డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఎన్నో విషయాలు చూస్తాము. కాని వాటిని పరీక్షించి నిర్ధారించాలి. బలవంతుడైన రాజు ఇంకొకరిని చంపడం తప్పు. అతన్ని నీవే మంత్రిగా నియమించావు. అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి అరుదుగా లభిస్తాడు. అతను సహృదయుడు. కనుక అతన్ని రక్షించు. నిర్దోషులను దండించే రాజు దుష్టులైన మంత్రులతో కలిసి తొందరగా నశిస్తాడు.’’
అప్పుడు ఆ శత్రుసమూహం నుండి ఒకడు బయటకు వచ్చి గోమాయువుకు జరిగిన అపకార మోసం గురించి చెప్పాడు. అంతా విన్న రాజు జరిగిన మోసం గ్రహించి గోమాయువును ఈ అభియోగం నుండి విముక్తుని చేశాడు. కాని గోమాయువు ఈ అవమానంతో బాధపడి ప్రాయోపవేశం చేయాలనుకొంది. కాని శార్దూలం దాన్ని అన్ని విధాలా సత్కరించి దాన్ని ప్రాయోపవేశం చేయకుండా ఆపింది.
కాని కన్నీళ్లతో గోమాయువు రాజుతో ఇలా అంది. ‘‘రాజా! మీరు మొదట సత్కరించారు. తర్వాత అవమానించారు. నేను మీ వద్ద ఉండడానికి తగను. గౌరవమైన పదవులనుండి తొలగింపబడిన వారు ఇతరుల మోసాలకు గురైనవారు, లుబ్ధులు, గర్వితులు ధనం కోల్పోయిన వారు, కపటంతో నిండినవారు వీరంతా శత్రువులకు సాధనాలుగా మారుతారు. నేను ఒకసారి స్థానభ్రష్ఠత్వం, అవమానం పొందినవాడిని. నన్ను ఎలా నమ్మగలరు? నేనెలా ఉంటాను? ఇలా అవమానం పొందిన నాకు ఇక్కడ విశ్వాసం ఉండదు. మీకు నామీద విశ్వాసం పోయింది. అందువల్ల నాకు భయం కలుగుతున్నది.
నా యందు స్నేహభావం లేని వారిని నేను తృప్తి పరచలేను. ఎంతో కష్టం మీద ప్రేమ బంధం అతుక్కుంటుంది. అలా అతుక్కున్న ప్రేమ బంధం అతికష్టం మీద విడిపోతుంది. అలా విడిపోతూ, కలుస్తూ ఉండే ప్రేమలో స్నేహం ఉండదు. ఎవరో ఒక్కరు ప్రభువు హితం కోరే వారుంటారు. మిగిలిన వారు తమ స్వార్థం చూసుకునేవారే. స్నేహభావం గలవారు దుర్లభులు. యోగ్యులైన వారి గురించి తెలుసుకోవడం రాజులకు కష్టం. వారి చిత్తం చంచలంగా ఉంటుంది. కనుక వందల్లో ఒక్కడు నమ్మకస్తుడు దొరుకుతాడు.
అకస్మాత్తుగా గౌరవించడం, అకస్మాత్తుగా అవమానించడం మేలు చేసి కీడు చేయడం, గొప్పదనం కల్పించి దిగజార్చడం ఇవన్నీ రాజులకుండే చిన్న బుద్ధి లక్షణాలు’’ ఇలా రాజుకు అనేక విధాలుగా నచ్చ చెప్పి, రాజును సంతృప్తి పరిచి గోమాయువు అడవిలోకి వెళ్ళిపోయింది. రాజు మాటలు పట్టించుకోక ప్రాయోపవేశం చేసి తన శరీరాన్ని విడిచి స్వర్గాన్ని పొందింది.
ఋషి - శే్వన సంవాదం
ఒక మహారణ్యంలో ఫలాలు, కందమూలాలు ఆహారంగా తీసుకుంటూ, ఇంద్రియ నిగ్రహంతో, నియమ వ్రతాలతో తపస్సు చేసుకుంటున్న ఒక మొనీశ్వరుడు ఉండేవాడు. అతను చాలా శాంత స్వభావం కలవాడు. ఉపవాసాల శుచివల్ల పవిత్రుడైనాడు. సత్త్వ గుణ సంపన్నుడు. అతని గుణాలను చూసి ఆ అరణ్యంలో తిరిగే వన్యమృగాలు అతని దగ్గరికి వచ్చేవి. సింహ శార్దూలాలు, మదగజాలు, భల్లూకాలు మొదలైన క్రూర మృగాలు ఎన్నో అతని దగ్గరకు వచ్చేవి. ఆ జంతువులు మాంసాహారులైనా అతని వద్ద చాలా నమ్రతగా తలవంచి కూర్చునేవి. అవి అతని సుఖం గురించి ప్రశ్నించి ఎలా వచ్చినవి అలా వెళ్ళిపోయేవి. ఒక గ్రామ శునకం మాత్రం ఆ మునిని వదిలి వెళ్ళేది కాదు. అది మునికి భక్తుడు అయంది. అది కూడా మునిలాగే ఉపవాసాలు చేసి కృశించి పోయంది. ఫలాలు, కందమూ లాలు, నీళ్ళు ఆహారంగా తీసుకుంటూ శాంతంగా ఉండే సాధు పురుషునిలాగ ప్రవర్తించేది. అది ఎప్పుడూ ముని పాదాల దగ్గర ఒక స్నేహితుని లాగ ఉండి అతనితో స్నేహ భావాన్ని పొందింది.
ఒకసారి మాంసాహారి, మహాక్రూరమైన ఒక చిరుతపులి ఆ కుక్కను పట్టుకోవడానికి దాని మీదకు దూకింది. క్రూరంగా తన మీదకు వస్తున్న చిరుతను చూసి కుక్క తన ప్రాణ రక్షణ కోసం మునితో ఇలా ప్రార్థించింది. ‘‘స్వామీ! ఈ చిరుతపులి కుక్కలకు శత్రువు. అది నన్ను చంపాలని చూస్తున్నది. నా మీద అనుగ్రహం చూపి దీని భయం నాకు లేకుండా చేయండి. నువ్వు సర్వజ్ఞుడవు నీకు అంతా తెలుసు’’.
ముని సిద్ధుడు సకల ప్రాణుల భాషలు తెలిసినవాడు. కనుక కుక్క సమస్య అర్థం చేసికొని దాని భయాన్ని పోగొట్టడానికి ఆ కుక్కను కూడా చిరుతపులిగా మార్చాడు.
ఇప్పుడు కుక్క చిరుతపులిగా మారిపోయంది. దాని శరీరం నిండా మచ్చలు వచ్చాయ. నోట్లో కోరలు మొలిచాయ. అప్పుడు తన ఎదుట ఉన్న చిరుతను చూసి దానికి వైరభావం పోయంది. అది నిర్భయంగా అడవి అంతా తిరుగసాగింది. కొంత కాలం ఈ విధంగా జరిగింది. ఒకసారి ఒక పెద్ద పులి పెద్దగా నోరు తెరుచుకొని దాని మీదకు వచ్చింది. చిరుతపులి ప్రాణ రక్షణకోసం మళ్ళీ మునిని ఆశ్రయంచింది. తనను ఆశ్రయంచుకుని ఉన్న శునకం పైన వాత్సల్యం కల ముని దానిని వెంటనే పెద్ద పులిగా మార్చాడు. అప్పుడు కుక్క కూడా శార్దూలం అయపోయ హాయగా మాంసం తింటూ బలిష్టమైంది. దానికి ఇక ఫలాలు కంద మ్మలాలు తినాలన్న కోరికపోయంది. అది నిత్యం అడవి జంతువులని చంపి తినాలని కోరుకుంటున్నది. అది మృగాలను చంపి తింటూ ముని కుటీరం సమీపంలోనే నిద్రిస్తున్నది. ఒకరోజు మేషంలాంటి ఒక మదగజం ఆ కుటీరం దగ్గరకు వచ్చింది. అది మదగజం. దాని గండ స్థలం నుంచి మద జలం కారుతున్నది. దానికి పొడవైన దంతాలు ఉన్నాయ. కుంభ స్థలం విశాలంగా ఉంది. దాని శరీరం చాలా పెద్దది. దాని ఘీం కారం మేఘ గర్జనలాగ ఉంది. దానిని చూసి పెద్దపులి భయపడిపోయంది ముని వద్దకు శరణుకోరుతూ పోయంది. దయకల ముని దానిని వెంటనే ఒక మదగజంగా మార్చేశాడు. ఇప్పుడు అది మదగజం. కనుక తామర కొలనులోకి స్వేచ్ఛగా తిరుగసాగింది. అలా అది ముని కుటీరం దగ్గరగా తిరుగసాగింది. ఇలా చాలా రోజులు గడిచాయ. ఒక రోజు ఒక సింహం అక్కడికి వచ్చింది. అది పెద్ద జూలుతో భయంకరంగా ఉంది. ఆ సింహాన్ని చూసి ఏనుగు భయపడి పోయంది. అది మళ్ళీ మునిని శరణు కోరింది. దానిపై జాలితో ముని దానిని సింహంగా మార్చేశాడు. ఇప్పుడు అది సింహం అయపోయం ది. తన జాతిదే కనుక బయట సింహం ఈ వన్య సింహాన్ని పట్టించుకోలేదు. కాని వన్య సింహం ఆ కొత్త సింహాన్ని చూసి భయపడింది. అందువల్ల ఆ అరణ్యంలో అది ఆశ్రమం దగ్గరగా ఉండసాగింది. దాన్ని చూసి భయపడి ఇతర మృగాలు ఆశ్రమం వైపు రావడం మానేశాయ. ఇలా కొంతకాలం గడిచింది. ఒకసారి సమస్త ప్రాణులను హింసించే శరభమృగం ఒకటి సింహాన్ని చంపాలని ఆశ్రమం వైపు వచ్చింది. ఆ మృగం రక్తాన్ని మరిగి, చాలా బలిష్టంగా ఉంది. దాన్ని చూసి అన్ని జంతువులు భయపడతాయ. ఎనిమిది కాళ్ళు కలిగి భయంకరమైన కళ్ళతో అది అందరికీ దడ పుట్టిస్తుంది.
ఆ మృగాన్ని చూసి వణుకుతూ సింహం ఆశ్రమం వైపు పరిగెత్తింది. అది మునిని వేడుకుంది. ముని కరుణతో దానిని శరభంగా మార్చి వేశాడు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి