డైలీ సీరియల్

అనంతం-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రగిలిపోతారని ఎలా చెప్పగలరు’’
‘‘ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం’’
‘‘మీ తదుపరి కార్యక్రమం?’’
‘‘పిచ్చుకల ప్రాజెక్టు’’
‘‘వ్వాట్’’
‘‘సెల్ టవర్లవల్ల పిచ్చుక జాతి అంతరించిపోతోంది’’
‘‘ఐతే.?’’
‘‘అడవుల్లో రక్షిత ప్రాంతాలు నెలకొల్పాలి’’
‘‘అన్నిరకాల పిచ్చుకలకూనా?’’
‘‘ఊరపిచ్చుకలకు మాత్రమే’’
‘‘ఎందుకని’’
‘‘దేశభక్తి’’
‘‘ఊర పిచ్చుకలకీ దేశభక్తికీ ఏమిటి సంబంధం.’’
‘‘ఊరపిచ్చుక లేహ్యం ధాతుపుష్టికి దివ్యమైన ఔషధం.’’
‘‘్ధతు పుష్టికి దేశభక్తికీ ఏమిటి సంబంధం.’’
‘‘చీపులిక్కరు గుట్కాలు మాదకద్రవ్యాలు- కలుషితమైన గాలి నీరూ... జాతిని నిర్వీర్యం చేస్తున్నాయి! వాళ్ళకి ఊరపిచ్చుక లేహ్యం అందించి పుష్టి సంపన్నులను చెయ్యటమే దేశభక్తి.’’
‘‘ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిస్తారా.’’
‘‘అందులో ఒక చిక్కుంది.’’
‘‘ఏమిటో...?’’
‘‘అమెరికా వాళ్ళతో కలసి లేహ్యం చెయ్యాలంటారు.’’
‘‘నిధులకు దిగులుండదు కదా.’’
‘‘ఇండియా ఊర పిచ్చుకల మీద అమెరికా పెత్తనం చేస్తుంది.’’
‘‘చేస్తే ఏం?’’
‘‘మన ఊర పిచ్చుక లేహ్యం అమెరికాలోనే అమ్మాలంటారు.’’
‘‘లాభమే కదా.’’
‘‘లేహ్యం మనది. ధాతుపుష్టి వాళ్ళకా? అన్యాయం.’’
అందరూ భళ్ళున నవ్వారు.
మళ్ళీ గ్లాసుల నిండా మందు నిండింది.
‘‘ప్రొడక్షన్ మొదలైతే నాకూ ఊరపిచ్చుక లేహ్యం పంపించండి’’ అన్నాడొక పోలీసు అధికారి నవ్వుతూ.
‘‘పరిస్థితి చెయ్యి దాటిపోయిందా.’’ గరుడాచలం అడిగాడు.
‘‘టెన్స్! బట్ అండర్ కంట్రోల్’’ అన్నాడతను.
మళ్ళీ అక్కడ నవ్వులు విరిసాయి...
విందు పూర్తయ్యింది.
అందరూ వెళ్ళిపోయాక గరుడాచలం, రాగ్యా మిగిలారు.
‘‘సారూ’’అని నెమ్మదిగా పిల్చాడు రాగ్యా.
‘‘ఏమిటి? చాంద్‌నీ విషయమేనా?’’ అడిగాడు గరుడాచలం.
అతని జ్ఞాపకశక్తికి రాగ్యాకి ఆశ్చర్యమనిపించింది!
అంత నిషాలోకూడా తన విషయం అతనికి గుర్తున్నదంటే ఎంత అభిమానం తన పట్ల!
‘‘దేవర జాతరొత్తుండాది’’అని గుర్తుచేశాడు రాగ్యా.
అప్పటికప్పుడు కారుమబ్బులు క్రమ్ముకున్న ఆకాశంలా అతని మొహం నల్లగా మాడిపోయింది రాగ్యా గమనించలేదు!
‘‘అనుకున్నట్టే అంతా జరుగుతుంది. ఎమ్మెల్లేగారు కూడా పట్టుదలతో ఉన్నారు. కాయా? పండా? అన్నది త్వరలోనే తేల్చేస్తారు’’అని రాగ్యాకి ధైర్యం చెప్పాడు గరుడాచలం.
కొంత సమయం గడిచింది.
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్లే పెంటారెడ్డి ఎక్కడికో వెళ్ళి, వ్యవహారాలన్నీ చక్కదిద్దుకొని వొచ్చాడు.
గరుడాచలం అతనికి ఎదురువెళ్ళి స్వాగతం పలికాడు!
ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
‘‘రాగ్యా నీతోనే ఉన్నాడా?’’ గుడారంలోకి వెళ్ళకుండా బైటే నిలబడి అడిగాడు ఎమ్మెల్లే.
‘‘ఏమంటాడూ! చాందినీ కావాలిట. తొందరపడుతున్నాడు’’
‘‘నీకుమాత్రం తొందరగా లేదూ’’అని, క్రీగంట గరుడాచలాన్ని చూస్తూ అదోలా నవ్వాడు ఎమ్మెల్లే.
గరుడాచలం వౌనంగా నవ్వూరుకున్నాడు.
‘‘అంతా నాకు తెలుసు! ప్రతీకారం తీర్చుకోవటంకన్నా, నీకు చాంద్‌నీని అనుభవించాలన్న ఆసక్తే ఎక్కువగా వుంది.’’
‘‘నా కళారాధన అలాంటిది’’అన్నాడు గరుడాచలం.
‘‘కీపిట్టప్! శృంగారం కూడా ఓ కళే! పైగా, అన్ని కళల్లోనూ అదే గొప్పది! రసికులెవ్వరూ దాన్ని కాదనరు.’’
‘‘నేను మాత్రం అన్నానా.’’
‘‘రాగ్యాకేమీ అనుమానం రాలేదా?’’
‘‘ఇప్పటివరకు రాలేదు.’’
‘‘జాగ్రత్తగా డీల్ చెయ్యాలి వాడ్ని.’’
‘‘అవస్యం’’అన్నాడు గరుడాచలం.
‘‘రాగ్యా ఎక్కడున్నాడు’’ క్షణం తర్వాత ఎమ్మెల్లే అడిగాడు.
‘‘నా గుడారంలో..’’
‘‘ఒంటరిగా నువ్వొకసారి రావాలి. గుడారంలోనే వుంటాను’’అని చెప్పాడు ఎమ్మెల్లే, తన గుడారంలోకి దారితీస్తూ.
గరుడాచలం రాగ్యా దగ్గరికి వెళ్ళాడు.
ఏవో ఊహల్లో తేలిపోతూ బాహ్యప్రపంచానే్న పూర్తిగా మరచిపోయి, ఓ మూల కూర్చొని ఉన్నాడు రాగ్యా.
‘‘రాగ్యా’’అని పిలుస్తూ గరుడాచలం వచ్చి, భుజంమీద చేత్తో తట్టేదాకా రాగ్యా రుూ ప్రపంచంలోకి రాలేదు.
‘‘ఏమిటలా ఉన్నావు?’’ గరుడాచలం అడిగాడు.
‘‘శాందినీ గురుతొస్తుంది’’అన్నాడు రాగ్యా దీనంగా.
మఫ్టీ కానిస్టేబులు కనకయ్య వొచ్చాడు. గరుడాచలానికి అభివాదం చేసాడు.
‘‘ఎమ్మెల్లేగారు త్వరగా రమ్మంటున్నారు’’అని చెప్పాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు