డైలీ సీరియల్

అనే్వషణ--36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీకు తెలీదురా! మనీ మేక్స్ మెనీ థింగ్స్.. ఆశ పెడదాం...’’
‘‘తప్పదు.. వీరబాహుకి ఇచ్చాంగా..’’
ఇంతలో ఇల్లు రావడంతో అనిరుధ్‌ని ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయాడు కొండబాబు ‘సాయంత్రం కలుస్తారా’ అని చెప్పి. అనిరుధ్ లోపలికి రాగానే అతడి అమ్మమ్మ చెప్పింది: ‘‘మీ మామయ్య వచ్చాడురా..’’ అని.
‘‘ఎప్పుడు?’’’
‘‘నువ్వు రావడానికి ముందే వెళ్ళాడు.. ఓ గంట కూర్చుని వెళ్లాడు’’
‘‘ఏమంటాడు?’’ కుర్చీలో కూర్చుంటూ అడిగాడు అనిరుధ్.
‘‘ఇంకేమంటాడు.. సాయి గురించే అడిగాడు మళ్లీ... అనిరూదూకు చెప్పావా? ఏమన్నాడు అని.. నేనింకా చెప్పలేదన్నాను.. వాడు ఏదో పనిమీద తిరుగుతున్నాడు.. వీలు చూసి చెబుతానన్నానురా..’’ మంచినీళ్ళు తెచ్చి ఇస్తూ చెప్పిందామె.
విని ఊరుకున్నాడు. మంచినీళ్ళు తాగాడు. సాయిరమ్య గురించి తన మనసులో మాట చెప్పేస్తే మంచిదేమో అనుకున్నాడు. ఊరికే నాన్చడం అతడికి ఇష్టం లేదు. సత్యం మామయ్య ఏమనుకున్నా ఇవ్వాళ కాకపోతే రేపయినా చెప్పక తప్పదని అనుకున్నాడు.
కాకపోతే తన మనసును ప్రస్తుతం దొలిచేస్తున్న తండ్రి ఎవరన్న ప్రశ్న తేలాక అమ్మమ్మకి హిమజ గురించి చెప్పాలనుకున్నాడు. కానీ, ఇంతలో సాయిరమ్య సమస్య వచ్చి పడింది. అసలు ఆమె గురించి అతడు కలలో కూడా తన మేనమామ ఇలా అడుగుతాడని ఏనాడూ ఊహించలేదు అనిరుధ్.
‘‘అమ్మమ్మా.. అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్... అదే సాయిరమ్య గురించి?’’ అనడిగాడు అనిరుధ్.
‘‘నేనేమనుకుంటాన్రా..?!.. పెళ్లి చేసుకునేది నువ్వు.. ఈ విషయంలో నా బలవంతం ఏమీ లేదురా అనిరూదూ!.. అయినా వాళ్లకి ఇప్పుడు కావాల్సి వచ్చావా నువ్వు?!.. ఇన్నాళ్లూ మనం వాళ్లకి కనిపించామా?!’’ అన్నది అమ్మమ్మ.
ఆమె అలా అనడంతో అనిరుధ్‌కి ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది.
‘‘నీ ఇష్టంరా! నువ్వు ఎవర్ని చేసుకోవాలనుకుంటే వాళ్లని చేసుకో.. నాకేం అభ్యంతరం లేదు..’’ అన్నది మళ్లీ ఆమె.
హిమజ గురించి చెబుదామా అనుకున్నాడు. ఎందుకో వెనక్కి తగ్గాడు. బెరుకు కాదు. ఇది సమయం కాదేమోనని. ఒక మంచి సందర్భం చూసి చెప్పాలన్నది అతడి ఆలోచన.
‘‘నేనిప్పుడప్పుడే పెళ్లి చేసుకోననీ, నాకోసం చూడొద్దనీ మామయ్యకి చెప్పెయ్యి అమ్మమ్మా..’’ అన్నాడు.
‘‘ఆ మాట నా నోటిదాకా వచ్చిందిరా.. కానీ నీ అభిప్రాయం అడిగి చెబుదామని ఊరుకున్నాను.. రేపొచ్చినపుడు ఆ మాటే చెప్పేస్తాను..’’ అన్నదామె.
ఆమె అంత కచ్చితంగా మాట్లాడ్డం అతడికి ఆశ్చర్యంగానే అనిపించింది. ఎంతయినా కొడుకు వచ్చి అలా అడగ్గానే ఆమె మెత్తబడుతుందనీ, తనను బలవంతపెడుతుందనీ అనుకున్నాడు. కానీ గతంలోకొడుకూ, కోడలూ చేసిన పనికి ఆమె మనస్సు ఎంత గాయపడిందో ఇప్పుడు అతడికి బాగా అర్థమయ్యింది.
***
సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కవితా రియల్ ఎస్టేట్స్ ఆఫీసు దగ్గరకొచ్చాడు కొండబాబు దూరంగా బైక్ పార్క్ చేసి అక్కడే అనిరుధ్‌ని ఉండమని చెప్పి.
రియల్ ఎస్టేట్స్ ఆఫీసు ముందు కారులో కూర్చుని కునికిపాట్లు పడుతూ ఎఫ్‌ఎం రేడియో పాటలు వింటున్నాడు డ్రైవర్. కొండబాబు కారుదగ్గరకొచ్చాడు.
‘‘ఈ ఆఫీసు కారు డ్రైవర్‌వేగా..’’’ అనడిగాడు కారు డోరు దగ్గరకొచ్చి. ఉలిక్కిపడి ఏమిటన్నట్లు చూశాడు డ్రైవర్. మళ్లీ అదే ప్రశ్నవేశాడు కొండబాబు.
‘‘అవును.. మీరు?’’
‘‘ఏం లేదు గురూ.. నీతో మాట్లాడదామని..’’ సగంలో ఆగిపోయాడు కొండబాబు.
‘‘నాతోనా?.. ఏమిటి?’’ డ్రైవర్ అడిగాడు అనుమానంగా.
‘‘మరేం లేదు గురూ.. మేం ప్లాట్స్ కొందామనుకుంటున్నాం.. వెంచర్ ఎలా ఉంటుందో కాస్త చెబుతావని..’’
‘‘పైన రాగిణి మేడం ఉన్నారు. వెళ్లి అడగండి..’’ డ్రైవర్ చెప్పాడు ఎఫ్.ఎం రేడియో సౌండ్ తగ్గించి.
‘‘నిన్న మేడమ్‌ని కలిశాం గురూ.. ఆమెగారు చెప్పారు.. కానీ నీకు కూడా బాగా తెలిసి ఉంటుంది కదా.. అందుకని.. మీరయితే నిజాయితీగా చెబుతారని..’’ ఒక రాయి వేశాడు కొండబాబు. ఆ మాటకి డ్రైవర్ కారు దిగాడు.
‘‘ఆళ్లు చెప్పేమాటలే.. అంతకంటే మేమేం చెబుతామండి?’’ అన్నాడు.
‘‘రా.. అలా హోటల్‌దాకా వెళ్లి మాట్లాడుకుందాం..’’’ అని అతడిని డివైడర్ దాటించి హోటల్ దగ్గరికి తీసుకొచ్చారు కొండబాబు. టీ తాగుదామా అని అడిగాడు. డ్రైవర్ సమాధానం కోసం ఎదురు చూడకుండా టీ ఆర్డర్ చేశాడు.
‘‘్ఫ్లట్ తీసుకోవచ్చంటావా? సమీప భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయా అని.. రేటొస్తే మళ్లీ అమ్ముకుందామని..’’ టీ తాగుతూ అడిగాడు కొండబాబు.
‘‘సారు వేసే వెంచర్లు అన్నీ మంచివేనండి.. డౌటు పడక్కర్లేదండి... రాగిణి మేడంగారు చెప్పారంటన్నారుగా..’’ అన్నాడు డ్రైవర్.
‘‘ఆమెగారి మాటంటే అంత కరెక్టా.. మీ సార్‌ని అడగక్కర్లేదా?’’ కొండబాబు అడిగాడు విస్మయంగా ముఖంపెట్టి.
‘‘అడగక్కర్లేదండి..’’
‘‘ఏం మీ సారుకి అంత నమ్మకమా ఆమె గారంటే?!’’
దానికి సమాధానంగా ముసిముసిగా నవ్వేశాడు డ్రైవర్. కొండబాబుకి అర్థమయ్యింది. అతడికి కావాల్సింది ఆ సమాధానమే. తన అనుమానం నివృత్తి అయ్యిందనుకున్నాడు. అప్పుడే ఆమెవల్ల అనిరుధ్ పని కచ్చితంగా అవుతుందన్న నిర్ణయానికి వచ్చేశాడు.
‘‘సరే గురూ ఫ్లాట్ తీసుకుంటాం.. థ్యాంక్యూ.. నీ సలహాకి..’’ అని చెప్పి అనిరుధ్ దగ్గరికి వచ్చాడు కొండబాబు.
‘‘ఇంతకీ ఇక్కడికి మళ్లీ ఎందుకొచ్చినట్లు మనం?’’ కొండబాబుని అడిగాడు అనిరుధ్.
‘‘ఒక డౌట్ ఉందిరా.. అది క్లియర్ చేసుకుందామని వచ్చాను.. క్లియర్ అయ్యింది.. రాగిణి ఒప్పుకుంటే ఇక మన పని అయినట్లే..’’ చెప్పాడు కొండబాబు.
‘‘ఏం టౌటు?’’ అర్థం కానట్లు అడిగాడు అనిరుధ్.
‘‘నారాయణ బ్లడ్ శాంపిల్స్, లేదా మరేదైనా సేకరిచడానికి మనం రాగిణిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం కదా!..

--ఇంకా ఉంది

-- సర్వజిత్ 9010196842