డైలీ సీరియల్

అన్వేషణ -39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ విషయం మాకు తెలుసు.. అతడు ఏదైనా ఆసుపత్రిలో చేరితే అక్కడే ఆ పని చేయించేవాళ్లం.. అందుకనే ప్రస్తుతం మీ దగ్గరకొచ్చాం.. అతడి ఇంటి దగ్గర ఇలాంటివి కుదరవని మీకూ తెలుసు.. ఈ పని చేసిపెడితే మీకు ఏభై వేలు ఇస్తాం.. అతడు మీ ఇంట్లో పడుకున్నపుడు అతడికి తెలియకుండా బ్లడ్ శాంపిల్స్ లేదా గుజ్జుతో తలవెంట్రుకలు.. లేదా ఇయర్ బడ్స్‌తో శరీరంమీద గట్టిగా రాయడం కానీ చేస్తాం.. కానీ వీటికన్నా బ్లడ్ శాంపిల్స్ మంచిదన్నారు డాక్టర్లు.. అందుకే.. మీరీ పని చేసిపెట్టండి.. ఏభై వేలు ఇస్తాం..’’ కొండబాబు డబ్బు గురించి ఒత్తి పలుకుతూ మరీ చెప్పాడు.
రాగిణి మెత్తబడినట్లు కనిపించింది. ‘రిస్కేమో?’ అన్నది అనుమానంగా.
‘‘అతడికి ఏ మాత్రం ఈ విషయం తెలియదు కదా?! తెలిస్తే కదా ఏమైనా జరిగేది?’’’ అనిరుధ్ అన్నాడు.
‘‘బ్లడ్ శాంపిల్ ఎవరు తీస్తారు?’’ అడిగిందామె ఆ పనికి అంగీకరిస్తున్నట్లు.
‘‘నర్స్ వచ్చి తీస్తుంది.. నారాయణకి ఏ మాత్రం తెలియకుండా.. ప్లీజ్ మీరు చెబితే తప్ప అతడికి ఏం తెలీదు..’’ కొండబాబు అన్నాడు.
‘‘ఎప్పుడు తీస్తారు?’’
‘‘మీ ఇష్టం.. నారాయణ ఎప్పుడొస్తాడు?’’ కొండబాబు అడిగాడు.
‘‘ఎప్పుడైనా రావచ్చు.. పిలిస్తే ఈ రోజైనా వస్తాడు..’’
‘‘అయితే రేపు పిలవండి.. ’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘ఎన్ని గంటలకి రమ్మంటారు?’’’ కొండబాబు అడిగాడు.
‘‘పదీ, పదకొండు గంటలకి.. ఏం ఫర్వాలేదుగా..’’
‘‘్ఛ.. మిమ్మల్ని రిస్కులో పెడితే మాకేం వస్తుంది.. మీరు మాకేవన్నా శత్రువులా?’’ కొండబాబు చెప్పాడు.
ఏభై వేలు వస్తున్నాయంటే ఆమెకు మనసు ముందుకే లాగుతోంది. దీనిలో తనకి ములిగిపోయిందేమీ లేదనుకుంది రాగిణి.
ఆమె చెప్పిన సమయానికి అనిరుధ్, కొండబాబు నర్స్‌ని వెంటబెట్టుకుని వచ్చారు. రహీం విషయంలో వీరబాహుకి సహాయపడిన నర్స్‌ని తీసుకొచ్చారు. ఆ విషయం అపుడు నర్స్‌తో తాను ఎలా మేనేజ్ చేసిందీ చెప్పుకొచ్చాడు. డాక్టర్ కె.వి.రావు ఆసుపత్రిలో ఉన్న ఆ నర్స్ కొండబాబుకు బాగా పరిచయమున్న మనిషే కావడంతో ఆమె రావడానికి ఒప్పుకుంది. ఆమె వస్తూ ఏదో లోషన్ చిన్న బాటిల్‌లో తెచ్చింది.
నారాయణ రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు. ఈ ముగ్గురూ ప్రక్కనే వున్న ఓ చిన్న హోటల్లో కూర్చున్నారు. దాదాపు పదకొండు గంటలకు నారాయణ నిద్రకు ఉపక్రమించాడు. కాస్సేపు పడుకుని వెళ్లడం అతడికి అలవాటు. ఒక్కోసారి పడుకోకుండానే వెళ్లిపోతాడు.
కానీ, ఆ రోజు కాస్సేపు పడుకోమని రాగిణి బలవంతపెట్టింది. అతడు పడుకున్న పావు గంటకి ఆమె బాత్‌రూముకన్నట్లు బయటికి వచ్చి కొండబాబు ఫోన్‌కి మిస్డ్‌కాల్ ఇచ్చింది. ఆమె ఇలా ఇస్తానని చెప్పింది. ఆమె కాల్ చూడగానే నర్స్‌ని వెంటబెట్టుకుని కొండబాబు రాగిణి ఇంటికి వెళ్లాడు. నర్స్‌ని మాత్రం లోపలికి రమ్మంది రాగిణి. ఆమె లోపలికి వెళ్లి తాను తెచ్చిన లోషన్ చిన్న దూదికి అద్ది రాగిణికి ఇచ్చింది నారాయణ ముక్కు దగ్గర పెట్టమని. ఆమె అలా చేసిన రెండు నిమిషాలకి అతడికి కాస్త మత్తు కూడా ఎక్కడంతో, అతడి మోచేతి దగ్గర సిరంజ్‌తో బ్లడ్ శాంపిల్ తీసింది నర్స్. దాన్ని ఎలా భద్రపరచాలో అలా చేసి కామ్‌గా బయటికి వచ్చేసింది. హాలులో ఓ ప్రక్కగా చీకటిలో వున్నారు కొండబాబు, అనిరుధ్. నర్స్ బయటికి రాగానే ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు అందించాడు కొండబాబు. ఆమె ఏమీ మాట్లాడకుండా బ్లడ్ శాంపిల్ బాటిల్ అతడికి అందించి వెళ్లిపోయింది.
రాగిణికి థ్యాంక్స్ చెప్పి ఆమెకు ఇస్తానన్న డబ్బు అందించాడు అనిరుధ్. ఆమె ఏమీ అనలేదు. తొందరగా వెళ్లిపోండి అన్నట్లు హడావిడి పడింది. వాళ్ళు బయటికి వెళ్లగానే చటుక్కున డోర్ వేసేసింది.
‘‘మనీ మేక్స్ మేనీథింగ్స్ అంటే ఇదేరా...’’ రోడ్డుమీదకొచ్చాక అన్నాడు కొండబాబు.
‘‘ఎగ్జాట్లీరా.. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా.. ప్రభుత్వ ఆఫీసులలో ఏపనన్నా లంచం పడేస్తే పనవుతుందని విన్నాను కానీ, ఇలాంటి పనులు కూడా తేలిగ్గా డబ్బుతో చేయించుకోవచ్చని మాత్రం ఇప్పుడే తెలిసిందిరా కొండలూ...’’ అన్నాడు అనిరుధ్ తలపెట్టిన పనిలో ఇపుడు రెండో అధ్యాయం ముగియబోతున్నందుకు అతడికి సంతోషంగా ఉంది. అయితే ఇతడే తనకి తండ్రి అని తేలితే ఏం చెయ్యాలి..? అన్న ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం అతడికి స్ఫురించడం లేదిప్పుడు.
వాళ్లిద్దరూ సరాసరి సీతారామారావుగారు చెప్పిన డాక్టర్ శ్రీనివాస్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయన చెప్పిన నైట్ డ్యూటీ నర్స్‌కి బ్లడ్ శాంపిల్ అందజేసి, తన బ్లడ్ శాంపిల్ కూడా ఇచ్చాడు అనిరుధ్.
‘‘మళ్లీ ఎన్నాళ్లురా వెయిటింగ్?’’ అనిరుధ్ అడిగాడు కొండబాబుని ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాక.
‘‘మామూలే.. ’’ బైక్ స్టార్ట్ చేస్తూ చెప్పాడు కొండబాబు.
‘‘ఇక్కడితో ఫుల్‌స్టాప్ పడుతుందో.. ఏమో?!..’’ అనిరుధ్ స్వగతంలా అనుకుంటూ బైక్ ఎక్కాడు.
‘‘పడనీ, పడకపోనీ... నీ ప్రయత్నం ఆగదు కదా!.. వాడెవడో తెలుసుకుందాం..’’ అన్నాడు కొండబాబు ఏక్సిలేటర్ రెయిజ్ చేస్తూ.
‘‘ఎస్!.. ఆగదు.. అతడెవరో తెలుసుకునేదాకా నా ప్రయత్నం ఆగదు.. కానీ ఈ రెండూ ఇంత తొందరగా అవుతాయనుకోలేదురా.. చాలాకాలం పడుతుందనుకున్నాను.. నువ్వు ఉండబట్టి చాలా ఫాస్ట్‌గా జరిగింది..’’.
‘‘నీకోసం ఏమైనా చేస్తానురా అనిరుధ్.. యూ ఆర్ మై హార్ట్ బీట్..’’ కొండబాబు అన్నాడు నిజాయితీగా.
‘‘్థ్యంక్స్‌రా..’’ అని అతడి భుజంమీద చెయ్యి వేసి నొక్కాడు అనిరుధ్.
అతడికి జీవితం అప్పుడు చిత్రంగా అనిపిస్తుంటుంది. అన్ని వసతులూ ఉండి ఏదేదో ఊహలు పెట్టుకుని చదివే వాళ్లకి భగవంతుడు అవకాశాలు ఇవ్వడా?.. మరి తనకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు?!.. తను ఇంజనీరింగ్ చదవడమేమిటి? యు.ఎస్ వెళ్లడమేమిటి?.. ఇన్ని మంచి అవకాశాలు ఇచ్చిన దేముడు తన పుట్టుక విషయంలో అలా ఎందుకు చేశాడు? అనిరుధ్ ఎప్పుడూ ఆలోచించే విషయం ఇది!.. ఎప్పుడూ సమాధానం దొరకని ప్రశ్న కూడా ఇదే!
‘అంతే అనీర్! అన్నీ ఇచ్చేస్తే అహంభావంతో కన్నూ మిన్నూ గానక మనిషి దానవుడవుతాడు.. అందుకే ఎప్పుడూ మనిషిని వెన్నంటి హెచ్చరిస్తూ ఉండే ఏదో ఒక లోపాన్ని భగవంతుడు పెడతాడు.. అది మనకి ఒక హెచ్చరిక! ఒక స్పీడ్‌బ్రేకర్ లాంటిది..’ అని ఒక రోజు తను తన విషయం చెప్పి బాధపడితే హిమజ అనునయిస్తూ అన్న మాటలు చప్పున గుర్తుకొచ్చాయి.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842