డైలీ సీరియల్

భారతంలో ఉపాఖ్యానాలు -- 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం మగధరాజ్యాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు బల సంపన్నుడు. గొప్ప పరాక్రమ శాలి. అందగాడు. అతను సౌందర్యవంతులు గుణవంతులు అయన కాశీరాజు ఇద్దరి పుత్రికలను వివాహం చేసుకొన్నాడు. వారిద్దరు కవలలు. వారిద్దరినీ అతను సమానంగా గౌరవించి ఆదరించాడు. వారిద్దరితో కలిసి చాలా కాలం జీవించినప్పటికీ అతనికి సంతానం కలుగలేదు.
ఒకసారి గౌతమ గోత్రుడైన చండకౌశికుడు తన తపస్సు ఆపి అటువైపు వచ్చి ఒక చెట్టుకింద నిలిచాడు. బృహద్రథుడు తన ఇద్దరు భార్యలతో వెళ్ళి మొని దర్శనం చేసికొన్నాడు. అతనికి ఎన్నో కానుకలు ఇచ్చి సంతృప్తి పరిచాడు.
అప్పుడు ముని అతనిని ఇలా అడిగాడు - ‘‘రాజా భార్యలతో, పురజనులతో కలిసి ఇక్కడికి రావడానికి కారణమేమిటి?
రాజు ఇలా అన్నాడు - ‘‘స్వామీ! పుత్రులు లేని వారి జన్మ వ్యర్థమని మన శాస్త్రాలు చెప్పాయ. సంతానహీనుడైన నేను ఈ రాజ్యాన్ని ఏమి చేసుకుంటాను? భార్యలతో వనానికిపోయ తపస్సు చేసుకుంటాను.
అతని మాటలు విన్న వౌనికి అతనిపై కరుణ కలిగింది. ఆయన ఆ మామిడి చెట్టు నీడలో ధ్యానిస్తూ కూర్చుని ఉండగా పైనించి ఒక పండు అతని ఒడిలో పడింది. దానిని తీసుకొని అతను రాజుకిచ్చి ఇలా అన్నాడు. ‘‘రాజా నీవు ధన్యుడవు అయ్యావు. ఈ పండు వలన నీకు ఒక పుత్రుడు కలుగును. నీవు తపస్సుకు వెళ్ళనవసరం లేదు. వెనక్కి పురంలోకి ప్రవేశించు. ప్రజలను పాలించు. ఇదే రాజధర్మం. నీ పుత్రునికి పట్ట్భాషేకం చేసిన తర్వాత వానప్రస్తానికి వెళ్ళు. నీ పుత్రునకు ఎనిమిది వరాలు ఇస్తున్నాను. బ్రాహ్మణ భక్తి, యుద్ధాలతో విజయం, యుద్ధాసక్తి నశించక పోవడం అతిధులను గౌరవించడం దీనులను కాపాడడం మహాబలం కీర్తి ప్రజానురాగం’’.
ముని మాటలతో ఎంతో సంతృప్తి చెంది రాజు తన భవనానికి వెళ్ళిపోయాడు. మంచి సమయం చూచి ఆ పండును సమానంగా ఇద్దరి భార్యాలకూ ఇచ్చాడు. ఆ అక్క చెల్లెళ్లు వాటిని రెండుగా కోసి తిన్నారు. కొంత కాలానికి వారిద్దరూ
గర్భవతులయ్యారు. ప్రసవ సమయంలో వారిరువురు చెరొక ముక్కగా శిశువుకు జన్మనిచ్చారు. మొత్తం శరీరం నిలువుగా రెండు ముక్కలైంది. ఆ భాగాలను చూచి ఆ ఇద్దరూ కలతపడి ఆ శరీరపు ముక్కలను దాదులచేత వాటిని గుడ్డలో చుట్టి బయట కూడలివద్ద పారవేయంచారు. అప్పుడు మాంసం, రక్తం ఆహారంగా తీసుకునే జర అనే రాక్షసి ఆ కూడలిలో విసిరివేయబడిన ఆ ముక్కలను తీసుకొని మోసుకునిపోవటానికి వీలుగా ఆ రెండు ముక్కలను కలిపింది.

--ఇంకావుంది...

--డాక్టర్ ముదిగొండ ఉమాదేవి