డైలీ సీరియల్

అనంతం-36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎనిమిదిగొంటే?’’ అని అడిగాడు గోపీనాయక్.
కిలాడి వ్యాపారి మొహం వాడిపోయింది!
ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకపోతే తన మోసం బైటపడుతుంది.
ఇక యంత్రాలు అమ్ముడుపోకపోగా, ఇప్పటికే కొన్నవాళ్ళు గొడవ చేస్తారు.
ఏం చెప్పాలా? అని.
ఒక్క క్షణం ఆలోచించి-
‘‘ఎనిమిది అదృష్ట సంఖ్య బాబూ... యంత్రాలు కొనండి! ఎనిమిది కొని మెడలో వేసుకుంటే, రాబోయే రోజుల్లో కాబోయే రాజులు మీరే! మీ రాజ్యంమీరేలండి. అదృష్టాన్ని కాలదన్నుకోకండి.
రాండి బాబూ రాండి..
ధనలక్ష్మి యంత్రాలు కొనండి అని మళ్ళీ అరిచాడా కిలాడి వ్యాపారి.
గోపీనాయక్‌కి వొళ్ళుమండింది!
రుూతాకుల చాప మీదనుంచి ఎనిమిది సత్తురేకుబిళ్ళలు అందుకున్నాడు. కిలాడి వ్యాపారి మెడలో వేసి-
‘‘ఇంక నువీడ అగుపిచ్చావంటే సంపుతాను! డిల్లీకో, అయిద్రాబాదుకో బోయి రాజువిగా రుూ రాజ్జఁవ్ మాకొద్దు’’అన్నాడు.
అతని అనుచరులు కిలాడి వ్యాపారి చుట్టుముట్టారు.
అతనికి పరిస్థితి అర్థమైంది!
మహామహిమాన్వితమైన సత్తురేకుల ధనలక్ష్మి యంత్రాలను పాత గోతాల్లో మూటకట్టుకొని, అక్కడ్నించి ఉడాయించాడు!
అంతలో-
సాయుధ పోలీసుబలగాలు నల్లకొండ దగ్గిరికి చేరాయి.
కవాతులు మొదలయ్యాయి.
ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది!
అడవి పుత్రుల మొహాలు పాలిపోయాయి. నెత్తురు చుక్కలేదు. భయంభయంగా పోలీసులవైపు చూస్తున్నారు. వొణికిపోతోన్నారు.
అలా ఎందుకు జరుగుతున్నది?
గతంలోకూడా కొండదేవర జాతర్లు చాలాసార్లు జరిగాయి. ఎప్పుడూ అంతమంది సాయుధ పోలీసులు రాలేదు. కవాతులు చెయ్యలేదు. అడవి పుత్రుల్ని భయపెట్టలేదు.
అలాంటిది, ఇప్పుడలా పరిస్థితి వుందంటే ఏం జరుగుతుంది?
జాతరకి తయారై వెళ్ళేందుకు రెడ్డియానాయక్ తండావాళ్ళు బయల్దేరే సమయానికి కబురు అందింది!
పోలీసులు బాగా మోహరించారనీ, అడవిపుత్రుల్ని డేగకళ్ళతో చూస్తూ, తుపాకులు సిద్ధంగా ఉంచుతున్నారనీ...
బాణావతు, కాళీచరణ్, నగ్గూరాం మొహాలు వాడిపోయాయి.
ఆలోచనలో పడ్డారు!
అప్పుడు-
తేనెపట్టు కొట్టబోతే బాణావతునీ, కాళీచరణ్ణీ చావబాది, తండా ఖాళీచేసి వెళ్ళిపోవాలని పోలీసులు హెచ్చరించటం.. కోపంలోవున్న తండావాళ్ళు ఎమ్మెల్లేగారి ‘తండాబాట’ కార్యక్రమాన్ని విఫలం చెయ్యటం..
అదేనేమో రుూ అనర్థాలన్నింటికీ మూల కారణం!
చాంద్‌నీ విషయంలో పంచాయితీకి భయపడిఅయిన వాళ్ళనూ, తండానీ ఒదిలిపెట్టి వెళ్ళి నాగరికులతో చేతులు కలిపిన రాగ్యా హస్తం ఉందేమో!
ఇప్పుడేం చెయ్యాలి?
ఉపద్రవంనుంచి ఎలా బైటపడాలి?
ఏం చెయ్యాలో వాళ్ళకి అర్ధంకావటం లేదు.
తరతరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో విద్యకీ, జ్ఞానానికీ, వైద్యానిక్కూడా నోచుకోకుండా పరమనికృష్టంగా జీవిస్తున్న అడవి పుత్రులు- అమ్మవడిలాంటి అడవితల్లి వొడిలో సేదతీర్తుంటే,
అక్కడా వాళ్ళని బ్రతకనివ్వకపోతే ఎలా?
సందేహం లేదు!
బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకోసం అమాయకులైన అడవి పుత్రుల జీవితాలతో చలగాటమాడుతున్నారు. బ్రతుకుల్ని ఛిద్రం చేస్తున్నారు.
అంతవరకూ దీర్ఘాలోచనలో ములిగిపోయిన బాణావతు నెమ్మదిగా గొంతువిప్పి-
‘‘ఆరునూరైనా తండా ఇడ్చిపెట్టి యాడికోబోయే పనే్లదు.
టుపాకులు గాల్సినా రుూడ్నే ఉందావు... సత్తే సద్దావుగానీ అడివిని మాత్తరఁవ్ ఇడ్సిపెట్టఁవ్’’అన్నాడు, ఉద్వేగంగా.
అందరూ అతన్ని సమర్ధించారు.
‘‘రాగ్యాగాడి యవ్వాఁరవేటి శాద్దావూ కాళీచరణ్ అడిగాడు.
‘‘కొండకాడికి బోదాఁవు. రాగ్యా కనిపిత్తే కట్టితెద్దాఁవు. ఇశారణ జెయ్యాలికదా’’ అన్నాడు బాణావతు.
రెడ్డియానాయక్ తండావాళ్ళందరూ బయల్దేరారు.
‘‘ఆడోళ్ళు యనకఁవాల రాండి.. ఆడ పరిత్తితి ఎట్టాగుందో! గొడవేటైనా జరిగితే సెడ్డసిక్కొచ్చుద్ది’’అన్నాడు బాణావతు.
పిల్లలు, స్ర్తిలు, వృద్ధులు తండాలోనే ఆగిపోయారు.
నగ్గూరాం బాణావతు కాళీచరణ్ ముందు నడుస్తున్నారు. వాళ్ళవెంట మిగతావాళ్ళంతా కదిలిపోతున్నారు.
తండా దండు కదిలింది.
నల్లకొండ వైపుకు సాగిపోతోంది.
అందరి చేతుల్లోనూ సాంప్రదాయక ఆయుధాలున్నాయి.
* * *
ఇంకొంత సమయం గడిచింది.
మేళ తాళాలతో, బాజాలతో, డప్పుల చప్పుళ్ళతో, కేరింతలతో పరిసరాలు హోరెత్తిపోతోన్నాయి.
ఇంకా తండాల్లోనుంచి జనం తరలివస్తూనే ఉన్నారు.
ఆ హడావుడికీ, చప్పుళ్ళకీ బెదిరి, దేవరకి బలిచ్చేందుకు తెచ్చిన మేకలు గొర్రెలూ చింతులు తొక్కుతూ గొంతు చించుకొని అరుస్తున్నాయి.
అప్పుడే డోలీనుంచి క్రిందికి దిగిన ఎవ్వరో వృద్ధుడు, దేవర దగ్గరికి నడిచి వెళ్ళలేక, కోర్కె చంపుకోలేక, అక్కడ్నించే దణ్ణం పెడుతూ-
‘‘దేవరా! ఇదే నాకు సివరాకరి సూపు. అడవి బిడ్డల్ని సల్లంగ సూడు...’’అంటున్నాడు.
రాళ్ళని పొయ్యిలుగా పెట్టి దూరంగా కొంతమంది సంకటి వొండుతున్నారు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు