డైలీ సీరియల్

అనంతం-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుడాచలం రాగ్యావైపు మొహం విప్పార్చి చూస్తూ-
‘‘చూశావా రాగ్యా! నీ విషయంలోనే ఎమ్మెల్లేగారు కబురుపెట్టింది. అన్ని ఏర్పాట్లూ వారే చూస్తున్నారు. పెద్దపెద్ద వాళ్ళతో మాట్లాడరుకూడా! చాంద్‌నీనీ, నిన్నూకలపందే నిద్రపోరు’’అని రాగ్యాకి ధైర్యంచెప్పి, ఎమ్మెల్లే గుడారానికి వెళ్ళిపోయాడు గరుడాచలం.
ఎందుకోమరి, కానిస్టేబులు కనకయ్య కొద్దిక్షణాలు రాగ్యావైపు అదోలా చూస్తూ అక్కడే నిల్చున్నాడు తనలోతను నవ్వుకుంటూ!
ఎంఎల్లే, గరుడాచలం ఎదురుబొదురుగా కూర్చున్నారు.
‘చెప్పండి’’అన్నాడు గరుడాచలం.
‘‘అండీదాకా వచ్చిందా, వ్యవహారం’’అన్నాడు ఎమ్మెల్లే.
‘‘కార్యసాధకుల లక్షణం అది’’అన్నాడు గరుడాచలం.
‘‘అంత అవసరం లేదు.’’
‘‘విషయం చెప్పు.’’
‘‘ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దేవర జాతర సమయంలో చాంద్‌నీ జోగినిగా మార్తుంది. ముందు నువ్వేదాన్ని అనుభవిస్తావో, రాగ్యాకి అప్పగిస్తావో, నాకు అనవసరం! స్నేహధర్మం పాటించి, నీకోసం అంతా చేశాను’’అన్నాడు ఎమ్మెల్లే.
‘‘నా విషయం, రాగ్యా విషయం అలా వుంచు! తమరేమీ ‘ఎంగిలి’ పడరా?’’
‘‘మందు అలవాటే లేదు, ఇక పొందు నాకెందుకూ.’’
‘‘మందుకీ పొందుకీ పొంతన లేదు! ఒకటి లేదని రెండోది ఒద్దంటే ఎలా?’’
‘‘ఒకటి వుంది కనుకనే.’’
‘‘ఏంటో అది.’’
‘‘్భర్య’’అన్నాడు ఎమ్మెల్లే నవ్వుతూ.
ఎవ్వరో వొచ్చారు.
‘‘రెడీ చేశారా’’వాళ్ళని ఎమ్మెల్లే అడిగాడు.
‘‘రెడీ సార్’’అన్నారు వాళ్ళు.
కొంతమంది కూలీలు బరువుగావున్న గోతాలు తెచ్చి, గుడారంలో ఓ ప్రక్కన క్రిందపెట్టారు.
కానిస్టేబులు కనకయ్య వొచ్చాడు!
‘‘సరిపోయాయి’’ అన్నాడు గోతాలు లెక్కవేసి.
‘‘ఇలా రా’’ ఎమ్మెల్లే కనకయ్యని దగ్గరికి పిల్చాడు.
అతను దగ్గరికి రాగానే-
‘‘నీ గురించి అంతా విన్నాను. నువ్వు ఏంచెయ్యాలో, మీ ఆఫీసర్లు చెప్పే ఉంటారు...’’
‘‘చెప్పారు సార్’’ అన్నాడు కనకయ్య.
‘‘చిన్న పొరపాటుకూడా దొర్లకూడదు.’’
‘‘దొర్లదు సార్.’’
‘‘నటనలో అనుభవం వుంది కదూ.’’
‘‘విపరీతంగా.’’
‘‘మోతాదు మించితే ప్రమాదం.’’
‘‘సమయస్ఫూర్తి కూడా వుంది సార్.’’
‘‘అదే కావాలి! అడవి మనుషుల్తో వ్యవహారం.’’
‘‘నా సమర్థతని సందేహించకండి సార్’’
‘‘నటన సరే! భాష ఎలా’’
‘‘అడవిలో కూంబింగ్ చేసిన అనుభవం వుంది. అడవి పుత్రుల భాషతో పరిచయం వుంది’’.
‘‘ఆహార్యం, భాష, అభినయం- అన్నీ పాత్రకి నప్పాలి’’
‘‘ఒక విషయం చెప్పనా సార్’’ అని సంకోచిస్తూ ఎమ్మెల్యే వైపు చూశాడు కానిస్టేబుల్ కనకయ్య.
‘‘సందేహం వద్దు.. ఏమిటో చెప్పు’’ అన్నాడు ఎమ్మెల్యే.
గురుడాచలం కూడా కనకయ్య వైపు చూస్తున్నాడు!
అమాయకంగా మొహం పెట్టి-
‘‘పోలేరమ్మ జాతర బందోబస్తుకి బోతే ఒకపాలేవైనాదంటే సారూ..’’ అన్నాడు.
ఎమ్మెల్యే, గరుడాచలం సంతోషంతో తబ్బిబ్బయ్యారు.
‘‘అద్భుతం’’ అన్నాడు గరుడాచలం.
‘‘్భష కూడా నప్పింది! సమయస్ఫూర్తిదే తేలాలి’’ అన్నాడు ఎమ్మెల్యే.
‘‘.. జాతర్లో ఒకవైపు తప్పెట్లు మోగుతుండయ్యి.. ఒకేపు బాజాలు మోగుతుండయ్యి! సిందులే యాత్తండారా.. రంగులే సల్లుతుండారా..
డ్యూటీలో వుండే మా కానిట్టేబులొకడు- పైచ్చికారెదవలే సారూ సెరుగ్గెడల దుకానంకాడికి సందాకి బోతే- సెరుకులమ్మే సివాద్రి పెండ్లాం సీతాలు సివంగోలె లెగిసింది!
కాకి గుడ్డలేసి కాయకట్టవ్ నూకనీకి బందోబస్తుకొత్తవంటరా యదవ సచ్చినోడ! గవోర్నవెంటు లాటీలిచ్చి, టుపాకిలిచ్చి, కాకి గుడ్డలిచ్చి మందిని కాపాడండంటే మంది సొమ్ము కోసరవ్ డూటీ శాత్తావంటరా పీనిగెదవ!’’ అంటూ ఎగబడింది.
పోలీసోనిమీద అట్టా ఎగబడితే సట్టవ్ సూత్తా వూరుకోదు. సిచ్ఛిచ్చుద్ది. గుల్లబారగొట్టి జేల్లో బెట్టుద్ది!
నూకింది పోలీసాయన గదా! ఎగబడితే సట్టవ్ సేతులు సాపి సెరుగ్గెడలన్నీ నూక్కపోయిద్దని గురుతొచ్చి, సివాద్రి పెండ్లా సీతాలు సిటికెలో పిలేట్ ఫిరాయిచ్చింది!
నెత్తిమీది జుట్టుసెరుపుకొని, మొకమీది బొట్టు మొత్తవ్ సేరిపేసుకొని, నిప్పులోలన సిందులేసే కోతిలెక్క సిందులేత్తా-
‘అట్టా సూత్తారేంటిరా- అమ్మోరి మయివలు తెలవని నాత్తికపు నాయళ్ళారా! అమ్మోర్ని పాలేరమ్మోర్ని గురుతే బట్టలేదంటరా సచ్చినోళ్ళల్లారా!
నా కూతురుసువంటి సింవాద్రి పెండ్లాం సీతాలు దుకానానికే సందా కొత్తారంటారా- ఎంత దైర్నెవ్! తిక్కలెగిసిందంటే హోల్ మొత్తం డిపారుటువెంటునే శపిస్తాను. రగతం గక్కిసావాల. పొట్టలు కరిగిపోయి ఏనుగసువంటి మడుసులు పీనిగెలు గావాల’ అంటూ సారూ. తెగతిట్టింది.
అపుడు నేనూ అక్కడే డ్యూటీలో ఉన్నాను.
తోడి కానిస్టేబుల్ని కాపాట్టం నా ధర్మం కదా!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు