డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహ్నుమహర్షి కుమారుడు అజుడు. అతని కొడుకు బలా కౌశవుడు. అతని కుమారుడు కుశికుడు. అతను ధర్మాత్ముడు. ముల్లోకాలను జయించే పుత్రుడు కలగాలని కుశికుడు గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు అతనికి పుత్రునిగా జన్మించాడు. అతని పేరు గాధి. అతనికి సత్యవతి అనే పుత్రిక కలిగింది. గాధి ఆమెను భృగుమహర్షి పుత్రుడైన ఋచీకునకు ఇచ్చి వివాహం చేశాడు. ఆమె సత్ప్రవర్తన, ధర్మనిరతికి, శుచిత్వానికి సంతృప్తి చెంది ఋచీకుడు ఆమెకూ, ఆమె తల్లికీ కూడా పుత్రులు కలగాలని రెండు చరువులు పండించి భార్యతో ఇలా అన్నాడు. ‘‘ఈ చరువును నీవు ఉపయోగించు, రెండవది మీ అమ్మ భుజించాలి. ఈ లోకంలో ఎవ్వరు గెలవలేని క్షత్రియుడు ఆమెకు పుడ్తాడు. అతను క్షత్రియ శ్రేష్ఠుడు కూడా. ధైర్యం, శమం కల సద్బ్రాహ్మణుడు నీకు పుడతాడు’’ అని భార్యతో ఇలా చెప్పి అతను తపస్సు చేసికొనేందుకు అరణ్యానికి వెళ్ళిపోయాడు.
అదే సమయంలో తీర్థయాత్రలు చేస్తున్న గాధి మహారాజు భార్యతో కలసి ఋచీకుని ఆశ్రమానికి వచ్చాడు. సత్యవతి తల్లి తండ్రులను చూసిన ఆనందంతో రెండు చరువుల గురించి భర్త అన్న మాటలు తల్లికి చెప్పి ఒక చరువు ఇచ్చింది. కాని పొరపాటున తన చరువు తల్లికి ఇచ్చి తల్లి చరవుతాను తీసుకొంది. అందు వలన క్షత్రియులను అంతం చేసే గర్భాన్ని సత్యవతి ధరించింది. ఆమె గర్భం విపరీతమైన తేజస్సుతో ప్రకాశించ సాగింది. ఋచీకుడు తిరిగి వచ్చి ఆమె గర్భంలో ఉన్న బ్రాహ్మణ తేజాన్ని చూసి భార్యతో ఇలా అన్నాడు ‘‘చరువులు తారమారు అవటంవలన నీపుత్రుడు్ర కోధి, క్రూర కర్ముడూ అవుతాడు. నీ తమ్ముడు బ్రాహ్మణుడు, తపస్వీ అవుతాడు. నీ చరువులో మహిమాన్వితమైన బ్రహ్మజ్ఞానాని పెట్టాను. నీ తల్లి చరువులో క్షత్రియ వీరుని పెట్టాను. కాని అవి తారుమారు అయ్యాయి. నీకు క్షత్రియుడు నీతల్లికి బ్రాహ్మణుడు పుడతారు’’ భర్త ఇలా చెప్పగానే సత్యవతి దుఃఖించి శోకంతో భర్త కాళ్ళపై పడి ఇలా ప్రార్థించింది.
‘‘స్వామీ! బ్రాహ్మణాధముని పుత్రునిగా పొందుతావు అని నాతో ఇప్పుడు చెప్పటం సముచితం కాదు’’. ఋచీకుడు భార్యతో ఇలా అన్నాడు. ‘‘సౌభాగ్యవతీ! నీ యందు నేను ఇటువంటి పుత్రుని సంకల్పించలేదు. చరువు మారటం వలన అతన తీవ్రమైన కోపం, ఉగ్ర కర్మలు చేసేవాడు అవుతాడు’’.
సత్యవతి మరల ఇలా ప్రార్థించింది ‘‘స్వామీ! నాకు శాంత స్వరూపుడు సరళ స్వభావకలవాడు తపస్వి అయిన పుత్రుని అను గ్రహించండి’’.
ఋచీకుడు ఇలా సమాధానం చెప్పాడు ‘‘నేను ఎన్నడూ పరిహాసానికైనా అసత్యం ఆడలేదు. మంత్ర పూర్వకంగా అగ్నిని నిలిపి చరువును సాధించాను. కల్యాణీ! ముందే నాకు తపస్సులో అంతా తెలిసింది. నీ తండ్రి వంశమంతా బ్రహ్మభూతవౌతుంది’’.
అప్పుడు సత్యవతి భర్తను ఇలాకోరింది. ‘‘స్వామీ ! మీకు ఇదే ఇష్టమయితే నా మనుమడు అలాంటి వాడు అవనివండి, కాని నాకు మాత్రం తపోధనుడు ప్రశాంత చిత్తుడు అయిన పుత్రుడే కావాలి’’. అప్పుడు ఋచీకుడు భార్యతో ఇలా అన్నాడు ‘‘పుత్రునికీ, పౌత్రునికీ పెద్ద భేదం లేదు, నీకు నీవు కోరుకున్న పుత్రుడే జన్మిస్తాడు’’.
తర్వాత కొంత కాలానికి సత్యవతికి తపస్సంపన్నుడైన పుత్రుడు కలిగాడు. అతనే జమదగ్ని. సత్యవతి తల్లికి కూడా విశ్వామిత్రుడు జన్మించాడు. జమదగ్ని శాంతిస్వభావుడూ, వినయశీలుడూ, బ్రహ్మగుణాలు కలిగిన వాడు. తర్వాత అతడు బ్రహ్మర్షి అయినాడు.
అతనికి భయం కరుడైన పుత్రుడు కలిగాడు. అతను ధనుర్విద్యా పాంర గతుడు, సకల విద్యలూ నేర్చినవాడు. అగ్నిలాగ ప్రకాశించాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి