డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ... 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సూర్య మనకి చాలా విలువైన సమాచారం ఇచ్చాడు. భరణిని చంపినది మనిషి కాదు దెయ్యం. భరణివల్ల మోసగించబడి ఆత్మహత్య చేసుకున్న సంధ్య అనే అమ్మాయి దెయ్యంగా మారి భరణిమీద పగ తీర్చుకుంది’’ అంటూ సూర్య తనకి చెప్పినదంతా అతడికి చెప్పాడు భరణి.
‘‘మీరు నిజంగా దీన్నంతటినీ నమ్ముతున్నారా?’’ భరణి చెప్పినది విని అన్నాడు రవీంద్ర.
పాణి చిన్నగా నవ్వేడు ‘‘నిజానికి మన నమ్మకాలతో పనిచలేదు రవీంద్రగారూ’’ అంటూ తను డాక్టర్ పరమేశ్వర్‌తో మాట్లాడిన విషయాలు కూడా రాజేంద్రకి చెప్పాడు.
‘‘నమ్మకం సంగతి పక్కన పెట్టండి. అసలు దీన్ని మీరు కోర్టులో ఎలా నిరూపిస్తారు? సాక్ష్యం ఎవరున్నారు?’’
‘‘మనం ఒకసారి హరిత వాళ్ళింటికి వెళ్ళి ఆమెతో మళ్ళీ మాట్లాడాలి’’ అన్నాడు పాణి.
‘‘పదండి’’ అన్నాడు రవీంద్ర సీట్లోంచి లేచి.
‘‘అలా కాదు. మీరు పోలీస్ డ్రెస్ మార్చుకుని మామూలు బట్టల్లో రావలా’’ అన్నాడు పాణి.
‘‘ఎందుకు?’’
‘‘చెప్పాను కదా? హరిత వాళ్ళది సంప్రదాయకమైన కుటుంబం. ఇలాంటి గొడవల్లో కూతురు ఇన్వాల్స్ అందని తెలిస్తే వాళ్ళు ఆమెని కాలేజీ మాన్పించేసి ఇంట్లో కూర్చోబెడతారు’’.
రవీంద్ర అసహనంగా చూసాడు పాణి వంక.
ఆ రోజు హరితని కలిసిన బస్టాండ్‌ని గుర్తుపెట్టుకుని అక్కడికి తీసుకువెళ్లాడు పాణి రవీంద్రని అక్కడికి నాలుగు సందుల వెనుకే తమ ఇల్లని హరిత ఆ రోజు చెప్పినది గుర్తుంది. కాలేజీ రికార్డులనుంచి నోట్ చేసి పెట్టుకున్న అడ్రస్ ఆధారంగా హరిత ఇల్లు గుర్తుపట్టడం వాళ్ళకి పెద్ద కష్టం కాలేదు.
కాలింగ్ బెల్ రెండుసార్లు నొక్కాక తలుపు తెరచుకుంది. హరితే తలుపు తెరిచింది. తెరవగానే ఎదురుగా కనిపించిన పాణిని, రవీంద్రని చూసి బిక్కచచ్చిపోయినట్టు అలా నిలబడిపోయింది.
ఆ క్షణంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న భయాన్ని చూడగానే పాణికి భయం వేసింది డాక్టర్ పరమేశ్వర్ చెప్పిన ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ స్థితి, రక్తంలో అడ్రినలిన్ ప్రయాణం వంటివి గుర్తొచ్చాయి. సాధ్యమైనంత త్వరగా ఆమెని మామూలు స్థితికి తీసుకువస్తే మంచిదనిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమెకి మాత్రం వినబడేటట్లు ‘్భరణి కేసు విషయంలో మీతో అర్జెంటుగా మాట్లాడాల్సి వచ్చి వచ్చాను. ఖంగారు పడకండి. మీ ఇంట్లో వాళ్ళతో నేనీ విషయాలేమీ చెప్పనులెండి. కాసేపు మాట్లాడి వెళ్లిపోతాను’’ అన్నాడు.
హరిత తేరుకుని అతడ్ని, లోపలికి రమ్మని చెప్పింది. అతడు ఇంకా లోపలకి రాకుండానే నలభయ్యేళ్ళ ఆవిడ హరిత వెనకాలే వచ్చి ‘‘ఎవరూ?’’ అని అడిగింది హరితని.
హరితకేం చెప్పాలో తెలియనట్టుగా ఖాళీ చూపులతో నిలబడిపోయింది. ఆమెని చూడగానే హరిత తల్లి సుమతి అని గుర్తించాడు పాణి.
‘‘నా పేరు పాణి అండీ. హరిత చదివే కాలేజీలో పనిచేస్తాము మేము. ఈ సంవత్సరం మీ అమ్మాయికి కాలేజీలో బెస్ట్ స్టూడెంటు అవార్డు వచ్చింది. అందుకే కాలేజీ మేగజైన్‌లో ఆమె ఇంటర్వూ వేద్దామన్నారు మా ప్రిన్సిపాగారు. మీరు అనుమతిస్తే మీ అమ్మాయిని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాము’’ అన్నాడు పాణి.
హరిత కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది పాణి వంక.
‘‘అలాగా? హరిత నాకా సంగతి చెప్పలేదే?’’ అంది సుమతి అనుమానంగా.
‘‘ఆమెకి నేను చెప్పేదాకా ఆ సంగతి తెలియదండీ. కంగ్రాచ్యులేషన్స్ హరితా’’ అన్నాడు పాణి గబగబా.
హరిత నోట మాట రానట్టు చూస్తూ ఉండిపోతే, ‘‘చాలా సంతోషం బాబూ. రండి. కూర్చోండి’’ అంటూ ఆహ్వానించింది సుమతి అతడ్ని.
పాణి లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. హరిత అతడి ఎదురుగా కూర్చుంది. ‘‘ఈయన రవీంద్ర. ఇన్స్‌పెక్టర్’’ అంటూ హరితకి పరిచయం చేశాడు. హరిత భయంగా చూసింది రవీంద్ర వంక. గుటకలు మింగుతూ సోఫాలో కూర్చుంది.
సుమతి మాత్రం ‘‘ఇన్స్‌పెక్టరేమిటి?’’ అంది ఆశ్చర్యంగా.
‘‘కాలేజీల ఇన్స్‌పెక్టర్. మేము సరైన వ్యక్తిని బెస్ట్ స్టూడెంట్ అవార్డుకి ఎంపిక చేశామో లేదో తెలుసుకోవడానికి వచ్చారు’’.
‘‘ఓహో’’ అంది సుమతి.
‘‘మీ నాన్నగారు ఇంట్లో లేరా?’’ అడిగాడు పాణి ఇంటిని పరిశీలనగా చూస్తూ.
‘‘లేరు. ఆదివారం మధ్యాహ్నం నాన్నగారు క్లబ్‌కి వెడతారు’’ అంది హరిత.
‘‘మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కాఫీ తీసుకుని వస్తాను’’ అని చెప్పి సుమతి లోపలికి వెళ్లింది. అప్పటికిగానీ హరిత తేలికగా ఊపిరి పీల్చుకోలేదు. ఆమె తలెత్తి పాణి వంక చూసింది.
‘‘రేపు కాలేజీ దగ్గర మాట్లాడుకోవచ్చు కదా సార్? ఇంటికి ఎందుకు వచ్చారు?’’ భయంగా అంది హరిత.
‘‘ఆ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నించినపుడు మీరు నాకు ఉన్నదున్నట్టుగా చెప్పి వుంటే మేము మీ ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు’’ సీరియస్‌గా అన్నాడు పాణి.
‘‘నేను మీ దగ్గర ఏ విషయం దాచలేదు...’’
‘‘స్టాపిట్ మిస్ హరితా.. పోలీసులనీ డిటెక్టివ్‌లనీ మీరు మోసం చెయ్యలేరు. మీరు చెప్పినట్టుగా మీరు భరణితో మీ రిలేషన్ కట్ చేసుకోలేదు. ఆ తర్వాత కూడా మీకూ భరణీకి మధ్యన ఫోన్ కాల్స్ నడుస్తూనే ఉన్నాయి. అంతేకాదు, చనిపోయిన రోజు భరణితో పాటూ మీరు కూడా గెస్ట్ హౌస్‌కి వెళ్ళారు.
ఆ విషయం గెస్ట్ హౌస్ దగ్గర దొరకిన మీ వేలి ముద్రలు చెబుతున్నాయి. ఆ రోజు మీరు గెస్ట్ హౌస్‌కి భరణి కారులోనే వెళ్లారు. ఆ విషయం భరణి కారులో దొరికిన మీ వెంట్రుకలు చెబుతున్నాయి’’.
హరిత ముఖం తెల్లగా పాలిపోయింది అతడి మాటలకి. ‘‘మీరు పొరపడుతున్నారు సార్.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ