డైలీ సీరియల్

అనంతం-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎట్టా’’
‘‘మంచి బువ్వెట్టి మందుగోలీలు మింగిచ్చి దేవుడి పందికి శావలు జేస్తే - మడుసుల్లో యింకా భక్తి ఉండట్టు. పంది దారి పందిదంటే భక్తి లేనట్టు’’
‘‘ఏందేలింది’’ అని కాళీచరణ్ అడిగాడు
‘‘ఉండట్టే ’’
‘‘ఎట్టా’’
‘‘జొర్గవ్ తగ్గాలని పూజలే జేశారా. పొర్లు దండాలే బెట్టారా కొబ్బెరకాయలె గొట్టారా సివరాకరికి సర్కారు గూడా పందికి మంచి వైజ్జిగం సెయ్యాలని ఆడరేసింది’’
‘‘్భక్యా తండా వోళ్ల గూడా జొరాలోచ్చి సత్తన్నారు ఎయ్యలేదే ఆడరు’’ అని అడిగాడు కాళీచరణ్
బాణావతు కొంచెంసేపు ఆలోచించాడు
‘‘ఇది మాయదారి లోకం డీ కాళీచరణ్ ఈ లోకవ్ లో మనసువంటోళ్లు పందులకన్నా కుక్కల కన్నా ఎలకాసిలకల కన్నా సివాదోమలకన్నా నీశం! నీశాతి నీశం!’’ అన్నాడు బాధగా
కాళీచరణ్ వౌనంగా నడవసాగాడు. కొంతదూరం వెళ్లేదాకా ఎవ్వరూ మాట్లడలేదు.
‘‘కొడుకుదే దిగులయ్యింది ’’కాళీచరణ్ అన్నాడు
‘‘రాగ్యాగాడి యిసయమేనా’’
‘‘ఇంకెవ్వుడూ .. ఆడే’’
‘‘ఏటైందేటి ’’అడిగాడు బాణావతు
‘‘సంతెకి బొతావత్తా పట్నపోళ్ల మాయలోబడింటు సెప్పింది యినుకొలేదు పెడసరవ్ గయ్యిండు’’
‘‘ఆడూ సెడిపోయిండూ’’
‘‘సిన్నగంటవే ఇంగిలీసు సిల్మాలంట సిగిరెట్ల బ్రాందీలంట’’
‘‘గుట్కాలూ ఇస్కీలంట.. శానా గలీజయ్యిండు’’
‘‘్ధయిర్నెంగుండు కొండదేవరే ఉండాడు’’
‘‘మంచోళ్లని మంచిగా ఉంచుతాడే వోగానీ సెడిన్నాకొడుకుల్నేటి శాత్తాడు దేవర! నా గాశారం అట్టాగుంది తోసటం లేదు’’
‘‘సిగిరెట్లు బ్రాందీ యిస్కీ గూడా మరిగిండా’’
‘‘మరిగిండు.. తాగిండంటే మడిసి కాదు మైండు పోయిద్ది’’
‘‘బువ్వని పెండంటాడు. పెండని బువ్వంటాడు. మరాటడికి బువ్వెఎట్టాల్నో పెండే బెట్టాల్నో’’
‘‘అమ్మ లేనోడని గారబం జేత్తే అంతే’’
‘‘అనుభగిత్తున్నాను’’
’’అదేవంటే తండాలో ఉండడంట పట్నం బోయి గొప్పోళ్లకాడ ఉద్దోగం శాత్తానంటాడు. డబ్బులు సంపాయిచ్చి పులిగో సెచిన్నూ ఉంగరాలు దొడిగి సూటూ బూటూ యేత్తాడంట. తనంత మడిసి సూటూబూటూ ఏసి సిగిరెట్లు దాగుతా సిలకలెంట బడతా సీదర మాటలు మాట్సాడ్తా కళ్లబడితే సిల్మావోళ్లు రమ్మంటారంట’’
‘‘మావోడికి పైచ్చికారితనం గాకపోతే సిలకలెంటబడతా సీదర మాటలు మాట్టడతా సిగిరెట్లు గాల్సే సెట్టంత మడ ఇసంట వాళ్లకాడ లేరూ రుూ నాయాలే గావాలా!’’
‘‘పట్న పోళ్ల కాడ సదువుంది. మాటకారితనవూ బిత్తర తనవూ వుంది. గడ్డీ గాద గర్సి పెద్దోళ్లు దాపెట్టిన సొత్తుంది. పగలు పని, రేత్తిరిళ్ళు దతొంగతనాలు సెయ్యకుండా బతికే ఆదరువుంది. నీకేవుందిరా గోసీ అంటే ’’
‘‘ఇయ్యాల్సి గోసీలే రేపటి మినిట్టర్లని సదువు లేనోళ్లకే అతికారమని ప్రెగది పతంలోకి దేశం ఉరుకుద్దనీ సెప్తుండు’’
‘‘పట్నపోళ్ల బిత్తర మాటలు నమ్మిండా ’’అని అడిగాడు బాణావతు
‘‘రాగ్యాగాడి కుండొద్దూ గేనం
‘‘అవుడియా అన్నాడు బాణావతు
‘‘ఏంటిదది
‘‘నగ్గూరాంగాడి కూతురు శాందినీ సక్కంగుంటుంది
‘‘రాగ్యాగాడికీ శాందినీకీ లగ్గం జేస్తే సంసారంలో బడి సక్కంగుంటడు’’
‘‘ఒస్ అదా నీఅవుడియా’’
‘‘బాగాలేదా’’
‘‘బాగ్గానే ఉంది’’
‘‘ఇంకేమరి ’’
‘‘నగ్గురాంగాడు పిల్లనియ్యడు సచ్చినా ఒప్పుకోడు’’
‘‘ఎంటికని’’
‘‘ఒకపాలి శాందినీని రాగ్యా ఏంచేసిండో తెల్సా’’
‘‘తెలవదే..’’
‘‘పట్నంలో ఇంగిలీసు సిల్మా సూసొచ్చిండు. సిల్మాలో రుూరో రుూరోయిన్ని సెరిసిండంట సెరిపిచ్చుకున్న ఆడకూతురూ సెర్చిన మొగకొడుకూ నగుతానే మళ్ళా మళ్లా సెరసి సెరపిచ్చుకున్నారంట’’
‘‘సిల్లాల్లో అట్టా గుంటుందా’’ బాణావతు అడిగాడు
‘‘సిల్మాల్లో అంతే ’’అన్నాడు కాళీచరణ్
‘‘అయితే ’’
‘‘సిల్మా యిడిసినాక జీవులెక్క ఇంటికొచ్చిండు రాగ్యాగాడు’’
‘‘బువ్వదిని తొంగుండా’’
‘‘తొంగుంటే కతే వుంది. తొంగోలేదు. తూల్తా తూల్తా తూల్తా సింతల తోపుకాడికెళ్లిండు సెమ్మట్లుకొచ్చిన శాందినీ సెయ్యట్టుకొని సాటుకు లాగబోయిండు’’
‘‘అపుడేవయ్యింది’’
‘‘శాందినీ శాకులాంటి పిల్ల . పులులకీ సింహాలకీ భయపడని దైర్నంగల పిల్ల యవ్వారం సెడిదంటే సివంగోలే దూకే పిల్ల..’’
‘‘భయ్యంతో పారెళ్లిందా’’
‘‘మావోడే పారెళ్లిండు’’
‘‘అదెట్టాగా ’’
‘‘సెంబుతో గొట్టింది తలమీద బొప్పిలెగిసింది
‘‘ఇదంతా ఎవ్వురికీ తెలవదే’’
‘‘దాపెట్టినావు పరువుపోయిద్దని’’
వాళ్లు నల్లకొండకు చేరకొన్నారు. అలుపు తీర్చుకుంటూ ఒక్కక్షణం వౌనంగా నిల్చున్నారు.
‘‘తేనె పట్టు యాడుంది’’ నెమ్మదిగా కాళీచరణ్ అడిగాడు
‘ఆడ’ అంటూబాణావత్ వ్రేలు చూపించాడు
తలెత్తి అటువైపు చూశాడు కాళీచరణ్ అతని మొహం సంతోషంగా విప్పారింది.
పక్కపక్కనే ఉన్న రెండు టేకు చెట్లను ఆసరా చేసుకొని వ్రేలాడుతూ ఒక పెద్ద తేనె పట్టు కనిపించింది
‘‘ఎంత పెద్దగుంది’’ అన్నాడు కాళీచరణ్
‘‘అందుకే మరి నినె్నంట దెచ్చింది. పట్టుకొడితే రెండు బుగ్గలు నిండుతయ్యి సెరోబుంగ నె్తం మీద మోసుకపోవొచ్చు. నీ శాకరి నే నుంచుకొనే్ల’’
బాణావతు మాటలకు కాళీచరణ్ భుజాలు ఎగురవేసి ‘‘ఎంతిత్తావేటి ’’అని అడిగాడు నవ్వుతూ
‘‘కోర్నంతా ’’అని బాణావతు కూడా నవ్వాడు
ఇద్దరూ అలాసరదాగా మాట్లాడుకుంటూ తేనె పట్టు దగ్గరికి వెళ్లారు..
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు