డైలీ సీరియల్

అనంతం-60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చిన్నప్పుడు తాగిన తల్లిపాలే కక్కిస్తాను.’’
రెండు సీసాల నీళ్ళు రాగ్యామీద పోశారు.
కొద్దిగా చలనం వచ్చింది రాగ్యాలో.
‘‘ఇతనే్నం చేస్తారూ’’ యాదయ్య అడిగాడు.
‘‘ఏం చెద్దామంటావూ’’
‘‘ఎన్‌కౌంటర్’’
‘‘అంత కోపమా రాగ్యామీద.’’
‘‘కోపం కాదు.’’
‘‘మరి?’’
‘‘చంపకపోతే నన్ను చంపేస్తాడు.’’
‘‘నమ్మకద్రోహం చేశావనా’’
‘‘గరుడాచలాన్ని అందుకే చంపాడు.’’
‘‘సరే! అలాగే చంపేద్దాం.’’
రాగ్యామీద మళ్ళీ చన్నీళ్ళుపోశారు. ఇంకొంచెం కదిలాడు.
బూటుకాళ్ళతో తన్నారు.
రాగ్యాకి పూర్తిగా మెలకువొచ్చింది. లేచి కూర్చున్నాడు.
చుట్టూవున్న సాయుధ పోలీసుల్ని చూసి నిర్ఘాంతపోయాడు.
‘‘రాగ్యావి కదూ’’ పోలీసు ఉద్యోగి అడిగాడు.
‘‘రాగ్యానే.’’
‘‘తండా వాళ్ళెక్కడ?’’
‘‘తెలవదు.’’
టార్చర్ మొదలైంది!
రైఫిల్ బట్లతో పొడుస్తున్నారు..
బైనెట్లతో గాట్లు పెడుతున్నారు..
బూతులు తిడుతున్నారు..
బూటుకాళ్ళతో తంతున్నారు..
రాగ్యా ఆర్తనాదాలకు అడవి దద్దరిల్లింది!
‘‘తండావాళ్ళెక్కడ’’
‘‘తెలవదు’’
‘‘మీరంతా విప్లవకారులు కదూ’’
‘‘తెలవదు’’
‘‘ఏ గ్రూపు?’’
‘‘తెలవదు’’
కటింగ్ ప్లేయర్తో రాగ్యా గోళ్ళుపీకారు! అతని చేతివ్రేళ్ళు రక్తంలో ముంచినట్టున్నాయి!
పెద్దగా అరిచాడు.
‘‘రాగ్యావి కదూ’’
‘‘అవును’’
‘‘తండావాళ్ళెక్కడ’’
‘‘తెలవదు’’
మర్మాంగంమీద రైఫిల్ బట్‌తో పొడిచారు!
‘‘అమ్మా’’అని రాగ్యా పెద్దగా అరిచాడు.
అరిచీ.. అరిచీ సొమ్మసిల్లి పడిపోయాడు.
‘‘ప్రాణంపోలేదు’’ రాగ్యా పల్స్ చూసి యాదయ్య అన్నాడు.
‘‘్భయపడకు! చంపేద్దాంలే!’’
‘‘ఫైర్ చేస్తారా’’ యాదయ్య అడిగాడు.
‘‘బుల్లెట్ వేస్ట్..’’
‘‘మరి?’’
‘‘దహనం’’
‘‘చంపకండానే?’’
‘‘సజీవ దహనం’’
కానిస్టేబుళ్ళు అడవి కట్టెలతో అందంగా చితి పేర్చారు!
అడవి తీగలతో కాళ్ళూ, చేతులూ కట్టేసి-చితి మీదికి విసిరేశారు.
రాగ్యా కళ్ళుతెరిచాడు.
యాదయ్య వైపు చూశాడు.
బైనెట్ పోటుకు నిర్ఘాంతపడి తండాలో కానిస్టేబులువైపు చూసిన మేకపిల్ల చూపు అచ్చం అలాంటిదే!
చితిమీద కిరసనాయిలు పోశాడు.
అగ్గిపుల్లతో అంటించారు.
రాగ్యా ఆర్తనాదాలు క్రమంగా ఆగిపోయాయి.
ఇకలేడు రాగ్యా!
* * *
‘‘అయ్య యాడికి బోయిండు’
’అని ఏదో గుర్తొచ్చినట్టే లక్ష్మీబాయిని చేత్తో తట్టి పిల్చి, వాల్యా అడిగాడు.
లక్ష్మీబాయి ఒక్కక్షణం నిర్ఘాంతపోయింది!
‘‘సంతకి’’అన్నది, తేరికొంటూ
‘‘కాదు’’ అన్నాడు వాల్యా.
‘‘మరేడికంటావ్?’’
‘‘అడివికి’’
లక్ష్మీబాయి ఊపిరి పీల్చుకుంది.
‘‘అడివికి బోయి ఏం జాస్తారూ’’అని అడిగింది నవ్వుతూ.
‘‘కట్టెమోపులు’’అన్నాడు వాల్యా.
అంతటితో ఆగలేదు! గుహలోనుంచి బైటికి వెళ్ళాడు. దాపులోనే వున్న పొదలదగ్గర ఎండిన పుల్లల్ని సేకరించి మోపుకట్టాడు.
నెత్తిమీద పెట్టుకొని గుహలోకి తెచ్చాడు.
లక్ష్మీబాయి కళ్ళల్లో తడి!
భర్త గుర్తొచ్చాడు!
‘‘ఏంటికా మోపు’’ కన్నీళ్ళు తుడుచుకొని వాల్యాని అడిగింది.
‘‘సంతలో అమ్మాల... బువ్వదినాల’’అన్నాడు వాల్యా.
అందరూ నవ్వారు.
లక్ష్మీబాయికి మాత్రం వాల్యా మాటల్లో సందేశం వినిపించింది!
‘‘మాట్లాడాలి’’అన్నది గోపీనాయక్ దగ్గరికి వెళ్ళి.
‘‘ఏంటిది’’అని అడిగాడు.
‘‘తండాల బువ్వ ఎంత కాలం దినాలి’’
‘‘అంటే?’’ఆశ్చర్యంగా చూసాడు గోపీనాయక్.
‘‘మంది బువ్వతో జల్మలెల్లవు! కట్టంజేసి బతకాల’’
‘‘అరతంగాలేదు’’
‘‘మేఁవుగూడా అడివికెల్లి...’’
‘‘ప్రెఁవాదఁవ్’’అని మధ్యలోనే అన్నాడు గోపీనాయక్.
‘ఐతే, ఒక పని శాద్దాం’’ అన్నది లక్ష్మీబాయి.
‘‘ఏంటిది.’’
‘‘మీ వోళ్ళని అడివినుండి సింతపొండు కట్టెలు...అనీ రుూడకేదెమ్మని సెప్పు! సింతపొండు గింజలేరిత్తాఁవు. కట్టెల్ని మోపులు గడతాఁవు బుంగల్లో తేనె సీసాలకెత్తుతాఁవు. ఆకులు తెత్తేయిత్తర్లు గుడతాఁవు! శాకిరి జేసి బతకాల్నేగానీ- సేత్తే ఎంత పనిలేదూ’’అన్నది లక్ష్మీబాయి.
గోపీనాయక్ కొద్దిక్షణాలు ఆలోచించాడు!
ఆమె చెప్పిందికూడా నిజమే!
అడవి పుత్రులకు రోజులు గడవటమే కష్టంగా వుంది. ఎంతకాలం వాళ్ళు మాత్రం భోజనాలు వండి పంపించగలరు?
దూరం ఆలోచించే లక్ష్మీబాయి అలాంటి నిర్ణయానికి వచ్చింది అనుకున్నాడు గోపీనాయక్.
రెడ్డియానాయక్ తండావాళ్ళ భవిష్యత్తే అగమ్యగోచరంగా వుంది!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు