డైలీ సీరియల్

అన్వేషణ -43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నే వచ్చిన దగ్గర్నుంచీ నువ్వు నాతోనే తిరుగుతున్నావు.. పాపం సావిత్రి అవస్థపడుతోంది షాపు, ఇల్లు చూసుకుంటూ..’’ అన్నాడు అనిరుధ్.
‘‘్ఫర్వాలేదురా.. తనకి అలవాటే.. నేను ఆ పని ఈపనీ అంటూ తిరుగుతుంటాను.. షాపు తనే మేనేజ్ చేస్తుంటుంది..’’ చెప్పాడు కొండబాబు.
‘‘రేపు ఉదయానే్న వైజాగ్ వెళ్లిపోదామా మరి?’’
‘‘వెళదాం.. ఆలస్యం ఎందుకు.. అక్కడకెళ్లి ముందు థామస్ ఇంటి అడ్రస్ సంపాదించాలి ఈ ఫోన్ నెట్‌వర్క్ ఊపులో..’’ కొండబాబు చెప్పాడు.
‘‘అవును...’’
‘‘దానికంటే ముందు మనం డాక్టర్ శ్రీనివాస్‌గారిని కలవాలి..’’
‘‘డాక్టర్ శ్రీనివాస్‌నా?.. ఫర్ వాట్?’’ భృకుటి ముడిచాడు అనిరుధ్.
‘‘ఎందుకంటే విశాఖలో ఆయనకు తెలిసి వున్న డాక్టర్ ఎవరేనా ఉన్నారేమో కనుక్కోవాలి.. ఆయనకి తెలిసిన డాక్టర్ అయితే అక్కడ మ నకి ఓ సమస్య తీరుతుంది’’ వివరించాడు కొండబాబు.
‘‘యూ ఆర్ కరెక్ట్ కొండలూ.. ఆవిషయం మరిచిపోయాను...’’
‘‘పద ముందు అక్కడికి వెళదాం..’’ అంటూ అటు బైక్ పోనిచ్చాడు కొండబాబు.
అప్పటికింకా డాక్టర్ శ్రీనివాస్ క్లినిక్ రాలేదు. ఓ ముప్పావుగంట వేచి వున్నాక ఆయన వచ్చారు. బయట వేచి వున్న వీళ్లని చూసి ఆయన లోపలికి వెళ్లగానే ముందుగా వీళ్లనే పిలిచాడాయన.
తాము విశాఖ వెళ్లదల్చుకున్నదీ, అక్కడ ఆయనకి తెలిసి వున్న డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పమని అడిగాడు అనిరుధ్. ఆయన క్షణం ఆలోచించి అక్కడ తన క్లాస్‌మేట్ డాక్టర్ మహేశ్వర్ ఉన్నాడని చెప్పి ఆయన ఫోన్ నెంబరు, ఓ పర్సనల్ లెటరూ ఇచ్చాడు డాక్టర్ శ్రీనివాస్.
వీళ్లు విశాఖపట్నం వెళ్లాలనుకుంటుంటే అక్కడ నారాయణ వీళ్ల వివరాలకోసం రహీంకి ఫోన్లమీద ఫోన్లు చేస్తూ తంటాలు పడుతున్నాడు నారాయణ.
‘‘కంగారు పడకురా బాబూ.. వారం రోజులయ్యింది కదా.. బహుశా నువ్వూ వాడికి ఏమీ కావని తేలిపోయిందేమో... ఊరికే కంగారు పడి బయటపడకు.. అనవసర దాద్ధాంతం అవుతుంది. ఏదైనా జరిగితే అపుడు చూద్దాం..’’ అని రహీం సలహా ఇచ్చాడు.
‘‘ప్రస్తుతానికి అంతే.. మనం సేఫ్.. అర్థమయ్యిందా.. నువ్వు ఓ పని చెయ్యి.. ఎందుకేనా మంచిది థామస్‌గాడినిక ఫోన్ చేసి ఈ విషయం చెప్పు.. మేమిద్దరం బయట పడ్డాం.. ఇక మిగిలింది మీ ఇద్దరే.. అని ఇన్‌ఫర్మేషన్ ఇవ్వు.. వాడే జాగ్రత్తపడతాడు’’ అని సలహా ఇచ్చాడు రహీం పాషా.
ఆ వెంటనే థామస్‌కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు నారాయణ. అది విని ఆశ్చర్యపోయాడు థామస్. పెద్ద పెట్టున నవ్వేశాడు.
‘‘ఇది నిజమా! మీరిద్దరూ ఆ టెస్టుల్లో మ్యాచ్ కాలేదా? భలే తమాషాగా ఉందిరా నారాయణ!.. ఇక నేనూ కనకారావుగారూ ఉన్నామా?!..’’ అని మూడుసార్లు రెట్టించి మరీ అడిగాడు.
‘‘అవున్రా బాబూ.. విషయం తెలిసి నేను చాలా వర్రీ అయిపోయాన్రా.. ఇంకా నాకు ఆ టెన్షన్ తగ్గలేదు.. ఏమీ జరగలేదని మాత్రం అనుకుంటున్నాను.. రహీంగాడికైతే డాక్టర్ చెప్పాడు మ్యాచ్ కాలేదని.. నా విషయం ఏమీ తెలీదు.. ఏమీ తెలీదు కనక.. కాలేదనుకుంటున్నానంతే.. వాడు నీ గురించి వచ్చాడో... వస్తాడో... తెలీదు.. ఎందుకేనా మంచిదని నీకు ఫోన్ చేశాను..’’ చెప్పాడు నారాయణ.
‘‘ఎప్పటిమాటరా ఇది?! ఏ మాటకామాటే చెప్పుకోవాలి గానీ.. పిచ్చిదైనా అపుడు మనం భలే ఎంజాయ్ చేశాంరా..’’ అన్నాడు థామస్.
‘‘ఇపుడు ఆ సంగతి కాదురా బాబూ చూడాల్సింది.. నువ్వు తండ్రివని రుజువయి అపుడు సంగతి ఆలోచించు..’’ నారాయణ గాబరాగా అన్నాడు.
‘‘రానీ వాడి సంగతి చూస్తాను.. ఇంతకీ వాడి పేరు ఏమిటి.. ఫొటో ఏమన్నాంటే ఫోన్‌లో పంపించు.. వాడి సంగతి నేను చూసుకుంటాను.. నువ్వూ, రహీం తప్పించుకున్నందుకు కంగ్రాట్స్..’’ అంటూ ఫోన్ పెట్టేశాడు.
థామస్‌కి చెప్పాడన్నమాటేగానీ నారాయణకి ఇంకా టెన్షన్‌గానే ఉంది, ఇది ఏమవుతుందోనని. థామస్ ఈ విషయాన్ని అంత తీవ్రంగా తీసుకోకపోవడం నారాయణకి ఆశ్చర్యంగా అనిపించింది. కొంపలంటుకునే వార్త చెబితే ఏమిటి వీడు అలా మాట్లాడతాడని విసుక్కున్నాడు. ఆ విషయం రహీంకి ఫోన్ చేసి చెప్పాడు. చెప్పడం వరకే మన పని, తర్వాత వాడిష్టం... మనకి ఇక సంబంధం లేదు అన్నాడు రహీం.
***
రుషికొండ బీచ్ సమీపంలోని షైనీ ఎంటర్‌ప్రైసెస్ అన్న కంపెనీ నడుపుతున్నాడు థామస్. మనిషి నల్లగా ఉంటాడు. ఇరవై నాల్గు గంటలూ తాగే మనిషిలా కళ్లు ఉబ్బెత్తుగా ఉంటాయి. బండముక్కు, బండ పెదవులు. కుడి చేతికి బ్రాస్‌లెట్, వ్రేళ్లకి మూడు ఉంగరాలు ఉంటాయి. ఎడమ చేతికి గోల్డ్ కలర్ చైనుతో పెద్ద డయల్ ఉన్న వాచీ ఉంటుంది.
ఎప్పుడూ పొట్టి చేతుల తెల్లచొక్కా, తెల్లప్యాంటూ వేసుకుంటాడు. నల్లని బూట్లు తొడుక్కుంటాడు. కుడిచేతిలో ఎప్పుడూ రెండు సెల్‌ఫోన్లుంటాయి. ఎడమ చేతిలో తరచూ సిగరెట్ వెలుగుతూంటుంది. మనిషి ఎటు కదిలినా అటు ఘుమఘుమలు వెదజల్లుతూంటాయి.
అతని భార్య జ్యోతీ థామస్ ఆ దగ్గరల్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుంటుంది. అందుచేత ఆమె కాఫీ టిఫిన్లు, భోజనం అన్నీ అక్కడే. ఇంట్లో ఎప్పుడేనా థామస్ కోసం ఆమె వంట చేస్తుంది. అందుకని భోజనానికి టైముకు ఇంటికి వెళ్లాలన్న నియమం ఏదీ లేదు థామస్‌కి.
అతడికి రోజూ నాన్‌వెజ్ వంటకాలు కావాలి. అది లేకపోతే అతడికి ముద్ద దిగదు. అలాగే సాయంత్రాలు వట్టి డిన్నర్ మాత్రమే చెయ్యడు. కక్కులేనిదే అతడిని నిద్రా పట్టదు.
అతడు ప్రతి ఆదివారం విధిగా చర్చికి వెళతాడు భార్య జ్యోతితో కలిసి. అలాగని అతడికి నిర్దిష్ట నియమాలేమీ లేదు. డబ్బు సంపాదించడానికి ఏం చెయ్యడానికైనా అతడు వెనుకాడడు. కనుకనే అతడి కంపెనీ షైనీ ఎంటర్‌ప్రైజెస్ పేరుమీద అతడు చాలా వ్యాపారాలు, కొన్ని అధికారికంగా, కొన్ని అనధికారికంగా చేస్తున్నాడు.
ఆ వ్యాపారాలు ఏమిటీ అని ఎవరైనా అడిగితే సీఫుడ్, బియ్యం వగైరా వగైరా ఎక్స్‌పోర్టు చేస్తున్నామని చెబుతాడు. అంతేకానీ అమ్మాయిల్ని కూడా అరబ్ కంట్రీలకి ఎక్స్‌పోర్టు చేస్తున్నామని ఎవరికీ చెప్పడు. అవన్నీ అనధికారికంగా చేసే చీకటి వ్యాపారాలు.
సిటీలో వున్న కొందరు పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు థామస్‌కి పరిచయస్తులే. వాళ్లందరికీ చీకటి వ్యాపారాలవల్ల లాభం ఉంది.
అందుకే ఊళ్లోకి ఏ ఆఫీసరు ట్రాన్స్‌ఫర్ అయి వచ్చినా థామస్ వాళ్లని తేలిగ్గా పరిచయం చేసుకుంటాడు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842