డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

13. దిలీపుని కధ
దిలీప మహారాజు ఇలబిలుని పుత్రుడు. ఆ రాజు వందలకొద్దీ యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాల్లో లక్షలకొలది బ్రాహ్మణులు పాల్గొన్నారు. వారందరూ వేదాలలోని కర్మకాండ, జ్ఞానకాండలలోని అర్థాన్ని తెలిసినవారు. పుత్రపౌత్రులు కలిగిన గృహస్థులు. ఆ రాజు తాను చేసిన మహాయజ్ఞంలో ధనధాన్యాదులతో సమృద్ధమైన ఈ భూమిని మొత్తము బ్రాహ్మణులకు దానం చేశాడు. అతను యజ్ఞంలో సువర్ణమయమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది ధర్మ సంపాదిత పుణ్యమార్గంగా భావించి, ఇంద్రునితో సహా దేవతలు ఆ మార్గం ద్వారా వచ్చారు. అక్కడ పర్వతాలంత ఏనుగులు వేలకొలది ఉన్నాయి. బంగారపు యూపస్తంభాలు ఉన్నాయి. ఆ యజ్ఞంలో విశ్వావసువు స్వయంగా వీణ వాయించాడు. సర్వప్రాణులు అతన్ని సత్యవ్రతునిగా గుర్తించాయి.
అతని నివాసానికి వచ్చిన అతిథులు లడ్డూలు ఇతర ఆహారపదార్థాలు భుజించి మత్తుతో మార్గాల్లోనే నిద్రించేవారు. ఆ రాజు శ్రేష్ఠమైన ధానుష్కుడు. అతను నీళ్లలో రదం మీద ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు రదచక్రాలు నీటిలో మునగవు. అతనికి ఇంకోపేరు ఖట్వాంగుడు. అతని నివాసంలో ఎప్పుడూ స్వాధ్యాయ ధ్వని, అల్లెత్రాటిధ్వని, త్రాగండి, తినండి, అన్నం భుజించండి అనే అయిదు ధ్వనులు నిరంతరం వినిపిస్తూ ఉంటాయి. ధర్మ జ్ఞాన వైరాగ్యాలలో, ఐశ్వర్యంలో అతనితో సమానమైన వారు లేరు. ఇదీ దిలీపుని ఘనత.
14. అంబరీష చరిత్రము
అంబరీషుడు నాభాగుని కుమారుడు. అతను ఒక్కడే వేలమంది రాజులను ఎదిరించి జయించాడు. ఆ రాజులంతా అస్తవ్రిద్యానిపుణులు. వారంతా ఒక్కమారే అతన్ని చుట్టుముట్టారు. అయినా అతడు ఎలాంటి వ్యధ చెందలేదు. బలం, ఒడుపు యుద్ధనైపుణ్యంతో ఆ శత్రువుల రథాలను, ధ్వజాలను ధ్వంసం చేశాడు. శత్రురాజులు పరాజితులయి అతన్ని శరణు వేడారు. అతను వారిని లొంగదీసుకొని, ఈ భూమిని అంతా జయించి వందక్ష్మి యజ్ఞాలను చేశాడు. ఆ యజ్ఞాలలో బ్రాహ్మణులు దక్షిణలతో, భోజనములతో సంతుష్టి చెందారు. మత్తు కలిగించే పదార్థాలు సేవించడం వలన పాపం కలుగుతుందని తెలిసీ అవి సుఖాన్నిస్తాయని సేవించారు. అంబరీషుడు పది లక్షల బ్రాహ్మణులకు పట్ట్భాషిక్తులైన రాజులను, వందలకొలది రాజపుత్రులను దక్షిణగా ఇచ్చాడు. వారినందరినీ బంగారు రథాలమీద ఎక్కించి, వారి గృహాలకు పంపాడు.
‘అంబరీషుడు చేసినట్లు ఇంకెవరూ యజ్ఞాలు చేయలేదు, దక్షిణలు ఇవ్వలేదు’ అని మహర్షులు అతన్ని ప్రశంసించారు.
15. శశబిందు చరిత్ర
శశబిందువు మృతి చెంది చాలా కాలమైంది. అయినా ఇప్పటికీ తన గుణాల చేత లోకుల హృదయాలలో నివసిస్తున్నాడు. అతనికి లక్ష మంది భార్యలు ఉన్నారు. ఒక్కొక్క భార్యకు వేయి మంది పుత్రులు జన్మించారు. వీరంతా పరాక్రమవంతులు. వేదపారంగతులు. వారు రాజులు అయిన తర్వాత పదిలక్షల యజ్ఞాలు చేయాలని నిశ్చయించారు. ముఖ్యమయిన యజ్ఞాలు చేశారు. తర్వాత వారు సువర్ణ కవచాలు ధరించి అశ్వమేదయాగాలు చేశారు. శశబిందుడు తన కుమారులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. వారిలో ఒక్కొక్కరితో నూరు రథాలు, నూరు ఏనుగులు వెంబడించాయి. ప్రతి రాజకుమారునితో సువర్ణంతో అలంకరింపబడ్డ నూరు మంది కన్యలు వెళ్లారు. ఒక్కొక్క కన్యతో నూరు ఏనుగులు, ఒక్కో ఏనుగుతో నూరు రథాలు వెళ్లాయి. ప్రతీరదంతో బలిష్టమైన నూరు అశ్వాలు, ప్రతీ అశ్వంతో వేయి గోవులు, ప్రతీ గోవుతో ఏభై గొర్రెలు వెళ్లాయి. ఇలా ఒక్కో బ్రాహ్మణుడు సైన్యమంత పరివారాన్ని వెంటబెట్టుకొని వెళ్లాడు. రాజు యజ్ఞాల్లో వండించిన అన్నరాసులు పర్వతాలంత ఎత్తు ఉన్నాయి. ఈ విధంగా రాజు అన్నదానం తక్కిన దానాలు, యజ్ఞాలు చేసి కీర్తిని పొందాడు.
16. యయాతి చరిత్ర
యయాతి చంద్రవంశానికి చెందిన రాజు. అతను ధర్మాత్ముడు. యయాతి మహారాజు నూరు అశ్వమేథాలు, వేయి పుండరీక యాగాలు, నూరు వాజపేయాలు, వేయి అతిరాత్రాలు, వేయి చాతుర్మాసాలు, వివిధ సూత్రయాగాలు చేశాడు. దుర్మార్గుల నుండి ధనం వసూలు చేసి పుణ్యాత్ములైన వేదపండితులకు ఆ ధనం దక్షిణగా ఇచ్చాడు కాని తన సుఖాల కోసం ఉపయోగించుకోలేదు.
యయాతి మహారాజుకు నదులలో గొప్ప పుణ్యప్రద అయిన సరస్వతీనది, సముద్రాలు, పర్వతాలతో కూడిన సరస్సులు నేతిని, పాలను పితికి ఇచ్చాయి. దేవాసుర సంగ్రామంలో యయాతి దేవతలకు సహాయం చేశాడు. ఎన్నో యజ్ఞాలను పరమాత్మను ఉద్దేశించి చేశాడు. ఈ భూమిని అంతా నాలుగు భాగాలుగా చేసి, ఋత్విక్కు, అధ్వర్యు, ఉద్గాత, హోత అనే యజ్ఞనిర్వాహకులు అయిన బ్రాహ్మణులకు దానం చేశాడు. అతనికి ఇద్దరు భార్యలు. శుక్రాచార్యుని పుత్రిక దేవయాని, శర్మిష్ఠ, వారియందు ఉత్తమ పుత్రులను కన్నాడు. భూమి మీద ఉండే ధాన్యం, యవలు, బంగారం, స్తల్రు, భోగాలు, మానవునికి సంపూర్ణంగా సంతోషాన్ని కలుగచేయవని గుర్తించి, యయాతి పూరువుని రాజుని చేసి అడవులకు వెళ్లి తపస్సు చేసికొన్న జ్ఞాన, వైరాగ్య ధర్మాలలో ఉత్తముడు యయాతి మహారాజు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి