డైలీ సీరియల్

అన్వేషణ -46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏంట్రా రెడీ అయిపోయావా?.. వచ్చేస్తాను పని నిముషాలు..’’ అని చటుక్కున లేచి గబగబా ఫ్రెష్ అయ్యారు. బట్టలు మార్చుకున్నాడు. ‘‘ఇప్పుడు మనం వాడి ఇల్లు చూసి వద్దాం..?’’ అన్నాడు లాడ్జి రూముకు తాళం వేస్తూ. అవునని తలూపాడు అనిరుధ్.
ఇద్దరూ థామస్ అడ్రెస్ పట్టుకుని ఆటోలో బయల్దేరారు. ఆ అడ్రస్ చెప్పిన ప్రాంతంలో ఓ సెంటర్‌లో దిగారు. ఆటోకి నూట్ యాభై ఇచ్చారు. అది ఎక్కువో తక్కువో అనిరుధ్‌కానీ, కొండబాబు కానీ ఆలోచించలేదు.
వాళ్లనీ, వీళ్లనీ అడుగుతూ ఓ రెండు కిలోమీటర్ల దూరం నడిచి థామస్ ఇల్లు వున్న ప్రాంతానికి వచ్చారు. ఇంటినెంబర్ల ఆధారంగా థామస్ ఇంటినీ గుర్తించారు.
సుమారు ఓ రెండు వందల గజాల స్థలంలో కట్టిన ఇల్లది. పైకి మోడ్రన్‌గానే కనిపించింది. కొంచెం దగ్గరికి వెళ్లి చూశారు. ఇల్లు తాళం పెట్టి ఉంది. అది ఐదేళ్ల క్రిందట అభివృద్ధికి వచ్చిన కాలనీ. ఇంకా రోడ్లు సరిగ్గా వెయ్యలేదు. అక్కడ మట్టిరోడ్లు కనిపిస్తున్నాయి.
‘‘ఇంట్లో ఎవరూ లేరంటే.. భార్య బయటికి వెళ్లయినా ఉండాలి.. లేదా ఉద్యోగస్తురాలైనా అయి ఉండాలి.. ఇప్పుడేం చేద్దాం?’’ అనిరుధ్ అడిగాడు.
‘‘ఎందుకేనా మంచిది ప్రక్కవాళ్లని అడుగుదాం..’’ అంటూ అనిరుధ్ సమాధానం కోసం ఎదురుచూడకుండా ప్రక్కింటికి వెళ్లాడు కొండబాబు.
‘‘ఈ ప్రక్కవాళ్లు ఎక్కడికి వెళ్లారండి?’’ అనడిగాడు వాళ్లని.
‘‘ఆమెగారు ఆఫీసుకు వెళ్లారు.. ఆయనా ఆఫీసుకు వెళ్లారు..’’ ప్రక్కింటావిడ చెప్పింది.
‘‘ఆయన ఆఫీసు ఎక్కడో చెప్పగలరా.. మేం ఆయన్ను కలవాలని వచ్చాం..’’ అన్నాడు కొండబాబు.
‘‘ఆయన ఆఫీసు.. రుషికొండ బీచ్ దగ్గర.. షైనీ ఎంటర్‌ప్రైజెస్.. అని..’’ అని చెప్పిందావిడ.
‘‘షైనీ ఎంటర్‌ప్రైజెస్?.. రుషికొండ బీచ్ దగ్గర కదూ అన్నారు.. థాంక్సండీ..’’ అని వచ్చేశాడు కొండబాబు.
ఏమైందన్నట్లు చూశాడు అనిరుధ్ మిత్రుడి ముఖంలో చిరునవ్వు చూసి.
‘‘చిన్న క్లూ దొరికిందిరా!.. రుషికొండ బీచ్ దగ్గర షైనీ ఎంటర్‌ప్రైజెస్ అనే ఆఫీసుంది వాడికి.. ఇప్పుడు టైము ఐదు అవుతోంది.. రుషికొండ బీచ్ ఇక్కడికి దగ్గరే.. జస్ట్ ఆఫీసు ఏమిటో.. చూద్దాం..’’ అంటూ ఖాళీగా వెళుతున్న ఆటోని పిలిచాడు కొండబాబు. అనిరుధ్ ఏమీ మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నాడు. పావుగంటలో వాళ్లు చెప్పిన సెంటర్‌కి తీసుకొచ్చాడు ఆటోవాలా.
అక్కడనుంచి నడచుకుంటూ ఆఫీసు బోర్డులు చూసుకుంటూ బయల్దేరారు ఇద్దరూ. షైనీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ ఎక్కడసార్ అని అడుగుతున్నారు. చివరికి ఆ విధీ చివరన, ఇంకా దాదాపు ఆఫీసులు ఏమీ లేనిచోట కనిపించింది షైనీ ఎంటర్‌ప్రైజెస్ అన్న బోర్డు.
ఆ బోర్డు చూడగానే వాళ్లకి ప్రాణం లేచొచ్చినంత పనయ్యింది. దానికి ఓ యాభై గజాలదూరంలో చిన్న చెట్టు క్రింద నిల్చున్నారు. అప్పుడు సమయం ఐదు గంటల ఇరవై నిముషాలు కావస్తూంది. ఆఫీసు నుంచి ఒకరు బయటికి వచ్చాడు. అతడిని పలుకరిద్దామా వద్దా అని కొద్ది క్షణాలు ఆలోచించాడు కొండబాబు. ఏదో వంక పెట్టి పలుకరించాలనే అనుకున్నాడు.
‘‘సార్!..’’ అన్నాడు అతడిని ఉద్దేశించి. ననే్ననా అన్నట్లు వీళ్లకేసి చూశాడు ఆ వ్యక్తి వెళుతున్నవాడల్లా ఆగి.
‘‘మిమ్మల్నే సర్..’’ కొండబాబు అతడి దగ్గరికి వెళుతూ అన్నాడు. అతడు నలభయ్యేళ్ల మనిషిలా ఉన్నాడు. కానీ అతడికి ముప్ఫయ్ ఐదేళ్లుంటాయి.. లాల్జీ పైజమా వేసుకున్నాడు. వేలాడే గుడ్డ సంచీ భుజాన వేసుకున్నాడు.
‘‘ఏమిటి?..’’ అనడిగాడు.
‘‘మీతో కొంచెం మాట్లాడాలి.. మీరీ కంపెనీలోనే పనిచేస్తున్నారు కదా?.. ఈ కంపెనీ గురించి.. మాట్లాడాలి..’’ కొండబాబు ఏదైతే అదవుతుందని ఓ రాయి విసిరాడు.
‘‘కంపెనీ గురించా?..’’
‘‘అవునండి..’’
‘‘సరే! రండి అలా వెళ్లి మాట్లాడుకుందాం..’’ అంటూ ముందుకు దారితీశాడు.
ఏం మాట్లాడతాం.. అన్నట్లు అనిరుధ్ మిత్రుడు కొండబాబుకేసి చూశాడు. కంగారు పడకు అన్నట్లు కొండబాబు కళ్లతోనే సౌంజ్ఞ చేశాడు. ప్రక్క రోడ్డులోకి దారితీసిన ఆ వ్యక్తి అక్కడ ఓ పాకలాంటి హోటల్లోకి తీసికెళ్లాడు. ముగ్గురూ అక్కడ కూర్చున్నాక ఆ వ్యక్తి టీలు ఆర్డర్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఏమిటి విషయం అన్నట్లు వాళ్లకేసి చూస్తూ సిగరెట్ ముట్టించాడు.
‘‘ఏం లేదండి.. మేం విజయవాడనుండి వచ్చాం.. ఇక్కడ పోర్టులో పనుండి.. అంటే చిన్నపాటి బిజినెస్ చేద్దామనుకుంటున్నాం. అక్కడ మాకు తెలిసి వున్న ఆయన ఈ కంపెనీ పేరు చెప్పి థామస్ అనే ఆయన్ని కలవమన్నాడండి.. ఆయన్ని కలిస్తే ఏమన్నా ప్రయోజనముంటుందా లేదా అని జస్ట్ తెలుసుకుందామని.. ఎందుకంటే మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్నారనుకుంటాము.. అందుకే అడుగుతున్నాం..’’ అన్నాడు కొండబాబు.
కొండబాబు సమయస్ఫూర్తికి అనిరుధ్ ఆశ్చర్యపోయాడు. అలాంటి ఆలోచన తనకి రానందుకు సిగ్గుపడ్డాడు. అతడిని కూడా తీసుకురావడం ఎంత మంచిదయ్యిందీ ఇప్పుడు అనిరుధ్‌కి బాగా అర్థమయ్యింది.
‘‘్థమస్.. ఎస్... మా బాస్.. వాడి సలహామీద మీరు చిన్న బిజినెస్ చేద్దామనుకుంటున్నారు.. వాడిని కలవమని మీకో ఆయన సలహా ఇచ్చాడు..’’ అని సిగరెట్ నుసి విదిలించాడు. ఇంతలో టీలు తెచ్చాడు కుర్రాడు.
తమాషాగా వున్న అతడి మేనరిజమ్‌ని గమనిస్తున్నాడు అనిరుధ్. కొండబాబుకి నవ్వొస్తోంది. కానీ ఆపుకుంటున్నాడు.
‘‘చూడండి.. నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అలాంటి పుంఢాకోర్ ఉండడుగాక ఉండడు.. ఎవరు?’’
‘... థామస్..’’ అనిరుధ్ అన్నాడు చప్పున.
‘‘ఎస్.. గుడినీ, గుళ్లో లింగాన్నీ మింగాలనుకునే తత్వం వాడిది.. ఏమిటీ వాడి దగ్గర పనిచేస్తూ ఇంతింత మాటలంటున్నాననా మీ ఉద్దేశ్యం..?’’ ఇద్దర్నీ చూసి అడిగాడు ఆ వ్యక్తి.
‘‘అబ్బే! అలాంటిదేమీ లేదు సర్.. మీరు చెప్పండి..’’ కొండబాబు చటుక్కున అన్నాడు.
‘‘ఇంతకీ మీరెవరో చెప్పారు కాదు?’’ మళ్లీ సిగరెట్ నుసి విదిలించి అడిగాడు.
‘‘నా పేరు కొండబాబు.. వీడి పేరు అనిరుధ్ అండి..’’
‘‘అనిరుధ్.. పేరు బావుంది.. బైదిబై .. నా పేరు పరమేశ్వరం.. అందరూ నన్ను పరం అంటారు..’’ అని వాళ్లిద్దరికీ షేక్ హ్యాండిచ్చాడు.
‘‘నైస్ టూ మీట్ యూ సర్.. అంటే మేం సరైన వ్యక్తిని కలుసుకున్నామన్నమాట..’’ కొండబాబు కాస్త పొగిడాడు పరమేశ్వరాన్ని.
‘‘ఇంతకీ మీరు ఏం బిజినెస్ చేద్దామనుకుంటున్నారు?’’ అడిగాడు పరమేశ్వరం.
‘‘ఏదైనా చిన్నది పరంగారూ.. అదీ థామస్ సలహా మీద..’’ చెప్పాడు అనిరుధ్.
‘‘వేస్ట్.. వాడు మీకు సలహా ఇవ్వడు.. వాడి దృష్టిలో వాడు తప్ప మరెవ్వరూ బాగుపడకూడదు.. ఇదివరకు ఇలాగే ఇద్దరు వచ్చారు. చెరో రెండు లకారాలు తగలేసుకుని వెళ్లిపోయారు.. మీరు ఎంత తగలెయ్యదల్చుకున్నారు?’’
‘‘అదేంటి సర్?’’ అనిరుధ్ అన్నాడు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842