డైలీ సీరియల్

సావిత్రి ఉపాఖ్యానం-68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించేవాడు. అతను పరమ ధార్మికుడు. బ్రాహ్మణులను భక్తితో సేవించేవాడు. సత్యసంధుడు. జితేంద్రియుడు. సర్వప్రాణుల హితం కోరేవాడు. అతనికి ఒక్కటే లోపం ఉండేది. అతను సంతానహీనుడు. సంతానం కోసం అతను సావిత్రీదేవిని ఆరాధించాడు. రోజూ లక్ష గాయత్రి హోమం చేస్తూ రోజులలో ఆరవ భాగంలో మితంగా ఆహారాన్ని స్వీకరించేవాడు. ఈ విధంగా పద్దెనిమిది సంవత్సరాలు చేశాడు. అతని భక్తికి, శ్రద్ధకు సావిత్రి సంతోషించి దివ్యరూపం ధరించి అగ్నిహోత్రం నుండి ఆవిర్భవించింది. రాజుకు దర్శనమిచ్చింది. తర్వాత ఆమె అశ్వపతితో ఇలా అంది. ‘‘రాజా! నీ బ్రహ్మచర్యంతో, నియమనిష్ఠలతో, భక్తితో చేసిన సేవలకు నేను తృప్తి చెందాను. నీకు ఇష్టమయిన వరం కోరుకో’’.
అప్పుడు అశ్వపతి దేవితో వినయంగా ఇలా అన్నాడు. ‘‘దేవీ! ధర్మాచరణ కోసం సంతానాన్ని పొందాలని ఈ హోమాన్ని చేశాను. నీవు ప్రసన్నురాలవైతే నాకు పుత్రులను ఇవ్వు. నాకు సంతానాన్ని ప్రసాదించు.’’
అప్పుడు సావిత్రీ దేవి ఇలా అంది. ‘‘రాజా! నాకు నీ కోరిక తెలుసు. కాని బ్రహ్మదేవుడు నీకు తేజస్విని అయిన పుత్రికను అనుగ్రహించాడు. కనుక వేరే వరం కోరకు’’.
అశ్వపతి సరేనని సావిత్రిని ప్రసన్నురాలిని చేసుకొన్నాడు. దేవి అదృశ్యమైపోయింది. రాజు తన నగరానికి తిరిగి వచ్చాడు. కొంతకాలం తర్వాత రాజుగారి భార్య గర్భవతి అయింది. నెలలు నిండగానే ఆమె చక్కని ఆడపిల్లను కన్నది. సావిత్రీ దేవి వరం వలన జన్మించింది కనుక అశ్వపతి ఆమెకు సావిత్రి అని నామకరణం చేసి అల్లారుముద్దు గా పెంచసాగాడు. ఆ రాకుమారి రూపుదాల్చిన లక్ష్మి లాగ దినదిన ప్రవర్ధమాన మై యుక్తవయస్కురాలైంది. ఎంతో తేజస్సుతో ఉన్న ఆమెను వరించడానికి ఎవ్వరూ సాహసించలేదు. ఎవ్వరూ ఆమె కోసం రావడం లేదని మహారాజు బాధపడ్డాడు. అతను కుమార్తెను పిలిచి ఇలా అన్నాడు. ‘‘పుత్రీ! నీకు వివాహ సమయం వచ్చినప్పటికీ ఎవరూ నీ కోసం నన్ను అడగటం లేదు. కనుక నీవు నచ్చిన వరుని స్వయంగా వెతుక్కో. అతనికి నిన్నిచ్చి కన్యాదానం చేస్తాను. ధర్మశాస్త్రాలు ఇలా చెప్తున్నాయి. ‘కూతురికి పెండ్లి చేయని తండ్రి నిందింపదగినవాడు. అలాగే కాలంలో భార్యను సమీపించని భర్త నిందింపదగినవాడు. భర్త మరణించిన తల్లిని రక్షించని కుమారుడు నిందింపదగినవాడు.’ కనుక నీవు భర్తను వెతుక్కో. నన్ను ఈ దోషం నుంచి రక్షించు’’. కూతురుతో ఇలా అని మహారాజు ఆమె ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి వృద్ధమంత్రుల్ని తోడిచ్చి ఆమెను పంపాడు. సావిత్రి తన ప్రయాణాన్ని తపోవనం వైపు సాగించింది. అక్కడ ఋషులకు మొక్కుతూ బ్రాహ్మణులకు దానాలు చేస్తూ ఆమె తీర్థాలలో, తపోవనంలో తిరిగింది.
ఒకరోజు అశ్వపతి నారదునితో, మంత్రులతో కలిసి సభలో ఉండగా సావిత్రి తిరిగి వచ్చి, తండ్రికి, మహర్షికి నమస్కరించింది. రాజు ఆమె వరించిన భర్త గురించి వివరించమనగా సావిత్రి ఇలా చెప్పింది. ‘‘శాల్వదేశాన్ని ద్యుమత్సేనుడనే రాజు పరిపాలించేవాడు. ప్రస్తుతం రాజ్యం పోగొట్టుకొని, గ్రుడ్డివాడై భార్యతోను, కుమారునితోను తపోవనంలో ఉన్నాడు. ఆ కొడుకు పేరు సత్యవంతుడు. అతనిని నేను భర్తగా వరించాను’’.
ఆమె మాటల్ని విన్న నారదుడు విచారంగా ఇలా అన్నాడు. ‘‘అయ్యో రాజా! విషయం తెలియక సావిత్రి సత్యవంతుని వరించింది. అతని తల్లిదండ్రులు సత్యమే పలుకుతారు. కనుక అతనికి సత్యవంతుడని పేరు పెట్టారు. అతనికి చిత్రాశవుడని ఇంకొక నామం ఉంది.’’
రాజు ఇలా అడిగాడు. ‘‘అయితే సత్యవంతుడు సహనశీలుడు, తేజస్వి, శూరుడు, పితృవత్సలుడు కాడా?’’
దానిక నారదుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘‘నిజమే! సత్యవంతుడు సూర్యునిలా తేజస్వి, బుద్ధికి బృహస్పతి, శిబిలాగా బ్రాహ్మణ భక్తుడు, చంద్రునిలాగ అందగాడు, జితేంద్రియుడు, శూరుడు, సత్యస్వరూపుడు’’.
అప్పుడు రాజు ఇలా అన్నాడు ‘‘స్వామీ! అతనిలోని సుగుణాలను చెప్తున్నారు. దోషాలు ఉంటే చెప్పండి’’.
నారదుడు ఇలా అన్నాడు ‘‘ఇన్ని సుగుణాలు ఉన్న సత్యవంతునిలో ఒకే ఒక దోషం ఉంది. దాన్ని ఏమి చేసినా తొలగించలేము. నేటి నుంచి సంవత్సరం లోపు అతని ఆయువు తీరి మరణిస్తాడు.’’
అప్పుడు రాజు ఇలా అన్నాడు ‘‘సావిత్రీ! నీవు ఇంకొక వ్యక్తిని వరించు’’.
సావిత్రి స్థిరమైన మనస్సుతో ఇలా అంది ‘‘స్తల్రు ఒక్కసారి ఎంచుకుంటారు. ఒక్కసారే కన్యాదానం చేస్తారు. సత్యవంతుడు దీర్ఘాయువు, అల్పాయువు అయినా, గుణవంతుడు అయినా కాకపోయినా ఒకసారి వరించిన తర్వాత వేరొకరిని మరల వరించను. మనసులో నిశ్చయించుకొని మాట చెప్పి క్రియా రూపంలో పెడ్తాము. నా మనసే నాకు ప్రమాణము’’.
అప్పుడు నారదుడు రాజుతో ఇలా చెప్పాడు. ‘‘రాజా! నీ కుమార్తె నిశ్చలమైన బుద్ధి కలది. ధర్మమార్గంలో నడుస్తున్నది. సత్యవంతుడు గుణవంతుడు. కనుక అతన్ని నీ అల్లునిగా చేసుకో’’. మహర్షి మాటలు విని రాజు సావిత్రి వివాహానికి ఏర్పాట్లు చేయసాగాడు.
ఇంకావుంది...