డైలీ సీరియల్

అనంతం-41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాగ్యా ఒక్క క్షణం ఆగాడు.
‘‘ఇంకా నన్ను నమ్మరా...?’’అని అడిగాడు.
‘‘మడిసి మంచాడయితే సాచ్చీకార్తోపనే్లదు..’’అని కాళీచరణ్ కొడుకు వైపుచూసాడు.
‘‘అంటే, నేను మంచాడ్ని కాదనేగదా’’
‘‘మంచాడివైతే మాకీ కర్మేంటికి పట్టుద్దిగానీ... పద.. పద! ఎర్ర నెమిళ్ళని చూపియ్యి’’ అన్నాడు కాళీచరణ్.
వాళ్ళంతా నెమలిగుట్టకు బయల్దేరారు.
అడవిదారి వెంట నడుస్తూ గుట్టల్నీ పొదల్ని తప్పించుకొంటూ ఆగమేఘాలమీద నెమలిగుట్టకు చేరుకున్నారు.
గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి!
‘‘అయ్యేంటియో మీరే సూడండి’’అని, వ్రేలు చూపించాడు రాగ్యా. అటు వైపు చూసారు!
మైదానంలో మైమరచి నర్తిస్తూ ఎర్ర నెమళ్ళు కనిపించాయి!
అందరూ కొద్దిక్షణాలు నిర్ఘాంతపోయారు!
‘ఇప్పుడేఁవి సెయ్యాలి?’’ నీరసంగా అడిగాడు నగ్గూరాం.
ఒక్కరూ పెదివి విప్పి మాట్లాడే స్థితిలో లేరు.
ప్రళయం సమీపించి,
శకలాలుగా భూమి చిట్లిపోతూ,
ఆకాశం రాలిపడి,-
ఉప్పొంగే నదీనదాలు, సముద్రాలూ సకల చరాచర జగత్తునూ ముంచివేసే చివరిక్షణం అదే అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి!
‘‘దేవరే యింక మనకి దిక్కు’’అన్నాడు కాళీచరణ్.
‘‘అంతగాకెంత’’ అన్నారెవ్వరో.
వౌనంగావున్న బాణావతుని నగ్గూరాం చేత్తోతట్టి పిల్చి-
‘‘ఆలోసిత్తా నిల్సుంటే ఎట్టా?’’ అని అడిగాడు.
బాణావతులో చలనం వచ్చింది!
‘‘సేసేదేఁవుంది! కొండకాడి కెల్దాఁవు పదండి... బలులిత్తే అన్నా దేవర శాంతిత్తాడేఁవో’’ అన్నాడు బేలగా చూస్తూ.
నల్లకొండ దగ్గరికి బయల్దేరారు.
* * *
మెట్ల దారికి సమీపంలో అంతా గందరగోళంగా వుంది!
అడవి పుత్రులు చాలామంది వృత్తాకారంలో గుమికూడి భయం నిండిన తెలికళ్ళతో వృత్తంలోకి చూస్తున్నారు.
నిట్టూర్పులు విడుస్తున్నారు.
వృత్తం మధ్యలో, ఆరోగ్యంగా దృఢంగావున్న ఎవ్వరో వ్యక్తికి పూనకం వచ్చి, అరుణారుణ నేత్రాలతో జనంవైపు కోపంగా చూస్తున్నాడు.
రంకెలు వేస్తున్నాడు.
చిందులు తొక్కుతున్నాడు.
శపిస్తున్నాడు!
జనం తుపానులో చిక్కుకున్న గువ్వపిట్టల్లా వొణుకుతూ, రాబోయే ఏవో అవాంతరాలను, కష్టాల్ని ఊహించుకొంటూ బిక్కమొహాలు వేసుకొని, దేవర పూనకం వచ్చిన వ్యక్తినే చూస్తున్నారు.
పూనకం దేవర పెడుతున్న శాపాలకు కలవరపడుతూ దణ్ణాలు పెడుతున్నారు.
అంతకంతకూ రెచ్చిపోతోన్నాడా పూనకం దేవర!
‘‘కోపవేంటికొచ్చిందో సెప్పవేటి దేవరా?’’ అని ఎవ్వరో అడిగారు.
‘‘ఎలిపోండెల్లిపోండి’’ గద్దించాడు దేవర.
‘‘అంత ఆగ్గరవైతే ఎట్టాగా’’
‘‘ఎలిపోండెల్లిపోండి’’ గుడ్లురుమి చూశాడు దేవర.
‘‘ఏం తప్పుజేసినావూ?’’
‘‘మడుసులే తప్పుడోళ్ళు.. ఎలిపోండెల్లిపోండి’’
‘‘బలులిత్తనావు.. బలెన్నవ్ బెడతన్నావు.. ఇంకేటి గావాల?’’
‘‘గొర్ల రగతవ్తో, మేకల రగతవ్తో గాదు బలెన్నవెట్టేది’’
‘‘మరేంటిదో సెప్పు దేవరా.. కోప్పడగాకు’’
‘‘వణ్ణంల్లో మీ రగతవ్ గలిపి బలెన్నవెట్టాల’’
‘‘మడుసుల్ని బలియ్యాల్నాదేవరా’’ అని అతగాడు దేవరకి కొంచెం దగ్గరగా జరిగి ‘‘సట్టవ్ ఒప్పదు దేవరా’’ అన్నాడు రహస్యంగా.
‘‘మడుసుల్ని బలియ్యవని గాదు నానడిగేది’’
‘‘మరేంటిది దేవరా.. సెప్పు’’
‘‘సెప్పింది శాత్తారా’’
‘‘శాత్తావు’’
‘‘రెడ్డియా నాయక్ తండావోళ్ళు గాదంటే..?’’
‘‘బొవికలిరగ నూకుతావు! దేవర కాడికెక్కువా.. ఏటి’’
‘‘ఆ తాండావోళ్ళొత్తుండరు.. వచ్చినాక సెప్తానంతే’’ అని దేవర క్రీగంట చూశాడు!
‘‘అప్పుడే రెడ్డియా నాయక్ తండాదండు అక్కడికి జేరింది.
అక్కడే వుండి, దేవర మాటలు విన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు!
దేవర చెప్పినట్టే, తండావాళ్ళు రావటంతో పూనకం దేవర మహిమల్ని తల్చుకొని దణ్ణాలు పెడుతున్నారు.
‘‘ఎలిపోండెల్లిపోండి’’ రెడ్డియా నాయక్ తండా వాళ్ళని దేవర కసిరికొట్టాడు.
‘‘యావయ్యింది దేవరా’’ అని బాణావతు అడిగాడు.
‘‘నా కొండ కాడికి రాగాకండి! వత్తే రగతం గక్కి సత్తారు.. మీ గుడిశెల్లో జిల్లేళ్ళు మొలిపిత్తాను.. పీనిగెలెల్తయ్యి మీ ఇళ్ళల్లో.. ఎలిపోండెల్లిపోండి’’ అని దేవర బొంగురు గొంతుతో అరిచి చెప్పాడు.
అసలే తెల్లకాకులు ఎర్ర నెమళ్ళ భయంతో బిక్కచచ్చిన తండా జనం దేవర శాపాలకి మరింత కృంగిపోయారు.
నగ్గూరాం ధైర్యం చేశాడు!
‘‘ఎవర్సావీ నువ్వు’’ అని అడిగాడు.
‘‘ననే్న గురుతుపట్టలేదంటరా-నగ్గూరాంగా’’ అన్నాడు కోపంగా దేవర.
నగ్గూరాం ఆశ్చర్యానికి అంతులేదు!
పేరు పెట్టి తనను పిల్చాడంటే సర్వం తెలిసిన దేవరే అతగాడు!
‘‘తెలిసింది సావీ.. నువ్వు మా దేవరవి’’ అన్నాడు వినయంగా.
‘‘ఎవుర్నిరా.. బాణావతుగా?’’ దేవర బాణావతును అడిగాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు