డైలీ సీరియల్

అనంతం-39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తగినన్ని పోలీసు బలగాలు లేవుకదా.’’
‘‘అదనపు బలగాలకోసం కబురువెళ్ళింది’’అని చెప్పాడు ఎమ్మెల్లే.
గరుడాచలం స్థిమితపడ్డాడు.
కొంతసేపటికి ఎవ్వరో పోలీసు ఉద్యోగి వొచ్చాడు. ఎమ్మెల్లేకి నమస్కరించి వినయంగా నిల్చున్నాడు.
‘‘కొండ దగ్గరి విశేషాలేమిటి’’అని అతన్ని ఎమ్మెల్లే అడిగాడు.
‘‘రెడ్డియానాయక్ తండావాళ్ళు రాగ్యాకోసం వెతుకుతున్నారు సార్’’ అన్నాడతను.
‘‘అనుకున్నదే కదా! రాగ్యా ఏం చేస్తున్నాడు.’’
‘‘అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసి, తండా వాళ్ళకి ఎదురువెళ్తున్నాడు’’
‘‘సెక్యూరిటీ జాగ్రత్త.’’
‘‘ఇబ్బందేమీ లేదు సార్! రాగ్యాని నీడలా అనుసరిస్తూ సివిల్ డ్రెస్‌లో చాలామంది కానిస్టేబుళ్ళున్నారు. వాళ్ళ దగ్గర రివాల్వర్లున్నాయి! అవసరమైతే కాల్పులు జరుపుతారుకానీ రాగ్యాకి ప్రమాదం జరగనివ్వరు.’’
‘‘సరే..వెళ్ళు! ఎప్పటికప్పుడు విషయాలు నాకు తెలుస్తుండాలి! అందరూ అలర్టుగా వుండండి’’అని చెప్పాడు ఎమ్మెల్లే.
పోలీసు ఉద్యోగి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
* * *
‘‘రాగ్యా గాడడుగో..’’ అని, ఓ అడవి పుత్రుడు అరిచాడు.
బాణావతుతో సహా అందరూ అటువైపు చూసారు.
కొంపలు ములిగినట్టు పెద్దపెద్ద అడుగులువేస్తూ చాలా హడావుడిగా తమవైపే వస్తూ రాగ్యా కనిపించాడు దూరంగా!
తండా వాళ్ళకది విచిత్రంగా తోచింది.
పంచాయితీకి భయపడి, నాగరికుల గుడారాల్లో తల దాచుకున్న రాగ్యా అంత నిర్భయంగా ఎందుకు వస్తున్నట్టు?
పచ్ఛాత్తాపం కలిగి పరివర్తన చెంది, చేసిన తప్పు ఒప్పుకొని స్వచ్ఛందంగా శిక్ష అనుభవించాలని వస్తున్నాడా?
ప్రశ్నలు, సందేహాలూ కలుగుతున్నాయి!
ఏదిఏమైనా రాగ్యాని బంధించాలి. చెట్టుదగ్గర పంచాయితీ పెట్టాలి. కఠినంగా దండించాలి!
ఇవ్వాళ, దేవర జాతరనీ, మరో కారణమనీ రాగ్యాని విడిచిపెడితే- తండాలో రేపు చాలామంది రాగ్యాలు పుట్టుకొస్తారు!
కట్టుబాట్లు సడలిపోతాయి.
తండా పెద్దలు చులకనైపోతారు.
ఆచారాలు మంటకలిసిపోతాయి.
‘‘ఇడ్సిపెట్టగాకండి’’అన్నాడు బాణావతు.
తండావాళ్ళు వేగం పెంచారు. గబగబా నడుస్తున్నారు!
రాగ్యా దగ్గరికొస్తున్నకొద్దీ ఆయుధాలమీద వాళ్ళచేతులు మరింత బిగుతుగా బిగుసుకుంటున్నయి. కోపంతో బుసలు కొడుతున్నారు!
తండా దుండుకీ, రాగ్యాకీ మధ్య దూరం తగ్గుతున్నకొద్దీ అందర్లోనూ ఉత్కంఠ పెరుగుతున్నది.
ఏం జరుగుతుందో అని ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.
రాగ్యా వెంట చాలామంది ధృఢకాయుల్ని తండావాళ్ళు అపుడు గమనించారు!
‘‘ఏదో పతకవే’’ అన్నాడు నగ్గూరాం అనుమానంగా చూస్తూ.
‘‘పతకవే అయితే ఇడ్చిపెట్టను వాడ్ని! కొడుకని గూడా సూడకుండా నరికేస్తాను’’ అన్నాడు కాళీచరణ్.
బాణావతు వౌనంగా రాగ్యా వస్తున్న వైపే చూస్తూ నడుస్తున్నాడు.
కొద్దిదూరంలో రాగ్యా ఆగాడు.
వెంట వచ్చిన దృఢకాయుల్ని అక్కడే ఆపి, ఒంటరిగానే నడుస్తూ తండావాళ్ళని సమీపించాడు!
రెండుచేతులూ ఎత్తి అందరికీ దణ్ణం పెడుతూ-
‘‘ఒక్కమాట సెబ్తా, యినుకోండి.. ఇన్నాక నన్ను సంపండీ..కొట్టండి! అందరికీ దణ్ణంవెట్టి సెబ్తుండాను! నాకోసరవ్ గాదిప్పుడు నేనొచ్చింది.. మీకోసరవ్’’ అన్నాడు రాగ్యా.
‘‘మాకోసరవా! నీకేంటిది పని’’ నగ్గూరాం అడిగాడు.
అందరూ రాగ్యా వైపు చూస్తున్నారు!
‘‘మొత్తంగా మన జాతే నసిచ్చిపోయిద్దని భయ్యంగుంది! అందుకే మీకాడికి లగెత్తుకొత్తుండాను’
‘‘నసిచ్చిపోయిద్దా? ఎట్టా?’’ అని బాణావతు అడిగాడు.
‘‘ప్రెవాదవ్ ముంచుకొత్తుంది’’
‘‘ఒకేపు దేవర జాతర జరుగుతుంటే ప్రెవాదవా? ఎందుకొచ్చుద్ది? ఏంటి కొచ్చుద్ది? మమ్ముల గాసే దేవరుండంగా అసువంటిదేవీ జరగదులే గానీ- యిసయవ్ జెప్పు! నీయన్నీ మాయ మాటలు గదూ?’’ అని కొడుకు వైపు తీక్షణంగా చూసాడు కాళీచరణ్.
రాగ్యా ఉన్నట్టుండి పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు.
అడవి పుత్రులు బిత్తరపోయారు!
ఇంతవరకు రాగ్యా అలా ఏడ్చిన దాఖలా లేదు!
ఏడిపించటం తప్ప ఏడవటం తెలియనివాడు అలా ఏడుస్తున్నాడంటే- మొత్తానికి ఏదో జరిగిందనుకున్నాడు బాణావతు.
‘‘ఇయసవేంటిదో తొందరగా జెప్పు’’ అన్నాడు. రాగ్యా కన్నీళ్లు తుడుచుకుంటూ, అందరివైపూ ఒకసారి కలియచూసి-
‘‘జాతర లేదు, గీతరా లేదు’’ అన్నాడు.
తండావాళ్ళ మొహాలు వాడిపోయాయి!
‘‘ఏంటికి లేదూ’’ అని కాళీచరణ్ అడిగాడు.
‘‘అయ్యా! నమ్మండి, నమ్మకపోండి! జల్మనిచ్చిన అయ్యకి అబద్దవ్ సెప్తారా, ఓరైనా? సత్తే జెప్పరు!’
‘‘యిసయవేంటిది?’’ బాణావతు అసహనంగా అడిగాడు. అందరి దృష్టీ రాగ్యా వైపునకు మళ్లింది!
‘‘కొండదేవరకి మనమీన కోపం వచ్చింది! ఆగ్గరంతో వూగిపోతుండు. ముక్కెంగా మన తండాని నల్సకతింటానంటుండు’’ చెప్పాడు రాగ్యా! అందరూ ఆలకించి వింటున్నారని గ్రహించి-‘‘మన గుడిసెలకింక అగ్గి అంటుద్ది.. బుగ్గగుతయ్యి.. దేవరంపిన దెయ్యాలు మనల్ని నల్సక తింటయ్యి.. తండా యిడ్చిపెట్టి యాడికి బోవాలె మనవంతా’’ అన్నాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు