డైలీ సీరియల్

ఒయాసిస్ (కొత్తసీరియల్ ప్రారంభం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్విని హాస్పిటల్‌లో ఫస్ట్ఫో్లర్‌లో డాక్టర్ మమత అప్పుడే ప్రసవించిన సుభద్రకు అభినందనలు తెలిపింది.

నర్స్ నిర్మల పసిబిడ్డను తీసుకొచ్చి తల్లికి చూపించింది. సుభద్ర మొహంలో ప్రసవ వేదన తాలూకు అలసట కనిపిస్తున్నా, బిడ్డను చూసుకుని పడిన శ్రమనంతా మర్చిపోయి తృప్తిగా నవ్వుకుంది.

‘‘మగ పిల్లాడు.. సంతోషమేనా?’’ అని అడిగింది మమత. ఆమె నవ్వుతూ తలూపింది.
మమత ఆ రూంలోనుంచి బయటకు రాగానే సుభద్ర భర్త, అత్త ఎదురైనారు.
‘‘కంగ్రాట్స్.. మగ పిల్లాడు..’’ అని వాళ్ళకు చెప్పింది మమత.
‘‘్థంక్యూ.. కరెక్ట్ టైం..’’ అని నసిగాడు సుభద్ర భర్త.
‘‘నర్స్ నోట్ చేసింది. ఆమె చెబుతుంది..’’’ అంటూ డాక్టర్ మమత తన రూంలోకి వెళ్ళబోయింది.
కిందనుంచి చౌకీదార్ పరుగెత్తుకుంటూ వచ్చాడు.
‘‘అమ్మా, అమ్మా.. డాక్టరమ్మా ఎవరో కత్తితో పొడిచారమ్మా.. కింద రూంలో పడిపోయిందమ్మా..’’ అని రొప్పుతూ చెప్పాడు చౌకీదారు.
‘‘ఏంటి చౌకీదార్, ఏమైంది? అని అడిగింది డాక్టర్ మమత, అతని మాటల్ని నమ్మలేక.
‘‘మన అమ్మగారమ్మా.. శే్వతమ్మగారు.. రూంలో పడిపోయి ఉండారమ్మా.. ఎవరో చంపేశారమ్మా.. రగతం అమ్మా..’’ అన్నాడు చౌకీదారు.
డాక్టర్ శే్వత ఏమిటి? రక్తం.. ఏమిటి? చనిపోవటం ఏమిటి? ఇప్పుడేగదా ఆమె సుభద్రకు డెలివరీ చేయించి కిందకు వెళ్లింది.. అతను చెప్పింది ఎంత మాత్రం నమ్మబుద్ధి కావటంలేదు.
‘‘వచ్చి చూడండమ్మా.. మన డాక్టరమ్మను చంపేశారమ్మా..’’ అంటున్నాడు చౌకీదారు.. మమత షాక్ నుంచి తేరుకుని, పరుగులాంటి నడకతో, రెండేసి మెట్లు దూకుతూ కిందకు వెళ్లింది.
డాక్టర్ శే్వత కన్సల్టేషన్ రూం తలుపు తెరిచే ఉంది. మమత ఒక్క ఉదుటన రూంలోకి వెళ్లింది. బాత్‌రూం దగ్గర డాక్టర్ శే్వత నిర్జీవంగా పడిపోయి ఉంది.
మమత దగ్గరకెళ్లి చూసింది. గొంతు దగ్గర నుంచి పొత్తికడుపుదాకా కత్తిపోట్లు.. రక్తం ధారగా స్రవించింది.. కళ్ళు నిశ్చలంగా చూస్తున్నాయి.. తెరచిన నోరు తెరిచినట్లే వుంది.. తెల్లని చీరంతా రక్తంతో తడిసి, చాలావరకు ఎర్రగా మారింది.
‘‘మేడమ్.. మేడమ్...’’ అంది మమత వణికే గొంతుతో. శే్వత చనిపోయినట్లు స్పష్టంగా తెలుస్తున్నా, ఇంకా పిలిస్తే పలుకుతుందేమోనన్న ఆశతో పిలుస్తోంది.
పైనుంచి నర్సులు, ఆయాలు, పేషెంట్స్ తాలూకు బంధువులూ.. అందరూ కిందకు వచ్చి రూంలోకి తొంగి చూస్తున్నారు.
నర్స్ నిర్మల మాత్రం శే్వత శరీరం దగ్గరకొచ్చి చూసింది. ‘‘అయిపోయింది మేడమ్.. నో హోప్స్..’’ అంది కన్నీళ్ళు కారుస్తూ.
‘‘ఇప్పుడే కదా మేడమ్ కిందకొచ్చారు.. డెలివరీ అయ్యేదాకా ఆమె కూడా అక్కడే వున్నారు. కదా..’’ అన్నది మమత ఏడుస్తూనే.
ఇద్దరు మగవాళ్ళు గేటుదాకా వెళ్లి చూశారు, ఎవరన్నా పారిపోతున్నారేమోనని.. ఎవరూ కనిపించలేదు.
సుభద్ర భర్త పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పాడు. ‘‘ఇక్కడ అశ్వనీ నర్సింగ్ హోం నుంచి మాట్లాడుతున్నానండి.. ఈ హాస్పిటల్ డాక్టర్ శే్వత గారిని, ఆమె కన్సల్టేషన్ రూంలోనే కత్తితో పొడిచి చంపేశారు..’’
‘‘ఎక్కడుందా నర్సింగ్ హోం..’’
అతను వివరాలు చెప్పాడు.
‘‘మీరెవరు?’’
‘‘నా భార్య ఇక్కడ కొద్దిసేపటి క్రితం పురుడు పోసుకుంది. అందుకని నేను ఇక్కడున్నాను..’’
‘‘మీ పేరు..?’’’
‘‘సుబ్బారావు..’’’
‘‘మీ అడ్రసు..?’’
సుబ్బారావు తన అడ్రసు చెప్పాడు.

- ఇంకాఉంది

శ్రీధర్