డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని మాటలు విన్న రాజు ఇలా తలచాడు. - ‘‘ఈ ఇద్దరి వివాదం ఇప్పుడే వచ్చి పడింది. బ్రాహ్మణుడు కూడా దానం స్వీకరించమని వత్తిడి తెస్తున్నాడు. ఏం చేయాలి?’’
రాజు వికృత, విరూపులతో ఇలా అన్నాడు. ‘‘మీ వివాదం తీరిన తర్వాతే వెళ్ళండి. నా రాజధర్మం అబద్ధం కాకూడదు. రాజులు స్వధర్మ పరిపాలన చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయ. ఇప్పుడు ఈ కఠినమైన బ్రాహ్మణ ధర్మం కూడా నన్ను ఆవేశించింది.’’
విప్రుడు ఇలా అన్నాడు - ‘‘రాజా! నీవు అడిగినది నేను ఇస్తానని అన్నాను. ఇప్పుడు అది నీవు నా దగ్గర దాచిన వస్తువులాగ ఉంది. వెంటనే తీసుకో!’’
రాజు - ‘‘రాజ ధర్మం చాలా క్లిష్టమైనవి. ఇప్పటి వరకు నేనెవరి ముందు చేయ జాచలేదు. ఇప్పుడు నీ ముందు చాపుతున్నాను. నీ దగ్గరున్న నా సొమ్ము నాకు ఇచ్చివేయ’’.
అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు - ‘‘సంహితను జపిస్తూ నేను కూడబెట్టిన పుణ్యం మొత్తం స్వీకరించు. ఇది కాక ఇంకేదైనా పుణ్యం నా దగ్గర ఉంటే దాన్ని కూడా తీసుకో’’.
అప్పుడు రాజర్షి ఇలా అన్నాడు ‘‘నీ దానాన్ని నేను స్వీకరించాను. నీవు కూడా నా దానాన్ని స్వీకరించు. మొత్తం దాన పుణ్యం చెరి సగం ఇద్దరం అనుభవిద్దాము.’’
అప్పుడు విరూపుడు ఇలా అన్నాడు - ‘‘రాజా! మేమిద్దరం కామక్రోధులం. మేమే నీ చేత ఈ పని చేయంచాము. తపః, దాన ఫలం చెరిసగం చేసుకొని అనుభవిస్తే ఇద్దరికీ ఒకే లోకం లభిస్తుంది. మేమిద్దరం ఒకరికొకరు ఏ బాకీ పడలేదు. మేమిద్దరమూ కాలుడూ, యముడూ అందరం మిమ్ము పరీక్షించడానికే వచ్చాము. నీ కర్మఫలంగా నీకు నచ్చిన లోనికి నీవు వెళ్ళవచ్చు.’’
బ్రాహ్మణుడు కూడా దీనికి అంగీకరించి వారిని అందరినీ పూజించి రాజుతో ఇలా అన్నాడు.
‘‘రాజర్షీ! ఈ తప్ఫఃలంతో నీవు ఉత్తమ లోకాలకు వెళ్ళు. నేను మరల తపస్సు చేస్తాను. నాకు జపం మీద శ్రద్ధ ఉంటుందని సావిత్రీదేవి వరమిచ్చింది.’’
అపుడు రాజు ఇలా అన్నాడు - ‘‘ద్విజోత్తమా! జప దాన ఫలితం ఇద్దరం కలిసి అనుభవిద్దాము’’. దానికి బ్రాహ్మణుడు అంగీకరించాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పుమన్నాడు.
అప్పుడు దేవేంద్రుడు దిక్పాలకులతో కలిసి అక్కడికి వచ్చాడు. అప్పుడు గొప్ప వాద్యాలు మ్రోగాయ. గంధర్వులు గానం చేశారు. వారిద్దరిపై పుష్పవృష్టి కురిసింది. వారిద్దరూ కలిసి తమ మనసులను విషయాల నుండి ఉపసంహరించు కొన్నారు. తర్వాత పంచ ప్రాణాలను మనస్సులో నిలిపారు. కనుబొమ్మల మధ్య నాసిక మీద దృష్టి నిలిపి, ప్రాణయమాలను సుషుమ్న ద్వారా హృదయస్థానంలో నిలిపి సమాధి స్థితికి చేరుకున్నారు. వారి శరీరాలు నిశ్చలంగా ఉన్నాయ. అప్పుడు ఆ బ్రాహ్మణుని బ్రహ్మరంధ్రం ఛేదించుకొని ఒక తేజోమయమైన జ్యోతి బయటకు వచ్చి స్వర్గం వైపు వెళ్ళింది. ఆ తేజః పుంజం చిన్న పురుషునిగా మారి బ్రహ్మ సన్నిధికి చేరింది. బ్రహ్మ ఆ పురుషునికి స్వాగతం పలికాడు. బ్రహ్మ ఇలా అన్నాడు - ‘బ్రాహ్మణా యోగులతో సమానమైన ఫలితాన్ని జాపకులు కూడా పొందుతారు. నీవు నాలోనే నిలిచిపో’. అప్పుడు బ్రాహ్మణుడు బ్రహ్మవదనంలోకి ప్రవేశించాడు.
అక్కడ ఉన్న దేవతలంతా ఇలా అన్నారు - ‘‘జాపకుడు, యోగులతో సమానంగా పొందే స్థానాన్ని చూడడానికీ మేమంతా వచ్చాము.’’
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు - ‘‘ఒక్కటిగా వచ్చిన ఈ ఇద్దరూ కూడా సమాన ఫలాన్ని పొందారు. ఇద్దరూ అన్ని లోకాలను దాటి వారికిష్టమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు’’.
అప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గర వీడ్కోలు తీసుకొని తమ తమ నివాసాలకు వెళ్ళారు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి