డైలీ సీరియల్

బంగారుకల - 40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం కలిసి చాలా రోజులయింది. కదా!’’ చంద్రప్ప ఆమె చేయిపట్టి పూపొదరింట కూర్చోబెట్టుకున్నాడు.
‘‘మన పెళ్ళి ఎల్లుండి పున్నమిరోజు విఠల మందిరంలో, ఇంకేం మాట్లాడకు సరేనా’’.
ఆమె అంగీకార సూచకంగా తలూపింది. అతని ఆనందానికి అవధులు లేవు. వాళ్ళిద్దరి మధ్య కాలం మరపురాని మధురగీతంలా జాలువారింది.
చాలాసేపు మైమరచి అలాగే ఉండిపోయారా ప్రేమికులు.
దూరంగా నగారా మోగింది. చంద్రప్ప ఈ లోకంలోకి వచ్చాడు ఏదో గుర్తొచ్చినట్లుగా.
‘‘మంజూ రామేశ్వర శాస్ర్తీ సన్యసించాడు. తెల్సుగదా!’’
‘‘అవును చంద్రా! అతను మహాశిల్ప గాయకుడు. ఉపాసకుడు. నిజానికి విఠల దేవాలయ సప్తస్వర స్తంభాల పూర్ణాకృతి అతని వల్లనే సిద్ధించింది’’ గౌరవం ధ్వనించిందామె స్వరంలో.
‘‘శాస్ర్తీ విజయనగరం వీడి వెళ్ళిపోయాడట మంజూ!
ఆమె ఆశ్చర్యపోలేదు. శాస్ర్తీ గురించి అప్పటికే చాలా కథనాలు విన్నది.
అతను అడుగుపెట్టినచోటు శుభప్రదంగా ఉంటుందనీ. ఏదైనా అశుభాలు జరగబోతుంటే అతనా స్థలంలో ఉండడనీ.
‘‘నాకు అదే కలవరంగా ఉంది చంద్రా! శాస్ర్తీ విజయనగర విశిష్ట శిల్పుల్లో ఒకడు. అలాంటిది ఈ నగరాన్ని వీడిపోయాడంటే అదీ ఎక్కడికో తెలీదంటే’’ అర్ధోక్తిలోఆగింది.
‘‘కాశీలో ఎవరికో కన్పించాడట. వెళ్ళేముందు ఆశ్రమవాసులతో ఇక విజయనగర వైభవం కనుమరుగవుతుందని అన్నాడట’’ బాధగా చెప్పాడు.
‘‘ఆ విషయం నేనూ విన్నాను. అతను సన్యాసం తీసుకున్న తరువాత పెనుమార్పు జరిగింది. కుండలిని సాధనతో భవిష్యత్ చెప్పగల శక్తి వచ్చిందట. ఏది ఏమైనా గొప్ప సంగీత శిల్పి’’ నిట్టూర్చిందామె.
‘‘నిజమే! ఇప్పుడు విజయనగర పరిస్థితులు ఆ సూచన చేస్తున్నాయి కూడా... ఆ వీరేంద్రుడు’’ కోపంగా ఏదో చెప్పబోయాడు. ఆమె మధ్యలోనే చెప్పింది.
‘‘చంద్రా! నీకు మరో ముఖ్య విషయం చెప్పాలి. ఆ వీరేంద్రుడు ప్రభువుకూ మహామంత్రికి వివాదం రేపాలని కుట్ర పన్నుతున్నాడు.’’
‘‘అలా చేస్తేగానీ వాడి ఆటలు సాగవని పన్నాగం కాబోలు’’ చంద్రప్ప దవడ ఎముకలు బిగిసాయి.
‘‘ఆ వివాదం యువరాజు పట్ట్భాషేక రూపంలో వస్తున్నది’’ మంజరి వివరించింది.
‘‘అయితే మనమేం చేయాలి’’ చంద్రప్ప ఆలోచించాడు.
‘‘మనం చేయగలిగేది మహామంత్రి చెప్తారు. ఆ కంటకుడితో నేను మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. ఆ ద్రోహి కూడా వీరేంద్రునితో చేతులు కలిపాడు. వాడేమన్నాడంటే’’ అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది.
‘‘ఆ! దుర్మార్గుడు తిన్న ఇంటి వాసాలు లెక్కపెడతాడా!’’ పళ్ళు కొరికాడు చంద్రప్ప.
‘‘మనం మహామంత్రి చెప్పినట్లే చేయాలి. తెలిసిందా! ఆవేశపడి రహస్యాన్ని బట్టబయలు చేయకు.’’
అతను కొంత తగ్గాడు. ఆమె అతనికి దగ్గరగా జరిగింది.
‘‘ఈ ప్రశాంతమైన రాత్రి ఓ పాట పాడు చంద్రా! విని చాలానాళ్ళయింది’’ బతిమలాటగా అంది. మనసులో మాత్రం చంద్రప్పను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అని బెంగగా ఉందామెకు.
‘‘ఈ చల్లని రేయిలో
నా ఉల్లము రంజిలగా
పాట పాడనా చెలీ
పరవశించనా’’
అతనలా పాడుతూనే ఉన్నాడు. ఆమె అతని భుజం మీద తలవాల్చి వింటున్నది.
‘‘బాగు బాగు చప్పట్లు విన్పించటతో ఇద్దరూ దిగ్గున లేచి నిలిచారు. ఎదురుగా రామకృష్ణ కవీంద్రులు.
మంజరి అనవతంగా నిలబడింది. చంద్రప్ప రామకృష్ణునికి నమస్కరించాడు.
‘‘కవీశ్వరులకు అభివాదం’’
‘‘చిరంజీవ. విజయనగర సామ్రాజ్యంలో కళారాధనకు వెనె్నల కూడా వికసిస్తుందని ఇవాళే తెలిసింది’’ కొంటెగా నావ్వాడు రామకృష్ణుడు.
‘‘క్షమించాలి స్వామీ! మంజరి, నేను...’’ తడబడ్డాడు చంద్రప్ప.
‘‘నాకు తెల్సుగానీ మీరు నిర్వహించవలసిన రాచకార్యమొకటున్నది. ఇది అతి రహస్యము. మహామాత్యులు సెలవిచ్చారు’’ అంటూ రామకృష్ణకవి చంద్రప్ప, మంజరిలను దగ్గరిగా పిలిచి కొన్ని మాటలు చెప్పారు.
‘‘అర్థమైంది కదా! ఎలాగైనా సరే. ప్రభువు పదిహేను దినాలు అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్ళకూడదు. అంతే! అన్నపూర్ణాదేవి మందిరంలో చక్కబెట్టే పని మంజరిది. మిగతా పని నీది చంద్రప్పా! ఆపైన అంతా విరూపాక్షునిది’’ రామకృష్ణుని దగ్గర సెలవు తీసుకుని కార్యభారంతో ఇద్దరూ బయలుదేరారు.
***
11
అన్నపూర్ణాదేవి మందిరం సుందర మనోహరంగా ఉంది. అత్తరు గుబాళింపులు, పూలగుచ్ఛాల స్వాగతాలు రాయల మనసుకు మరింత ఆహ్లాదాన్ని సమకూరుస్తున్నాయి.
ఎక్కడనుంచో శ్రావ్యమైన వీణావాదన విన్పిస్తున్నది. సర్వాంగ సుందరంగా శయ్యామందిరం అలంకరించి ఉంది. రాయల మనసు అన్నపూర్ణాదేవి పట్ల విరహంతో వేగిపోతున్నది. ఆమె సౌందర్యంలోని రాజసానికి రాయలు ఏనాడో ఆకర్షితులయ్యారు. గజపతులతో రాయల వైరాన్ని అన్నపూర్ణాదేవి ప్రేమానురాగాలతో మరపించింది.
రాయలు శయ్యామందిరం చేరే సమయానకి అన్నపూర్ణాదేవి సౌందర్యదేవతలా అలంకరించుకుని ఉంది.

- ఇంకా ఉంది

చిల్లర భవానీదేవి