నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
70. కరమను రక్తి, మందరము గవ్వముగా నహిరాజు త్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మధించు చున్నచో
ధరణి , చలింప , లోకములు తల్లడమండఁగఁ గూర్మమై ధరా
దరము ధరించి తీవె కదా! దాశరథీ కరుణాపయోనిధీ
*
భావం: దశరథ రామా! దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వముగాను, సర్పరాజగు వాసుకిని కవ్వపుత్రాడుగాను చేసి పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా అపుడా కొండ తటాలున మునుగడం వలన భూమి, లోకము తల్లడిల్లడం చూసి, కూర్మావతారం ఎత్తి కొండను వీపు మీద దాల్చిన వాడవు నీవేకదా. లోకానికి ఉపకారం చేసినవాడవు నీవే కదా.
*
వ్యాఖ్యానం: విష్ణుమూర్తి కూర్మావతారాన్ని కవి ప్రస్తావిస్తూ లోకాలను రక్షించేనాథుడు కేవలం విష్ణ్భుగవానుడే అని చెబుతున్నాడు. భగవంతుడు ఎప్పుడు ఏ అవతారం ఎత్తినా అది సజ్జనులు కాపాడడానికే కదా అని అంటున్న కవిని సమర్థించాల్సిందే. ఎందుకంటే ఆ క్షీరసాగరాన్ని మధించేటపుడు వీలుగా ఉండడానికి విష్ణుమూర్తి కుదురుగా ఉన్నాడు. ఆయనే భూమి ఒకసారి నీటిలో మునిగిపోతుంటే తిరిగి పైకి తెచ్చి నిలబెట్టాడు. పరమేశ్వరుడుగా ఉన్నప్పుడు ఆ క్షీరసాగర మథనం లో లోకాలను హరించివేసే హాలాహలం వస్తే వెంటనే దాన్ని నోటితో మింగివేసి తన కంఠాన నిలిపి నీలకంఠునిగా పేర్గాంచిన శివుడు పరమేశ్వరుడే కదా. ఉన్న ఒక్కపరమాత్మ ఎన్ని అవతారాలు దాల్చినా అవి అన్నీ ప్రాణికోటిని సంరక్షించడానికే అయి ఉన్నాయి.