డైలీ సీరియల్

సుందోపసుందులు (మహాభారతంలో ఉపాఖ్యానాలు-25)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మదేవుడు వారి ప్రార్థన ఆలకించి విశ్వకర్మను పిలిచి ‘ఒక అత్యంత సుందరమైన స్ర్తిని వారి వధ కోసం తయారుచేయ.’ అని చెప్పాడు. విశ్వకర్మ ఒక దివ్య సుందరిని తయారుచేశాడు. ముల్లోకాల్లో ఏ పదార్థం శ్రేష్టమైనదో దానిని ఆ సుందరి శరీరంలో అమర్చాడు. ఆ యువతి అవయవాల్లో ఎన్నో రత్నాలను పొదిగాడు. వాటితో ఆమె రత్న కిరణాలను వెదజల్లింది. లక్ష్మీ శరీరం దాల్చినట్లు ఆ కామరూపిణి సర్వప్రాణుల చూపులను ఆకర్షించింది. ఉత్తమ రత్నాలను నువ్వుగింజ పరిమాణంలో తీసి ఆమె శరీరాన్ని నిర్మించుట చేత బ్రహ్మ ఆమెకు తిలోత్తమ అన్న నామకరణం చేశాడు. బ్రహ్మ ఆమెకు ప్రాణప్రతిష్ట చేయగానే ఆ సుందరి లేచి నమస్కరించి ఇలా అంది ‘‘నాపై ఏ కార్యభారాన్ని ఉంచదలచి ఈ శరీర నిర్మాణాన్ని చేయంచావు?’’
అప్పుడు బ్రహ్మ ఆమెతో ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ! నీవు సుందోపసుందుల దగ్గరకు వెళ్లి నీ రూపంతో వారిని ప్రలోభపెట్టు. నిన్ను పొందాలనే తీవ్రమైన కోరిక వారికి కలిగించు. వారికి పరస్పర విరోధం కలిగేటట్లు చెయ్య’’.
తిలోత్తమ దానికి అంగీకరించి అక్కడ ఉన్న దేవతలకు ప్రదక్షిణం చేసింది. ఆమె దేవతలు, ఋషులు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆమె ఎటువైపు వెళ్ళితే అటువైపు వారి ముఖాల చూపులు లగ్నమయ్యాయ. దేవతలనే మోహపరవశులను చేసిన ఆమె సుందోప సుందులను కచ్చితంగా ప్రలోభపెట్టగలదని వారు భావించారు.
ఇక సుందోపసుందులు భూమినంతటినీ జయంచి, మూడు లోకాలను వశపర్చుకుని, దేవతలు, గంధర్వులు నాగులు యక్షులు రాక్షసుల దగ్గర ఉన్న రత్నాలను సంపదలను చేజిక్కించుకొని సంతృప్తి చెందారు.
వారిని ఎదిరించే వారు ఎవ్వరూ లేకపోవడంతో వారు భోగాల్లో మునినిగిపోయారు.
సుందరమైన స్ర్తిలను, భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలతో ఆనందం అనుభవించారు. ఉద్యానవనాల్లో పర్వతాలుమొదలైన సుందర ప్రదేశాలల్లో వారు కూడా దేవతల్లాగ విహరించారు.
ఒక రోజు వారు వింధ్య పర్వత శిఖరంపైన ఉన్న సమతలమైన ప్రదేశానికి విహరించడానికి వెళ్ళారు. అక్కడ వారు స్ర్తీలతో కలిసి కూర్చుని ఆనందంలో మునిగారు. అప్పుడు తిలోత్తమ ఒక ఎఱ్ఱటి వస్త్రం ధరించి పూలుకోస్తూ వారికి కన్పించింది. ఆమె సౌందర్యం వారిని ఉన్మత్తులను చేసింది. ఆమె పుష్పాలు కోస్తూ వారు ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఆ సమయంలో వారు మధువును సేవిస్తూ ఉన్నారు. ఆ రాక్షసులిద్దరూ తమ ఆసనాలను వదిలి ఆమె దగ్గరకు వచ్చారు. వారిరువురూ ఆమెను కోరారు. సుందుడు ఆమె కుడి చేతిని, ఉపసందుడు ఆమె ఎడమ చేతిని పట్టుకున్నారు. మొదట వారు వరగర్వితులు. ఆ పైన బలవంతులు. ఇంకా ధనరాసులు రత్నాలు వారి దగ్గర ఉన్నాయ. ఇప్పుడు సురాపానం చేస్తున్నారు. వారు ఒకరిపై ఒకరు కళ్లు ఎఱ్ణచేశారు.
తిలోత్తమ తన క్రీగంటి చూపులతో వారిని మోహపరవశుల్ని చేసింది. కుడి కంటితో సుందునీ, ఎడమ కంటి చూపుతో ఉపసుందుడినీ వశపర్చుకుంది. ఆమె రూపంతో వ్యామోహం చెందిన కామ పీడితులైనారు. సుందుడు తమ్మునితో ఇలా అన్నాడు. ‘‘ఈమె నా భార్య, నీకు తల్లితో సమానం’’.
ఉపసందుడు ఇలా జవాబిచ్చాడు ‘‘ఈమె నా భార్య నీకు కోడలితో సమానం’’.
ఇలా ఇరువురు ఆమె నాదంటే నాది అని వాదించుకున్నారు. వారిలో క్రోధం పెరిగిపోయంది. వారి వరాలను

వారు మరిచిపోయర. ఉన్నత్తులైనారు. స్ర్తిని చూడగానే మతి స్థితిమితం తప్పింది. అంతే ఇద్దరిలో ఒకరిపై ఒకరికి అసూయ జనించింది. అసూయతోనే ఒకరికంటే మరొకరు అధికులమని భావించారు. తిలోత్తమ సౌందర్యంతో మోహితులైన వారిలో స్నేహం, సోదర ప్రేమ నశించాయ. అన్నదమ్ముల మైత్రి ఆమడదూరం పోయంది. ఎవరికి వారు గొప్ప అనుకొన్నారు. అంతే ఎలాగైనా ఆమెను తామే పొందాలి అన్న ఉద్దేశ్యంతో వారిద్దరూ గదలతో ఒకరినొకరు మోదుకున్నారు. వారి శరీరాలు రక్తసికాలైనాయ. ఒకరినొకరు కొట్టుకున్న గదాఘాతాలతో వారిద్దరూ భూమిపై పడి హతులయ్యారు. మిగిలిన రాక్షసులు పాతాళానికి పారిపోయ ప్రాణాలు కాపాడుకున్నారు. బ్రహ్మ దేవతలకు ప్రత్యక్షమై తిలోత్తమను ప్రశంసించి వరమివ్వడానికి సంసిద్ధుడై ఆమెతో ఇలా అన్నాడు. ‘‘ఎక్కడిదాకా సూర్యుడు సంచరిస్తాడో అక్కడి దాకా నీవు సంచరిస్తావు. నీ తేజం ఇతరులు చూడలేరు’’ ఆ తర్వాత స్వర్గం మరల దేవతలకు లభించింది.
(ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి