వాత నెమ్మదిగా అన్నది: ‘‘అనిర్! నువ్వు అన్నదానితో నేను సెంట్‌పర్సెంట్ ఏకీభవిస్తున్నాను. చట్టం తన పని తాను చేసుకుపోదామన్నా మన రాజకీయ నాయకులు పోనివ్వరు.. నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగా మర్డర్ చేసినా సరే ఆ దోషి తరఫున మన లాయర్లు వాదిస్తారు. చట్టాలలో, న్యాయవ్యవస్థలో వున్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని ఆ దోషిని కాపాడ్డానికి ప్రయత్నిస్తారు.. అలాంటివారికి గొప్ప క్రిమినల్ లాయర్‌గా పేరు! బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే ముక్కతో ఆ దోషి హ్యాపీగా బయటికి వచ్చేస్తాడు..’’
‘‘అందుకే మనవాళ్లకి ధీమా.. ఎంతటి తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోగలమని!’’ మళ్లీ మరో రాయి తీసి కసిగా నేలకేసి కొడుతూ అన్నాడు.
‘‘సరే! నీ అనే్వషణ ఎప్పట్నుంచి?..’’
‘‘ఓ రెండు రోజుల్లో ప్రారంభిస్తాను.. ఆర్నెల్లపాటు నేను ఆఫీసుకు రానని.. అన్నీ నువ్వే చూసుకోవాలని జగదీశ్‌కి చెప్పాను. రేపు, ఎల్లుండి ఆఫీసుకు వెళ్లి ఆ పనులు చూడాలి.. కొన్ని బ్యాంకు పనులున్నాయి. చెక్కులమీద సంతకాలు ఎట్‌సెట్రా పనులున్నాయి..’’
‘‘నువ్వు అన్ని రోజులు లేకపోతే ఫర్వాలేదా?..’’
‘‘నో ప్రాబ్లమ్ హిమా! జగదీశ్ చాలా నమ్మకమైనవాడు. అన్నీ ఆలోచించే అతడిని పార్ట్‌నర్‌గా పెట్టుకున్నాను.. హి రుూజ్ ఎ నైస్ జెంటిల్మన్..’’
‘‘ఆర్నెల్లా!!..’’
‘‘కావచ్చు.. ఈలోగానే నా పని పూర్తికావచ్చు.. లేదా ఇంకా మరికొన్నాళ్లు పట్టొచ్చు..’’
ఆ మాటకి ఆమె అతడినే వౌనంగా చూస్తుండిపోయింది కొద్ది క్షణాలు. అతడు సెల్‌ఫోన్‌లో టైము చూశాడు, ఎనిమిదిన్నర గంటలు దాటుతోంది.. త్రయోదశి చంద్రుడు చుట్టూ వెనె్నల కురిపిస్తున్నాడు. అతడు లేచాడు.. ఇక అక్కడ కూర్చోవడం మంచిది కాదని, పురుగూ పుట్రా ఉంటాయని. ఆమె లేవడానికి చెయ్యి అందించాడు. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842