డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరణ్యంలోని అన్ని జంతువులు ఈ శరభానికి భయపడి అన్ని దిక్కులకు పారిపోయాయ. ఆ శరభం ఆ ప్రాణులను చంపుతూ చాలా సంతోషించింది. అది మాంసం రుచి మరిగి ఫలాలను తినడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు అది బలిష్టంగా ఉంది. దానికి తోడు రక్త పిపాస కలిగింది. కుక్కలకు ఉండే విశ్వాసం దానికి పోయ అది మునినే చంపాలని అనుకుంది. అది ఇలా ఆలోచించింది. ఇతనికి గొప్ప మహిమ ఉంది. కేవలం నోటి మాటతోనే, అన్ని ప్రాణులను భయపెట్టే శరభ మృగంగా మారిపోగలిగాను. ముని దగ్గర ఇంకా చాలా జంతువులు, పక్షులు ఉన్నాయ. అవి కూడా ఏనుగులకు, సింహాలకు భయపడుతూ జీవిస్తున్నాయ. ముని వాటిపైన దయతలచి వాటిని కూడా శరభాలుగా మార్చవచ్చు. పక్షులకు గరుత్మంతుని బలం ప్రసాదించవచ్చు. ముని అలా చేయక మొనుపే నేను ఈ మునిని చంపేస్తాను. ముని చనిపోతే ననె్నవ్వరూ ఇక ఎదిరించలేరు’’.
అరణ్యంలోంచి వచ్చిన శరభం మునికి ఈ విషయం తన తపశ్శక్తి వలన తెలిసింది. అప్పుడు ఆ జ్ఞాని అయన ముని ఆ కుక్కతో ఇలా అన్నాడు ‘‘నువ్వు కుక్కవు. తరువాత చిరుతపులివి అయ్యావు, పెద్దపులివి అయ, ఆ శరీరం నుండి ఏనుగువి అయ్యావు. ఏనుగు నుంచి సింహంగా మారి తర్వాత శరభమృగం అయ్యావు. నీ పట్ల స్నేహం కలిగిన నేను నీ జాతిని విస్మరించాను. పాపాత్ముడా! ఏ పాపం తెలియని నన్ను చంపాలని తలచావు కనుక నీవు నీ అసలు స్వరూపాన్ని పొందెదవు గాక’’ ఇలా అని ముని దాన్ని మరల కుక్కగా మార్చేశాడు’’ అది తన కుక్క రూపాన్ని తిరిగి పొందింది.
కుక్క రూపంలో అది చాలా దైన్యస్థితి పొందింది. అది ఋషిని దైన్యంగా తన మీద దయ చూపమని ప్రార్థించింది కాని ముని హుంకరించి దాన్ని తపోవనం నుండి వెళ్ళగొట్టాడు. కనుక ఎవరిపైన అయనా అనుగ్రహం, దయ చూపించే ముందు వారి పరిశుద్ధతను, స్వభావాన్ని ఋజుత్వాన్ని, సత్యవాదిత్వాన్ని వినయం, క్షమ మొదలైన గుణాలు ఉన్నవో లేవో పరీక్షించి అట్టి యోగ్యతగల వానిపై అనుగ్రహం చూపాలి. ఈ కొత్త శరభాన్ని చూసి భయపడి మరల అరణ్యంలోకి పారిపోయంది. ముని చేసిన శరభం సుఖంగా ముని ప్రక్కనే ఉండసాగింది.
ఉష్ణగ్రీవోపాఖ్యానము
పూర్వం సత్యయుగంలో ఒక ఒంటె ఉండేది. దానికి తన పూర్వ జన్మ జ్ఞానం ఉంది. అందువలన అది కఠోర నియమాలను పూని ఆ అరణ్యంలో గొప్ప తపస్సు చేసింది. దాని తపస్సుకు సంతృప్తి చెంది బ్రహ్మ దాని ముందర ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ ఒంటె ఇలా ప్రార్థించింది. ‘‘దేవా! మీ దయవల్ల నా మెడ పొడవుగా సాగుగాక, దాని వల్ల యోజనాల మేరకు మేయడానికి మెడతో సాగగలను’’ అన్నది. బ్రహ్మ దానితో ‘‘అట్లే అగును’’ అని వరమిచ్చాడు. ఇలా మంచి వరాన్ని పొంది ఒంటి అరణ్యంలోకి వెళ్ళిపోయంది. కాని వరదానం వల్ల గర్వం వచ్చి ఆ ఒంటె సోమరి అయ మేతకు వెళ్ళడానికి ఇష్టం లేకపోయంది. అది తన పొడవైన మెడను కొన్ని యోజనాల వరకు సారించి విరామం లేకుండా మేయసాగింది. అంతలో పెద్ద గాలి దుమ్ము లేచింది. అప్పుడు ఒంటె తన మెడను ఒక గుహలో దాచింది. ఇంతలో పెద్ద వాన కురిసింది. అప్పుడు ఒక నక్క వర్షానికి వణుకుతూ భార్యతో సహా ఆ గుహలోకి వచ్చింది. మాంసం తినే నక్క గుహలో ఒంటె మెడను చూచి శుభ్రంగా దాన్ని తినేసింది. తనను ఏదో జంతువు తినేస్తోందని తెలుసుకొని ఒంటె ముడుచుకోవడానికి ప్రయత్నించింది. కాని అది పైకీ కిందకీ ఎంతదాకా మెడ కదిలిస్తోందో అంతవరకు నక్క తినేసి గాలివాన తగ్గగానే గుహనుండి వెళ్ళిపోయంది. ఈ విధంగా ఆ ఒంటె చనిపోయంది. కనుక సోమరితనం పనికిరాదు. బుద్ధిబలంతో చేసేవి మధ్యమాలు, కాని బలంతో చేసేవి అధమాలు. బరువెత్తుకొనే పనులు అన్నిటికంటె అధమమైనవి.
త్రిపురాసుర వృత్తాంతం
దేవతలకూ అసురులకూ ఎల్లప్పుడూ ఒకరి నొకరు జయించాలనే కోరిక ఉండేది. అందుకని వారికి తారకామయం అనే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు జయించారు. దైత్యులు ఓడిపోయారు. అప్పుడు తారకాసురుని ముగ్గురు కొడుకులు - తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనేవారు ఘోర తపస్సు ఉత్తమ నియమనిష్ఠలతో చేశారు. వారు తపస్సుతో తమ శరీరాలను శుష్కింప జేశారు. ఇంద్రియ నిగ్రహం పాటించి సమాధి స్థితిలో ఉండిపోయారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వారికి ప్రత్యక్షమై వరములు ఇవ్వ దలిచాడు. అప్పుడు వారు ముగ్గురు కలిసి బ్రహ్మదేవుని ఇలా వరం కోరారు. ‘సర్వప్రాణుల వల్ల మాకు చావు లేకుండా ఉండాలి’’.
అప్పుడు బ్రహ్మ వారితో ఇలా అన్నాడు ‘‘అసురులారా! అందరికీ అమరత్వం అసంభవం. కనుకక ఇంకేదైనా వరం కోరుకోండి’’.
అప్పుడు ఈ ముగ్గురు అసురులు చాలా సార్లు ఆలోచించి బ్రహ్మను ఇలా కోరారు ‘‘పితామహా! మాకు ఈ వరం ఇవ్వు. స్వేచ్చానుసారం వెళ్లే నగర ఆకార సుందర విమానాన్ని నిర్మించి అందులో నివసించకోరుతున్నాము. ఆ విమానం అభీష్టవస్తు సంపన్నం కావాలి. అది దేవదానవులు నాశనం చేయలేనిది కావాలి. ఆ మూడు పురాలు యక్షులు, రాక్షసులు, పన్నాగులు, ఇతరప్రాణులు, కృత్యలు, శస్త్రాలు, బ్రహ్మవేత్తల శాపాలతో నాశనం అవకుండా ఉండాలి’’. వారి మాటలు విన్న బ్రహ్మ మరల వారితో ఇలా అన్నాడు. ‘‘దైత్యులారా! కాలం తీరితే అన్నీ నశిస్తాయి. ప్రతి వానికి ఎప్పుడో ఒకప్పుడు మరణం తద్యం. కనుక ఈ మూడు పురాల నాశనానికి ఇంకేమయినా కారణం కోరండి’’.
దైత్యులు ఇలా కోరారు. ‘‘దేవా! నీ అనుగ్రహం వలన మేము మూడు పురాలలో నివసిస్తాము. ఈ భూమండలమంతా సంచరిస్తాము. వేయి సంవత్సరాలకు ఒకసారి మేము ముగ్గురం కలుస్తాము. ఈ పురాలు మూడూ అప్పుడు కలుస్తాయి. ఏకమైన వీటిని ఒకే బాణంతో కొట్టే దేవశ్రేష్ఠుడు మా మృత్యుకారకుడు అవుతాడు’’. బ్రహ్మ ‘‘తథాస్తు’’ అన్నాడు.
ఆ తర్వాత మహాసుర మయుడు వారి కోసం మూడు పురాలను నిర్మించాడు. అందులో ఒకటి బంగారం, రెండవది వెండిది, మూడవది ఇనుపది. బంగారంతో నిర్మించింది స్వర్గలోకంలో ఉన్నది. వెండితో చేసిన పురము అంతరిక్షంలోను ఇనుముతో చేసినది భూమండలంలోను ఉన్నాయి. ఈ పురాలు మూడు పెద్ద పెద్ద భవంతులతో, క్రీడోద్యానాలతో, ప్రాకారాలు చక్కటి వాకిళ్లతో శోభించాయి. ఆ పురాలలో ఒక్కొక్కరు రాజు అయ్యారు. అందులో తారకాక్షుని నగరం సువర్ణమయం.
కమలాక్షునిది వెండిపురం. విద్యున్మాలిది ఇనుపది. ఈ విధంగా ఆ రాక్షసులు ముల్లోకాలను ఆక్రమించారు. ‘ప్రజాపతి అంటే ఎవరు?’ అని ప్రశ్నించారు. వారి దగ్గరకు కోట్లమంది దానవులు వచ్చి చేరారు. దేవతల దగ్గర ఓడిపోయిన దైత్యులు వారి దగ్గరకు వచ్చి చేరారు. మయుడు వారికి కావలసిన వస్తు సామగ్రిని సమకూర్చాడు. త్రిపురాసురులను ఆశ్రయించినవారు మనసులో ఏది కోరితే దాన్ని మయుడు సృస్టించి వారికిచ్చేవాడు. తారకాక్షుని కుమారుడు హరి. అతను తీవ్ర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఈ వరాన్ని కోరాడు.
-ఇంకావుంది